1978 ఎన్నికలలొ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ఆద్వర్యం లొ "రెడ్డి కాంగ్రెస్" ఏర్పడింది అని చాలా మంది చెబుతు ఉంటారు. కాంగ్రెస్ .ఆర్ - రెడ్డి కాంగ్రెస్ ఒకటేనా ? లేక పత్రికలు వేసిన కుల ముద్రా ? ఒకసారి చరిత్ర చూద్దాం.
భారత దేశం కి బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చి 1950 లొ భారత రాజ్యాంగం అమలు లొకి వచ్చిన తరువాత మొట్టమొదటి ఎన్నికలు 1951 లొ జరిగాయి. ఈ ఎన్నికలలొ జవహర్ లాల్ నెహ్రు గారి ఆద్వర్యం లొ ఎన్నికలకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టి కి ఎన్నికల సంఘం పార్టి గుర్తు గా జొడు ఏడ్లు ఇచ్చింది , ఈ ఎన్నికల గుర్తు తొ మొట్టమొదత కాంగ్రెస్ పార్టి ఎన్నికలకి వెళ్ళి విజయం సాదించింది.
1966 జనవరి లొ ప్రధాన మంత్రిగా ఉన్న లాల్ బహ్దూర్ శాస్త్రి గారి మరణం తొ గుల్జారిలాల్ నందా గారిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చెసి 13 రొజులకి పార్టి నాయకుని ఎన్నుకునే సమయం లొ ఇందిరా గాంధి గారికి మొరార్జి దేశాయి రూపం లొ పొటి ఏదురైంది భారత దేశం ఇప్పుడు ఉన్న పరిస్థుతులలొ అనుభవం లేని ఇందిరా కి పగ్గాలు అప్పచెప్పటం క్షేమం కాదు రహస్య ఒటింగ్ జరిగితే ఎవరికి మద్దతు ఉన్నదొ తేలిపొతుంది అని మొరార్జి అనటం తొ ఎన్నిక అనివార్యం అయింది. నెహ్రూ హయాము తరువాత సిండికేట్ గా పేరు గాంచిన కామ్రాజ్ నాడర్ లాంటి కొంతమంది వ్యక్తుల సహాయము తొ ఇందిరి గాంది విజయం సాదించారు. 1966 జనవరి 19న జరిగిన ఆ ఎన్నికలొ మొరార్జీ కి 169 ఒట్లు , ఇందిరా గాంధి కి 355 రాగా ఇందిరా మొరార్జి మీద 186 ఒట్ల తేడా తొ గెలిచి ప్రధానమంత్రి అయ్యారు.
ఈ సిండికేట్ పేరుతొ కాంగ్రెస్ లొ కొంతమంది కుర్చి లొ ఎవరు కూర్చున్న వారు ఆ కుర్చీని నడిపేవారి గా తయ్యారు అయ్యారు , అలాగే వారు ఇందిరా గాంది కి మద్దతు పలికింది కూడా ఇందిరా ని కుర్చి లొ కూర్చొ పెట్టి వారు వెనకాల శక్తిగా నడుచుకొవటానికి - ఈ సిండికేట్ లొ ముఖ్యులు కామ్రాజ్ నాడర్ , నిజలింగప్ప , నీలం సంజీవ్ రెడ్డి తదితరులు.
ఇలా గెలిచిన ఇందిరా గాంధి మొదటి నెలలొ ఆ సిండికేట్ వ్యక్తులు ఎలా నడిపితే అలా నడిచేవారు, ఆకరికి "మౌం కి గుడియా" (మైనపు బొమ్మ) అని పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టి లొ అందరు ఆమేని వచ్చే ఎన్నికల దాక ప్రధాన మంత్రి కుర్చిని బర్తి చెయటానికి తాత్కాలికంగా ఎన్నుకున్నారు అని అనుకొవటం మొదలు పెట్టారు - కాని వాళ్ళ ఆలొచనలు , అభిప్రాయాలు ని ఇందిరా గాంధి తన స్వియ ఆలొచనా శక్తి తొ తునాతునకలు చెసారు , ఇది భరించలేని సిండికేట్ గ్రూప్ ఇందిరా గాంధి అభిప్రాయాలకి అడ్డుపడటం మొదలు పెట్టారు ఇలా జరుగుతున్న సమయం లొ రాష్ట్రపతి గా ఉన్న జాకీర్ హుస్సేన్ మరణం తొ రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల సమయం లొ వచ్చిన విభేదాలతొ సిండికేట్ గ్రూపుకి పూర్తి గా వ్యతిరేకి గా మారి ఇందిరా ఒక "ఇండికేట్" గ్రూప్ ని తయ్యారు చెసుకున్నారు. దీంతొ విభేదాలు ఉన్న మొరార్జి దేశాయి దగ్గర ఉన్న అర్ధిక శాఖ మంత్రిత్వం ని ఇందిరా తీసుకుని బ్యాంకులని జాతీయం చేశారు దీంతొ మొరార్జి దేశాయి రాజీనామా చేశారు. ఇలా ఒక దానిమీదఒకటి విబేదాలు తీవ్రతరం అయ్యి 1969 నవంబర్ 12 న సిండికేట్ వ్యక్తుల ప్రొత్బలం తొ కాంగ్రెస్ పార్టి నుండి క్రమశిక్షణ ఉల్లంగణ కారణాలు చూపి నిజలింగప్ప ప్రధాని గా ఉన్న ఇందిరా ను కాంగ్రెస్ పార్టి నుండి బహిష్కరించారు..
ఇందిరా ని కాంగ్రెస్ నుండి బహిష్కరిస్తు చూపిన 3 కారణాలు
1) పొటి కార్యవర్గం , పొటీ ఏ.ఐ.సి.సి ల ఏర్పాటుని ఎక్కువగా ప్రొత్సహించటాం
2) కార్యవర్గ అధికారాన్ని గుర్తించటానికి ఇందిరా నిరాకరించటాం
3) పార్టిని అదేపనిగా చులకన చెయటం
ఇందిరా బహిష్కరణం తరువాత నిట్టనిలువునా చిలిన కాంగ్రెస్ రెండు గ్రూపులు అయింది సిండికేట్ గ్రూపు మొరార్జి దేశాయి,కామ్రాజ్ అద్వర్యం లొ తమదే నిజమైన కాంగ్రెస్ అని, ఆ కాంగ్రెస్ కి ( కాంగ్రెస్ ఒ ) (కాంగ్రెస్ ఆర్గనైజేషన్) గా పిలుచుకున్నారు, బహిష్కరంప బడిన ఇందిరా తమ వర్గం తొ (కాంగ్రెస్ ఆర్) (కాంగ్రెస్ రెక్వజెషన్) గా పిలుచుకున్నారు 1971 ఎన్నికలలొ(కాంగ్రెస్ ఒ) తమ పాత కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన జొడు ఏడ్లు గుర్తు తొ రాగా , (కాంగ్రెస్ ఆర్) కి ఎన్నికల సంఘం "ఆవు దూడా" గుర్తు ఇచ్చింది.
"ఆవు దూడా" ఎన్నికల గుర్తు తొ ఏ పొత్తులు లేకుండా 1971 ఎన్నికలకి వెళ్ళగా , (కాంగ్రెస్ ఒ) మాత్రం భారతీయ జనసంఘ్ , స్వతంత్రపార్టి, సమ్యుక్త సొషలిస్ట్ పార్టి, ప్రజా సొషలిస్ట్ పార్టిలతొ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది , ఈ ఎన్నికలలొ కాంగ్రెస్ ఒ చిత్తుగా ఒడిపొయి కెవలం 518 సీట్లకి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంటే , ఇందిరా గాంధి "కాంగ్రెస్ ఆర్" పార్టి మాత్రం గరీభి హటావొ ( పేదరిక నిర్మూలన ) నినాదం తొ ప్రజలలొకి వెళ్ళి వారి మనస్సు గెలుచుకుని 352 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ని ఏర్పారు చెసింది. ఈ గెలుపుతొ ఎన్నికల సంఘం ఇందిరా గాంధి గారి కాంగ్రెస్ పార్టి ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తించింది. కొత్త కాంగ్రెస్ కి అద్యక్షులు గా జగ్ జీవన్ రాం ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
1971 ఎన్నికలలొ అఖండ విజయం సాదించిన ఇందిరా , అదే ఏడు డిసంబర్ లొ జరిగిన పకిస్తాన్ యుద్దంలొ పాకిస్తాన్ ని ఒడించి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేశారు దీనితొ ఆమే కీర్తి ప్రజలలొ విపరీతంగా పెరిగింది , ఒకానొక సమయం లొ కాంగ్రెస్ నాయకుడు బారువా ఇండియానే ఇందిరా , ఇందిరా నే ఇండియా అనే స్థాయికి వెళ్ళింది ఆమే కీర్తి - అలాగే ఆమేకి వ్యతిరేకంగా గుజరాత్ లొ విద్యార్ధులు నవనిర్మాన్ ఉద్యమం ని నడిపారు ,అలాగే బీహార్ లొ జయప్రకాష్ నారాయణ విద్యార్ధులతొ కలిసి ఉద్యమం చేశారు 1971 ఎన్నికలలొ ఇందిరా కి ప్రత్యర్ధిగా ఎన్నికలలొ పొటి చెసిన రాజ్ నారాయణా 1971 ఎన్నీకలలొ ఇందిరా అధికారాన్ని ఉపయొగించుకుని అక్రామాలకు పాల్పడ్డారు అని కేసు వేశారు, దీని మీద 1975 జూన్ 12 న ఇందిరా మీద మొపిన అభియొగం ని సమర్ధిస్తు, ఇందిరా కి 6 ఏళ్ళు అధికారాలను చెపట్తటానికి వీలు లేదు అని తీర్పు వచ్చిన ఫలితంగా కొంతమంది కాంగ్రెస్ నాయకుల సలహా తొ ఇందిరా గాంధి ప్రభుత్వం 1975 జూన్ 25 నుండి 1977 దాక ఏమర్జన్సీ ని విధించారు , ఆ కాలం లొ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హక్కుల ఉల్లంగన కు పాల్పడింది. దీనితొ ప్రజ్లలలొ ఆమే పట్ల వ్యతిరేకత ఏర్పడింది. తాను ప్రజాస్వామ్య వాది అని నీరూపించుకొవట్తనికి హటాత్తు గా ఏమర్జన్సీ నడుస్తున్న సమయం లొనే 1977 జనవరి 23 న పార్లమెంట్ ఎన్నికలకి అన్ని పక్షాలకి పిలుపు ఇచ్చి రాజకీయ ఖైదీలను విడుదల చేశారు ఇందిర.
1971 ఎన్నికలలొ ఒటమి తరువాత ,మొరార్జి దేశాయి , జయప్రకాష్ నారాయణ ఆద్వర్యం లొ కాంగ్రెస్ ఆర్ ( ఇందిరా కాంగ్రెస్ ) ని వ్యతిరేకించేవారు ఒక కూటమిగా తయారయ్యరు వీరి లొ ( కాంగ్రెస్ ఒ,భారతీయ జనసంఘ్,సమ్యుక్త సొషలిస్ట్ పార్టి , భారతియ్య లొక్ దల్ ) ఈ పార్టీలు అన్ని కలిసి జనతా మొర్చా పార్టిగా భారతీయ లొకదల్ గుర్తు మీద 1975 లొ గుజరాత్ లొ జరిగిన విధాన్ సభ ఎన్నికలలొ విజయం సాదించింది. ఈ కూటమి 1977 వచ్చేసరికి జనతా పార్టి గా ఆవిర్భవించింది. ఎన్నికలు ముగియ గానే 1977 మే 1 న అన్ని విలీనం అయ్యి జనతా పార్టిగా మారిపొయాయి.
1977 మార్చ్ లొ జరిగిన ఎన్నికలలొ ఈ జనతా పార్టి విజయం సాదించింది ఈ ఎన్నికలలొ ఉత్తర భారతం జనతా కి వైపు నులబడితే , ధక్షిణ భారతం ఇందిరా "ఆవు దూడ" వై.పు నిలబడింది వెరసి , రాయిబరేలి లొ ఇందిరా గాంధి గారు ఒడిపొయారు. జనతా పార్టీకి 298 సీట్లు రాగా , ఇందిరా ఆద్వర్యం లొ ఉన్న కాంగ్రెస్ ఆర్ కి 153 సీట్లు వచ్చాయి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రి గా 1977 మార్చ్ 24 న మొరార్జి దేశాయి ప్రమాణ శ్వీకారం చేశారు. దీనికి రెండు రొజుల ముందు ఇందిరా గాంధి ప్రవేశపెట్టిన ఏమర్జెన్సి ని 1977 మార్చ్ 21 న రద్దు చెస్తు తాత్కాలిక రాష్ట్రపతి బి.డి జెట్టి ఉత్తరువులు ఇచ్చరు, మార్చ్ 23 న కాంగ్రెస్ పార్లమెంటరి పార్టి నాయకుడిగా యశ్వంత రావు చావన్ ఎన్నికైనారు.
ఇదే సమయం లొ 1977 మే 6 న కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అద్యక్షులు గా ఎన్నిక అయ్యారు - ఈ ఎన్నికలొ 499 అమంది ఏ.ఐ.సి.సి సభ్యులు పాలొంతే అందులొ కాసు బ్రహ్మానందరెడ్డి కి 317 ఒట్లు రాగా సమీప ప్రత్యర్ధి అయిన సిద్దార్ధ శంకర రాయి కి 160 ఒట్లు వచ్చాయి
అతుకుల బొంత అనుకున్న జనతా పార్టి సమస్యలని అధిగమిస్తూ తనదైన శైలి లొ పాలించటం మొదలు పెట్టినా, ఎన్నికలలొ దారుణమైన ఒటమి రుచిచూసిన కాంగ్రెస్ వైఫల్యాల మీద సమీక్ష చెసుకొకుండా లొలొన ఒకరినిఒకరు నిందించుకొవటం మొదలుపెట్టారు. ఎవరైతే ఎమర్జన్సీ సమయం లొ ఇందిరా ని అభినందించారొ వారే విమర్శించటం మొదలుపెట్టారు , ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంతే ఇండియా అని అన్న బారువా కూడా ఇందిరని విమర్శించే వారిలొ కలిసిపొయాడు.
ఇదే అదునుగా జనతా ప్రభుత్వం 1977 మే 28 న ఎమర్జన్సీ సమయం లొ జరిగిన చట్టవుల్లంఘనల మీద దర్యాప్తుకు షా కమీషన్ నియమించింది దీనితొ పాటు ఇందిర అవినీతికి పాల్పడ్దారు అనె నెపం తొ హొమంత్రిగా ఉన్న చరణ సింగ్ ఆదేశాలతొ ఇందిరా గాంధి గారిని 1977 అక్టొబర్ 3 న సి.బి.ఐ అరెస్టు చెసింది ఆ తరువాత రొజు కొర్టు సి.బి.ఐ అరెస్టుకు సరైన ఆదారాలు చూపలెక పొయింది అని చెప్పి ఇందిరా ని విడుదల చెసింది - సి.బి.ఐ చెసిన ఆరొపణ ఎమర్జన్సి సమయం లొ వివిద కంపెనీల నుండి 104 జీపులు వాడుకొవటానికి తీసుకున్నారు అనే నెపం మొపి అరెస్టు చెస్తే దానికి ఆదారాలు లేవు అని కొర్టు కొట్టేసింది. దీనితొ ఒక్కసారిగా దేశ ప్రజల మనస్సు లొ ఏమర్జన్సి సమయం లొ ఏర్పడిన వ్యతిరేక భావం తుడిచి పెట్టుకుపొయి , ప్రజల మనస్సులొ ఆమే పట్ల సానుభూతి పవనాలు వీచాయి , ఇదే అదునుగా ఇందిర అనునాయుల వర్గం బ్రహ్మానంద రెడ్డి ని కాంగ్రెస్ అద్యక్ష పదవి నుండి దింపి ఆ స్థానం ని ఇందిరా కి కట్టబెట్టాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు. బ్రహ్మానందరెడ్డి కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇందిరా అనునాయుల ఆటకట్టించాలి అని ఇటు బ్రహ్మానంద రెడ్డి వర్గం లొ పట్టుదల పెరిగింది. చివరికి ఈ దుమారం తారా స్థాయికి చెరి 1977 డిసెంబర్ 18న ఇందిరా గాంధి పార్టి కార్యవర్గానికి రాజీనామ చెసి ఆ లేఖని కాసు బ్రహ్మానందరెడ్డి కి పంపించారు. దీంతొ నాలుగు నెలలుగా సాగుతున్న సంక్షొభం ఒక్కసారి తారా స్థాయికి చెరింది.
1977 డిసెంబర్ 31 , 1978 జనవరి 1, తేదీలలొ డిల్లీ లొ ఇందిర వర్గం పొటి కాంగ్రెస్ గా బల ప్రదర్శనకు సిద్దం అయ్యారు. అనుకునట్టే చివరికి ఈ దుమారం తారా స్థాయికి చెరి 1977 డిసెంబర్ 18న ఇందిరా గాంధి పార్టి కార్యవర్గానికి రాజీనామ చెసి ఆ లేఖని కాసు బ్రహ్మానందరెడ్డి కి పంపించారు. దీంతొ నాలుగు నెలలుగా సాగుతున్న సంక్షొభం ఒక్కసారి తారా స్థాయికి చెరింది. 1977 డిసెంబర్ 31 , 1978 జనవరి 1, తేదీలలొ డిల్లీ లొ ఇందిర వర్గం పొటి కాంగ్రెస్ గా బల ప్రదర్శనకు సిద్దం అయ్యారు. 1978 జనవరి 1,2 తారీకులలొ జరిగిన సమావేశం లొ ఇందిరా వర్గం ఇందిరా ని కాంగ్రెస్ కి జాతియ అధ్యక్షరాలు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతొ బ్రహ్మాందరెడ్డి కాంగ్రెస్ కార్యవర్గ అత్యవసర సమావేశం జరిపి ఇందిరా గాంది ని పార్టి అధ్యక్షులుగా ఎన్నుకోవటం పార్టి నియమావళిని ఉల్లంగించటం అని చెప్పి నేను అధ్యక్షుడిగా ఉన్న భారత జాతియ కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్ వాదుల చట్టబద్దమైన సంస్థ అని, ఆవుదూడ గుర్తు ఉన్న కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ అని బ్రహ్మానందరెడ్డి గారు చెప్పి 1978 జనవరి 3వ తారికున ఇందిరా వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి బ్రహ్మానంద రెడ్డి బహిస్కరించారు. దీంతొ 1969 తరువాత మరొ సారి ఇందిరా గాంధి బహిష్కరణ తొ కాంగ్రెస్ నిలువునా చీలిపొయింది.
1978 జనవరి 13 న ఎన్నికల కమీషన్ 6 రాష్ట్రాలకి ( ఆంద్రప్రదేశ్, అస్సాం , మహారాష్ట్ర, కర్నాటక, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ) కి ఫిబ్రవరి 24 న ఎన్నికలు జరిగుతాయి అని నొటిఫికేషన్ విడుదల చెసింది. దీంతొ 1969 లొ తాను స్థాపించి ఆవుదూడ గుర్తు తొ ఎన్నికలకి వెళ్ళిన ఇందిరా తిరిగి ఆ గుర్తు కొసం తనది నిజమైన కాంగ్రెస్ అని - సంఖ్యా బలం పట్టి తనకి ఆ గుర్తు ఇవ్వాలని ఎన్నికల కమీషన్ దగ్గర విన్నవించుకున్న, దీనిని బ్రహ్మానంద రెడ్డి సవాల్ చెయటం తొ "ఆవు దూడా" గుర్తు సంస్థా కాంగ్రెస్ కే ఎన్నికల సంఘం 23 జనవరి 1978 న ఇస్తునట్టు ఎన్నికల సంఘం అధికారి బూట సింగ్ తెలిపారు, 1969 లొ ఇందిరా స్థాపించిన కాంగ్రెస్ కే ఆవు దూడ గుర్తు ఉండిపొయింది. దీంతొ ఆవు దూడ , ఎన్నికల గుర్తు గా బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ కే వచ్చాయి..
ఆవు దూడా ఎన్నికల గుర్తు బ్రహ్మానంద రెడ్డి కి ఇస్తునట్టు ప్రకటినిచ ఎన్నిక సంఘం నిర్ణయం ని ఇందిరా సుప్రీం కొర్టు లొ సవాల్ చేశారు. ఈ గుర్తు మీద ఇందిరా అంత పట్టు బట్టటానికి కారణం ఆవు దూడ గుర్తు ని ఆ నాటి మారుమూల ప్రజలు కూడా ఇందిరా దే అని గుర్తించారు దానికి ప్రధాన కారణం , ఆవు ని ఇందిరా గా , దూడని సంజయి గా ప్రచారం చేశారు. 1978 జనవరి 31న ఎన్నికల కమీషన్ విషయం లొ జొక్యం చెసుకొము అని సుప్రీం కొర్టు తీర్పు ఇవ్వటాం తొ అధికారికంగా ఆవుదూడా గుర్తు బ్రహ్మానంద రెడ్డి ది అయ్యింది
దీంతొ తమ పార్టి ని కాంగ్రెస్ (ఐ) గా వ్యవహరించాలి అని నిర్నయం తీసుకున్నారు, రాన్నున్న ఎన్నికలలొ గుర్తు కొసం తీవ్ర ఆలొచన చెసిన ఇందిర వర్గం, హస్తం గుర్తు కేటాయించాలి అని ఎన్నికల కమీషన్ ని అభ్యర్ధించగా ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ ఐ ( ఇందిరా కాంగ్రెస్ కి ) హస్తం గుర్తు కేటాయిస్తు 1978 ఫిబ్రవరి 2వ తారికున ప్రకటించారు.
ఇలా కొత్తగా చీలిన ఇందిరా కాంగ్రెస్ కి హస్తం గుర్తు , 1969 లొ ఇందిరా చీలిక తొ వచ్చిన ఆవుదూడా గుర్తు బ్రహ్మానంద రెడ్డి కి వచ్చి , ఇందిరా గాంది పార్టి కాంగ్రెస్ ఐ గాను , బ్రహ్మానంద రెడ్డి పార్టి గుర్త 1969 నుండి ఉన్న భారత జాతియ కాంగ్రెస్ గాను 1978 ఫిబ్రవరీ లొ జరిగిన ఎన్నికలకి వెళ్లారు ఈ ఎన్నికలలొ డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారికి భారత జాతియ కాంగ్రెస్ నుండి టికెట్టు వస్తే చంద్రబాబు నాయుడి కి ఇందిరా కాంగ్రెస్ నుండి టికెట్టు వచ్చింది - ఈ ఎన్నికలలొ భారత జాతీయ కాంగ్రెస్ 30 స్థానలు గెలుచు కుంటే , ఇందిరా కాంగ్రెస్ 170 స్థానలు గెలుచుకుంది - ఈ ఒటమికి భాద్యత వహిస్తు ఫలితాలు వచ్చిన వెంటనే బ్రహ్మానంద రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామ చేశారు. ఆ తరువాత భారత జాతియ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ లొ వీలీనం అయ్యింది..
( ఇక్కడ రెడ్డి కాంగ్రెస్ అనేది కేవలం ఆంద్ర ప్రదేశ లొ పత్రికలు వేసిన కుల ముద్ర గా చుడొచ్చు అంతే కాని నిజానికి వ్యవహరికంగా రెడ్డి కాంగ్రెస్ అనే పార్టి ఎప్పుడు ఆంద్రప్రదేశ్ లొ లేదు.. వై.యస్ రాజశేకర రెడ్డి గారు, రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచారు అనేది ఒక అబద్దం. )
నొట్ : చరిత్ర లొ ఉన్న కాంగ్రెస్ (ఆర్) - కాంగ్రెస్ రెక్వజెషన్ - ఇందిరా గాంధి 1969 లొ భారత జాతియ కాంగ్రెస్ నుండి చీలి ఆవుదూడ గుర్తు తొ ఏర్పర్చుకున్న పార్టి...
కాంగ్రెస్ పార్టి (జొడెద్దులు - ఆవుదూడా - హస్తం) రెడ్డి కాంగ్రెస్ ఎక్కడిది ?
Reviewed by surya
on
4:13 PM
Rating:
No comments: