అది ఆగస్టు 2019 నర్సీపట్నం ఏరియా అసుపత్రిలో మత్తుడాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్, అదే అసుపత్రిలో గైనకాలజిప్ట్ గా ఉన్న డాక్టర్ గౌతమితో శాఖాపరమైన వివాదాలు ఉండటం వలన ఆ కోపం ప్రసవానికి వచ్చిన ఆరుగురు గర్భిణీ స్త్రీలపై వివక్షను చూపి వారికి ఆపరేషన్ కు ఏనస్తీషియా (మత్తు) ఇవ్వకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక శాశనసభ్యులు ఉమాశంకర్ గణేష్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని అనకాపల్లి నుంచి వెంటనే వేరే మత్తు డాక్టర్ వచ్చి గర్భిణీలకు సుఖ ప్రసవం జరిగే విధంగా ఏర్పాటు చేశారు.
మత్తు డాక్టర్ తీరు మోదటి నుండి వివాదాస్పదంగా ఉండటం గతంలో కూడా అనకాపల్లిలో పనిచేస్తునప్పుడు డ్యూటీకి సమయానికి రాకపోవడంతో ప్రశ్నించిన ఏరియా ఆసుపత్రి సూపర్టెంట్ పై దాడి చేసి పోలీసు కేసులో ఉండటంతో సుధాకర్ వ్యవహారశైలిని తప్పుపడుతూ శాశనసభ్యులు ఉమా శంఖర్ తీవ్రంగా మందలించారు. ఇది మనసులో పెట్టుకున్న మత్తు డాక్టర్ సుధాకర్ స్థానిక శాశనసభ్యులైన ఉమాశంఖర్ పై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు.
ఇక ప్రపంచానికి మహమ్మరిలా పట్టుకున్న కరోనాతో అన్ని దేశాలు పోరాడుతున్న వేళ ముఖ్యమంత్రిగా జగన్ గారు కూడా తమ శక్తికి మించి ప్రజలకి తోడుగా నిలబడి ఉన్న సమయంలో గతంలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని స్థానిక శాశనసభ్యులు ఉమా శంఖర్, అలాగే జగన్ గారి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకుని వచ్చేలా చేసి తమ అక్కస్సు తీర్చుకుందాం అనే ఆలోచనతో స్థానిక టీడిపీ నేత అయ్యన్నపాత్రుడి సహకారంతో తెలుగుదేశం అధినేత చంద్రబబు స్క్రిప్ట్ లో భాగంగా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు మాస్కులు కోరత అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తు పోలీసులని ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
దీంతో స్థానిక శాశన సభ్యులు... సుధాకర్, తెలుగుదేశం నేతలు కలిసి చేసిన కుట్ర కోణాన్ని బయట పెటేలా వాస్తవాలని ప్రజలకు తెలిసేలా మత్తు డాక్టర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు సుమారు గంట సేపు అయ్యన్న పాతృడితో రహస్యంగా కలిసిన సీసీ ఫుటేజ్ ని బయట పెట్టారు. ఈ వయ్వహారంపై కలక్టర్ విచారణకు ఆదేశించి కుట్ర కోణం బయటపడటంతో డాక్టర్ సుధాకర్ ని విధులనుండి సస్పెండ్ చేశారు.
ఇక సుధాకర్ సస్పెండ్ తో రంగంలోకి దిగిన తెలుగుదేశం కుల రాజకీయాలకి తెరలేపుతు గర్భిణీ స్త్రీలు అని కుడా కనికరం చూపకుండా వారిని గాలికొదిలేసిన మత్తు డాక్టర్ దళితుడు అంటూ సెంటిమెంట్ పాలిటిక్స్ కి తెరలేపారు. ఇది ఇలా ఉండగా సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ ముస్లిం, క్రైస్తవ సమాజాన్ని పట్టుకుని పబ్లిక్ గా ముస్లిం, క్రైస్తవలు ఉగ్రవాదులు అని అంటూ రోడ్ మీద హల్చల్ చేసి ఒక సారి వార్తల్లోకి ఎక్కారు.
మరోసారి మత్తుడాక్టర్ కుమారుడు లాక్ డౌన్ నిబందనలు ఉల్లంఘించినందుకు పోర్ట్ పోలీసులు బైక్ సీజ్ చేస్తే సుధాకర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళీ నానా హంగామా చేసి కలకలం రేపారు. మరో సారి విశాఖాలో కారులో వెలుతు మధ్యం మత్తులో బైక్ ను డీకొట్టి ప్రమాధానికి పాల్పడటమే కాకుండా స్థానికులని తనకి కరోనా ఉందని వస్తే తమకి అంటిస్తానని బెదిరించడంతో పోలీసులు వచ్చి మత్తు డాక్టర్ ను అరెస్టు చేశారు. ఈ అరెస్టుని కూడా తెలుగుదేశం తమ రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేసింది.
మత్తు డాక్టర్ గా వార్తల్లో నిలిచిన సుధాకర్ ఈ ఘటనలు జరిగిన ఏడాది తరువాత గుండెపోటుతో మరణించారు. మరణానికి ముందే ఒకానోక సంధర్భంలో మత్తు డాక్టర్ సుధాకరే అయ్యన్న పాత్రూడు తనని కుక్కలా వాడుకున్నాడని ఆవేదన చెందుతున్న వీడియొని సైతం సోషల్ మీడియా మాద్యమాల్లో వైరల్ అయింది.
ఒక సామాన్యమైన డాక్టర్ ఉద్రేక మనస్తత్వాన్ని తమ రాజకీయాలకి వాడుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లబ్దిపొందాలనే ఆలోచన చేసి చివరికీ ఆ వ్యక్తి చేత తప్పులు మీద తప్పులు చేసేలా వెనకనుంచి పోత్సహించి ఆకరికి తెలుగుదేశం సాధించింది ఎంటి? ... తెలుగుదేశాన్ని నమ్మిన మత్తు డాక్టర్ సుధాకర్ ఏమి సాధించాడు.. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు తెలుగుదేశం మనుకోవాలి. అలాగే తెలుగుదేశం మాటలు నమ్మి వారి ఆటలో పావుగా సామాన్యులు మారదు... తస్మాత్ జాగ్రత్త....
No comments: