ప్రభుత్వాలు బాధితుల పక్షాన్న నిలబడాలనే మౌళిక సూతాన్ని మరిచి భాదితులనే దబాయిస్తే... ఇలాంటి ఘటనలు చంద్రబాబు పాలనా హయాములో కోకోల్లలుగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘటన అనురాధాగారిది.
13 సెప్టెంబర్ 1996న అనురాధా అనే బీఏసీ అగ్రికల్చర్ విద్యార్ధినిపై వెటర్నిటి సైన్స్ విద్యార్ధి శ్రీనివాస్ యాసిడ్ పొసాడు, ఈ దాడీలో అనురాధ శరీరం 20 % కాలిపొయింది, తన ఎడమ కన్ను పొగొట్టుకున్నది, తన ఎడమ చెవ్వు, వక్ష స్థలం కాలిపోయాయి, తను ఆర్ధిక సమస్య వలన కాలేజిలో నెగ్లిజన్స్ వలన ప్రభుత్వం నుండి సాయం కావాలని హై కోర్టుని కోరింది, హైకోర్టు సానుకూలంగా స్పందించి అనురాధ వైద్య కర్చుతో పాటు పరిహారంగా 5 లక్షలు చెల్లించాలి అని (21 జనవరి 1997) న తీర్పు ఇచ్చింది, తీర్పు అందుకున్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది , పూర్తి పరిహారం అందని అనురాధ మిగిలిన మొత్తంని అడిగితే ఇంతకన్న నయపైసా కూడా ఇచ్చేదిలేదని హై కోర్టు ఇచ్చిన తీర్పుని నిలుపుదల చేయాలని లక్షలు కర్చు పెట్టి సుప్రీం కోర్టు కి వెల్లింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం.
ఈ నేపధ్యంలో వైయస్సార్ గారి ప్రభుత్వం వచ్చినా కేసు త్వరగా తేలకపొవటంతో వైయస్సార్ గారు చనిపొవటానికి 2 రోజుల ముందు అనురాధా గారు వైయస్సార్ ని కలుసుకుని జరుతున్న పరిణామాలను పూర్తిగా వివరించారు. దీంతో వైయస్సార్ గారు నేను వెగవంతం చెయిస్తాను మంచి పరిహారం అందేలా చేస్తానని మాట ఇచ్చి అప్పటికి అప్పుడూ దీనిని త్వరగా తేల్చండని రిపొర్టు పంపారు. వైయస్సార్ గారు చనిపొయిన 17 రొజులకి 19 సెప్టంబర్ 2009న సుప్రీం కోర్టు 71.45 లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది ముఖ్యమంత్రి స్థానం రోసయ్య గారు వెంటనే యునివర్సిటి వైస్ చాన్స్లర్ ఆ మొత్తాన్ని అనురాధాకి విడుదల చెయాలని చెప్పి ఇప్పించింది, ఈ మొత్తం నగదు అందుకున్న అనురాధ గారు వైయస్సార్ గారు చనిపొక ముందు ఈ కేసుని వేగవంతం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుని 13 ఏళ్ళ తరువాత నాకు పునర్జన్మ ఇచ్చారని అంత భాదలో కూడా కాస్త ఉపశమనం కలిగినందుకు. తన ఆనందాన్ని పత్రికాముఖంగా పంచుకున్నారు.
(చంద్రబాబు గారి ప్రభుత్వం లక్షలు పెట్టి సుప్రీంకి వెల్లకుండా, ఆ లక్షలు అనురాధా గారికి ఇచ్చి ఉంటే ఆయన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది.)

No comments: