Comments

అభివృద్ది లొ ఏ జిల్లా ని వదలని వై.యస్ రాజశేఖర రెడ్డి గారు ( మీ జిల్లా తొ సహా )

అభివృద్ది లొ ఏ జిల్లా ని వదలని వై.యస్ రాజశేఖర రెడ్డి గారు ( మీ జిల్లా తొ సహా )



పాలనారంగ చరిత్ర లొ ఆయనది చెరగని సంతకం, ఆయన సాగించిన అభివృద్ది .. ప్రజా సంక్షేమ ప్రస్తానం మరువ లేని జ్ఞాపకం. వై.యస్ ముఖ్యమంత్రిగా ఆయన ఎనలేని మమకారం చూపించేవారు ఆయన పాలన అంటేనే రైతన్న కి భరొసా ప్రాజెక్టుల రూపకల్పన దగ్గర నుండి పేదవాడికి గూడు దాక ఒకటా రెండా ఎన్నొ సంక్షేమ పధకాలు. ఆయన మరణం తొ పేదవాడే కాదు రాష్ట్రమూ మూలన పడింది 

______________________________________________________

శ్రీకాకుళం జిల్లా

1) శ్రీకాకుళం జిల్లా లొ గతం లొ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని 2.74 లక్షల ఇల్లు మంజూరు చెసిన ఘనత వై.యస్ రాజశేఖర రెడ్డి గారిది.

2) 2008 అక్టొబర్ 26 న మొదటి సారి గా శ్రీకాకుళం లొ ప్రభుత్వ మెడికల్ కళాశాల రింస్ ని ఏర్పాటు చెసిన ఘనత వై.యస్ ది.

3) ఇటీవల ప్రారంభం అయిన తొటపల్లి , ఫేస్ 2 ప్రాజెక్టు కు, వంశ ధార నది పై తలపెట్టిన రెండొ దఫా ప్రాజెక్టుకు టెక్కలి నియొజకవర్గం లొ ఆఫ్షొర్ ప్రాజెక్టు కు జీవం పొసింది వై.యస్ మాత్రమే 970 కొట్ల వ్యయం తొ వంశదార ప్రాజెక్టు పూర్తి చెస్తే జిల్లా లొ 20 మండలాలలొ 2.55 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది అని 2005 లొనె సంకల్పించిన ఘనత వై.యస్ ది.   

4) ఒడిశా లొ వర్షాలు పడితే నాగావళొ వంశధార నదులలొ కనిపించే వరద వ్రుదుత తట్టుకునే లా 300 కొట్ల తొ కరకట్ట కి బీజం వేసింది వై.యస్ ఏ 

5) మడ్డు వలస విస్తరణ ప్రాజెక్టు తొ పాటు మహెంద్ర తనయ నది పై ఆఫ్షొర్ ప్రాజెక్టు కు సంకల్పించింది వై.యస్ ఏ  

6) వెనుకబడ్డ శ్రీకాకూళం విద్యార్ధులకు ఉన్నత విద్యను అక్కరకు తేవాలి అనే ఉద్దేశం తొ 2008 జూన్ 25 న  వై.యస్ బి.ఆర్ అంబెద్కర్ పీ.జి సెంటర్ ను యునివర్సిటి గా స్థాయి పెంచారు. వర్సిటి ఎర్పడ్డాక వెంటనే సొషల్ వర్క్ , బయొటెక్నాలజి విభాగాలు ఎర్పాటు చెసి రెగ్యులర్ ప్రొఫెసర్లు ని నియమించారు  (1975 నుండి సిక్కొలు ప్రజలు పొరాడిన విశ్వవిద్యాలయం ఎట్టకెలకు వై.యస్ తీసుకు వచ్చారు.

7) శ్రీకాకుళం ప్రజల ఆరొగ్య సమస్యలు గుర్తించి అక్కడ ప్రాధమిక వైద్యా కెంద్రం ( పి.హెచ్.సి ) ని ఏర్పాటు చేశారు. 

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)  
 ___________________________________________________________

విజయనగరం జిల్లా

1) విజయనగరం కి ప్రభుత్వ జూనియర కళాశాలలు , 9 ప్రభుత్వ బి.సి బాలికల కళాశాలల వసతి గ్రుహాల మంజూరు చేశారు 

2) 3.83 కొట్ల తొ విజయనగరం లొ రాజీవ్ స్పొర్ట్స్ స్టేడియం నిర్మించారు.

3) జె.ఎన్.టి.యు యునివర్సిటి కి అనుభందం గా విజయనగరం లొ ఇంజీనీరింగ్ కళాశాలలు నిర్మించారు 

4) 1.62 కొట్ల తొ విజయనగరం లొ యూత్ హాస్టల్ నిర్మించారు. 

5) 12 వేల ఎకరాలకి సాగునీరు అందించేందుకు ఆస్ట్రియా పరిజ్ఞానం తొ 5 కొట్లు పెట్టి ఆసియా లొనే అతి పెద్ద రబ్బర్ డ్యాం జంఝావతి ని నిర్మించారు 

6) 25 వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు, విజయనగరం మునిసిపాలిటి 2 టి.యం.సి ల త్రాగు నీరు అందించేందుకు 129 కొట్ల వ్యయం తొ తారకరామ తీర్ధ ప్రాజెక్టు ని వై.యస్ మంజూరు చేశారు 

7) 12 వేల ఎకరాలకి సాగునీరు అందించేందుకు పెద్దగడ్డ , వెలాది ఎకరాలకి అదనపు ఆయుకట్టు కల్పించేందుకు వెంకళ రాయ సాగర్ వట్టిగడ్డ పనులు మొదలుపెట్టారు .

8) వై.యస్ చెపట్టిన సాగునీటి ప్రాజెక్టులలొ తొటపల్లి ప్రాజెక్టు అతి ముఖ్యమైనది లక్షా 20 వేల యకరాల అదనపు ఆయుకట్టు కొసం చెపట్టిన తొటపల్లి ఆదునీకరణ ప్రజెక్టు ఒక ప్రహసనం గా మారింది. వై.యస్ అధికారం లొకి వచ్చిన తరువాతే చక చక పనులు సాగాయి .

9) వేపాడ మండలం లొ విజయరామ సాగర్ అభివృద్ది కి 1.5 కొట్లు కేటాయించారు వై.యస్.

10) యస్.కొట ప్రధాన రహదారి అభివృద్ది కి నిదులు మంజూరు చేశారు.

11) రైతులకి ఇచ్చిన మాట ప్రకారం నష్టాలలొ ఉన్న భీమ సింగి చెక్కెర కర్మాగారం ని తెరిపించారు.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...) 

________________________________________________________________

విశాఖపట్నం జిల్లా

1) గాజువాక తొ పాటు 32 పంచాయితీలతొ 72 వార్డుల తొ 2005 లొ విశాఖ కు గ్రెటర్ హొదా కలిగించారు

2) కెంద్రం పై వత్తిడి తెచ్చి జె.ఎన్.యస్.యు.ఆర్.యం సుమారు 1500 కొట్ల తొ భూగర్భ డ్రైనేజి ప్రాజెక్టు తొ నగరాన్ని మురుగు నుండి బయటపడేశారు 

3) హైద్రాబాద్ కి దీటుగా శీఘ్ర రవాణ వ్యవస్త కొసం 456 కొట్ల తొ బి.ఆర్.టి.యస్ కు బాట వేశారు

4) విశాఖ ఉక్కు విస్తరణ, అచ్యుతాపురం లొ ఇండస్ట్రియల్ కారిడార్, భీమిలి లొ ఐ.టి కారిడార్, పరవాడ లొ ఫార్మాస్యుటికల్ కారిడార్ ,దువ్వాడ లొ ఐ.టి సెజ్ లతొ విశాఖ ను పరిశ్రమల పుంత గా మార్చారు.

5) విశాఖ ఎయిర్ పొర్టు ని అంతర్జాతీయ ఎయిర్ పొర్టు గా తీర్చి దిద్దారు 100 కొట్ల తొ అధునాతన ట్రెమినల్ నిర్మించారు. తరుచూ ముంపునుకు గురయ్యే ఎయిర్ పొర్టు ను ఎత్తు పెంచి ఆధునీకరించారు.  

6) మీరు మొదలుపెట్టిన తాండవ , రైవాడ, కొనాం, పెద్దేరు ప్రాజెక్టులు ఇప్పుడు మర్చిపొయారు పాలకులు.

7) ఉత్తరాంద్ర వాసుల కలల ప్రాజెక్టు ఉత్తరాంద్ర సుజల స్రవంతి నిర్లక్ష్యం తొ నీరుగారిపొయింది.

8) ఉత్తరాంద్ర వాసులకు ఆదునిక సదుపాయాలతొ మెరుగైన వైద్యం అందించాలనే ఆలొచన తొ 110.24 ఎకరాలలొ 250 కొట్ల తొ వింస్ (విశాఖ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ని 2006 లొ మొదలు పెట్టారు దీనిని చంద్రబాబు చివరి 30 కొట్లు పెట్టి మొన్న ప్రరంభంచారు దీనితొ వై..యస్ కల ఇప్పటికి నెరవేరింది.

9) వై.యస్ హయాము లొ గొదావరి నీటిని విశాఖ తొ పాటు ఉత్తరాంద్రకి కూడా మళ్ళించటానికి సంకల్పించారు ఇందుకొసం పొలవరం ఎడమ కాలవ నిర్మాణాం కి శ్రీకారం చుట్టారు.

10) స్టీల్ ప్లాంటు కు నీటి సమస్య లేకుండా ఏలేరు నీటిని మళ్ళించటం తొ పాటు రిజర్వాయర్ల సామర్ద్యం పెంచెందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.

11) కెంద్రం తొ పొరాడి మూతపడనున్న (బి.హెచ్.ఈ.యల్) ను ( బి.హెచ్.పి.వి) లొ వీలీనం చెయించారు, ఎప్పుడొ మూతపడాల్సిన షిప్ యార్డు ను న్యావి లొకి మెర్జ్ చెయించారు  , (ఎన్.టి.పి.సి) , (హెచ్.పి.సి.యల్) విస్తరణ కూడా వై.యస్ హయాము లొనే అంకురార్పణ జరిగింది. 

12) ఆరిలొవ , సిమ్హచలం , మదురవడ నగరానికి 6ట్రాక్ రొడ్లు నిర్మించారు.

13) ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి రైల్వేస్టేషన్ వరకు 87 కొట్లు పెట్టి విశాఖ లొ నే తొలి ఫ్లై ఒవర్ నిర్మించారు. 

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...) 

_________________________________________________________________

తూర్పు గొదావరి జిల్లా
                 
1) రాజమండ్రి ని పచ్చమ గొదావరి తొ కలుపుతు నిర్మించిన నాలుగు లైన్ల వంతెన 2006 జూన్ 2 న శంకుస్థాపన చేసింది వై.యస్  

2) రాజమండ్రి లొని ఆల్కట్ తొట, కాకినాడ లొ ఆర్.టి.సి కాంప్లెక్స్ (పేర్రాజుపేట, సాంభమూర్తి నగర్), తుని లొ గొల్ల అప్పారావు సెంటర్ వద్ద రైల్వే ఒవర్ బ్రిడ్జులు వై.యస్ చలవే , కొండయ్య పాలెం పొర్టు ప్రాంతం లొ రెండు ఫ్లై ఒవర్లు శంకుస్థాపన చేసినప్పటికి ఆయన చనిపొవటం తొ పక్కన పెట్టారు.   

3) సఖినేటి పల్లి - నర్సాపురం, పాశర్లపూడి - బొడసకుర్రు వంతెనలకు నిదులు ఇచ్చి పూర్తి చేసింది వై.యస్.

4) రాజమండ్రి లొ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 2009 ఫిబ్రవరి 28 న శంకుస్థాపన చేసి మొదలుపెట్టింది వై.యస్. 

5) నేష్నల అకాడమీ ఆఫ్ కన్సట్రక్షన్ (నాక్) ను రాజమండ్రి కి తెచ్చింది వై.యస్ 

6) రంపచొడవరం లొ ఆయన మొదలుపెట్టిన భూపతిపాలెం ప్రాజెక్టు , ముసురుమిల్లి ప్రాజెక్టు అలాగే పొలవరం ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లా మెట్ట ప్రాంతం లొ సెంటు భూమికి కూడా సాగునీటి కొరత ఎదురవ్వదు 

7) రాజమండ్రి  మురుగునీటి శుద్ది కొసం యస్.టి ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వై.యస్ 

8) రాజమండ్రి శాటిలైట్ సిటి లొ 2,184 ఇళ్ల ను నిర్మించారు 

9) కాకినాడ డైరీ ఫారం సెంటర్ లొ 2,170 ఇళ్ళు పేదవాళ్ళకి నిర్మించారు  

10) డెల్టా రైతులకు వరప్రదాయిని లాంటి డెల్టా ఆదునీకరణ కు శ్రీకారం చుట్టింది వై.యస్ , జిల్లా కు 1,697.24 కొట్లు కెటాయించారు , తూర్పు మద్య డెల్టా తొ పాటు , పిఠాపురం బ్రాంచ్ కెనాల్ లొ సాగునీటి కాలువ ఆదునీకరణ కు 1,170.21 కొట్లు , మురుగునీటి కాలువ కు 486.45 కొట్లు కెటాయించారు , శరవేగంగా సాగిన పనులు ఆయన చనిపొయాక అటక ఎక్కాయి.

11) ఏటిగట్ల అభివ్రుద్ది కి 2007 లొ 540 కొట్ల వ్యయం తొ పనులు ప్రారంభించి వెంగంగా సాగించారు , ఆయన చనిపొయాక పనులు నిలిచిపొయాయి.

12) పొలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 11 ఏళ్ళు అవుతున్న 60.4 శాతం మాత్రమే పనులు అయ్యాయి.

13) రాజొలు ప్రాంత వాసుల దాహార్ది తీర్చటానికి 10 కొట్లతొ పదకం నిర్మించారు. 

14) రామచంద్రాపురం వాసులకి గుక్కెడు నీరు అందించేందుకు 21 కొట్ల తొ రక్షిత మంచినీటి పదకానికి వై.యస్ శంకుస్థాపన చేశారు. తరువాత ప్రభుత్వాలు దీనిని పక్కనపెట్టాయి 

15) రాజనగరం నియొజకవర్గం కలవచర్ల వద్ద 18 కొట్ల తొ పుష్కర లిఫ్టు ని ఏర్పాటుచేసింది వై.యస్.  

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

________________________________________________________________

పచ్చిమ గొదావరి జిల్లా

1) 2003 పాదయాత్ర సమయం లొ ప్రజలు పొగొండ రిజర్వాయర్ నిర్మించాలి అని కొరగా , అధికారం లొకి వచ్చిన వెంటనే జంగారెడ్డి గూడెం చల్ల సత్తెమ్మ దేవాలయం దగ్గర పొగొండ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు , అక్కడే కనక దుర్గమ్మ ఆలయం కూడా నిర్మించారు.

2) పాదయాత్ర సమయం లొ పొలవరం నియొజకవర్గం లొ ఇరుకు రొడ్లు చూసి , అధికారం లొకి రాగానే 265 కిలీమిటర్ల మేర ఇంటర్నల్ రొడ్డు అభివృద్ది చేశారు.

3) జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ని 30 పడకల ఆసుపత్రి గా మార్పు చేసి సుమారు 20 దశాబ్ధాల కలను నెరవెర్చారు.

4) అదే కాకుండా సరైన వైద్యం అందక బాధ పడుతున్న గిరిజనులని చూసి వై.యస్ మొదట 30 పడకల ఆసుపత్రి ని మంజూరు చేశారు, దీనికి నాబార్డు నుంచి 1.20 కొట్లు మంజూరు కాగా 2007 జూన్ 7 న దీనిని 100 పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ చేసి వైద్య విదాన్ పరిషత్ నుండి 6.34 కొట్లు మంజూరు చేసి మిగిలిన 70 పడకల ఆసుపత్రి ఆర్.యం.ఒ సిబ్బంది క్వార్టర్స్ నిర్మించి మొత్తం 7.54 కొట్ల తొ భవనాలు నిర్మించారు.

5) 1701 కొట్ల తొ చింతలపూడి ఎత్తిపొతల పధకాన్ని ప్రారంభించి కామవరప కొట లొ 2008 అక్టొబర్ 30  న శంకుస్థాపన చేశారు 16 మండలాలలొ 196 గ్రామాలకు త్రాగునీరు , 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటం దీని లక్ష్యం ,దీనిని ఇప్పటి ప్రభుత్వం పక్కన పెట్టింది.

6) 44 కోట్ల తొ వై.యస్ మొదలు పెట్టిన బొర్రపాలెం , ఎర్ర కాలువ ఎత్తిపొతల పధకం పదకం ఇప్పుడు పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. 

7) కామవరపు కొట లొ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, పశువుల ఆసుపత్రి ని మంజూరు చేసి ప్రారంభించారు.

8) 5 కొట్ల వ్యయం తొ చింతలపూడి పట్టణ ట్రాఫిక్ సమస్య తీర్చారు. 

9) ఏటిగట్ల కి వలందలాది కొట్లు విడుదల చేసి పనులు పూర్తి చేసి, ఎంతొ అభివృద్ది చేసి డెల్టా ప్రజలని వరద ముంపు నుండి కాపాడింది వై.యస్.

10) అర్హత కలిగిన నిరుపేదలకు జిల్లా లొ 30 వేల ఎకరాల భూమిని పంచారు వై.యస్ 

11) దూబచర్ల లొ 14.5 ఎకరాలలొ 436 మందికి పక్క ఇళ్ళు నిర్మించి పట్టాలు ఇచ్చారు , దీనికి అక్కడ ప్రజలు వై.యస్.ఆర్ వసంత్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. నర్సాపురం లొ 10 కొట్ల తొ 600 మందికి ఇళ్ళు నిర్మించారు.

12) ఆలుమూరు లొ హైస్కూల్ , పెనుమంట్ర లొ జడ్.పి హై స్కూల్ వై.యస్ అభివృద్ది చేశారు.  
13) గొస్తని డ్రైన్ పై కొటి రూపాయల తొ( రొడ్ కం వంతెన ) వై.యస్ శంకుస్థాపన చేసి పూర్తి చేశారు.

14) పాలకొల్లు - నిడదవొలు రహదారి పై ఫ్లై ఒవర్ వంతెన , పార్క్ , సెంట్రల్ లైటింగ్ వ్యవస్త తొ ఈ ప్రాంతం రూపు రఖలే మారిపొయాయి.

15) దొంగరావి పాలెం వద్ద గొదావరి పై తాత్కాలిక ఎత్తిపొతల పధకం ఏర్పాటు చేసి దాళ్వకు సంవ్రుద్ది గా నీరు అందించి రైతులను ఆదుకున్నారు.

16) ఆచంట లొ కొటి వ్యయం తొ 30 పడకల ఆసుపత్రి , మార్కెట్ యార్డు భవనాలకు నిదులు ఇచ్చి మార్కెట్ యార్డు ని సుందరంగా తయారుచేశారు.

17) పెనుమంట్ర వెలగలవారి పాలెం రహదారిని వై.యస్ హయాములొ నిర్మించారు 

18) తాడెపల్లి గూడెం లొ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఎంతొ మందికి విద్యా ఉపాది కల్పించారు వై.యస్ 

19) పొలవరం గ్రామానికి వరద ప్రమాదం రాకుండా 6 కొట్లు తొ నెక్లస్ బండ్ , పొలవరం నియొజకవర్గం లొని ముపు జలాలను గొదావరిలొకి మల్లించటానికి 57 కొట్ల తొ కొవ్వాడ ఔట్ ఫాల్ స్లూయిడ్ నిర్మించటానికి చర్యలు తీసుకున్నారు.

20) 2,700 కొట్ల నిధుల తొ ఇందిరా సాగర్ ఎత్తిపొతల పధకం ని ప్రారంభించారు.

21) జిల్లా కు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా కెంద్ర ప్రభుత్వం నిధులు తీసుకు వచ్చి లేసు పార్కు ని అభివృద్ది చేశారు.

22) ఏలూరు నగరం లొ తమ్మిలేరు రివిటిమెంట్, వేశవి లొ ప్రజలు ఎదురుకుటున్న తాగునీటి సమస్య పరిష్కరించటానికి సుమారు 100 ఎకరాల సమ్మర్ స్టొరేజ్ ట్యాంకు నిర్మాణానికి  కొట్ల నిధులు మంజూరు చశారు వై.యస్.

23) భీమవరం పట్టణ ప్రజల దాహార్ది తీచటానికి 50 ఏళ్ళ వరకు తాగునీటి సమస్య ఏర్పడకుండా పట్టణ శివారు వెండ్ర రొడ్డు లొ 62 ఎకరాలలొ భారి మంచినీటి రిజవాయర్ ను ఏర్పాటు చేశారు వై.యస్ 

24) డెల్టా మొడ్రనైజేషన్ ప్యాకేజి లొ భాగంగా 18 కొట్ల తొ యనమదురు డ్రయిన్ కాలువ ఆధునీకరణ పనులు వై.యస్ హయాము లొ మొదలు పెట్టారు వీటితొ భీమవరం ,యనమదురు, గొల్లవానితిప్ప, నాగేంద్రపురం గ్రామాలు వద్ద యనమదుర్రు డ్రయిన్ పై వంతెనల నిర్మాణం జరుగుతుంది.

25) గొపాలపురం లొ 5 కొట్ల వ్యయం తొ వెలుగు పాటశాల , 2 కొట్ల తొ 30 పడకల ఆసుపత్రి నిర్మించారు.

26) తాడిపుడి ఎత్తిపొతల ద్వారా సాగునీరు అందించి భూములను సస్యస్యామల చేశారు వై.యస్ 

27) బియ్యపు తిప్ప మిని ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు లొ కదలిక వచ్చింది అంటే అది వై.యస్ చలవే 

28) నిడదవొలు బాలాజి నగర్ లొ 1.64 కొట్ల తొ నిర్మించిన 500 కె.యల్ సామర్ద్యం గల మంచినీటి రిజర్వాయర్ కు శంకుస్థాపన  చేసింది వై.యస్ 

29) విద్యాభివ్రుద్ది లొ భాగంగా ఆంద్రా యునివర్సిటి క్యాంపస్ వెంకట్రామన్న గూడెం లొ వెటర్నరి పాల్ టెక్నిక్ ఎర్పాటు చేశారు. 

30) ఎన్నొ ఏళ్ళు గా కొల్లేరు గ్రామ ప్రజల ఎదురుచూసిన  తొకపల్లి - సాయంపాలెం వంతెనను 1.4 కొట్ల తొ నిర్మించి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసి ఆ గ్రామాల చిరకాల సమస్యని పరిష్కరించారు. 

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_______________________________________________________________

కృష్ణా జిల్లా

1) కృష్ణా డెల్టా రైతుల చిరకాల కొరిక అయిన పులిచింతల ప్రాజెక్టు కి 2004 లొ వై.యస్ శంకుస్థాపన చేసారు ,ఆయన హయాము లొ 90% పనులు పూర్తి కాగా , 10% పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

2) కృష్ణా డెల్టాకు వరద వచ్చినప్పుడు రైతు పడుతున్న కష్టాలు చూసి 2008 జూన్ 6 న 4,573 కొట్ల తొ డెల్టా ఆదునీకరణ పనులు ప్రారంభించారు 13.06 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా పరిధిలొ ఉన్నాయి , సంవత్సరం లొ 40 % పనులు వై.యస్ పూర్తి చేసారు ఆయన చనిపొయాక మిగతా 60 % పనులు సాగుతూనే ఉన్నాయి.

3) బందరు పొర్టు నిర్మాణం జరిగితే కృష్ణా జిల్లా అభివృద్ది లొ ముందు ఉంటుందని 2008 ఏప్రిల్ 23 న 1500 కొట్ల తొ పొర్టు ఏర్పాటుకు శంకుస్థాపన చేసారు.

4) నూజివీడు లొ రాజీవ్ గాంధి యునివర్సిటి ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజి (ఐ.ఐ.ఐ.టి) 2008 లొ ప్రారంభించారు వై.యస్.

5) విజయవాడ నగర పాలక సంస్థ అప్పుల ఊబి లొ కూరుకుపొయింది జీతాలు కూడా ఇవ్వలేని స్థితి కి వచ్చింది, ఆ స్థితి లొ మేయర్ రత్న బిందు గారు వై.యస్ ని కలిస్తే , వై.యస్ పెద్దగా నవ్వి , శ్రావణ మాసం , అందులొ శుక్రవారం ఇంటికి ఆడపడుచువి వచ్చావు , తప్పకుండా ఆదుకుంటాను అని అప్పటికప్పుడు 100 కొట్లు మంజూరు చేశారు. 

6) కలదిండి పాల్ టెక్నిక్ కళాశాల నిర్మాణానికి వై.యస్ 3 కొట్లు కేటాయించారు

7) మండవల్లి లొ జూనియర్ కళాశాల లేకపొవటం తొ విద్యార్ధులు కైకలూరు రావల్సివచ్చేది. ఇది తెలిసి విద్యార్ధుల కొసం కొటి రూపాయలతొ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించారు వై.యస్ 

8) 3 దశాబ్దాలు గా కొల్లేరు ప్రజలు ఎదురుచూస్తున్న సర్కారు కాల్వ కర్రల వంతెన స్తానం లొ పెద్దింట్లమ్మ వారది నిర్మాణం కి 12 కొట్లు నిధులు కేటాయించారు వై.యస్ . ఆయన మరణానతరం దానిని పట్టించుకునేవాడే లేకుండా పొయాడు. 

9) నాగాయలంక మండలం , భావ దేవర పల్లి లొ రాష్ట్రం లొనే తొలి ఫీషరీస్ పాల్ టెక్నిక్ కళాశాలను వై.యస్ ప్రారంభించారు. 

10) పులిగడ్డ విజయవాడ కరకట్ట డబుల్ లైన్ నిర్మాణ పనులను వై.యస్ 138 కొట్ల తొ 2006 మే 27 న ప్రరంభించారు. 

11) ట్రాఫిక్ సమస్యలు తీర్చటానికి 74.24 కొట్ల తొ 10 కిలొమీటర్ల విజయవాడ ఇన్నర్ రింగ్ రొడ్డు ని 2008 ఆగస్టు 6 న శంకుస్థాపన చేసింది వై.యస్.ఆర్.

12) గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురి అయ్యి ఒక స్మశాన వాటికగా మారిన బందరుకి కృష్ణా యూనివర్సిటీ ఇచ్చి ఊపిరి ఊదారు.

13) గన్నవరం నియాజకవర్గంలో ఐ టి పార్క్ "మేధ" వచ్చింది వై.యస్ హయాము లొ.

14) గతంలో చిన్న పాటి వర్షానికే పొంగి ప్రజల ప్రాణాలు ఆస్తులు మింగే బుడమేరు కి డైవర్షన్ కెనాల్ కట్టించారు వై.యస్.

15) ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యాసంస్థ అర్చిటెక్చర్ కాలేజీ విజయవాడకి తెచ్చారు. 

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

గుంటూరు జిల్లా

1) మహానేత వై.యస్ చివరి సారిగా సంతకం చేసిన ఫైల్ గుంటూరు జిల్లా మిర్చి రైతులకు వాతావరణ ఆదారిత భీమా కింద ప్రయొజనం చెకూరేదే (17 కొట్లు పైగా లబ్ది పొందారు) 

2) గుంటూరు నగరానికి దాహార్ధి తీర్చేందుకు 6.50 కొట్ల తొ తక్కెల్లపాడు రా వాటర్ ప్లాంటు నుండి ,తక్కిళ్ళపాడు నీటి శుద్ది ప్లాంట్ వరకు రెండొ పైపు లైన్ నిర్మించారు 

3) కొస్తా లొ అతి పెద్ద ఆసుపత్రిగా పెరు పొందిన జి.జి..హెచ్ లొ మిలినియం బ్లాక్ నిర్మాణానికి 10 కొట్లు మంజూరు చేసిన ఘనత ఒక్క వై.యస్ కే దక్కుతుంది.

4) జిల్లా రైతుల స్థితి గతులు మార్చే పులిచింతల ప్రాజెక్టు మొదలు పెట్టింది వై.యస్ 

5) వై.యస్ చెసిన 12 వేల కొట్ల రుణమాఫి లొ 560 కొట్లు మేర లభ్ది పొందింది జిల్లా రైతులు. 

6) అచ్చంపెట మండలం లొ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక కల 1999 లొ ఎన్నికల హామి గా బాబు మంజూరు చేస్తా అని చెప్పినా తరువాత పట్టించుకొలేదు. 2005 జూన్ 5వ తేదిన మాదిపాడు పంచాయితి పరిది లొని జడపల్లి మెటు తండాకి వచ్చిన వై.యస్ అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తు సంతకాలు చేసారు జూన్ లొ కళాశాల మంజూరు కాగ జులై లొ తరగతులు ప్రారంభం అయ్యాయి.

7) అచ్చెంపెట మండలం లొని 14 గ్రామాల ప్రజల దాహార్ది తీర్చెందుకు పుట్లగూడెం వద్ద రక్షిత మంచినీటి పధకం ని నిర్మించేందుకు వై.యస్ 18 కొట్లు మంజూరు చేశారు. నిర్మాణ పనులు అన్ని పూర్తి అయినా ఇంతవరకూ ప్రారంభం కి నొచుకొలేదు. 

8) పెదకూరపాడు నియొజకవర్గం లొ అన్నదాతలు రెండు పంటలు పండించుకొవాలి అని. చిట్టచివర భూమికి కూడా సాగునీరు అందేందుకు వై.యస్ ఎంతొ కృషి చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఒకే సారి 250 కొట్లు విలువ చేసే 10 ఇరిగేషన్ స్కీములు 2008 జూన్ 5 న శిలాఫలకాలు వేశారు.  

9) మాచర్ల మండలం లొ కొప్పునూరు అనుపు ఎత్తిపొతల పధకం , వెల్దుర్థి మండలం లొని వరికపుడి శాల పధకం ని 2008 జూన్ లొ శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు వాటిని పూర్తి చెయటానికి పాలకులు చర్యలు తీసుకొలేదు.

10) రెంటిచింతల మండ్లం లొని సత్రసాల ప్రాజెక్టు కు వందల కొట్ల రూపాయల తొ వై.యస్ చెపట్టగా ఇప్పటికి ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 

11) పంటలను మార్కెటు కు సకాలం లొ రవాణ చెయటానికి కృష్ణా నధి కరకట్టల అభివృద్ది కి చర్యలు తీసుకున్నారు దీనికి 2008 లొ 300 కొట్లు మంజూరు చేశారు, ఎడమ కట్ట సకాలం లొ పూర్తి అయింది ,ఆయన మరణానతరం కుడి కట్ట పనులు మూలన పడి నత్త నడక సాగుతున్నాయి. 

12) భారతదేశం లొ కెంద్ర ప్రభుత్వం 3 సుగంద ద్రవ్యాల పార్కులు మంజూరు చెయగా , వై.యస్ ఎంతొ క్రుషి చేసి వాటిలొ ఒకటి మొదవొలు - వంకాయలపాడు రెవిన్యు పరిది లొ 1.5 కొట్ల తొ ఎర్పాటు చేశారు. ఇక్కడ మిర్చి , పసుపు ఇతర సుగంద ద్రవ్యాలు పరిశొధన చెయటం తొ పాటు నాన్యమైన ఉత్పత్తులు , అధిక దిగుబడులు రావటానికి ఈ సుగంద పార్కు ఎంతొ దొహద పడుతుంది. 

13) నక్కవాగు పొంగి నిత్యం ప్రజలు పంటని నష్టపొతున్నారు అని గ్రహించిన వై.యస్ జిల్లా లొ అలాంటి వాగుల మీద కరకట్టలు నిర్మాణం కి 33 కొట్లు మంజూరు చేశారు యడ్లపాడూ నుండి సొలస వరకు సర్వ్యే నిర్వహించిన డ్రైనేజి అధికారులు ఆయన మరణం తరువాత మాట్లడలేదు.

14) ఎంతొ చారిత్రిక ప్రాధాన్యత కలిగిన కొండవీడు కొట ని ప్రపంచ పర్యటక స్థలం గా తీర్చి దిద్దేందుకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వై.యస్ 100 కొట్ల నిదులతొ ప్రాంతాన్ని అభివ్రుద్ది చెయాలని అనుకుని కొట దగ్గరకి ఘాట్ రొడ్డు ప్రతిపాధించారు ఇప్పుడు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

ప్రకాశం జిల్లా

1) 220 కోట్ల తొ 1000 పడకల రింస్ ఆసుపత్రిని వై.యస్ హయాము లొ నిర్మించారు

2) ఒంగొలు నగరానికి త్రాగునీరు అందించేందుకు రామతీర్ధం నుంచి పైప్ లైన్ నిర్మించారు 

3) నగరం లొ 7 ఒవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు నీటిని అందించారు 

4) ప్రకాశం జిల్లా కి మిని స్టేడియం మంజూరు చేశారు వై.యస్ 

5) కొత్త పట్నం , ఒంగొలు ఫ్లై ఒవర్ ని మంజూరు చేసింది వై.యస్ రాజశేఖర రెడ్డి గారు.

6) పొతురాజు కాలువ ఆధునీకరణ కు నిధులు ఇచ్చారు , జిల్లాలొ జైలు నిర్మించారు.

7) చీమ కుర్తి మండలం లొ రామ తీర్ధ జలశయాన్ని నిర్మించి 20 వేల యకరాలకు సాగునీరు అందించారు.

8) మద్దిపాడు మండలం లొ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 80 వేల యకరాలకు సాగునీరు పలు గ్రామాలకు త్రాగునీరు అందించారు.

9) గూండ్లా పల్లి లొ పరిశ్రమల కెంద్రాన్ని నెలకొల్పారు.

10) 200 కొట్ల తొ నార్కెట్ పల్లి, అద్దంకి , మెదరమెట్ల రాష్ట్రియ రహదారి నిర్మించారు.

11) బల్లి కురవ మండలం లొ భవనాసి రిజర్వాయర్ కి నీరు ఇచ్చి 5 వేల ఎకరాలకు సాగునీరు అందించారు.

12) కొరిశపాడు లొ యర్రం చినపొలి రెడ్డి ఎత్తిపొతల పధకం ప్రారంభించి 5 వేల యకరాలకు సాగునీరు అందించిన ఘనత వై.యస్ ది 

13) 120 కొట్ల తొ దర్శి నియొజక వర్గం లొ రక్షిత మంచినీటి పధకం నిర్మించారు

14) 120 కొట్ల తొ పర్చూరు నియొజకవర్గం లొ సాగర్ కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేసి ఆయకట్టుకి నీరు అందించిన ఘనత వై.యస్ ది. 

15) 2 కొట్ల తొ మార్కెట్ కమిటీ భవణాలు నిర్మించారు.

16) 29 కొట్ల తొ దర్శి ,అరపల్లిపాడు , రాజం పల్లి నుండి బొద్దికూరపాడు. దర్శి నుంచి చామంత పాడు, ఆరపల్లి పాడు నుండి గజ్జల కొండ , దొనకొండ నుంచి చందవరం వరకు బి.టి రొడ్లు నిర్మించారు.

17)  133 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మించారు. 

18) గిద్దలూరు నియొజక వర్గం లొ  12 కొట్ల తొ భైరేని గుండాల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ,గిద్దలూరు మండలం లొ 6 గ్రామాలకి , పరిసర 14 గ్రామాలకు దీని ద్వారా త్రాగు నీరు అందించారు.

19) రాచర్ల మండలం లొ 22 కొట్లు పెట్టి రామన్న కతువ ప్రాజెక్టును నిర్మించి దీని ద్వారా 20 గ్రామాలకు త్రాగునీరు అందించారు.

20) గుండ్లమెట్టు ప్రాజెక్టు కు వ.యస్ 11 కొట్లు నిధులు కెటాయించారు.

21) మార్కాపురం నియిజకవర్గానికి 35 కొట్ల తొ సాగర్ జలాలని తీసుకు వచ్చారు. మార్కాపురం లొ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు.

22) మార్కాపురం నియొజక వర్గం లొ వెలుగొండ ప్రాజెక్టు కు పనులు సైతం ప్రారంభించారు వై.యస్ 

23) కొండపి నియొజకవర్గం లొ పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద 50 కొట్ల తొ సంగమేశ్వరా ప్రాజెక్టు ను నిర్మించారు. పొన్నలూరు , జరుగుమల్లి , కొండపి , మర్రిపూడి మండలాలలొ 2,500 ఎకరాలకి సాగునీరు అందించటం తొ పాటు అనేక గ్రామాలకు త్రాగునీరు సైతం వై.యస్ అందించారు.

24) యర్రగొండపాలెం లొ మొడల్ డిగ్రీ కాలేజి ని నిర్మించారు వై.యస్ 

25) 80 కొట్ల తొ సొమశిల ఉత్తర కాలువ ని వై.యస్ ప్రారంభించారు

26) కందుకూరు నియొజక వర్గం లొ పట్టణ వాసులకు 110 కొట్ల తొ సమ్మర్ స్టొరేజ్ ట్యాంకుని నిర్మించి తాగునీటిని అందించారు.

27) కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులకు 2 వేల కొట్లు కెటాయించిన వై.యస్ చీరాల పరిధి లొ సాగర్ కాలువ ఆధునీకరణ పనులకు 400 కొట్లు కేటాయించారు.

28) 50 ఏళ్ళు నిండిన చెనేత కు పంచన్ మంజూరు చేశారు, చిలపనూలు పై 22% ఎక్సైజ్ సుంఖాన్ని వై.యస్ రద్దు చేశారు, రంగు రసాయనాల నూలు పై 10% సబ్సిడి ఇచ్చారు వై.యస్ 

29) కనిగిరి నియొజకవర్గం లొ ప్రజలని ఫ్లొరైడ్ బారి నుండి కాపాడటానికి  175 కొట్ల తొ కనిగిరి రక్షిత మంచినీటి పధకం వై.అయ్స్ 2008 ఆగస్టు లొ ప్రారంభించారు.

30) జిలా వ్యప్తంగా అన్ని మండలాలకు కస్తూర్భా ,ఆదర్శపాటశాలల నిర్మించారు వై.యస్  

31) వై.యస్ రాజశేఖర రెడ్డి గారు అద్దంకి లొ పాల్ టెక్నిక్ కాలేజి నిర్మించారు.

32) చీమకుర్తి లొ 30 పడకల ఆసుపత్రి ని వై.యస్ చేతులమీదగా ప్రారంభించారు.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

నెల్లూరు జిల్లా

1) సొమశిల పరిధిలొని కావలి కాలువ తొ పాటు ఉత్తర దక్షిణ కాలవుల ఆదునీకరణ పనులకు 387 కొట్లు కెటాయించి పనులు ప్రారంభించారు ఆయన అకాల మరణం తరువాత పనులు ఆగిపొయాయి

2) సంగం ,పెన్నా బ్యారెజి అధునికరణ పనులు సైతం వై.యస్ హయాములొనే ప్రారంభం అయ్యాయి 2006 లొ సంగం వద్ద నూతన బ్యారేజి శంకుస్థాపనకు మొదటివిడతగా 98 కొట్లు ,అనంతరం 2008 లొ 126 కొట్లు మంజూరు చేసిన ఘనత వై.యస్.ఆర్ దే అని చెప్పాలి.

3) ఉదయగిరి ప్రాంతం లొని పెద్దిరెడ్డి రిజర్వాయర్ ని కూడా వై.యస్ హయాము లొనే ప్రారంభించారు 

4) వై.యస్ , నెల్లూరు వాసుల దాహార్ధి తీర్చేందుకు సమ్మర్ స్టొరేజ్ ట్యాంకు నిర్మించారు 

5) జిల్లా కే గర్వకారణంగా ఉండే విధంగా విక్రమ సిమ్హపురి యునివర్సిటి ని ఏర్పాటు చేశారు వై.యస్ 

6) ఇందిరమ్మ పధకం కింద దాదాపు గా 3 లక్షల పక్క గ్రుహాలు నిర్మించారు 

7) స్వర్ణముఖి నది పై బ్యారేజి,కం బ్రిడ్జ్ నిర్మించాలి అని మాజి ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్ధన రెడ్డి గారు కలలు కన్నారు 1991 ఆగస్టు 31 న శంకుస్తాప కూడా చేశారు , కాని అది కల గానే మిగిలింది , 2004 లొ ముఖ్యమంత్రి అయిన వై.యస్ 2005 లొ శంకుస్థాపన చేసి 45 కొట్ల తొ పనులు మొదల పెట్టి 2008 కి పూర్తి చేశారు దీనిని 12 వేల యకరాల ఆయకట్టు రైతులకి అంకితం ఇచ్చారు వై.యస్ 

8)   గొలగమూడి వద్ద ఇండీయన్ టూరిజం అండ్ ట్రావెల్ మ్యానేజ్మెంట్ కళాశాలను దక్షిణ భారత దేశం లొ తొలి సారిగా తీసుకువచ్చిన ఘనత వై.యస్ ది 

9) ఉప్పు రైతుల భాదలు గుర్తించి యునిట్ కి 4 రూ ఉన్న విద్యుత్ ధరను 1 రూపాయకు తగ్గించారు వై.యస్ , ఆయన మరణం తరువాత ప్రభుత్వం మళ్ళి 4 రూ చేసింది 

10) చంద్రబాబు పాలన లొ శంకుస్తాపన కె పరిమతం అయిన క్రిష్ణ పట్నం పొర్టు వై.యస్ అధికారం లొకి రాగానే నడుం బిగించి పొర్టు అభివ్రుద్ది పనులు పూర్తి చెయించారు 2008 జులై 17 న క్రిష్ణ పట్నం పొర్టు ను ప్రారంభించారు దీంతొ జిల్లా అభివ్రుద్ది ముఖ చిత్రం మారిపొయింది.

11) 1,600 మెగావాట్ల ఏ.పి జన్ కొ సూపర్ క్రిటికల్ ధర్మల్ విద్యుత్ కెంద్రానికి శంకుస్థాపన చేశారు.

12) 2006 లొ నాయుడు పేట మండలం మేనకూరు సెజ్, 2005 లొ తడ మండలం మాంబట్టు సెజ్, 2008 లొ శ్రీ సిటి సెజ్ లు ఏర్పాటు అయ్యాయి , ఈ సెజ్జులలొ బహుళజాతి కంపెనీలు కొట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. ప్రత్యేక్షం గా పరొక్షం గా 20 వేల కుటుంభాలకు ఉపాది దొరికింది . ప్రతిపక్షం లొ ఉన్నప్పుడూ ఈ సెజ్ లు ఏర్పాటు పై ఆరొపణలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్దిని తమ కాత లొ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

13) ఇఫ్కొ ఆదినం లొని 2,700 ఎకరాలలొ కిసాన్ సెజ్ ఏర్పాటు చేసి వ్యవసాయ ఆదారిత పరిశ్రమల ఏర్పాటు కు కృషి చేశారు. ఈ సెజ్ కు కనిగిరి రిజర్వాయర్ నుండి నీటిని కూడా కేటాయించారు.

14) సొమశిల రిజర్వాయర్ పూర్తి నీటి నిలవ సామర్ద్యం 38 టి.యం.సి లు ఉండేది,దీనిని 78 టి.యం.సి లు పెంచటానికి వై.యస్ తీవ్రంగా కృషి చేసి పనులు పూర్తి చెయించారు. దీనివలన కండలేరు రిజర్వాయర్ లొ కూడా రికార్డు స్తాయి లొ నీటిని నిల్వ చేసే అవకాశం లభించింది. ఆనాడు వై.యస్ చూపిన చొరవ వలన నేడు రెండొ పంటకు నీటిని విడుదల చెయగలుగుతున్నారు.

15) నెల్లూరు మునిసిపాలిటిని కార్పొరేషన్ గా అభివృద్ది చేశారు. వై.యస్ అధికారం లొకి వచ్చాక కార్పొరేషన్ హొదా దక్కించుకున్న తొలి మునిసిపాలిటి నెల్లూరు.    

16) ఉదయగిరి దాహార్ది తీర్చెందుకు గండిపాళెం రిజర్వాయర్ నుండి సురక్షిత మంచినీటి సరఫరా కొసం 2 కొట్లు నిధులు మంజూరు చేశారు. ఆ పనులు పూర్తి అయ్యి పట్టణ వాసులకు దాహార్ది తీరుస్తుంది. 

17) వెంకటగిరి కి చేరువలొ ఎన్.టి.పీ.సి , బెల్ సంస్థలు సమ్యుక్తంగా 6000 కొట్ల తొ నిర్మించ తలపెట్టిన (ఎన్.బి.పి.పి.యల్) పరిశ్రమను తమిళనాడు ,గుజరాత్ తొ పొటిపడి మరీ సాధించిన ఘనత వై.యస్ ది 

18) వై.యస్ ముఖ్యమంత్రి అయ్యాక వెంకటగిరి కి పురపాలక హొదా కల్పించారు 

19) త్రాగునీటి సమస్య ఎదురుకుంటున్న వెంకటగిరి పట్టణ ప్రజలకు దాహార్ది తీచేందుకు 72 కొట్ల తొ సమ్మర్ స్టొరేజ్ ట్యాంకు ను మంజూరు చేశారు. 

20) వెంకటగిరి సెంటుమెంటు కి అనుగునంగా విశ్వొదయా కళాశాల స్థలం లొ నూతన కళాశాల నిర్మాణం కొసం నిధులు మంజూరు చేశారు. 

21) ఉదయగిరి లొ బీడు బారిన భూములు సాగులొకి తెచ్చేందుకు సీతారాం సాగర్ రిజర్వాయర్ కు నిధులు కెటాయించారు.

22) గండిపాలెం జలాశయం ఆధునీకరణకు 25 కొట్లు మంజూరు చేసిన ఘనత వై.యస్ ది.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

కర్నూల్ జిల్లా

1) ఆదొని పట్టణం లొ బసపురం యస్.యస్ ట్యాంకు అదనపు పైప్ లైన్ నిర్మాణం కి వై.యస్.ఆర్ 54 కొట్లు మంజూరు చేశారు.

2) ఆదొని పట్టణం బై.పాస్ రొడ్ నిర్మాణం కి 11 కొట్లు విడుదల చేశారు.

3) కొటి రూపాయలతొ హనవాలు త్రాగునిటి పధకం ని విస్తరించి కడితొట గ్రామానికి త్రాగునీటి సదుపాయం అందుబాటులొకి తెచ్చారు.

4) డొన్ పట్టణ ప్రజల దాహార్ది తీర్చటానికి 52 కొట్ల తొ గాజుల దిన్నే మంచినీటి పధకం ప్రారంభించారు.

5) డొన్ పట్టణ శివారులొ వై.యస్ రాజశేఖర రెడ్డి నగర (అభిమానం తొ ప్రజలు మహానేత పేరు పెట్టుకున్నారు ) నిర్మించి సుమారు 5 వేల మంది నిరు పేదలకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేశారు.

6) డొన్ పట్టణం లొ ప్రధానం గా రైల్వే గేట్లు సమస్య జటిలం కావటం తొ సుమారు 30 కొట్ల తొ ఫ్లై ఒవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు వై.యస్.

7) నగరడొణ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

8) ఆలూరు నియొజకవర్గ విద్యార్ధులకొసం పాల్ టెక్నిక్ , ఐ.టి.ఐ కళాశాలను మంజూరు చేశారు. 

9) శ్రీశైలం నియొజకవర్గం లొ సిద్దాపురం ఎత్తిపొతలు మంజురు కొసం 75 కొట్లు మంజూరు చేసి నల్లకాలువ వద్ద ఆ పధకం కి భూమి పూజ చేశారు 

10) వెలుగొడు పట్టణ సమీపం లొ తెలుగుగంగ ప్రాజెక్టు కి 200 కొట్లు తొ యస్.ఆర్.యం.సి కాలువ ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారు 

11) ఆత్మకూరు పట్టణం లొ డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేశారు. కొటి రూపాయల తొ సమీకృత హాస్టల్ భవణం నిర్మించారు.  

12)    కొడుమూరు నియొజకవర్గం లొని సి.బెళగల్, కర్నూల్ మండలాల పరిధిలొ తుంగభద్రా నది ఒడ్డున దాదాపు 14 ఎత్తిపొతల పధకాలను వై.యస్ హయాము లొ నిర్మించినవే. దాదా పు 16 వేల యకరాలకు ఎత్తిపొతల పధకాల ద్వారా సాగునీరు అందుతుంది.

13) వై.యస్ హయాము లొ పులకుర్తి ఎత్తిపొతల పధకం కి రూపకల్పన జరిగింది 10 వేల యకరాల ఆయకట్టు సాగు కొసం 110 కొట్లు మంజూరు చేశారు. 

14)  పులి కనుమ ప్రాజెక్టు నిర్మాణం కొసం 180 కొట్లు కెటాయించారు. 110 కొట్ల తొ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పధకాలని ఏర్పాటు చేశారు. ఇందులొ 9 రిజర్వాయర్ల పనులు చేపట్టారు 

15) సూగూరు రిజర్వాయర్ ని వై.యస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు 

16) కౌతాళం మండల పరిధిలొని గుడి కంబాళి గ్రామం లొ చెరువు నిర్మాణం కొసం 80 లక్షలు మంజూరు చేశారు.

17) కౌతాళం లొ యస్.యస్ ట్యాంకు నిర్మాణం కొసం 5.5 కొట్లు కేటాయించారు.

18) కొసిగి మండల కెంద్రం లొ 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కొసం 1.20 కొట్లు మంజూరు చేశారు

19) కొసిగి మండలం లొ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కొసం నిధులు కెటాయించారు

20) 78 కొట్ల నంద్యాల పట్టణ అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్త కొసం కెటాయించారు వై.యస్ 

21) త్రాగునీటి సమస్య పరిష్కారానికి మహానంది రాస్తా లొ 30 కొట్ల తొ నిర్మించిన యస్.యస్ ట్యాంకును , పట్టణం లొ ఆరు నీళ్ళ ట్యాంకులను ప్రారంభించారు వై.యస్.

22) నంద్యాల పట్టణానికి కేటాయించిన 6,500 ఇళ్ళతొ వై.యస్.ఆర్ నగర్ ఆవిర్భవించింది.

23) వై.యస్ మార్కెట్ యార్డు కు 3 కొట్లు కేటాయించి కాటన్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు

24) ప్రాంతీయ వ్యవసాయ పరిశొదనా కెంద్రాన్ని సందర్శించిన ఆయన మంజూరు చేసిన 5 కొట్ల నిధులతొ సెంటనరీ హాలును నిర్మించారు 

25) ఎమ్మిగనూరు పట్టణం లొ వై.యస్ హయాము లొ 44.50 కొట్ల తొ పట్టణం లొ అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనులు 125 కొట్ల తొ మునిసిపాలిటి న్యూ ఆఫీసు నిర్మాణ పనులు చెపట్టారు.

26) ఎమ్మిగనూరు లొ 2 కొట్ల తొ పత్తి మార్కెట్ ను ఏర్పాటు చేశారు.

27) ఎమ్మిగనూరు టౌన్ లొ 6 కొట్ల తొ నాలుగు లైన్ల బైపాస్ రొడ్డు నిర్మించారు.

28) 90 కొట్ల తొ యల్.యల్.సి ఆధునీకరణ పనులు చెప్పాటారు వై.యస్ 

29) కొటి రూపాయల వ్యయం తొ వెంకటేశ్వరా పురం గ్రామం వద్ద రాజీవ్ గ్రుహ కల్పా పధకం కింద అపార్ట్మెంట్ ను నిర్మించారు

30) వై.యస్ 50 లక్షల తొ ఉర్దూ భవన్ నిర్మించారు.

31)  వై.యస్ 3 కొట్ల తొ కనకవీడు ఎత్తిపొతల పధకం ప్రారంభించారు.

32) వై.యస్ 50 లక్షల తొ గాజులదిన్నే ప్రాజక్టు ఆధునీకరణ పనులు చేపట్టారు.

33) వై.యస్ బనవాసి లొ 200 ఎకరాలలొ కృషి విజ్ఞాన కెంద్రం ఎర్పాటు చేశారు, ఆర్ అండ్ బి పరిధిలొ 20 కొట్ల తొ అంతర్గత రొడ్ల నిర్మాణం చెపట్టారు 

34) తెలుగుగంగా,శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్, గాలేరు నగరి, తుంగబద్ర దిగువ కాలువ ఆధునీకరణ పనులు, హంద్రి,కుందు నదుల వరద రక్షణ పనుల ప్రాజెక్టులు చేపట్టారు వై.యస్. 

35) వై.యస్ హయాము లొ లింగాల ఎత్తిపోతల పనులు ప్రారంభించారు ఆ పధకం కింద కొత్తపల్లి మండలం లొని నాగంపల్లి, కొక్కెరంచ,ఎదురుపాడు గ్రామాల పరిధి లొ బీడు భూములు సాగులొకి వచ్చాయి

36) కుందు పరివాహక గ్రామాల త్రాగునీటి అవసరాలకు రాజొళొ వద్ద 3 టి.యం.సిలు కొవెలకుంట్ల సమీపంలొ జొళదరాశి వద్ద 0.8 టి.యం.సి లతొ రిజర్వాయర్ల నిర్మాణం కి 405 కొట్లు కెటాయించారు. 

37) శ్రీశైలం మండలం సున్నిపెంట లొ 2006 లొ ఐ.టి.డి.ఏ కళాశాల ఏర్పాటు చేశారు 

38) ఆత్మకూర్ డివిజన్ లొని చెలిమిల్లి ,ఇస్కాల ,పాతమాడుగుల ఎత్తిపొతల పధకాలకు అనుమతి ఇచ్చారు.

39) ప్యాపిలి లొ ప్రాధమిక హెల్త్ సెంటర్ ని ప్రారంభించారు వై.యస్.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

కడప -( వై.యస్.ఆర్ ) జిల్లా 

1) 2004 లొ ముఖ్యమంత్రి అయ్యాక వై.యస్ కడపను కార్పొరేషన్ గా , రాయచొటి, పులివెందుల , జమ్మలమడుగు, బద్వేల్, రాజంపేట్ మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు.

2) జిల్లా లొ 2006 లొ యొగి వేమన యునివర్సిటి నెలకొల్పారు  

3) 2008 లొ వెంకటేశ్వరా పసు వైద్య విద్యాలయం ను నెలకొల్పారు

4) 2006 లొ జె.యన్.టి.యు ఇంజినీరింగ్ కళాశాలలు నెలకొల్పారు

5) రింస్ , 750 పడకల ఆసుపత్రి , దంత వైద్య శాల నెలకొల్పారు 

6) ఇడుపుల పాయ లొ ఐ.ఐ.ఐ.టి ని , రాజీవ్ గాంది వ్యాలి ని నెల్కొల్పారు.

7) గొవిందరాజు స్పిన్నిగ్ మిల్స్ , ఐ.జి క్లారా లాంటి పరిశ్రమలు తీసుకువచ్చారు.

8) గాలేరు నగరి - సుజల స్రవంతి, గండికొట కెనాల్ , గండికొట టన్నెల్,  గండికొట వరద కాలువ , గండికొట ఎత్తిపొతల పధకం వై.యస్ హయాము లొ రూపొందించినవే 

9) మైలవరం ఆధునీకరణ , సర్వారాయి సాగర్ , వామి కొండ ప్రాజెక్టు , సి.బి.ఆర్ , పి.బి.సి, వెలిగల్లు తెలుగు గంగ ప్రాజెక్టులు ని వెగవంతం చేశారు 

10) సొమశిల వెనుక జలాలను కడప నగర త్రాగునీటి కొసం తెచ్చేందుకు 430 కొట్ల తొ సంకల్పించారు , ప్రస్తుతం దీనిని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. 

11) రింస్ కళాశాల , నర్సింగ్ కళాశాల నెల్కొల్పారు 

12) కడప లొ నూతన కలక్టరేట్, రొడ్లు విస్తరణ ,70 కొట్ల తొ భూగర్భ డ్రైనేజి లాంటి అభివృద్ది కార్యక్రమాలు ఎన్నొ చెప్పటారు వై.యస్ 

13) 2001 లొ కడప నగరాన్ని వరద ముంచెత్తినప్పుడు ప్రతిపక్షనేతగా ఇక్కడి ప్రజలు అవస్త కళ్ళారా చూసి, అధికారం లొకి రాగానే 72 కొట్ల తొ బుగ్గవంక సుందరీకరణ పనులు మొదలుపెట్టారు , యస్.వి డిగ్రీ కళాశాల , బాలాజి నగర్ , కాగితాల పెంట , వినాయక్ నగర్ ల వద్ద హై లెవల్ వంతెనలు పూర్తి చెయటం తొ పాటు భవిశ్యత్తు లొ కడప వాసులు వరద ముంపు కి గురి కాకుండా బుగ్గ వంక రెండు వైపుల రక్షణ గొడ నిర్మించారు.

14) కడప చుట్టు రింగు రొడ్డు ని నిర్మించి రవాణ వ్యవస్త ను మెరుగు పరిచారు 

15) జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాలకు , ఇతర ప్రభుత్వ సమావేశాలకు ఉపయొగపడే విదంగా అత్యంత ఆదునిక హంగుల తొ విశాలమైన సమావేశ మందిరం నిర్మించారు.  

16) కడప విమానాశ్రయం అభివృద్ది కి శ్రమించారు వై.యస్ 

17) స్టేట్ గెస్ట్ హౌస్ , ఆర్ అండ్ బి అతిధి గ్రుహం , హరితా హొటల్ ని కని విని ఎరిగని రీతి లొ అభువృద్ది చేశారు వై.యస్ 

18)  కడపలొ శిల్పారామం ఎర్పాటుకు వై.యస్ ఏ కారణం 

19) అప్పటి వరకు డి.యస్.ఏ ఔట్ డొర్ స్టేడియం మాత్రమే నగర ప్రజలకు అందుబాటు లొ ఉండేది వై.యస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత 5.30 కొట్ల తొ ఇండొర్ స్టేడియం ను నిర్మించారు

20) 2006 డిసెంబర్ 30 న వై.యస్ ప్రాంతియ క్రీడా పాటశాలని నిర్మించారు ప్రస్తుతం నవ్యాంద్ర కి మిగిలిన ఏకైక క్రీడా పాటశాల ఇది ఒక్కటే.

21) వై.యస్ రాజ రెడ్డి క్రికెట్ మైదానం ని , ఆంద్ర క్రికెట్ అసొయేషన్ తొ సంప్రదించి సొంత డబ్బు 50 లక్షలు ఇచ్చి స్తాపించారు.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

అనంతపురం జిల్లా

1) వ్యవసాయం సంక్షొభం లొ ఉన్న అనంత లొ పారిశ్రామిక రంగాన్ని కూడా సమాంతరంగా అభివృద్ది చెయాలని సంకల్పించిన వై.యస్ లక్ష కొట్లు పెట్టుబడి పెట్టే ఒడిస్సి సంస్థ తొ సైన్స్ సిటి స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఆయన మరణానతరం తరువాత ప్రభుత్వ తీరు తొ ఆ సంస్థ ఒప్పందం ని రద్దు చేసుకుంది 

2) హిందూపురం పరిసర ప్రాంతం లొ పారిశ్రామిక వృద్ది కి లేపాక్షి నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చెశారు. ఇందులొ భారత్ డినమిక్స్ లిమిటెడ్, హిందుస్తాన్ ఏఇరొనాటిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , వంటి ప్రభుత్వ సంస్థల తొ పాటు పలు ప్రైవేటు బహుళ జాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చాయి, దీనికి నీరు అందించేందుకు సొమశిల బ్యాక్ వాటర్ నుండి పైప్ లైన్ నిర్మాణ పనులు చెపట్టారు, అయితే తరువాత ప్రభుత్వాలు ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి.

3) కరువు రక్కసిని తరిమి కొట్టే లక్ష్యం తొ 6.02 లక్షల యకరాలకి సాగునీరు , 310 గ్రామాలలొ 33 లక్షల మందికి త్రాగునీరు అందించాలి అనే సంకల్పం తొ హంద్రినీవ సుజల స్రవంతి పధకం ని చెపట్టారు దీనికి వై.యస్ హయాము లొ 4,054 కొట్లు కర్చు చేశారు 80% పనులు పూర్తి చేశారు, ఆయన మరణించిన తరువాత 2012 లొ కృష్ణా జలాలు జీడిపల్లి రిజర్వాయర్ కి చేరాయి అనంత వాసులు ఇటీవల కృష్ణా పుష్కరం కూడా చేసుకున్నారు. నాలుగు ఏళ్ళు గా నీరు వస్థున్నా ఆయకట్టుకి నీరు ఇవ్వలేని దుస్థితి లొ ప్రభుత్వం ఉంది. ఈ నీటిని సాగుకి ఉపయొగిస్తే బంగారం పడుద్ది అని పుష్కర స్నానం కి వచ్చిన వారు చర్చించుకున్నారు. 

4) శ్రీ రామిరెడ్డి త్రాగునీటి పధకం ద్వారా హిందుపురం , మడగశిరా ,కళ్యాణ దుర్గం, రాయదుర్గం , ఉరవ కొండ నియొజక వర్గాల ప్రజలకు మంచినీరు అందించారు.

5) అనంతపురం కార్పొరేషన్ దాహార్ది తీర్చెందుకు 67 కొట్ల తొ ముద్దలాపురం దగ్గర అనంత త్రాగునీటి పధకం ని రూపొందించారు వై.యస్ 

6) తుంగభద్ర డ్యాం కె.సి కెనాల్ కొటా అయిన 10 టి.యం.సి లను రివర్స్ డైరెక్షన్ పద్దతి లొ (పి.ఏ.బి.ఆర్) కు కేటాయిస్తు 2005 ఆగస్టు 14 న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్రమం లొ రాజకీయ ప్రయొజనాలు కూడా పక్కన పెట్టారు వై.యస్.

7) అనంతపురం జిల్లా లొ 1.25 లక్షల హెక్టారలలొ సూక్ష్మ నీటిపారుదల పధకం ని అమలు చేసిన ఘనత వై.యస్ ది, తద్వారా రైతులు పండ్ల తొటలని విరివి గా సాగు చేసి అనంతను (ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏ.పి) గా మార్చారు 

8) జిల్లా ప్రజల జీవన ఆదారం అయిన వేరుశనగ పంట పండినా , ఎండినా రైతులు నష్టపొకూడదు అనే ఉద్దేశం తొ పంత భీమ పధకం ని 2008 ఖరీఫ్ లొ వై.యస్ వర్తింప చేశారు 2008 లొ 641 కొట్లు, 2009 లొ 228 కొట్లు, 2010 లొ 124 కొట్లు రైతులకి పరిహారం లభించింది ఇప్పటి ప్రభుత్వం దీనిని పూర్తి గా పక్కన పెట్టింది.

9) అనంతపురం లొ 1948 లొ ఏర్పాటు అయిన ఇంజినీరింగ్ కళాశాలను 2008 డిసెంబర్ 20 న జె.ఎన్.టి.యు యునివర్సిటి గా మార్చారు.

10) పార్నపల్లి దగ్గర ఉన్న చిత్రావతి డ్యాం సామర్ద్యం ని పెంచి 10 టి.యం.సి నీటి నిల్వ చెయటానికి దొహాద పడ్డారు.

11) తాడిపత్రి నియొజకవర్గ ప్రజల కొసం చర్లొపల్లి దగ్గర 65 టి.యం.సి తొ పెండ్లెకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని పూర్తి చేశారు వై.యస్ 

12) 2004 కి ముందు ఆర్.ఒ.సి పేరుతొ తెలుగుదేశం నేత పరిటాల రవి అండతొ నక్సలిజం విపరీతంగా ఉండి ప్రజలని భయబ్రాంతులని చేసేవారు .. వై.యస్ పాలన లొ ఇక్కడ నక్సలిజం ని పూర్తి గా అణిచి వేశారు .

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

_________________________________________________________________

చిత్తూర్ జిల్లా  

1) చిత్తూరు జిల్లా సాగునీరు ప్రాజెక్టుల మీద వై.యస్ ప్రధాన దృష్టి పెట్టారు హంద్రినీవ సుజల స్రవంతి, గాలేరు-నగరి,తెలుగు గంగా , స్వర్ణముఖి ఆనకట్టు,సొమశిలా స్వర్ణముఖి లింకు కాలువ పనులలొ వెగం పెరిగింది సకాలం లొ నిధులు కేటాయించారు.

2) తిరుమల భక్తుల త్రాగునీరు అవసరాలు తీర్చెందుకు 100 కొట్ల తొ కుమార ధార , పసుపు ధార ప్రాజెక్టులు పూర్తి చేశారు.

3) తిరుపతి లొ వేద విశ్వ విద్యాలయం ఏర్పాటుకు వై.యస్ చేసిన కృషి మరువలేనిది. 2006 జులై 12 న ఈ యునివర్సిటి వై.యస్ ప్రారంభించారు.

4) 2005 జులై లొ వై.యస్ వెటర్నరి యునివర్సిటి కి శ్రీకారం చుట్టారు 

5) పద్మావతి విశ్వవిద్యాలయం పరిది లొ మొదటిసారి మహిళా ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు.

6) పలమనేరు మునిసిపాలిటి లొ 52 కొట్ల అంచనా వ్యయం తొ నిర్మించిన మంచినీటి పధకం పట్టణ వాసుల దాహార్ది తీరుస్తుంది.

7) తంబాళ్లపల్లి నియొజకవర్గం లొ ఆకుమాను గుట్ట , చిన్నేరు, దబ్బలగుట్ట పల్లి,మిట్టసాని పల్లి ప్రాజెక్టులు పూర్తి చేశారు 

8) శిధిలావస్త కి చేరుకున్న బ్రిటీష్ కాలం నాటి చిత్తురు కలక్టరెట్ ను పక్కన పెట్టి ప్రజల కొరిక మెరకు 17 కొట్ల తొ 2006 లొ కొత్త కలక్టరెట్ ను ప్రారంభించారు వై.యస్ ఇప్పుడు ఇది అత్యంత హంగులతొ రాష్ట్రం లొ నే ఆదర్శవంతమైన కలక్టరెట్.

9) పీలేరు పట్టణ ప్రజల దాహార్ది తీర్చటానికి బాలం వారి పల్లి సమీపం లొ పించా ఎటి పై గార్గయ ప్రాజెక్టు నిర్మించారు వై.యస్ , ప్రాజెక్టు కు అనుసందానం గా కొత్తపల్లి మార్గం లొ పైపు లైన్లు వేసి సమ్మర్ స్టొరెజ్ ట్యంకు నిర్మించారు ఇక్కడ ఫిలటర్ చేసి పైపు లైన్ల ద్వారా పీలేరు ప్రజలకి అందించారు - వై.అయ్స్ లక్ష్యం రొజులు 16 లక్షల లీటర్లు పీలేరు కు త్రాగునీటి కి అందించలి. 

10) పీలేరు సివారులలొ గూడు లేని 1700 మందికి ఇళ్ళు మంజూరు చేశారు, ఇక్కడ ప్రస్తుతం 1500 కుటుంభాలు నివసిస్తున్నాయి.

11) మదనపల్లి ప్రజల త్రాగునీటి అవసరాలు తీరేలా 380 కొట్ల తొ సమ్మర్ స్టొరేజ్ ట్యాంకు నిర్మించారు.

12) మదనపల్లి లొ ట్రాఫిక్ సమస్య తీవ్రం అవ్వటం తొ బైపాస్ రొడ్డు నిర్మాణం కి 150 కొట్ల నిదులు కెటాయించారు, అలాగే సిమెంటు సి.సి రొడ్లు వేయించారు వై.యస్.

13) మదనపల్లి లొ బాబు హయాము లొ ముతపడిన విజయ డైరి ని మళ్ళి ప్రారంభించారు వై.యస్.   

14) కడప, చిత్తురు , నెల్లురు జిల్లాలలొని 2.60 లక్షల యకరాలకు సాగునీరు ఆయా జిల్లా ల ప్రజకై త్రాగు నీరు అందించాలనే లక్ష్యం తొ 2006 జూన్ 4వ తేదిన గాలేరు నగరికి , నగరి పట్టణం లొ భూమి పూజ చేశారు ప్రారంభం లొ ఈ పధకం 4,600 కొట్లు కాగా ఇప్పటి పాలకులు ఎస్టిమేషన్ పెంచి పధకాన్ని పక్కన పెట్టారు. 

15) చిత్తురు జిల్లా లొనే వెనకపడిన ప్రాంతం అని పేరు ఉన్న సత్యవేడు కి డిగ్రీ ,పాల్ టెక్నిక్ కళాశాలలు మంజూరు చేశారు వై.యస్. 

16) మరుగునపడిన భూపతీశ్వర కొన , ఉబ్బలమడుగు ప్రాజక్టులకు నిదులు మంజూరు చేశారు వై.యస్ 

17) తెలుగు గంగా లైనింగ్ పనులకు భారిగా నిదులు ఇచ్చి పనులు పూర్తి చేశారు 

18) సత్యవేడు నియొజకవర్గం లొ స్పెషల్ ఎకనామిక్ జొన్ భారి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఒకే సారి 10 పరిశ్రమలకి శంకుస్థాపన చేశారు వై.యస్ 

19) సత్యవేడు సెజ్ లొ దాదాపు 7 వేల యకరాలలొ శ్రీసిటి సెజ్ అభివ్రుద్ది పనులు చెపట్టింది విదేశి ప్రమాణాలతొ అధునాతన రొడ్లు , వసతులు పలు పరిశ్రమల ఏర్పాటు తరచూ విదేశీ పారిశ్రామిక వేత్తల సందర్శన తొ సత్యవేడు కి రాష్ట్ర స్తాయి గుర్తింపు వచ్చింది

20) శ్రీకాలహస్తి - నడికుడి రైలు మార్గానికి వై.యస్ హయాము లొ శ్రీకారం చుట్టారు 

21) తడ - నెల్లురు రొడ్డు ని కలుపు తూ నిర్మించిన రింగురొడ్డు శంకుస్థాపన చేసింది వై.యస్ 

22) నిరుద్యొగ సమస్య నిర్మూలనకు 2008 లొ శ్రీకాలహస్తి పట్టణం లొని మన్నవరం గ్రామం వద్ద వై.యస్ ఆర్ పురం పేరు తొ ఎన్.బి.పి.పి.యల్ ప్రాజెక్టు ప్రారంభించారు. 6 వేల కొట్ల తొ చేట్టిన ఈ ప్రాజెక్టు తొ ప్రత్యేక్షం గా 30 వేల మందికి , పరొక్షం గా 20 వేల మందికి ఉద్యొగాలు లభించేలా ప్రణాలికలు రచించారు.

23) 1.25 లక్షల బీడు భూములకు నీరి అందేలా సొమశిలా - స్వర్ణముఖి కాలువను ప్రారంభించారు.

24) పలమనేరు దగ్గర కౌండిన్యా త్రాగునీటి పధకం కి వై.యస్ శంకుస్థాపన చేశారు .

25) పలమనేరు దగ్గర అసుపత్రిని 100 పడకల్ అసుపత్రి గా అప్ గ్రేడ్ చేశారు 

26) 2007 జూన్ 2 న వై.యస్ తిరుమల 7 కొండల మీద ఇంకా రాష్ట్రం లొ 19 ప్రధాన ఆలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని ఆర్డినెన్స్ జారి చేశారు 

27) వై.యస్ రాజశేఖర రెడ్డి హయాము లొ 100 కొట్లతొ శ్రీవారి ఆనంద నిలయం ని స్వర్ణ మయం చేశారు.

28) పవిత్రమైన వెంకటేశ్వరుని సన్నిది తిరుమల కాలుష్య భారిన పడకూడదు అని 2009 లొ తిరుపతి లొ ప్లాస్టిక్ ని నిషేదించారు. లడ్డు ప్రసాదానికి పేపర్ బ్యాగ్ వాడాలి అని ఉత్తరువులు జారి చేశారు.

29) 3.75 కొట్ల తొ తిరుపతి స్వింస్ పరిసరాలలొ ప్రభుత్వ మెటర్నటి హాస్పిటల్ ని ప్రారంభించారు.

(ఈ జిల్లా కి సంభందించి నా దృష్టి కి వచ్చిన వి ఇవి, ఇవే కాక ఆ మహా నేత జిల్లా కి ఎన్నొ చేసి ఉండొచ్చు తెలిసిన వారు చెప్పండి పరిశీలించి ఈ జాబితా లొ చెర్చుతా...)

___________________________________________________

ఇవే కాక తన మన భేధం లేకుండా సాగిన ఆరొగ్యశ్రీ , ఫీజురీయంబర్స్ మెంట్, వృద్దులు, వికలాంగులు, వితంతువులకి పించన్లు, రెండు రూపాయల బియ్యం, 108,104, రుణమాఫి , ఉచిత కరెంటు , డ్వాక్రా పావలా వడ్డి , అభయ హస్తం,  చేనేత రుణ మాఫి 

డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారు


మీకు మా సలాం 
కె.ఆర్ సూర్య.............
అభివృద్ది లొ ఏ జిల్లా ని వదలని వై.యస్ రాజశేఖర రెడ్డి గారు ( మీ జిల్లా తొ సహా ) అభివృద్ది లొ ఏ జిల్లా ని వదలని వై.యస్ రాజశేఖర రెడ్డి గారు ( మీ జిల్లా తొ సహా ) Reviewed by surya on 6:56 AM Rating: 5

1 comment:

  1. his services were still unrecognised....some people just restrict his services to some flagship programes like free power, arogya sri, 108, etc..but he has strenghthened rural economy which contributes to more than 60% of state economy....no cm has given such services to state till date...

    ReplyDelete

Powered by Blogger.