Comments

"వైయస్సార్" తిరుమల ఏడు కొండలని రెండు కొండలుగా చేద్దాం అనుకున్నారా ? ఇందులో నిజం ఎంత ??

"వైయస్సార్" తిరుమల ఏడు కొండలని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులో నిజం ఎంత ?

YS Rajashaker Reddy Tirumala Hills Facts


2005లో తిరుమల గ్రామంలో పంచాయతి ఎన్నికలు జరగాలని నాటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు, జయచంద్రనాయుడు అనే ఒక అనామకుడిని అడ్డు పెట్టి హైకోర్టులో కేస్ వేయించారు. 

1959లో నీలం సంజీవరెడ్డి గారి ఆద్వర్యంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభమైనా, తిరుమలలో ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. 1964లో ఈవోగా ఉన్న నరసింగరావు తోలి పంచాయతీ అధికారిగా భాధ్యతలు శ్వీకరించారు. అప్పటి నుండీ ఈవోనే పంచాయతీ అధికారిగా భాధ్యతలు నిర్వహిస్తూ రావడం ఆనవాయతీగా వస్తున్న సాంప్రదాయం. 

రామారావుగారి ప్రభుత్వం హయాంలో 1985 సెప్టెంబర్ 6న అసెంబ్లీలో తిరుమలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా అని అడిగిన ప్రశ్నకు , ప్రభుత్వం నుండి లేదని వచ్చింది.  ఈవోగా ఉన్న వ్యక్తే పంచాయతీ భాధ్యతలు నిర్వహించాలని సాంప్రదాయానికి విరుద్ధంగా మొట్టమొదటి సారి అక్కడ పంచాయతీ ఎన్నికలు జరగాలని 2005లో  కోర్టు మెట్లు ఎక్కేలా చేశారు. 

ఈ కేసులో టీడీపీ వారి వాదన ఎంటంటే "తిరుమలలో ఒక స్థానిక సంస్థ అనేది లేకపోవడం, ఎన్నికయిన పాలనా సంస్థ లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని. 1993లో రాజ్యాంగాన్ని 73, 74వ సవరణల ద్వారా మార్చిన తరువాత దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థలు లేకపోవడం, ఎన్నికైన స్థానిక పాలనాయంత్రాంగం లేకపోవడం జరగడానికి వీలులేదని. పెద్ద ఊరయితే మునిసిపాలిటీ ఉండాలి, చిన్న ఊరయితే పంచాయితీ ఉండాలి. పంచాయితీకి తగినంత జనాభా లేనట్లయితే పక్కనున్న ఏదైనా గ్రామ పంచాయితీలో భాగం చేయాలి. అంతే తప్ప స్థానిక సంస్థ ఏదీలేని మానవ ఆవాసం ఉండడానికి వీలులేదని" కొర్టులో కేసు వేయించారు. అయితే ఈ కేసును కోర్టు కొట్టేసింది.


 
పంచాయతీ ఎన్నికల నిర్వహణకి సంభందించి కేసు.. కోర్టు కొట్టేసినా , తిరుమలలో ఎప్పటి మాదితే అసెంబ్లీ , పార్లమెంట్ కి సంభందించి ఎన్నికల్లో ఓట్లు హక్కు వినియొగించుకోవడం వాటి కోసం అభ్యర్ధులు ప్రచారం చేసుకోవడం జరిగేది. 

ఈ నేపద్యంలో తిరుమల పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మికం తప్ప రాజకీయ ప్రచారాలు, సభలు , సమావేశాలు తగదనే ఉద్దేశంతో 2005న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న జేసి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యంలో ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జీఓ విడుదల చెసింది (GO No 338).



ఆ జీఓలో తిరుమలలో 27.5 చదరపు కిలోమీటర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకోసం ఏర్పర్చిన గ్రుహాలు, మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక పవిత్ర స్థలంగా ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు, మీటింగులు జరగటానికి వీలు లేదని చెబుతు జీఓ ని విడుదల చేశారు.  నిజంగా ఈ జీవో కొత్తగా బౌండరీస్ నిర్ణయించేది అయితే రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుండి రావాలి కానీ , జీవో ఇచ్చింది పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్. పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ కి సరిహద్దులు నిర్ణయించే అధికారం ఉండదు అనే కనీస అవగాహన కూడా లేకుండా ఆ జీవో పై అసత్య ప్రచారాలు చేశారు.

(రాజకీయాలకి దూరంగా తిరుమల ఉండాలని  ఆశించి వైయస్సార్ గారు  ఈ జీఓ ఇచ్చారు) 
 

మనుషులు సంచారం ఉన్నంత మేరకు తిరుమల గ్రామం విస్తీర్ణం ఇంతా అని చెబుతూ వైయస్సార్ గారు ఈ జీఓ ఇవ్వడానికి ఆదారంగా తీసుకున్నది. గతంలో ఉన్న జీవోలు
బ్రిటీష్ వారి పాలన 1870లో, అప్పటి ప్రభుత్వము 10.1/3 చదరపు మైళ్లు (27.5 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించింది.
1923 డిసెంబర్ 12 తేదీన రెవెన్యూ బోర్డు వారు "బ్రిటీష్ వారి పాలన 1870లో 10.1/3 చదరపు మైళ్లు (27.5 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించిన విషమై ఆ విధంగానే విలేజ్ రికార్డుల్లో ఎక్కించడానికి ప్రభుత్వం అనుమతి ఉవ్వాలని డి.డిస్. నం. 2719 ద్వారా రెవెన్యూ బోర్డు అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపింది   
1924 మే 12న, అప్పటి ప్రభుత్వం ఆ ప్రతిపాదన ప్రకారం 10 1/3 చ.మైళ్ళ భూమిని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అప్పగిస్తూ, అదే విషయాన్ని గ్రామ రికార్డుల్లో నమోదు చేయాలని రెవెన్యూ బోర్డు వారిని ఆదేశించింది. 
అనంతరం 1965లో ఈ హక్కును తిరుమల తిరుపతి దేవస్థానాల పేరిట ప్రభుత్వము జీ.ఓ. నెం. 1784, తేదీః 01-11-1965 ద్వారా ధృవీకరించింది. 10.1/3 చదరపు మైళ్లు విస్తీర్ణం ని తిరుమల గ్రామంగా ప్రకటించింది.
తిరుమల గ్రామ పంచాయతీగా గుర్తించిన ప్రాంతంలో పరిపాలన ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు దానధర్మాలు చట్టం 1966 లోని సెక్షన్ 90 ప్రకారం నిర్వహించబడుతుందని. అలాగే ప్రభుత్వం కాలానుగుణంగా తిరుమల గ్రామ పరిధిలోని పరిపాలన ప్రయోజనం కోసం తిరుమల గ్రామం ప్రాంత పరిమితులను (10.1/3 చదరపు మైళ్లు) విస్తరించే హక్కును ఇస్తూ 2-12-75 తేదీన జీవో 1605, రెవెన్యూ (ఎండ్స్)లో ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
10.1/3 చదరపు మైళ్ల సరిహద్దు దాటి ఉన్న అటవి ప్రాంతం అటవీ శాఖ ఆధీనంలోని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించబడింది. 

అలాగే 1986లో ఎన్టీఆర్ దేవాలయాల చట్టంలో అర్చకుల వారసత్వపు హక్కును రద్దు చెయాలనే ఆలోచనతొ జస్టిస్ చల్లా కొండయ్య నెత్రుత్వంలో ఒక కమిటీ వేశారు ఆ కమిటి కూడా స్వామివారి ఆలయం చుట్టు ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం మాత్రమే దేవస్తానానికి మంజూరు అయిందని చెప్పారు.. ( ఇక్కడ కూడా ఆ కమీషన్ ఏడుకొండల విస్త్రీణం మోత్తం తిరుమల గ్రామమని చెప్పలేదు
ఇంకా తిరుమల పవిత్రతని కాపాడటానికి కమీషన్  తిరుమలలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకి తావు ఇవ్వకూడదని కూడా చెప్పారు కాని ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ వాటిని పట్టించుకొకుండా , కేవలం అర్చకుల వారసత్వపు హక్కు మాత్రమే రద్దు చేశారు. కాని దీనినే వైయస్సార్ తిరుమల పవిత్రతను కాపాడటానికి అమలు చేశారు. వైయస్సార్ గతంలో వచ్చిన జీవోలు, కమీషన్ల రిపోర్టుల ఆదారంగా తీసుకుని ఉదహరిస్తు అందులో ఉనట్టే చెప్పారు. 
మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులో ఉంటది కాబట్టి జీవోలో వాటి ప్రస్తావన ఉదహరించలేదు.  ఉదహరించే అవకాశం చట్టప్రకారం కూడా వైయస్సార్ గారికి లేదు.  ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరి ఐఏఎస్ ఎం.శామ్యూల్ అనే అధికారి.




జి.ఓ.నెం.311, రెవెన్యూ (ఎండోమెంట్స్–ఈ) శాఖ, తేదీ: 09-04-1990 ప్రకారం నిర్ణయించబడ్డ టీటీడీ రూల్ 196 చెప్పేది ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ 10 1/3 చదరపు మైళ్లు విస్తీర్ణంలో ఉన్న భూమి — పూర్తిగా టిటిడీ ప్రత్యేక అధీన ఆస్తిగా పరిగణించబడినట్టు చెప్పింది.
ఈ GO No 338 ని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి, వైయస్సార్ తిరుమల ఏడు కొండలని రెండు కొండలు గా చేశారని ప్రచారం అందుకున్నారు - ( వాస్థవం గా చూస్తే ఆ GO No 338 ముఖ్య ఉద్దేశం జనసంచారం మటికి ఉన్న తిరుమల ప్రాంతంలొ ఎలాంటి రాజకీయ కర్యాకలాపాలు ఉండటానికి లేదు అని చెప్పటం) 1925 నుండి విలేజ్ రికార్డ్స్ లొ ఉన్న ఏరియా ఇంతే - ఇందులొ వైయస్సార్ మార్చింది లేదు.
 

ప్రతిపక్షాలు మాటలు నమ్మి కొంత మంది సాదువులు 2006 జులై 15 న నిరసన వ్యక్తం చేశారు ఇలా చేస్తూ వారు తిరుమలని కిలొ మీట్లర్లలా కాకుండా ఏడు కొండలు అని మార్చి జి.ఒ ఇవ్వాలి అని అడిగారు, అలాగే 27 జులై 2006 న టి.టి.డి అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమల 27.5 చదరపు కిలొ మిటర్లు కాదు అడవితొ సహా అంత కలిపి 332 చదరపు కిలొ మీటర్ల ప్రాంతం అని కొత్త జి.ఒ ఇవ్వాలి అని అడిగారు.

అదే రొజు ప్రభుత్వ కెబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని కెంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అది రాగానే ప్రభుత్వం 2007 జూన్ 2న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జి.ఒ నెంబర్ 746 ని విడుదల చేశారు , దీనితొ పాటు రాష్ట్రంలొ ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జి.ఒ ని విడుదల చేశారు వైయస్సార్.  చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా ఏడు కొండలపై  అన్యమత ప్రచారాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం అని పెర్కోన్నారు .


వైయస్సార్ అదే 2006 ఆగస్టున తిరుపతిలొ "యస్.వి వేదిక్ విశ్వ విద్యాలయం" ప్రారంబిస్తు తిరుమల కొండల విషయంలో తెలుగుదేశం పార్టీ మీడియాని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న తప్పుడు ప్రచారాలు ఆపాలని, ఎట్టి పరిస్తుతులలొను తిరుమల, ఏడు కొండలు అంగులం కూడా కదిలించాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, ఆ పాపం కి వడికట్టాము అనే ప్రచారం మానుకొవాలి అని హితవు పలికారు.


ఇక్కడే చంద్రబాబు గారి నిజస్వారూపం కనిపిస్తుంది 

2009 జనవరి 27న గుంటూరు సమీపంలో జరిగిన బైబిల్ మిషన్ యొక్క 71వ రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబు గారు ప్రసంగిస్తూ, వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన "తిరుమల 7 కొండలు శ్రీవారికే చెందుతాయని అవి హిందువుల పుణ్యక్షేత్రాలుగా ప్రకటించే జీఓ:746ను, మరియు హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాలలో మత మార్పిడి మిషనరీల ప్రసంగాలు, సంబంధిత కార్యకలాపాలను నిషేధించే జీఓ:747ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని వాగ్దానం చేశారు.  







వైయస్సార్ ఇచ్చిన జీవోతో 1870 బ్రిటీష్ పాలన నుండి అధికారికంగా లేని ఏడు కొండ్లను శ్రీవారికి చేందేలా అయ్యాయి. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఆ జీవోను రద్దు చేస్తాం అని హామీలు ఇచ్చారు...
ఇప్పుడు ఎవరు ఏడు కొండలని రెండు కొండలు చేద్దామని అనుకున్నారో ప్రజలే వివేకంతో ఆలోచన చేయాలి.
ఇలా రాజకీయాల నుండి తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతని కాపాడుదాం అని ఆలొచించిన వై.యస్ మీద కేవలం రాజకీయ లబ్ధి కొసం దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ చేశారు తెలుగుదేశం వారు , దీనికి బాబు గారిని మొసే పత్రికలు వంత పాడాయి - హిందు ధర్మం మీద అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళ మనొభావాలు గాయపడ్డాయి - లేదు ప్రతిపక్షాలు వాటి అనుభంద మీడియా గాయ పడేలా చేశారు... ఇప్పటికైనా విజ్ఞులు నిజాలు గ్రహిస్తారు అని ఆసిస్తున్నాం...



"వైయస్సార్" తిరుమల ఏడు కొండలని రెండు కొండలుగా చేద్దాం అనుకున్నారా ? ఇందులో నిజం ఎంత ?? "వైయస్సార్" తిరుమల ఏడు కొండలని రెండు కొండలుగా చేద్దాం అనుకున్నారా ? ఇందులో నిజం ఎంత ?? Reviewed by surya on 7:26 AM Rating: 5

No comments:

Powered by Blogger.