2017 చంద్రబాబు పరిపాలనలో కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చిత్రీకరించింది. అయితే.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ అధినేత కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
2017 నుండి ఈ కేసులో ఉన్న నిందితులని కాపాడేందుకు టీడీపీ నేతలు మాండ్ర శివానందరెడ్డితో పాటు, గౌరు వెంకటరెడ్డి కూడా అడుగడుగునా ప్రయత్నించారని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో 2017 నుండి 2019 ఎన్నికల వరకు ఈ కేసులో ఎలాంటీ పురోగతీ లేకుండా సుగాలీ ప్రీతీ తల్లితండ్రులకి ఎలాంటీ న్యాయం జరగలేదు. నాడు పవన్ కళ్యాణ్ సైతం ఈ కేసు విషయంలో ఎక్కడా మాట్లాడింది లేదు.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం కేసుని తిరగతోడటం మోదలుపెట్టింది. సుగాలీ ప్రీతీ తల్లితండ్రులు కూడా జగన్ ప్రభుత్వం ఈ కేసును తిరిగి విచారణ ప్రారంభించడం స్వాగతిస్తున్నాం అని మీడియా ముఖంగా ప్రకటించారు.
దీంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ సుగాలీ ప్రీతీ హత్య జగన్ ప్రభుతంలో జరిగిననట్టు ఎక్కడలేని హడావిడి చేసి ఈ కేసును రాష్ట్ర ప్రభుతం కాదు సీబీఐ కి అప్పగించలని నానా హంగామా చేశారు. అక్కడితో ఆగకుండా సుగాలి ప్రీతీ తల్లితండ్రులని కలిసి వాళ్ళచేతకూడా అదే డిమాండ్ చేయించారు. ఈ నేపధ్యంలో 2020 ఫిబ్రవరీ 18న కర్నూల్ వచ్చిన జగన్ ను సుగాలీ ప్రీతీ తల్లితండ్రులు కలిసి ఈ కేసును సీబీఐ కి అప్పగించలని జగన్ ను కోరారు. లేదు కోరేలా వాళ్ళని పవన్ కళ్యాణ్ అండ్ టీం ప్రేరేపించారు. దీంతో జగన్ సైతం వారి తల్లితండ్రుల అభిష్టం మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరీ 28న జీవో 37 జారీ చేశారు.
ఇక ఈ కేసు ని అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ప్రతీ వేదికలో జగన్ పై నిందలు మోపుతూ ఎంత రాజకీయంగా ఈ కేసును వాడుకున్నారో కోత్తగా చెప్పనవసరంలేదు. తానూ కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉన్న కూడా ఏనాడు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలని ఈ కేసు విషయం మాట్లాడని పవన్ కళ్యాణ్ ఏపీలో మాత్రం నిందలు జగన్ ప్రభుత్వంపై మోపూతూ వేదికలపై ఊగిపోయారు. కానీ నిందితులు తేలుగుదేశంకి చెందిన వారని ఎక్కడా కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం చనిపోయిన బాలిక తల్లితండ్రులు ఎవరిపైన ఆరోపిస్తున్నారో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది పవన్ కళ్యాణ్ నిందితులని కాపాడటానికి చేసిన కుట్ర కాక మరేమిటి?
జగన్ ప్రభుత్వం సుగాలీ ప్రీతీ వాళ్ల తల్లితండ్రుల అభిష్టం మేరకు కేసునును సీబీఐ కి ఇచ్చినా వారి కుటుంభానికి మాత్రం అండగానే నిలబడింది 2021లో ప్రీతి తల్లిదండ్రులకు 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మాత్రం కేసును రాజకీయంగా వాడుకుని తను అధికారంలోకి రాగానే మోదట పరిష్కరించే కేసు సుగాలీ ప్రీతీ కేస్ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చుకుంటూ తిరిగారు.
కోరుకున్న విధంగానే 2024లో అధికారలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అయ్యారు కానీ సుగాలీ ప్రీతీ కేసు పై ఎక్కడా మాట్లాడలేదు. బీజేపీతో పోత్తులో ఉన్నా కనీసం సీబీఐ ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తుందో కూడా అడిగిన దాఖలాలు లేవు. ఇప్పుడూ ఏకంగా సీబీఐ తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ కేసు నీరుకారిపోయింది అని స్పష్టంగా తేలిపోయింది.
లోతుగా చూస్తే 2019లో జగన్ ప్రభుత్వం కేసును విచారిస్తే సుగాలీ ప్రీతీ తల్లితండ్రులు ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతల గుట్టు ఎక్కడ భయట పడుతుందో అనే పవన్ కళ్యాణ్ చేత పావులు కదిపి సుగాలీ ప్రీతీ కేసు సుగాలీ ప్రీతీ వాళ్ళ తల్లితండ్రుల చేతే సీబీఐకి వెళ్ళేలా చేసి ఇప్పుడు నీరు కారిపోయేలా పవన్ కల్యాణ్ పావులు కదిపారా అనే అనుమానం రాక మానదు. కేంద్ర ప్రభుత్వంతో పోత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన సమయం ఇది.

No comments: