Comments

ప్రజా సమస్యల పై పొరాటం లొ పవన్ , జగన్ పనితీరు.. విశ్లేషణ




ఆంద్ర ప్రదేశ్ లొ ప్రతిపక్షనేత గా ఒకరు , అలాగే ప్రశ్నిస్తా అని మరొకరు విఫలమైన ప్రభుత్వం నష్టపొతున్న ప్రజల తరున ఎలా పొరాడారొ బేరీజు వేసుకునే సమయం వచ్చింది. ఇందులొ పవన్ గారి మీద బాబు అనూకుల వ్యక్తి అనే ముద్రపడటానికి గల కారణాలు అలాగే ప్రతిపక్ష నేత జగన్ విఫలం అనే కామెంట్స్ లొ నిజ నిజాలు కచ్చితంగా ప్రజలు తెలుసుకొవాలి. సరైనా నాయకత్వం ఎన్నుకొకపొతే రాష్ట్రం ఎంత నష్టపొతుందొ ఇప్పటికే ప్రజలు తెలుగుదేశం పార్టి ని ఎన్నుకొవటం తొ చవి చూసారు. ప్రజలకు అండగా ప్రజా సమస్యల మీద అవగాహన గల నేత గా ఎవరు ప్రజలకి మేలు చెయగల దమ్ము ఉందొ , బేరీజు వేసుకొవాలి. ఇంక వివరాలలొకి వెలితే ముందు పవన్ గారి మీద చంద్రబాబు అనుకూలుడు అని వస్తున్న ఆరొపణలు గల కారణలు , అలాగే పవన్ గారికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్త శుద్ది , ప్రతిపక్షం గా జగన్ విఫలం అని పదే పదే ప్రభుత్వం నుండి వస్తున్న ఆరొపణలలొ నిజం ఎంత అనే వాటి మీద వరుస క్రమం లొ చూద్దాం  

పవన్ కల్యాణ్ గారు, చంద్రబాబు గారు రహస్య మిత్రులు అనే అనుమానం ప్రజలకి రావటానికి ముఖ్య కారణాలు. ??



1) జగన్ వెనకాలే పవన్ పర్యటన.

2015 మార్చ్ 3 -- తాడేపల్లి , మంగళగిరి , తుల్లూరు మండలాలలొ జగన్ పర్యటన చెయగానే వెంటనే అక్కడికి పవన్ కళ్యాణ్ (రెండు రొజులకి) 2015 మార్చ్ 5 న ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపుడి, తుల్లూరు లొ పర్యటించారు. (రాజధాని అవసరమే రైతులని ఒప్పించి తీసుకొండి అని సలహ ఇచ్చి వచ్చారు )

2) ధర్న కి పిలుపు ఇచ్చిన జగన్, దానికన్న ముందు పర్యటన పెట్టుకున్న పవన్

ప్రభుత్వం చెస్తున్న అడ్డగొలు భూసేకరణ పై ప్రజలు, రైతులు, రైతు కూలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు , ప్రజా సంఘాలు, రైతు కూలి సంఘాలు ఆగస్టు 25-2015 న బంద్ కి పిలుపునిచ్చాయి , ప్రతిపక్ష నాయకుడు జగన్ అంతకుముందే 26 న ధర్న కి పిలుపునిచ్చి ఆయనే స్వయంగా వస్తా అన్నారు , ఇలా అన్నారొ లేదొ పవన్ గారు అక్కడికి వచ్చి బలవంతంగా భూములు లాకొవద్దు , వాళ్ళకి నచ్చితే తీసుకొండి అని ప్రభుత్వానికి చెప్పారు.

అక్కడ ప్రభుత్వం మీద వచ్చిన వ్యేతిరకతని జగన్ ఎక్కడ లాభం పొందుతాడొ అని పవన్ ని అడ్డం పెట్టి పవన్ చెప్పాడు భూసేకరణ తాత్కాలికంగా వాయిదా వేశారు అనే భావన కలిగే లా చెసి. (తరువాత గుట్టుచప్పుడు కాకుండా బెదిరించి భయపెట్టి భూసేకరణ చేసేరు బయటకి రాజధాని రైతులు మొత్తం ఇష్టంగ 33వేల ఎకరాలు ఇచ్చారు అని చెప్పారు )

3) ప్రత్యేక హొదా జగన్ బంద్ పిలుపు , పవన్ దేశ సమగ్రత ట్విట్ విన్నపం.

2015 ఆగస్టు 10 న డిల్లీ లొ జగన్ ప్రత్యెక హొదా కొసం భారి ధర్న చేశారు , 15 రొజులకి అంటే అగస్టు 25 న చంద్రబాబు డిల్లీ వెళ్ళి , ప్రత్యెక హొదా కన్న ప్యాకేజి ఏ బాగుంటది అని చెప్పారు , దీనితొ జగన్ ప్రత్యేక హొదా ఇచ్చే లా చంద్రబాబు మొడి మీద వత్తిడి ఎందుకు తేలేకపొతున్నారు , వాళ్ళు కన్న మీర ముందు ప్యాకేజి కి ఎందుకు అనుకులత చూపిస్తున్నారు అని కెంద్రం లొ మొడి , రాష్ట్రం లొ చంద్రబాబు ప్రభుత్వాలు ఆంద్రప్రదేశ్ ప్రజల్ని మొసం చెస్తున్నారు అని ఆగస్టు 29 న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు , కాని పవన్ ఆగస్టు 28 న (బంద్ కి ఒక్కరొజు ముందు పవన్ ఇలా ట్విట్ చేశారు - నేను విభన వలన జరిగిన నష్టం ని మొడి కి వివరించాను సానుకూలంగా స్పందించారు, వారు ఇచ్చిన హామిని నెరవేరుస్తారు అని భావిస్తున్న , దేశ సమగ్రత దృష్టి లొ పెట్టుకుని భావొద్వేగాలకి పొకుండా ఇంక కొంతకాలం వేచి చూద్దం అని ట్విట్ చేశారు పవన్)

4) జగన్ తొ పాటు విపక్షాలు బంద్ కి పిలుపు , ప్రజలెందుకు పొరాడాలి అని చెప్పిన పవన్

2016 సెప్టెంబర్ 8న అర్ధరాత్రి అరుణ్ జైట్లి గారు ప్రెస్ మీట్ పెట్టి , హొదా లేదు , ప్రత్యేక సహయాం చెస్తాం అని చెపారు , తరువాత రొజు 9వ తారీకున విపక్షాలతొ పాటు జగన్ గారు కూడా 10వ తారీకున రాష్ట్ర బంద్ కి పిలుపుని ఇచ్చారు , పవన్ కళ్యాన్ గారు అదే సెప్టెంబర్ 10న కాకినాడ లొ సభ పెట్టి , ప్రజలు ఎందుకు పొరాడాలి , బి.జే.పి పాచిపొయిన లడ్డులు ఇచ్చింది , పార్లమెంటు మెంబర్లు మాత్రమే పొరాడాలి అని చెప్పుకొచ్చారు ( అలా బందులొ ప్రజలు భాగస్వామయం వద్దు అన్నారు)

5) జగన్ జై ఆంద్రప్రదేశ్ , పవన్ సీమాంద్ర హక్కులు

2016 నవంబర్ 6 న విశాఖ లొ జై ఆంద్రప్రదేశ్ సభ పెట్టి ప్రత్యేక హొదా ఇవ్వల్సిందే అది ఎన్నికలలొ చంద్రబాబు, మొడి కలిసి ఇచ్చిన హామి, ప్రత్యేక హొదా తొనే మనకి మనుగడ అని సభ లొ ప్రశంగించారు, 2016 నవంబర్ 10 న ( నాలుగు రొజులకి) పవన్ అనంతపూర్ లొ సీమాంద్ర హక్కుల సభ అని పెట్టి బి.జే.పి ని మీరు అర్ధరాత్రి ఎందుకు ప్యాకేజి ఇచ్చారు , నాకు మొక్కలంటే ఇస్టం , నేను కూలి పని చేస్తా , అని మాట్లాడారు.

6) అగ్రి గొల్డ్ జగన్ వెనకాలే పవన్

2017 మార్చ్ 23 న జగన్ దీక్ష చెస్తున్న భాదితుల దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంట మీరు అధైర్య పడద్దు ఏవ్వరు ఆతమహత్య చెసుకొవద్దు, న్యాయం జరిగేలా చంద్రబాబు మీద వత్తిడి తెస్తా , ఒకవేల ఈ రెండు ఏళ్ళ లొ ఆయన స్పందించకపొతే తరువాత మీకు ఎలా న్యాయం చెయాలొ నాకు తెలుసు 1,182 కొట్లు కేటాయించి 14 లక్షల మంది అగ్రిగొల్డ్ భాదితులని నేను ఆదుకుంట , చనిపొయిన వారికి 3 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం , ఎవ్వరి అధైర్య పడద్దు అని భరొసా ఇచ్చి ధీక్ష విరమింప చేశారు , సరిగ్గ ఆరు రొజుల తరువాత మార్చ్ 30న పవన్ కళ్యాణ్ గారు అగ్రిగొల్డ్ భాదితులతొ ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేసి అగ్రిగొల్డ్ విషయం కొర్టు లొ ఉంది, ఏజెంట్లది తప్పులేదు ముళ్ళ మీద గుడ్డ పడింది జాగ్రత్త గా తీసుకొవాలి ప్రభుత్వం దీనిని పరిష్కరించాలి అని చెప్పారు .

7) జగన్ రైతు దీక్ష విరమించిన 30 నిమషాలకే పవన్ ప్రకటన

రాష్ట్రం లొ దళారీల వలన మిర్చి,పత్తి,కంది,పసుపు రైతులు మద్దతు దర లేక పండించిన పంట అమ్ముకొవటానికి అవస్తలు పడుతుడటం చూసి , ప్రభుత్వం నుంచి ఎంతకి చెలనం లేకపొవటం తొ జగన్ గారు గుంటూరు లొ 2017 మే 1,2 తారీకులలొ దీక్ష చెపట్టారు , ఇలా చెపట్టి 2వ తారీకు దీక్ష విరమించగానే, పవన్ గారు రైతులకి మద్దతు ధర కల్పించాలి అని ప్రకటన విడుదల చెశారు.

ఇవే కాక చంద్రబాబు గారికి అనుకూల పత్రికలు మీడియా ఎంటి అనేది భహిరంగ రహస్యం , కాని అవి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటించటం
మాకు తెలిసి పవన్ గారు బయటికి వచ్చింది , ఉద్దానం కిడ్నీ భాదితుల కొసం , చేనేత సభ కొసం , ఇందులొ చెనెత సభ కి వాళ్ళు పిలిస్తే వెళ్ళారు,మిగతా వి ఉత్తర భారత దక్షిణ భారత ట్విట్లు

8) జగన్ పాదయాత్ర పవన్ ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన

రాష్ట్రం లొ తెలుగుదేశం పాలన లొ అవినీతి , అకృత్యాలు పతాకస్థాయి కి చెరి ప్రజలని గ్రామ గ్రామాన కమిటీలు వేసుకుని పీక్కుతింటుంటే , జగన్ గారు వీరికి అండగా తొడుగా ఉండటానికి అక్టొబర్ 27 నుండి 3వేల కిలొమీటర్లు , ఆంద్ర ప్రదేశ్ లొని ప్రతి జిల్లాకి పాదయాత్ర గా వస్తా అని ప్లీనరీ లొ జులై 9 న ప్రకటించారు

పవన్ కల్యాణ్ గారు జులై 31 న ఉద్దానం అని చెప్పి చంద్రబాబు గారిని కలిసి సుమారు గంట సేపు చర్చలు జరిపి బయటకి వచ్చి నేను అక్టొబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాలలొకి వస్తా అని ప్రకటించారు , పైగా నేను కమిట్ అయిన సినిమాలు ఉన్న డైరెక్టర్లని, ప్రొడ్యుసర్లకి నచ్చ చెప్పుకుని వస్తా అని చెప్పారు , ముందు నుండి ప్లానింగ్ ఉంటే సినిమాలు ఎందుకు ఒప్పుకున్నారు అని ఒక ప్రశ్న.

9) వై.సి.పి పొలవరం టూర్ పెట్టుకున రొజే పవన్ పొలవరం టూర్ 

పొలవరం లొ జరుగుతున్న అవినీతి ని ప్రజలకి తెలియచెయటానికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ డిసెంబర్ 7 న పొలవరం పర్యటన చెస్తున్నం అని డిసెంబర్ 2 న ప్రకటించగానే , పవన్ కల్యాన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి పెట్టుకున్న డిసెంబర్ 7 నే పొలవరం టూర్ చెస్తాం అని డిసెంబర్ 5న ప్రకటన విడుదల చేశారు.

10) ఫాతిమా కాలేజీ సమస్య (జగన్ వెనక పవన్) 

నవంబర్ 10న పాదయాత్ర లొ ఉన్న జగన్ ని ఫాతిమా కాలేజీ విద్యార్ధులు కలిసి తమ సమస్యని వివరించారు వెంటనే జగన్ గారు దీని మీద స్పందించాలి అని ప్రతిపక్షం లొ ఉండి కూడా తన భాద్యతగా కెంద్రానికి లేఖ రాశారు తన యం.పీ లతొ అంతక మునుపూ కూడా రాజ్య సభలొ , ప్రస్థావన తెప్పించారు.. ఇలా జగన్ గారిని కలిసిన ఫతిమా కాలేజి వాళ్ళని అప్పటికి అప్పుడు పవన్ టూర్ పెట్టుకుని డిసెంబర్ 7న పిలిపించుకుని వారం లొ మీ సమస్యని పరిష్కరిస్తా అని చెప్పు జగన్ ని విమర్శించి వెళ్ళిపొయారు రాష్ట్ర ప్రభుత్వం తొ పొత్తు లొ ఉండీ కూడా కనీసం ఒక లేఖ కూడా రాయకుండా అజ్ఞాతవాసి ఆడియొ ఫంక్షన్ లొ బిజీ అయిపొయారు.

11) సామాజిక వర్గ బలం ని కాపాడుకొవటం కొసమే పవన్ పొరాటయాత్ర ?
 
గొదావరి జిల్లాలలొ పవన్ సామాజిక వర్గ వొట్లు ప్రభావం అధికం అని రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి తెలుసు , 2018 మే 13 న కృష్ణ జిల్లా దాటి పచ్చమ గొదావరి జిల్లాలొకి జగన్ గారి పాదయాత్ర రాగానే వారం తిరగకుండా పవన్ కల్యాణ్ హటాత్తుగా మే 20 2018 నాడు పొరాటయాత్ర అంటు ఇచ్చాపురం నుండి బయలుదేరాడు మొదట 175 నియొజిక వర్గాలు పర్యటిస్తా అని చెప్పిన పవన్, జగన్ గారి పాదయాత్ర ఉత్తరాంద్ర జిల్లాలొ సాగేదాక ముక్కలు ముక్కలుగా ఊత్తరాంద్రా కొస్తా జిల్లలొ పొరాటయాత్ర పేరొ తొ తిరిగిన పవన్ , జగన్ గారి పాదయాత్ర ఇచ్చాపురం లొ 2019 జనవరి 9న ముగుస్తుంది అని ప్రకటించగానే పవన్ కల్యాణ్ 2019 జనవరి 7న పొరాటయాత్రను అర్దాంత్రం గా ఆపేశారు. ప్రత్యక హొదా కొసం పొరాట యాత్ర ముందు చెప్పిన నిరాహారదీక్ష ఉసేలేదు , ఇవన్ని చూస్తే కొస్తా జిల్లాలొ జగన్ గారు ఎక్కడ బలపడతారొ అని చంద్రబాబు ఏజెంట్ గా వచ్చి జగన్ గారి మీద అకారణంగా నిందారొపణలకి,దూషణకి దిగాడు పవన్ కల్యాన్.   


ఇలా జరిగిన వరుస సంఘటనలు చూస్తే జగన్ అనే శక్తి ని అడ్డుకొవటానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ని ప్రయొగిస్తున్నరు అనే అనుమానం మరింత పెరుగుతుంది.


***ఇంక రాష్ట్ర సమస్యల మీద పవన్ చిత్త శుద్ది చూద్దాం*** 


ఉద్దానం కిడ్నీ బాదితుల ని కలిసి మాట్లాడిన పవన్ 15 రొజులలొ గతం లొ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అడ్మినిష్ట్రెషన్ ఇచ్చిన రిపొర్టు తీసుకుని ముఖ్యమంత్రిని కలుస్తా అని అన్నారు కాని కలవలేదు. 48 ఘంటల డెడ్ లైన్ అన్నారు అది గాలికి వదిలేసారు. 7 నెలల తరువాత ఉద్దానం సమస్య మీద హార్వర్డ్ నుండి వైద్యులు వచ్చారు అక్కడ సమస్య ని పరిశీలించటానికి , ఇది పెద్ద విషయం కాదు ఎందుకు అంటే అక్కడికి కేవలం సమస్య ఎంటొ తెలుసుకొవటానికే గతం లొ ఇదే హార్వడ్ నుండి ఇంకా అనేక దేశాల నుండి డాక్టర్లు వచ్చారు కాని సమస్యని కనుక్కొలేదు గతం లొ ఇదే హార్వడ్ నుండి ఇంకా అనేక దేశాల నుండి డాక్టర్లు వచ్చారు కాని సమస్యని కనుక్కొలేదు.  అక్కడ భాదితులకి వైద్యానికి మందులు, డయాలసిస్ సెంటర్లు, సమస్య కనుకునేందుకు రీసర్చ్ సెంటర్లు , ప్రతివారం డయాలైసి కి వెళ్ళే వారికి ప్రయాణ కర్చులు లాంటివి కనీస అవసరాలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి  

లాండ్ పూలింగ్ మీద రైతులని కలిసారు రైతులకి ఇష్టం అయితేనే తీసుకొండి లేక పొతే పొరాడతా అన్నారు ,ఆ తరువాత రైతుల దగ్గర బలవంతంగా లాకుంటే రైతులు కొర్టుకు వెల్లారు కాని పవన్ చెప్పిన పొరాటం దాకలాలు లేవు

అగ్రీ గొల్డ్ మీద సభ పెట్టి తన భాగస్వామ్యం గా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని టాస్క్ ఫొర్స్ ఏర్పార్టు చెయాలి అని వుజ్ఞప్తి చేశారు , ప్రభుత్వం ఇప్పటి వరకు చెయకపొయినా పవన్ మల్లి అడిగిన దాకలాలు లేవు.

2015 లొ ప్రత్యేకహొదా కొసం మొడి ని రెండు రొజులలొ కలుస్తా అన్నారు , ఇప్పటి వరకు కలవలేదు. పైగా తరువాత మొడి ని అడిగే అంత అర్హత నాకు లేదు అని అన్నారు ఇదే పెద్ద మనిషి , ప్రత్యెక హొదా మీద డెడ్ లైన్ పెట్టే అంత స్థాయి లేదు అన్నారు.



2016 అక్టొబర్ లొ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరి భదిత గ్రామ ప్రజలని హైద్రాబాద్ పిలిపించుకుని వారి సమస్యలు విని వెంటనే ప్రెస్ ముఖంగా పవన్ చెప్పినది ఎంటి అంటే, ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ని తుందుర్రు గ్రామం నుండి వెంటనే వేరే ప్రదేశానికి తరిలించాలి అని లేని పక్షం లొ పార్టీలని కలుపుకుని పొరాటం చెస్తాను అని చాలా భాధతొ చెప్పారు మైకుల ముందు , ఇది గడిచి సుమారు 8 నెలలు అవుతుంది ఇంతమటికి ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీ ని తరలించలేదు , అలాగే ఆ నాడు భాదపడుతు చెప్పిన పవన్ ఉద్యమము చెయలేదు. పైగా ఈ విషయం మీద జులై 31 న ఇచ్చిన ప్రెస్ మీట్ లొ నేను అక్కడికి వస్తే సంఘ విద్రొహ శక్తులు వస్తాయి అందుకే రాలేదు అన్నారు. ఏ నాయకుడు వెళ్ళినా రాని ఈ సంఘ విద్రొహ శక్తులు పవన్ వెళ్ళినప్పుడే వస్తారా . ఇలా ఎన్ని సమస్యల మీద సంఘ విద్రొహ శక్తుల మాట చెప్పి దాట వేస్తారొ తెలియదు 

2017 జనవరి గణతంత్ర దినొత్షవం నాడు ప్రత్యక హొదా మీద నిరసన తెలిపిన యువత మీద పొలీసులు చెసిన లాఠి చార్జ్ కి నిరసన గా పొయిన మార్చ్ నెలలొ విశాఖ పట్నం ఆర్.కే బీచ్ లొ ( దక్షిణ భారతీయుల ఆత్మ గౌరవ శాంతియుత నిరసన ) చెస్తాం అని ట్విట్ చేశారు,  తరువాత దాని మీద కనీసం మాట్లాడలేదు.


2017 ఫిబ్రవరి 20 న మంగళగిరి లొ చెనేత సత్యగ్రహ సభకి వచ్చి చెనేత బ్రాండ్ కి అంబాజిడర్ గా ఉంటా అని చెప్పి , ఎన్నికలలొ గెలిచాక అశంబ్లీ లొ చేనెత సంస్యల మీద ప్రశ్నిస్తా అని చెప్పి, చెనేతకు ఎప్పుడు జనసేన అండగా ఉంటది అని చెప్పారు , అ సభ అయిపొయిన కొన్ని రొజులకి జి.యస్.టి విధానం లొ చెనేతకి రంగానికి తీవ్ర అన్యాయం జరిగింది , చెనెత మొయలేని భారం పడింది కాని అంబాజిడర్ గా ఉన్న పవన్ చెనేతకు ఎప్పుడు సమస్య వచ్చినా జనసేన అండగా ఉంటది అని చెప్పిన పవన్ ఈ జి.యస్.టి విధానం మీద కనీసం ఒక ప్రెస్ నొట్ కూడ విడుదల చెయలేదు చెనేతకు అండగా.


గరగపర్రు లొ దళితుల సాంఘిక బహిష్కరణ గురైన సమస్య మీద సమస్య ఉన్నప్పుడు మాట్లాడకుండ నెల తరువాత చంద్రబాబు ని కలిసి ప్రెస్ మీట్ పెట్టి , నేను అక్కడికి వస్తే సంఘ విద్రొహ శక్తులు వస్తాయి అందుకే రాలేదు అన్నారు , ప్రతిపక్షనేత వెళ్ళినప్పుడు రాని వారు పవన్ అప్పుడు ఎందుకు వస్తారొ తెలియదు, నేను కులాల మద్య విభజించి మాట్లాడలేను అంటారు, ఎవరు విభజించి మాట్లాడమనరు ప్రతిపక్షనేత లా వెళ్ళి నచ్చ చెప్పు ఉద్రిక్తతలు తగ్గించి కలిసి ఉండమని చెప్పవచ్చు అనే విషయం పార్టి అదినేత గా చెయలేక పొయారు.

డిసెంబర్ 7 న ఫాతిమా కాలేజీ విద్యార్ధులని కలిసి మీ సమస్యని వారం లొగా పరిష్కరిస్తా అని చెప్పి వెళ్ళిపొయారు  ఆ తరువాత కనీసం దాని మీద తాని పొత్తులొ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ని కాని కెంద్ర ప్రభుత్వం ని కాని సంప్రదించలేదు అజ్ఞాతవాసి ఆడియొ ఫంక్షన్ కి ప్రిపేర్ అయిపొయారు తప్ప మళ్ళి ఫాతిమా కాలేజి మీద మాట్లాడలేదు 

 విశాఖ డ్రడ్జింగ్ కార్పొరేషన్ దగ్గర నుండి సింహపూరి యునివర్సిటీ దాక చూసుకున్నా, రాజధాని పొలాల నుండి ,ఆక్వా పార్క్ వరకు అన్ని మద్యలొనే వదిలేసారు పవన్. ఇలా సమస్యల మీద మొక్కుబడిగా మాట్లాడటం వెల్లిపొవటం.. తెలుగుదేశం ప్రభుత్వం లొ ఉన్న జనసేన కి ప్రభుత్వాన్ని ఒప్పించి సమస్యలని పరిష్కరించే సత్తా లేనప్పుడు వీళ్ళలొ నాయకత్వపు లక్షణాలు లేనట్టే కద. ఒక్క సమస్యమీద శాస్విత పరిష్కారం చూపిన దాకలాలు లేవు.



ప్రతిపక్ష నేత గా వై.యస్ జగన్ గారు 100% సక్సెస్.. 

(దీనికి ఎన్నొ రుజువులు )





ప్రతిపక్ష నేత గా వై.యస్ జగన్ గారి కి 100 మార్కులు వేయవచ్చు అంటున్న ప్రజలు ,సాదారణం గా ప్రతిపక్షం అధికారపక్షం తొ పొరాటం చెయటం లొ కొంచం బలహీనంగా ఉంటుంది దానికి కారణం వళ్ళ దగ్గర అధికార యంత్రాంగం ఉండటం అటు అశంబ్లీ లొను ఇటు బయట అధికార పక్షం ఎలా కావలొ అలా నడిపించుకునే వెసులుబాటు వాళ్ళకి పుష్కలం గా ఉంటుంది కాని ఆంద్రప్రదేశ్ లొ మాత్రం అధికారపక్షం కన్న ప్రతిపక్షం ఎంతొబలం తొ ఉంది అనేది అనేక సంధర్బాలలొ ఇప్పటికే రుజువైంది ప్రతిపక్షం వారి పని తీరు తొ ప్రజలలొ 100 మార్కులు సంపాదించుకుంది అనే సంకేతాలు ప్రతిపక్షం కి పెరుగుతున్న మద్దతు చూస్తే తెలుస్తుంది అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు

వరుసుగా వచ్చిన క్రమాలు చూస్తే 

*ప్రత్యేక హొదా అనే ది రాష్ట్రం కి ఎంతొ ముఖ్యం అలాంటి ప్రత్యేక హొదా మీద ఏ ఒక్కరు మాట్లాడకుండా పత్రికల ముసుగులొ దానిని నీరుకార్చే ప్రయతనం చెస్తే జగన్ గారి ఆద్వర్యం లొ ఒక్క వై.సి.పి మాత్రమే సూమారు 25కి పైగా దీక్షలు , ధర్నాలు, బందులు, యువభేరిలతొ ప్రత్యేక హొదా వలన వచ్చే లాబాలు వివరించి ప్రత్యేక హొదా డిమాండ్ ఇంకా సజీవంగా ఉండేలా చెయటం లొ విజయం సాదించారు. 

*గుట్టు చప్పుడు కాకుండా సాగిపొయిన విశాఖ భూదందా ని ప్రజలు తెలిసేలా సాక్షాలతొ బయటాపెట్టారు.

*అద్దంకి దగ్గర కిడ్ని వ్యాది తొ అనేక గ్రామాలు బాద పడుతున్న సమయం లొ అక్కడ దర్నా చెసి ప్రభుత్వం చెత అనేక డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చెయిస్తాం అనే హామి ని వచ్చేలా చేశారు. 

*అలాగే రైతు ఆత్మ హత్యలు అనేకం జరుగుతుంటే ప్రభుత్వం వారు ఆ చనిపొయినవారిలొ ప్రేమ విఫలం చెందిన వారు ఉన్నారు అంటు అనేక చౌకబారు కారణాలు చూపి వారికి నష్ట పరిహారం ఎగొట్టే ప్రయత్నం చెస్తే వై.యస్ జగన్ గారు రైతు భరొసా యత్ర చెపట్టి ప్రభుత్వం మీద వత్తిడి పెంచి వారికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వం మెడలు వంచగలిగి విజయం సాదించారు. 

*జగన్ గారు గిరుజనులకి అండగా నిలబడి ప్రభుత్వం ఇచ్చిన జి.ఒ 97 కి( అక్రమ బాక్సైట్ తవ్వకం ) కి వ్యేతిరకం గా సాగించిన పొరాటం తొ , విధిలేక బాక్సైట్ తవ్వకం పై చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం రద్దు చెసుకుంది. 

*32 లక్షల మద్యతరగతి వారి డబ్బు తొ అవకతవకలు చెసిన అగ్రీ గొల్డ్ లొ నేతల వ్యవహారం పై సాక్షాలతొ బయ్టపెట్టి వాళ్లని ప్రజాకొర్టూ లొ నిలబెట్టరు జగన్.

*వై.యస్ జగన్ గారు మిర్చి రైతులు కి దీక్ష చెసి కెంద్రం నుండి మద్దతు దర లభించేలా చేశారు. 

*గరగపర్రు లొ విషబీజాలు నాటుకున్న వేల అధికార పక్షం తొ సహా అందరు అటు చూస్తే రాజకీయం గా దెబ్బ తగులుతుంది అని ఆలొచించారు కాని జగన్ గారు ఇరు పక్షాలతొ మాట్లాడి గరగపర్రు లొ ఉదృత తగ్గించటం లొ విజయం సాదించారు.

*వై.సి.పి ఆద్వర్యం లొ చెవిరెడ్డి గారి చెత దీక్ష చెయించి ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డ్ ను త్వలగించెలా ప్రభుత్వం మెడలు వచ్చగలిగారు. 

* వివిద విద్యార్ధి సంఘాలని కలుపుకుని వై.యస్.ఆర్.సి.పి విద్యార్ధి విభాగం జగన్ గారి సూచన మేరకు ప్రభుత్వం తొ పొరాడి పొలీసుల లాఠి దెబ్బలు తిని చివరికి ప్రభుత్వం మెడలు వంచే లా అన్ని జిల్లలలొ నిరసనలు తెలిపి ప్రభుత్వం చెత గ్రూప్ 2 ని వాయిదా వేసేలా పొరాడారు. 

*ఉద్దానం లొ పర్యటించినప్పుడు కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇస్తా అని వాగ్ధానం చెసిన జగన్ గారు , మళ్ళి ప్లీనరీ లొ కూడా జగన్ గారు కిడ్నీ బాధితులకి అధికారం లొకి రాగానే పెన్షన్ ప్రకటించారు, జగన్ గారి హామి తొ దిగి వచ్చిన సర్కార్ కిడ్నీ భాదితులకి 2,500 పెన్షన్ ఇవ్వాలి అని క్యాబినేట్ లొ తీర్మానించింది.

*పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలి అనే వై.యస్ రాజశేఖర రెడ్డి గారి ఆలొచన తొ రీపుదిద్దుకున్న  విశాఖ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రవేటు పరం చెద్దాం అని చూసిన చంద్రబాబు ప్రభుత్వం తొ 2016 నవంబర్ లొ  వై.యస్.ఆర్ సిపి ఆద్వర్యం లొ పొరాడి ఆ నిర్ణయం ని రద్దు చెసుకునే లా చెసిన వై.యస్ జగన్ గారు. 

*గుంటూరు లొ 2015 లొ ప్రభుత్వ విధానల వలన భజరంగ్ జూట్ మిల్ మూత పడటం తొ రొడ్డు కార్మికులు రొడ్డున పడ్డారు జగన్ గారి ఆదేశాల మేరకు వై.సి.పి సభ్యులు, బజరంగ్ జూట్ మిల్ వర్కర్స్ యునియన్ ప్రెసిడెంట్ అయినటువంటి లెళ్ళ అప్పిరెడ్డి గారి ఆద్వర్యం లొ నిరంతరం సాగిన పొరాటాం ఫలితం గా దిగివచ్చిన ప్రభుత్వం 2017 ఆగస్టు 16 కల్లా లాకౌట్ ఎత్తేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.

రాష్ట్రంలో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయడానికి అధికార పార్టీకి చెందిన వారు ఒక్కరే ఉండటం మిగిలిన వారంతా ప్రతిపక్ష పార్టీ వారు కావటం తొ. అధికార పార్టీ సభ్యులు తక్కువగా ఉన్నందు వల్లనే ఈ సలహా మండలిని ఏర్పాటు చెయకుండా చంద్రబాబు 3 ఏళ్ళు సాకులు చెబుతు వచ్చారు. దీంతొ రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేయాల్సిన మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడంపై  గతం లొ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌ స్పందిస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. మార్చ్ 28న ఇదే విషయం మీద రాజ్య సభలొ  కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరామ్ ను విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు మండలి ఏర్పాటు చెయకుండా తాత్సారం చెస్తున్నారు అని 2017 ఏప్రిల్ లొ హైకొర్టు లొ పిల్ కూడా వేశారు.  ఈ నేపథ్యంలో ఇలా ప్రతిపక్షం చెసిన పనితొ అన్ని వైపుల నుండి వచ్చిన వత్తిడి తొ టీడీపీ ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చెస్తున్నట్టు ఉతర్వులు జారి చెసింది.  

* డ్వాక్రా మహిళల కొసం ప్లీనరీ లొ ప్రకటన చెయగానే అప్పటి వరకు మొద్దు నిత్ర లొ ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద 676 కొట్లు విడుదల చెసి , సున్న వడ్డి బకాయి చెల్లింపు అని ప్రకటన చేశారు. 

సదావర్తి స్కాం లొ కొర్టు లొ పొరాడి ప్రభుత్వానికి మొట్టికాయలు పడేలా చేశారు, 22 కొట్లకి కొట్టేద్దాం అనుకున్న ప్రభుత్వం మెడలు వంచి దేవదాయ శాఖ ద్వారా పేద బ్రాహ్మణ పిల్లలకి అదనంగా పొరాడి 30 కొట్లు వచ్చేలా చేశారు. 

ఇంక తాజాగా జి.యస్.టి విధానం వలన చెనేతకు తీరని నష్టం జరిగింది, దీనిని దృష్టి లొ పెట్టుకుని వై.యస్ జగన్ గారు చెనేతను జి.యస్.టి విధానం నుండి తప్పించాలి అని కొరుతు కెంద్రానికి లేఖ రాశారు - దానికి స్పందిస్తూ కెంద్రం జి.యస్.టి విధానం నుండి చెనేతకు మినహాయింపు ఇస్తూ ప్రకటన విడుదల చెసింది..

ఇలా చెప్పుకుంటు పొతే ప్రతిపక్షం గా తమ పాత్ర సమర్ధవంతం గా పొషిస్తు వై.యస్ జగన్ గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం మెడలు వంచి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి సాదించిన విజయాలు ఎన్నొ ఉన్నాయి... ఇది కేవలం ప్రజా శ్రెయస్సు మీద జగన్ గారికి ఉన్న కమిట్ మెంట్ ఏ ముఖ్య కారణం అని జగన్ గారి ప్రతి అడుగు దీక్షణం గా పరిశీలించిన వారికి సులభం గా తెలిసిపొతుంది ... ప్రజలకు అండగా నిలవటాం లొ జగన్ గారు సక్సెస్ అయ్యారు .....


ప్రజా సమస్యల పై పొరాటం లొ పవన్ , జగన్ పనితీరు.. విశ్లేషణ ప్రజా సమస్యల పై పొరాటం లొ పవన్ , జగన్ పనితీరు.. విశ్లేషణ Reviewed by surya on 4:50 AM Rating: 5

27 comments:

  1. చక్కగా విశ్లేషించారు సూర్య...

    ReplyDelete
  2. Very good analysis,pavan is not suitable for politics

    ReplyDelete
  3. Bro, asusual you penned it very analytically and appropriately. Your content sounds a lot.

    ReplyDelete
  4. Its very good information.very useful information thank u so much

    ReplyDelete
  5. It's very useful information thank u so much

    ReplyDelete
  6. Bayya Jagan Garu erojullo ekkadekkado meeting pettaro date tho Saha oka page tayari cheyandi..meku samayam dorikithe..Chala manchi Pani avuthundi...Chala mandhi em chesadu Jagan antunnaru...vallandariki chepputho kottinattu avuthundi..kudirithe Eenadu andhrajothy clippings pettandi...dola teripovali villaku

    ReplyDelete
  7. Pawan is pavala no value...for that live him as ajantavasi

    ReplyDelete
  8. Great job...
    People always concern what jagan says.. rather than pavan...
    He has been working for tdp... Inspire of people voice..

    ReplyDelete
  9. That's an excellent analysis and this type of articles should reach people.

    ReplyDelete
  10. wondeful analysis bro..plz make it viral

    ReplyDelete
  11. It's very good information,this type of articles should be reache the people,i always support to jagananna.

    ReplyDelete
  12. Very very nice analysis ..
    Nice info which every one especially for pawan fans ...

    ReplyDelete
  13. Nice job done by you brother what you have written was 100 0/0 correct

    ReplyDelete

Powered by Blogger.