Comments

చంద్రబాబు అభివృద్ది చేస్తే - వై.యస్ లబ్ది పొందారా ? (ఏది నిజం)

చంద్రబాబు అభివృద్ది చేస్తే - వై.యస్ లబ్ది పొందారా ? (ఏది నిజం) 


తెలుగుదేశం నాయకుల దగ్గరనుండి తముళ్ళ దాక రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివ్రుధి సంక్షేమ పధకాలు అమలు పై నిత్యం చెప్పే మాట - చంద్రబాబు అభివ్రుద్ది చేసి వెలటం వలనే రాజశేఖర రెడ్డి గారికి ఆ అవకాశం వచ్చింది అని ఇందులొ ఎంత నిజం ఉందొ , తముళ్ళు చేసే గొబెల్స్ ప్రచారం శాతం ఎంత తెలుసుకొవాలి అంటే మనం 2004 వై.యస్ అధికారం లొకి వచ్చినప్పుడు రాష్ట్రం ఎలా ఉంది వనరులు ఎలా ఉన్నయి ఆదాయం ఎంత ఉంది అనేది తెలుసుకొవాలి - ఆనాడు వై.యస్ ముఖ్యమంత్రి పదవి చెప్పట్ట గానే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తదితర వాటిమీద విశ్లేషన తొ కూడి న వ్యాసం జమీన్ రైతు అనే పత్రిక రాసింది.
ఆ వ్యాసం లొ ఉన్న ముఖ్య అంశాలు గమనిస్తే ఇలా ఉనాయి
1) రాజశేఖరుడికి ఇది వ్యక్తిగతంగా రాజ మకుటమే కాని వ్యవస్తా పరంగా ముళ్ళ కిరీటం.
2) ముఖ్యమంత్రి చంద్రబాబు వారసత్వం అన్ని కొణాలలొను సంకటం కలిగించేది అనటం నిజం.
3) భారత దేశం లొ ఆంద్ర ప్రదేశ్ ఒక రాష్ట్రం గా కాక , ఆంద్ర దేశం లొ , భారత దేశం ఒక భాగం అన్న భ్రమ కల్పించేటట్లు గా సాగింది చంద్రబాబు ప్రచర వ్యుహం.
5) తానొక సంస్కర్త గా ప్రచారం చేసుకున్న బాబు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ అందుకే నేడు ప్రజలు ఈ తీర్పుని ఇచ్చారు
6) చంద్రబాబు వల్లే అబద్దాలు చెప్పటం, మాటలు శ్రుష్టించటం, బ్రమలు కల్పించటం, వ్యక్తిగత ప్రతిష్ట కొసం ప్రభుత్వ ధనం ని విచ్చల విడిగా కర్చు చేయటం వంటి పనులు రాజశేఖర రెడ్డి చెయడు , చెయకూడదు కూడా.
7) చంద్రబాబు ఖాళీ బొక్కసం మిగిల్చి వెళ్ళాడు ( ఈ ఒక్క మట తొ చంద్రబాబు చేసిన అభివ్రుద్ది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఉపయొగ పడిందొ అర్ధం చేసుకొవచ్చు)
8) చంద్రబాబు పాలన లొ అవినీతి అవదులు మీరిపొయింది , తిన మరిగిన కొళ్ళను దారిలొకి తెచ్చుకొవటం సామన్యమైన పని కాదు , ప్రభుత్వ కార్యాలయాలు , పొలీసులు సైతం పచ్చ చొక్క దళారులుగా మారిపొయారు.
ఏ కొణం నుండి చూసిన రాజశేఖర రెడ్డికి సమస్యల వలయం తప్ప సుఖ భొగాలు అనుభవించే అవకాశం కనిపించటం లేదు
వాస్తవాలు ఇలా ఉంటే అవగాహన లేని ప్రజలని మభ్య పెట్టటం ఒక్కటే ఎజండా గా తముళ్ళు ప్రచారం సాగిస్తారు. బాబు వై.యస్ కి 9 ఏళ్ళు పాలించి లొటు బడ్జెట్ తొ ఇస్తే దాన్ని వై.యస్ 5 ఏళ్లలొ మిగులొకి తెచ్చారు, నిజానికి కనీసం ఆర్దిక క్రమశిక్షణ పాటించని బాబు గారి ప్రతిబ ఎలా ఉందో చూడండి...
1995 లో బాబు గారు ముఖ్యమంత్రి కాకముందు...
ఆదాయం : 13 వేల 100 కోట్లు
కర్చులు : 14 వేల 800 కోట్లు
బడ్జట్ లోటు : 1700 కోట్లు
ఇంత లోటు ఎందుకు అంటే మద్యం మీద ఆదాయం 600 కోట్లు, బియ్యం పదకం కోసం ఇచ్చింది 150 కోట్లు ... అంటే లోతు షుమారుగా 1000 కోట్లు మాత్రమే..
అప్పటి deposits/ liabilities /assets విలువలు దొరకలేదు ...
2004 లో బాబు గారు దిగిపోయేటప్పుడు ఏమిటి ??
ఆదాయం : 26 వేల 869 కోట్లు
కర్చులు : 35 వేల 575 కోట్లు
బడ్జట్ లోటు : 8706 కోట్లు
Reserve funds : 1224 కోట్లు
Deposits : 5326 కోట్లు
అప్పులు : 64 వేల 545 కోట్లు
ఆస్తుల విలువ : 2 లక్షల 12 వేల కోట్లు
5 ఏళ్ల వై‌ఎస్‌ఆర్ పాలన తరవాత 2009::::
ఆదాయం : 62 వేల 858 కోట్లు
కర్చులు : 61 వేల 854 కోట్లు
బడ్జట్ మిగులు : 1004 కోట్లు
Reserve funds : 4016 కోట్లు
Deposits : 12305 కోట్లు
అప్పులు : 1 లక్షా 6 వేల 917 కోట్లు
Assets .... 6 లక్షల 41 వేల 502 కోట్లు
1999-2004 మద్యలో సంవత్సరానికి 1827 రోజులు ఉంటే 1304 RBI దగ్గర ways and means వాడుకున్నాము .
అదే YSR హయాంలో 1827 రోజులకి కేవలం 449 రోజులు వెళ్లాము ...
Overdraft …..
బాబు గారి హయాంలో 99 రోజులు ఉంటే వై‌ఎస్‌ఆర్ ఒక్క రోజు కూడా OD కోసం వెళ్లలేదు...
15 వేల మంది రైతుల ఆత్మ హత్యలతొ , జలియన్వాలా భాగ్ లాంటి భషీర్ భాగ్ కాల్పులతొ , పల్లేల నుండి రైతుల వలసలతొ 1995 నుండి 2004 దాగా రాష్ట్రం శ్మాసానంగా మారిపొయున సంగతి నేటి తరం లొ ఎంతమందికి తెలుసు. అదే సమయం లొ మహా పాదయాత్ర కి శ్రీకారం చుట్టారు వై.యస్, రాష్టం అంటే పల్లే, రాష్ట్రం అంటే రైతు , రాష్ట్రం అంటే సంక్షేమం ఇది వై.యస్ మాట. ఆ భయంకరమైన చరిత్ర నుండి ప్రతి మనిషి ని , ప్రతి పల్లేను , ప్రతి పేదవాడిని , గడప గడప లొనూ జీవం తెచ్చిన మహా నాయకుడు వై.యస్.
భయానక పాలనతొ విసిగిపొయిన ప్రజలు వై.యస్ కి పట్టం కట్టారు
రాష్ట్ర చరిత్ర లొ కనివిని ఎరుగని ప్రజొపయొగ పధకాలని ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పధం లొ నడిపిన ముఖ్యమంత్రి గా "డా. వై.యస్ రాజశేఖర రెడ్డి" చరిత్ర లొ నిలిచిపొయారు. ఆయన పధకాల వళ్ళ రాష్ట్రం లొ లబ్ధి పొందని పేదవాడు లేడు అంటే అతి శయొక్తి కాదు. ఏ ఆపద వచ్చిన , ఏ అవసరం వచ్చిన ప్రభుత్వం అండగా ఉంటది అని పేదవాడికి చేతలలొ చెసి చూపిన ఏకైక ముఖ్యమంత్రి వై.యస్ మాత్రమే.
పేద కుటుంభాలలొ గుండే జబ్బులు, కిడ్నీ సమస్యలు , లివర్ వ్యాదులు వంటివి వస్తే, కాటికి కాళ్లు చాపటం తప్ప ఏమి చెయలేని స్థితి, ఆరొగ్య శ్రీ ద్వారా అటువంటి వారికి అనాద రక్షకుడి గా ఏదిగారు వై.యస్, అటు పేదల కే కాకుండా ప్రజలందరికి ప్రాణప్రధాయిని 108 అంబులెన్స్ పధకం, రాత్రి పూట ఎవరికి ప్రాణం మీదకి వచ్చినా, ఏ రహ దారులలొ వాహానాల కింద పడి రక్తపు మడుగులలొ ప్రణాలకొసం గిల గిల లాడే దుస్థితి వచ్చినా క్షణాలలొ వచ్చి వాలిన అద్భుత సేవా పధకం 108 , ఉచిత విద్యుత్, మద్దతుదర , రుణమాఫి , రైతు ప్రొత్షహకాలతొ రాష్ట్ర రైతుకి కలిగిన ఆత్మ స్థైర్యం అంతా ఇంతా కాదు , ఆ ధైర్యం తొనే అంతక ముందు ఎన్నడు లేని విధంగా 199 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చెయకలిగారు రైతన్నలు , పేదవారి అందరికి గూడు కల్పించాలి అని వై.యస్ ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు విస్త్రుతి ప్రధానిని కూడా ఆచర్య పరిచింది ఎందుకంటే ఎక్కడా చుడని విధంగా 38 లక్షల ఇళ్ళు పూర్తి చెసి చూపించారు వై.యస్ , ప్రతి పేదవాడి ఇంటి నుండి ఒక డాక్టర్ , ఒక ఇంజనీర్ అవ్వాలి అని పెట్టిన ఫీసు రీయంబర్స్ మెంట్ పధకం, ఆ సాహాసోపేత నిర్ణయం ని వర్ణించలేము.
==========================================

వై.యస్ పధకాలు :

ఆరొగ్య శ్రీ భీమా పధకం :- ప్రపంచ చరిత్ర లొ మొదటి సారి 942 వ్యాదులు ఈ పధకం లొ చెర్చి , 3 లక్షల శస్త్ర చిక్కిత్సలు జరిగాయి.

104 గ్రామీణ సంచార వైద్యా పధకం :- 104 సంచార వైద్యా వాహనాలతొ ప్రతి నెలెలొ ఒక రొజు ఒక గ్రామం లొ వైద్యం చెసే విధానం , 475 సంచార వాహనాలతొ ఉచిత వైద్యం , ఉచిత మందుల పంపినీ చెస్తు 4 కొట్ల గ్రామీణ ప్రజల వాకిళ్ల ముంగిట వైద్య సేవలు అందించిన మహత్తర పధకం .

పెన్షన్ :- 5 ఏళ్ళ లొ 200 రూపాయల చొప్పున నూతనంగా 55 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. (పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 71 లక్షల కి చెరింది)

వై.యస్ 5 ఏళ్ళ లొ ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు

జల యగ్నం :- 5 ఏళ్ళ లొ 12 ప్రాజక్టులు పూర్తి చెసి 19 లక్షల ఏకారాలకు నిళ్లు ఇచ్చారు

ఉచిత విద్యుత్ : 5 ఏళ్ళలొ 30 లక్షల పంపు సెట్లకి 1500 కొట్ల యునిట్ల విద్యుత్ ఉచితంగా రైతులకి ఇచ్చారు.

వ్యవసాయ రుణాల రద్దు : దేశం లొనే అత్యధికంగా ఒకెసారి 11,100 కొట్లు వ్యవసాయ రుణాలు రద్ధు చెసారు 64 లక్షల మంది రైతులకి లబ్ధి పొందారు.ముందస్తు రుణాలు చెల్లించిన వారికి ప్రొచ్చాహంగా ఒక్కొక్క రైతుకు 5000 చొప్పున 1800 కొట్ల రూపాయలని 36 లక్షల మంది రైతులకి పంపిణీ చెసారు

భూ పంపిణీ :- 6.04 లక్షల ఎకరాలు పేదవారికి పంచటం జరిగింది. 500 కొట్లు ఆ పొలం లొ అభివ్రుద్దికి ఇవ్వటం జరిగింది , 6 లక్ష్ల ఎకరాల పై గిరిజనులకి హక్కులు ఇవ్వటం జరిగింది

పశు క్రాంతి పధకం : లక్షా 50 వేలు పశువులు కొనుగొళ్ళ కై 3 % వడ్డి తొ పాటు 30,000 సబ్సిడి ఇవ్వటం జరిగింది గ్రామీణ ప్రాంతం లొ పాల వెల్లువ ను శ్రుష్టించారు.

108 :- ఫొన్ చెసిన 18 నిమషాలలొ చెరే లా 802 అంబులెన్స్ ఏర్పాటు చెసారు.

ఇందిరమ్మ గ్రుహాలు : 38 లక్షల ఇళ్ళు పూర్తి చెసారు, ఆయన చనిపొయే నాటికి 28 లక్షల ఇళ్ళు నిర్మాణ దశ లొ ఉన్నాయి , వై.యస్ పెట్టుకున్న లక్ష్యం 80 లక్షల ఇళ్ళు .

అప్పు రద్దు : 2000 కొట్ల రూపాయలు రద్దు చెసి యస్.టి, యస్.సి, బి.సి , మైనారటీ లకు లబ్ధి చెసారు.

చెనేత రుణాలు రద్దు : 327 కొట్లు చెనేత రుణాలు రద్దు చేసారు , దీని వలన 3 లక్షల మందికి లబ్ది చెకురింది , 1.50 లక్షల మంది చెనేత కార్మికులకి పించన్ లు అందచెసారు.

విద్య : ప్రతి జిల్ల కి విశ్వ విద్యాలం లొ భాగంగా 17 విశ్వ విద్యాలు ఏర్పాటు చెసారు , ఐ.ఐ.టి ని మెదక్ లొ , నుజివీడి, బాసర , ఇడుపుల పాయ లొ ఐ.ఐ.ఐ.టి ని , బిట్స్ పిలాని ని హైద్రాబాద్ లొ నిర్మించారు.

ఫీజ్ రీయంబర్స్ మెంట్ : ఉన్నత విద్యని 85 % పేద విద్యార్ధులకి అందించారు 33 లక్షల మంది విద్యార్ధులు ఈ పధకం ద్వారా చదువు కున్నారు.

ఐ.టి మరియు ఐ.టి ఉద్యొగాలు : 2007 -2008 సంవత్స్రం లొ 1,584 ఐ.టి కమెనీల ఏర్పాటు తొ 1.53 లక్షల ఉద్యొగాలు ఈ రంగం లొ కల్పించారు 2008-2009 సంవత్సరం లొ 32,507 కొట్ల ఎగుమతులు ఈ రంగం లొ సాదించారు. ఇది జాతియ ఎగుమతులలొ 15 % (జాతియ వ్రుద్ది రేటు 32 ఉండగా రాష్ట్ర వ్రుద్ది రేటు 41 % )

" బాబు అధికారం లొ కి వచ్చే నాటికి 1995 లొ మనం ఐ.టి ఎగుమతులలొ 9 % ఉండగా . 2004 దిగిపొయే నాటికి అది 8.6% వచ్చింది పెరగక పొగా తగ్గిపొయింది ) వై.యస్ దానిని 5 ఏళ్ళ లొ 15 % తీసుకెల్లారు".

రెండు రూపాయ బియ్యం : ఈ పధకం కింద 2 కొట్ల కుటుంబాలు లబ్ది పొదాయి.

పరిశ్రమలు : వై.యస్ హయాము లొ (ఆర్ బి ఐ) లెక్కల ప్రకారం పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రా లలొ మనం దేశం లొ 2వ స్థానం లొ ఉన్నాం.

వ్యవసాయ ఉత్పత్తులు:- బాబు హయాము లొ 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చెస్తే , వై.యస్ 5 ఏళ్ళ లొ 199 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చెసారు.

చంద్రబాబు గారు అధికారం లొ రైతు ఆత్మ హత్యలు సంవత్సరం , సంవత్సరం పెరిగిగి చివరి సవత్సరం వచ్చెసరికి అత్యదికంగా 1031 మంది రైతులు ఆత్మ హత్యలు చెసుకున్నారు

వై యస్ పాలన వచ్చె సరికి 2005 లొ 631 అయింది
2006 వచ్చెసరికి 530 అయింది
2007 వచ్చెసరికి 427 అయింది
2008 వచ్చెసరికి 267 అయింది
2009 మే దాక కేవలం 4 రైతులు ఆత్మ హత్యలు చెసున్నారు
అంటే ఆయన పాలన లొ పెరుగుతా పొయిన రైతు ఆత్మ హత్యలను సంవత్సరం , సంవత్సరం తగ్గించి అత్యంత కనిష్టం కి చెర్చిన ఘనత వై.యస్ ది మాత్రమే.

మద్దతు ధర :-
ఇక మద్దతు దర విషం కి వస్తే 1998 -99 సంవత్సరం లొ కనీస మద్దతు ధర 470 ఉండగా 2004 కి వచ్చెసరికి కనీస మద్దతు దర 580 కి పెరిగింది అంటే బాబు గారి పాలన చివరి 5 సంవత్సరాలలొ కేవలం 110 రూపాయలు మాత్రమే పెరిగింది.

వై.యస్ వచ్చిన 5 ఏళ్ళ లొ కనీస మద్దతు ధర 930 అయింది అంటే వై.యస్ పాలన లొ 350 పెంచ్చారు.

ఇరిగేషన్ కొసం పెట్టిన కర్చు :
చంద్రబాబు 9 ఏళ్ళ పాలన లొ 10,119 కొట్లు అయితే
వై.యస్ 5 ఏళ్ళ పాలన లొ 41,000 కొట్లు కర్చు పెట్టారు

రాష్ట్ర రెవెన్యు :-
బాబు పాలన 2003 -2004 రాష్ట్ర రెవిన్యు 26,848 కొట్లు అయితే
వై.యస్ పాలన 2008-2009 రాష్ట్ర రెవిన్యు 65,000 కొట్లు

రైతుల బాధలు:-
దొంగ కరెంటు వాడారు అని 3 హెచ్.పి కి అనుమతి తీసుకుని 5 హెచ్.పి మొటర్ వాడుతున్నారు అని మొత్తం వ్యవసాయానికి సంబందించిన రైతుల మీద బాబు గారి హయాములొ పెట్టిన కేసులు 11 వేలు
బాబు పాలన లొ కరంటు బిల్లు కటలేదు అని 77 వేల మంది రైతుల మీద కేసులు పెట్టారు.
దీనికి బాబు గారు టార్గెట్లు కూడా పెట్టారు
ఏ.ఈ లేవల్ కి - 20 కేసులు
ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు
డిపార్ట్మెంట్ ఆగ్ పిల్ఫిరేజ్ ఆఫ్ ఎనర్జి కింది
ఏ.ఈ లేవల్ కి - 20 కేసులు
ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు

రైతు ఆత్మ హత్యలు డబ్బుకొసం చెసుకుంట్టున్నారు అన్నారు , తిన్నది అరగక చెసుకుంట్టున్నారు అన్నారు , వ్యవసాయం దండగా అన్నారు

రైతులకి సంబందించిన ఉత్పత్తులు :-
తెలుగుదేశం అధికారం లొ ఉన్న చివరి 5 సంవత్సరాలలొ చూస్తే ఏవరేజ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 137 లక్షల టన్నులు మాత్రమే , వై.యస్ వచ్చిన 5 సంవత్సరాలలొ అది 172 లక్షల తణ్ణులు అయింది అంటే అది 35 లక్షల టన్నులు పెరిగింది , ఇది ఆల్మొస్ట్ 28% గ్రొత్ , భారత దేశం లొ ఏ రాష్ట్రం లొ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల లేదు. మరీ ముఖ్యంగా చివరి రెండు సంవత్సరాలలొ 2007-2008 లొ 198 లక్షల టన్నులు , 2008-2009 లొ 199 లక్షల టన్నులు గా ఉంది ఉత్పత్తి.

ఎలక్ట్రసిటి రంగం:-
చంద్రబ్బబు అధికారం లొకి వచ్చెసమయానికి రాష్ట్ర విద్యుత్ 84 కొట్ల లాభం లొ ఉంది , విచిత్రంగా ఆయన్ దిగిపొ ఏ నాటికి చార్జీలు పెంచినా 12000 కొట్లు నష్టం లొ ఉంది.

పరిశ్రమలు:-
చంద్రబాబు 9 ఏళ్ళ పాలనలొ 38,797 చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి , 368 మద్యతరహా , భారి పరిశ్రమలు మూతపడ్డాయి

పన్నులు :-
9 ఏళ్ళ పాలనలొ 3 వేల కొట్లు పన్నులు భారం ప్రజల మీద రుద్దారు , వై.యస్ ఏసిన పన్నులు సున్నా
కొంత మంది బాబు పాలన లొ అభివ్రుద్ది చెస్తే వై.యస్ ఆ ఫలాలని అనుభవించారు అంటారు , అది నిజం అయితే జాతియా సగటు గ్రొత్ రేట్ కన్న ఆంద్రప్రదేశ్ తక్కువ ఉన్నమాట వాస్తవం కాదా ?
( ఇలా ఎన్నొ ప్రజలకి మేలు చెసే పధకాలు ప్రవేశపెట్టి ప్రజలమిషి అయ్యారు వై.యస్, నిప్పులాంటిది దాచాలి అన్నా దాయటం కష్టం)
===================================

సంపూర్ణ ఆరొగ్యం ,దేదీప్యమానమైన రాజకీయ ప్రభావం , కళ కళ లాడే ముఖం , కంటికి ఇంపైన రూపం , మిన్ను విరిగి మీదపడినా చరగని చిరునవ్వు, తల ఎత్తుకుని , రొమ్మువిరుచుకుని , ధీమాగా , దైర్యం గా , ఏవరినీ లెక్క చెయకుండా , ఏవరికి తలవంచకుండా , ఏంతటి అవరొదానైనా అలవొక గా అదిగమిస్తు, అనితర సాద్యమైన ప్రాధరణ తొ , ఇదివరికి ఎన్నడు చూడని జన సమ్మొహనత్వం తొ తన ప్రతి అడుగులొను చూపరులకి ఆచర్యాన్ని, తన ప్రతి చర్య తొ ఒక అద్భుతాన్ని , తన ప్రతికదలిక లొ విస్మయాన్ని , నమ్మలేని తనాన్ని ప్రదర్సించిన వై.యస్ రాజశేఖర రెడ్ది ని ఎలా మరువగలం.
====< ప్రజల మనిషి కి జొహార్ >===
చంద్రబాబు అభివృద్ది చేస్తే - వై.యస్ లబ్ది పొందారా ? (ఏది నిజం) చంద్రబాబు అభివృద్ది చేస్తే - వై.యస్ లబ్ది పొందారా ? (ఏది నిజం) Reviewed by surya on 6:25 AM Rating: 5

No comments:

Powered by Blogger.