గత 13 ఏళ్లలో ఉద్దానం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ వ్యాది కనుక్కొలేక పోయారు ఈ సారైనా వ్యాది మూలాలు తెలుసుకుని వాళ్ళకి మంచి జరగాలని ఆశిద్దాం.
ఉద్దానం ప్రాంతంలో మొట్టమొదట కేజి హెచ్ వైద్య బృందం, జిల్లా వైద్య బృందం కలిసి 2004లో అద్యాయనం చేశాయి, నీరు రక్త నమూనాలు లాబ్ కి పంపడం, ఆహార అలవాట్లపై ప్రాధమిక అద్యాయనం జరిగింది.2007లో అమెరికా లోని శాంఫ్రాన్సిస్కొ కిడ్ని వ్యాదులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది అక్కడికి వై.యస్ ప్రభుత్వం తరుపున కె.జి.హెచ్ లో అప్పటి నెఫ్రాలజీ విభాగం అధిపతి అయిన డాక్టర్ రవిరాజుని పంపించారు, ఆయన ఈ ఉద్దానం కిడ్ని వ్యాదుల తీవ్రతను మొదటి సారి అంతర్జాతీయ వేదిక మీదకి తెచ్చి ప్రపంచ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈయన అంతకు ముందే 15-12-2006న ప్రభుత్వ సూచనల మేరకు కవిటీలో వైద్య శిబిరాలు నిర్వహించారు 20 గ్రామాలకు చెందిన 63,000 మందికి ఈ అంశంపై అవగాహన కల్పించారు.
2008లో వై.యస్ కోరిక మేరకు ఏపీ అకాడమి ఆఫ్ సైన్స్ సిసియంబి నెష్నల్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి న్యూడిల్లి, నింస్ హైద్రాబాద్, ఉమ్మడిగా అద్యాయనం చేశారు కిడ్నీ వ్యాది గల కారణాలు నిర్ధారణ కాలేదని తెల్చారు.
2008లోనే అమెరికా లోని హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ, విశాఖ కే.జి.హెచ్ వైద్య నిపుణుల బృందం ఉద్దానం కిడ్ని వ్యాదులపై అద్యాయనం చెపట్టాయి, ముంబైలోని కేంద్ర పరిశోధనా శాలకు రక్తం, మట్టి నమూనాలు పంపారు కాని కారణం మాత్రం గుర్తించలేదు. ఆ ప్రాంతం ఆహార అలవాట్లపై మరింత అద్యాయనం చెయాలని వారు నివేదిక ఇచ్చారు - ఇలా తదుపరిగా ముందుకు వెళ్ళే సమయంలో వై.యస్ చనిపొయారు అపటి నుండి దీనిని పభుత్వాలు పట్టించుకొలేదు.
అక్కడ కనీసం సరైన వైద్య సదుపాయాలు లేవు అని గుర్తించిన వై.యస్ 2008 అక్టొబర్ లో రాజీవ్ గాంధి ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఉద్దానం భాదితులు అక్కడే వైద్యం చెయించుకుంటున్నారు. వై.యస్ ఆరొగ్యశ్రీ ద్వారా ఈ కిడ్నీ భాదితులకి డయాలసిస్ చెయించేవారు.
అక్కడ కనీసం సరైన వైద్య సదుపాయాలు లేవు అని గుర్తించిన వై.యస్ 2008 అక్టొబర్ లో రాజీవ్ గాంధి ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఉద్దానం భాదితులు అక్కడే వైద్యం చెయించుకుంటున్నారు. వై.యస్ ఆరొగ్యశ్రీ ద్వారా ఈ కిడ్నీ భాదితులకి డయాలసిస్ చెయించేవారు.
హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ తమ పరిశోధనపై 2012లో నివేదిక ఇచ్చినది కాని వ్యాది కారణాలు మాత్రం వెల్లడించలేకపోయింది. పర్యావర్ణంతో పాటు త్రాగునీరు ఈ సమస్యకు కారణం అనే అనుమానం వ్యక్తం చేసింది. మరింత పరిశోధన చేయాలని తెల్చి చెప్పింది.
2013లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అద్యాయనం చేశాయి, ఉద్దానం ప్రాంతంలో 28 శాతం కిడ్నీ వ్యాతో భాదలు పడుతున్నారని తెల్చింది వాళ్ళకి సరైన వైద్యం అందించాలి ఆర్ధికంగా ఆదుకోవాలని చెప్పింది. చైనాలోని హాంకాంగ్‌లో 2013లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ నెఫ్రాలజీలో ఈ పరిస్థితిని చర్చించి ఉద్దానం నెఫ్రోపతి అని పేరు పెట్టారు.
2013 చివరిలో నెష్నల్ జియాగ్రఫికల్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, సైన్స్ అండ్ టెక్నాలజి డిల్లీ సంస్థ కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులతో అద్యాయనం చేశారు.
2014లో నింస్, సి.సి.యం.బి, ఏ.యు, హైడ్త్రలాజికల్ ఆఫ్ ఇండియా , రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖా ఆద్వర్యంలో అద్యాయనం జరిగినా ఏది తెల్చలేక పొయారు.
2015లో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం అద్యాయనం చెసింది వాళ్ళాకి కొత్త విషయాలు వెల్లడి కాలేదు ఎండిన ఉప్పు చెపలు తినటం, ఇతర ఆహార అలవాట్లు, త్రాగునీటిపై మరింత అద్యాయనం చెయాలని ఆ బృంధం వెళ్ళడించింది.
స్టొన్ బ్రూక్ యునివర్సిటి బృందం అద్యాయనం చెసినా ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు, ఈ అద్యాయనంలో మరిన్ని అనుమానాలు ఏర్పడ్డాయి, ఉద్దానం ప్రాంతంలో పండే మునగకాయ తినటం వలన వాటిలో ఉండే పొటాషియం కిడ్ని వ్యాదులు రావటానికి అవాశం ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తపరిచింది, ఇంకా ఆ ప్రాంతంలో జీడి మామిడి కొబ్బరి తొటలు ఎక్కువగా ఉండటం వలన ఆ తోటకు వాడే ఎండొ సల్ఫన్ తదితర పురుగు మందు వినియొగం ఎక్కువ అవ్వటం వలన కిడ్నీ వ్యాదులు రావడానికి కారణం అవ్వచ్చని అభిప్రాయాలు వచ్చాయి..
వై.యస్ హయాము తరువాత మళ్ళి ఉద్దానంకి - హార్వర్డ్
Reviewed by surya
on
2:05 AM
Rating:
No comments: