అబ్దుల్ కలాం గారిని బాబు గారు చెప్పుకుంటున్నటు నిజంగానే బాబు గారే రాష్ట్రపతి ని చేసారా ????
=====నిజం ఇది=====
లేని గొప్పలు డప్పు వాయిస్తే జరిగేది ఇంతే (14- జూన్ - 2002)- అప్పటి పేపర్ లొ వచ్చిన వార్త
జాతీయ రాజకీయాలలొ తన ప్రాధాన్యత తగ్గలేదు అని జనాన్ని నమ్మించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెసిన చిరు ప్రయత్నం అబాసుపాలు అయింది. రాష్ట్రపతి ఎన్నికలలొ తెలుగుదేశం కీలక పాత్ర నిర్వర్తించిందన్న ప్రచారం కొసం చాలా ఆరాట పడ్డాడు చంద్రబాబు. అందరికంటే మొదటగా ఉపరాష్ట్రపతి క్రిష్నకాంత్ పేరు ప్రతిపాదించారు ఆయన ప్రధాని వాజ్ పాయి తన మాట కాదు అనడు అని నమ్మాడు. అయితే (ఎన్.డి.ఏ) లొని కొన్ని పార్టీలు క్రిష్నకాంత్ పట్ల సుముఖత చూపకపొవటం తొ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. అక్కడి తొ సరిపెట్టుకుని ఉండి ఉంటే బాగుండేది కాని అబ్దుల్ కలాం ఎంపిక తన సూచన ప్రకారమే జరిగింది అని స్వయంగా ప్రకటించుకుని, అందరి ద్రుష్టి లొ చులకన అయిపొయాడు చంద్రబాబు.
కలాం గారి పెరు మొదటగా ప్రతిపాదించింది సమాజ్ వాది పార్టి అధినేత ములాయం సింగ్ యాదవ్ , క్రిష్నకాంత్ మహారాష్ట్ర గవర్నర్ అలగ్జాండర్ పట్ల తమ కూటమి లొనే ఏకాబిప్రాయం లేకపొవటం తొ వాజ్ పాయి జరిపిన ప్రత్యామ్నాయ అన్వేషణ లొ అబ్దుల్ కలాం వెలికి వచ్చారు. డిల్లీ లొ ఈ అబ్యర్ధిత్వం పై విస్త్రుత చర్చ జరిగిన తరువాత, ఆ తరువాత కాంగ్రేస్ వంటి ప్రతిపక్షాలతొ పాటు తెలుగుదేశం వంటి మిత్రపక్షాలకి కూడా సమాచారం అందించారు ప్రధాన మంత్రి వాజ్ పాయి. గత వారం పది రొజులగా దిన పత్రికలు చదివే ప్రతి ఒక్కరికి ఈ పరిణామాలు అర్ధం అవుతూ వచ్చాయి.
అయితే ఉన్నట్లుండి చంద్రబాబు రంగ ప్రవేశం చేసి అబ్దుల్ కలాం పేరు తానే ప్రతిపాదించినట్లు , అందుకు ప్రధాని అంగీకరించినట్లు ఒక ప్రకటన చెసాడు బాబు. జాతీయ రాజకీయాలలొ తన ప్రభావం తగ్గలేదు అని చెప్పుకొవటానికి ఈ చిన్న అభద్దం చెపారు చంద్రబాబు. అదే సమయం లొ హైద్రాబాద్ లొ ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే ఈ ప్రకటనను ఖండిస్తు ఒక వివరణ ఇచ్చారు. ప్రధాని వాజ్ పాయి గారు ఈ విషయం లొ ఒక నిర్ణయం తీసుకుని ఆ తరువాత అందరి తొ పాటు చంద్రబాబు కు కూడా సమాచారం అందించారు తప్ప, నిర్ణయం లొ చంద్రబాబు పాత్ర ఏది లేదు అని వెంకయ్య నాయుడు చెప్పటం తొ పాపం చంద్రబాబు కి గాలి తీసినట్టు అయింది . ముఖ్యమంత్రి స్థాయి లొని వ్యక్తి చవకబారు ప్రచారం కొసం ఇంత పెద్ద అభద్దం చెప్పటం ఎబ్బటు గా ఉంటుందన్న ఇంగిత జ్ఞానం చూపలేక పొయారు చంద్రబాబు .
ఇక్కడ మనం అబ్దుల్ కలాం గారు (టర్నింగ్ పాయింట్స్ - జర్నీ త్రూ చాలెంజస్) అనే పుస్తకం లొ ఆయన తను రాష్ట్రపతి అయిన ప్రక్రియ వివరించారు అందులొ కలాం గారు - తనకి వాజ్ పాయి గారు ఫొన్ చెయబొతున్నారు అని తెలుసుకుని దాని కొసం ఎదురు చూస్తున్న సమయం లొ నా పర్సనల్ ఫొన్ కి బాబు ఫొన్ చెసి మీకు ప్రదాని ఫొన్ చెయబొతునారు మీరు వద్దు అనమాకండి అని చెప్పారు అని ఆ పుస్తకం లొ ఆయన రాసారు.
ఇదంతా సింక్ చెసి చూస్తే ఆక్కడ ఏంజరిగిందొ చిన్న పిల్లలకి కూడా ఇట్టే అర్ధం అయిపొతుంది - ఇది బాబు గారు అబ్దుల్ కలాం గారి రాష్ట్రపతి కథ
అబ్దుల్ కలాం గారిని వాజ్ పాయి గారికి చెప్పి నేనే రాష్ట్రపతిని చెసా - చంద్రబాబు గారు
Reviewed by surya
on
3:38 PM
Rating:
No comments: