Comments

పద్మావతి విశ్వవిద్యాలయం లొ క్రీష్టియన్ లేడిని నియమించారు వైయస్సార్ ? ఇప్పుడు ఈ ఆరొపణలలొ నిజనిజాలు చూద్దాం ! YS Rajashaker Reddy Padmavathi Mahila university Veena Noble Das Christianity

నేను కూడా హిందూ సొదరుడినే, హిందు ధర్మం మీద ఉన్న అభిమానంతో, వైయస్సార్ నిజంగా హిందువులకి అన్యాయం చేదాం అనుకున్నారా ? అనే విషయం మీద, ఆయన మీద వచ్చిన అనేక ఆరోపణల మీద రీసర్చ్ చెసి అందులో ఎంత దుష్ప్రచారం ఉందో తెలుసుకున్నాను. వైయస్సార్ ని అభిమానించమని ఎవ్వరు బలవంతం చేయరు, కాని వైయస్సార్ చేయని తప్పుని కూడా ఆయనికి అంటగట్టి అదే నిజం అని నమ్మించే తెలుగుదేశం అభిమానుల ట్రాప్ లో పడవద్దని మాత్రమే కొరుకుంటున్నను. ఎందుకంటే హిందూ ధర్మం పాటించే నిజమైన హిందూ ఎవ్వరూ కూడా అకారణంగా ఎవ్వరి మీద నిందలు వేయ్యరు అలా వేయడం ధర్మ విరుద్దం అని నమ్మే జాతి మంది. కాని కొంతమంది వారి రాజకీయ లాభం కోసం అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయతనంలో మీరు అకారణంగా పావులు కావద్దు.. 



1) విశ్వవిద్యాలయం లొ క్రీష్టియన్ లేడిని నియమించారు వైయస్సార్ ? ఇది అభియొగం.

నిజం చూద్దాం 

వీణ దాస్ అనే ఆమే అసల ఆ పద్మావతి యునివర్సిటీలోకి వచ్చింది వైయస్సార్ హయాములో కాదు , ఆమే 1998 అంటే చంద్రబాబు హయాము లోనే ఆ యునివర్సిటిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఇక రామ బ్రహ్మం అనే ఆ యునివర్సిటి రిజిస్టరర్ పొస్టుకి రిజైన్ చెసి వెళ్ళిపొతే ఆమేని 16-11-1998 (బాబు హయాము లోనే) ఇంచార్జ్ రిజిస్టరర్ గా నియమించారు. తరువాత మీటింగ్ పెట్టుకుని 23-3-1999 న పరిమినెంట్ రిజిస్టరర్ గా నియమించారు - పైగా బాబు హయాములోనే 20-2-1999న ఆమేకి అక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. తరువాత అమెని వైస్ చాన్సిలర్ ని అనుభవం ప్రాతిపధికన చేశారు, ఆ అధికారంతో ఆమే చెసిన ఆరచకాలు వెలుగులోకి వచ్చి ప్రభుత్వం దృష్టికి రాగానే 2008లో ఆమేని అక్కడ నుండి సస్పెండ్ చేసి సరోజమ్మ అనే ఆమేని వైస్ చాన్సిలర్ ని చేశారు వైయస్సార్, కాని ఇక్కడ కేవలం వైయస్సార్ క్రిస్టియన్ అనే ఆలోచన వలన చాలామంది ఈ మొత్తం వ్యవ్హారాన్ని వైయస్సార్ కి అంటగట్టి ఆయనని రాజకీయంగా దెబ్బకొడదాం అనే ఆలోచనతో హిందు ధర్మం పాటించేవాళ్లకి వైయస్సార్ ఏ చెయించాడు అనే భావన కల్పించారు. నేను చెప్పినవి అబద్దం అయితే ఆమే ఎప్పుడు ఆ యినివర్సిటిలో అడుగుపెట్టారో వివరాలు చూసి మీరే నిజం తెలుసుకొండి - పూర్తి వివరాలు లా వెబ్ సైట్ లో చూడొచ్చు  

https://indiankanoon.org/doc/620834/



ఇప్పుడు ఆ వీణ దాస్ ఎక్కడ ఉన్నారు ?

ఉపకులపతిగా తీసేసిన వీణ నోబెల్ దాస్ ను ఇంకా అకాడమిక్ సెనెట్ మెంబెర్ గా కొనసాగిస్తున్నారు, ఇది చేస్తున్నది ఎవరు?? చంద్రబాబు ప్రభుత్వం కాదా??  పూర్తి వివరాలు పద్మావతి యునివర్సిటి వెబ్ సైట్ లో చూడొచ్చు  - 
http://www.spmvv.ac.in/adminis.html 

ఇప్పుడు యునివర్సిటీలో పరిస్థితి చూస్తే , యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి గారిని నియమించింది ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కాదా?? ఆమె హిందువా క్రైస్తవ మతమా?? ఆమె 2014లో కూడా తెలుగుదేశం టికెట్ మీద పూతలపట్టు నుండి పోటీ చేసి ఓడిపోలేదా?? నిజాలు తెలుసుకోండి

2) ఇక ఇటువంటిదే ఇంకోక ఆరోపణ తిరుమల రెండు కొండలు చెద్దాం అనుకున్నాడు వైయస్సార్ అని, ఇది కూడా పచ్చి అబద్దం కేవలం రాజకీయం కోసం ఆకరికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడిని కూడా రాజకీయంలోకి లాగిన నీచ ఘటన ఇది. తెలుగుదేశంకి అండగా నిలబడే పత్రికలు పన్నిన పన్నాగం, నిజనిజాలు నేను నా బ్లాగ్ లో ప్రూఫుల తో సహా పెట్టాను, నేను ఇచ్చిన ఈ లింక్ చూసి ఇందులో ఎక్కడ వైయస్సార్ చెసిన తప్పు ఉందో తెలుసుకొగలరు. 
https://prajaballet.blogspot.com/2017/06/blog-post.html

3) వైయస్సార్ హయాములో తిరుమలకి కానీ హిందు ధర్మానికి కాని నిజంగా ఏమైనా మేలు చేశారా అనే విషయం మీద కూడా శోధన చేశాను ఇందులో కూడా నా దృష్టికి వచ్చిన వైయస్సార్ హిందు ధరమ పరిరక్షణ కోసం చేసిన మంచిని పొందుపరిచాను ఈ లింక్ లో చూడొచ్చు .. 
https://prajaballet.blogspot.com/2017/02/blog-post_97.html

ఒక వ్యక్తి నిజంగా హిందూ ధర్మ నాశనానికి పూనుకుని తప్పు చేస్తే కచ్చితంగా నిలదీయటంలో తప్పు లేదు , కాని రాజకీయంగా తన మన భేదం లేకుండా 108, అరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి పదకాలు పెట్టి ప్రజల మన్ననలు పొందిన ఒక వ్యక్తిని నిలువరించటానికి వేరే దారి లేక హిందూ దేవుళ్లని, హిందూ ధర్మం ఆచరించే వారి మనోభావాలని గాయ పరిచి, కించపరిచి వారిని ఈ వ్యక్తికి మానసింకంగా దూరం చేద్దాం అనే ఆలోచనతో తెలుగుదేశం వాటి అనుభంద పత్రికలు ఆడిన ఆటలో మన హిందు సోదరులు పావులుగా మారి మన కలియుగ దైవం మీద వారు చేసిన లేని ఆరోపణలు చేసి వేంకటేశ్వరుని ప్రతిష్టని తిరుమల పవిత్రతని దెబ్బతీయవద్దని మనవి. 
పద్మావతి విశ్వవిద్యాలయం లొ క్రీష్టియన్ లేడిని నియమించారు వైయస్సార్ ? ఇప్పుడు ఈ ఆరొపణలలొ నిజనిజాలు చూద్దాం ! YS Rajashaker Reddy Padmavathi Mahila university Veena Noble Das Christianity పద్మావతి విశ్వవిద్యాలయం లొ క్రీష్టియన్ లేడిని నియమించారు వైయస్సార్ ? ఇప్పుడు ఈ ఆరొపణలలొ నిజనిజాలు చూద్దాం ! YS Rajashaker Reddy Padmavathi Mahila university Veena Noble Das Christianity Reviewed by surya on 11:59 PM Rating: 5

No comments:

Powered by Blogger.