Comments

మధ్యాహ్న భోజన పథకం అధ్వానం - డోక్కా సీతమ్మకే అవమానం!



ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండే మధ్యాహ్న భోజన పథకం అమలు రోజురోజుకి అద్వానంగా తయ్యారైంది. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖమంత్రి లోకేష్ పధకం బ్రహ్మాండంగా అమలౌతుందని చెప్పుకేనందుకు పిల్లలతో భోజనం చేసి ఆ నాటికి ఫోటోలు ప్రచారం చేసుకున్నా , రాష్ట్రంలో పెరిగిపోతున్న కలుషుత ఆహార ఘటనలు సామాన్యులని సైతం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి, గతంలో ఎన్నడు లేని విధంగా  జాతీయ మానవహక్కుల కమీషన్ రాష్ట్ర అధికారులకి నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. పరిస్థితి ఎంత దారుణంగా అయ్యారైంది అంటే ఏకంగా రాష్ట్ర హోం మంత్రి బీసీ బాలికల వసతి గృహానికి వెళ్ళి అక్కడ భోజనం చేసే సమయంలో ఆమే ప్లేట్ లోనే బోద్దింక రావడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని అద్దం పడుతుంది. ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన డోక్కా సీతమ్మగారి పేరు ఈ పధకానికి పెట్టి ప్రచారం చేసుకోవడం తప్ప కూటమి పాలకులు పిల్లలకి నాన్యమైన భోజనం అందించండంలో పూర్తిగా విఫలమయ్యారనే మాట వినిపిస్తుంది.

కూటమి పాలనలో జరిగిన ఘటనలు వివరాలు:- 

2024 జూన్ 26:- అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులం పాఠశాలలో ఫుడ్ పాయిజన్. దాదాపు 60 మంది విద్యార్ధినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.


2024 జూన్ 26:- వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని హాస్టల్లో విద్యార్థులకు ఇడ్లీ, సాంబారు అల్పాహారంగా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ అల్పాహారం తిన్నారు. ఎనిమిది మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులై అస్వస్థతకు గురవడంతో వారిని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు 

2024 జులై 12:- విశాఖ చోడవరం, బుచ్చియ్యపేట మండలం వడ్డాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న ఆరుగురు విద్యార్ధులని ఫుడ్ పాయిజన్. వారిని ఇలా బయట అరుగుల మీద పడేసి వైద్యం అందించారు.

2024 జులై 15:- నాయుడుపేట డా:బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 121 మందికి అస్వస్థత .


2024 ఆగస్ట్ 27:- కాకినాడ జిల్లా ఏలేశ్వరం అంబెద్కర్ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.  75 మంది విధ్యార్దునులకి అస్వస్థత.


2024 ఆగస్ట్ 27:- కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు హై స్కూల్ లో విధ్యార్ధునులకి భోజనంలో కుళ్ళిన గుడ్లు సరఫరా


2024 ఆగస్ట్ 29:- నెల గడవక ముందే ఒకే పాఠశాలలో రెండు సార్లు ఫుడ్ పాయిజన్ .. నాయుడుపేట డా:బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 11 మందికి అస్వస్థత


2024 ఆగస్ట్ 29:- నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్.. వెయ్యిమంది విద్యార్థులకు పైగా అస్వస్థత.


2024 ఆగస్ట్ 29:- కె.గంగవరం మండలంలోని బట్లపలిక ప్రాథమిక పాఠశాల్లో మధ్యాహ్న భోజనం బాగాలేదని నిరసన తెలిపిన విద్యార్థులు శుక్రవారం పాఠశాల నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం భోజనం బాగాలేదని చెప్పిన సమస్య పరిష్కారం కాలేదని వారంతా భోజన సమయంలో స్కూల్ నుంచి బయటికి వచ్చేశారు.

2024 ఆగస్ట్ 30:- అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలోని వసతి గృహంలో ఫుడ్ పాయిజన్, 50 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 43 మంది అరకులోయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 


2024 సెప్టెంబర్ 25:- విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎస్సి కళాశాల బాలికల వసతి గృహంలో  మొత్తం 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని స్థానిక సిహెచ్సికి తరలించారు.

2024 నవంబర్ 15:- తిరుపతి నగరం బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహారం తిని 32 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 32 మంది విద్యార్థినుల్లో కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. 17 మందిని రుయా ఆస్పత్రికి తరలించారు. 15 మందికి వసతి గృహంలోనే చికిత్స అందించారు.  


2024 డిసెంబర్ 8:- అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు. ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలతో విధ్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్లో గోమండి పీహెచ్సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.  

2024 డిసెంబర్ 12:- ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో 39 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం దుంప కుర్మా వారికి వడ్డించారు. భోజనం తిన్న అర గంట తర్వాత వారు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు. 9 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెనూలో దుంపకుర్మా కూరలో రాగి పిండి కలిపి భోజనం పెట్టారని, విద్యార్థుల్లో అరుగుదల లేకపోవడం వలన కడుపు నొప్పి వచ్చిందని చాట్రాయి పీహెచ్సీ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 


2024 డిసెంబర్ 17:- శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అన్నం, సాంబార్, సొరకాయ కూర, అరటిపండు వడ్డించారు. తిన్న కొద్దిసేపటి తర్వాత విధ్యర్ధునులు వాంతులు చేసుకున్నారు. పాఠశాల సిబ్బంది వారిని హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

2025 జనవరి 4 :- తిరుపతి జిల్లా చంద్రగిరిలో చంద్రగిరి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మధ్యాహ్నం భోజనం తిన్న తరువాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సుమారు 26 మంది విద్యార్థినులు అస్వస్థతక గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి ఆటోల్లో తరలించారు. వైద్యులు పరీక్షించి వైద్య సేవలను అందించారు. తెలుగు దేశం ఎమ్మెల్యే పులవర్తి నాని వస్తున్నారని హడావిడిలో పిల్లలకి ఉడికని అన్నం పెడ్డం వలనే ఇలా జరిగిందని తెలిపారు.

2025 జనవరి 31:- ఏలూరు పెదపాడు మండలం వట్లూరులోని శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంలో (టీటీడీసీ) వృత్తివిద్య శిక్షణ పొందుతున్న యువతుల్లో ఆహారం వికటించి 11 మంది ఆస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని వట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తలరించి చికిత్స అందించారు. 

2025 ఫిబ్రవరి 19 :- శ్రీ సత్యసాయి జిల్లాలో కనగానపల్లి పరిధిలో కలుషిత ఆహారం తిని స్థానిక మోడల్ స్కూల్ లోని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటున్న పలువురు విద్యార్థినులు కడుపునొప్పి, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. ఆహారం, నీరు కలుషితం కావడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురై నట్లు వైద్యులు తెలిపారు.  

2025 ఫెబ్రవరీ :- 20 ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం చీమల పాడు పెద్దతండాలోని అంగన్వాడీలో ఆహారం తిన్న 12 మంది చిన్నారులకి వాంతులు, విరోచనాలు హుటాహుటిన ఆటోల్లో మైలవరం ఆసుపత్రికి తరలింపు.


2025 ఫిబ్రవరి 25 :- తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీలోని జగ్గిరాజుపేట మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉదయం అల్పాహారంగా ఇచ్చిన రాగిజావ తాగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలకు మొత్తం 26 మంది విద్యార్థులు హాజరవ్వగా, 14 మంది వాంతులతో అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్లోలో తరలించారు. రాగి పిండి కాల పరిమితి ముగిసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీసం రాగి పిండి ప్యాకెట్లు లేకపోవడం గమనార్హం.

2015 మార్చ్ 3:- పాడేరు జిల్లా పెదబయలు మండలం తురకలవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 35 మంది గిరిజన విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు.  క్యాబేజీ, కందిపప్పు కూరతో అన్నం తిన్న 6,7 తరగతుల విద్యార్థినులు కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో పాటు కొందరికి విరేచనాలు కూడా కావడంతో హెచ్ఎం గంగాభవానీ, సిబ్బంది పెదబయలు పీహెచ్సీకి సమాచారం అందించారు. గోమంగి, పెదబయలు పీహెచ్సీల వైద్యులు నిఖిల్, చైతన్య పాఠశాలకు చేరుకుని విద్యార్థినులకు వైద్యం అందించారు.


2015 మార్చ్ 27:-  శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని జి.ఆర్ పురం కెజిబివిలో 198 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాత్రి భోజనం అనంతరం ఇద్దరు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. మర్నాడు ఉదయం వారికి పెరుగన్నం పెట్టి... మిగతా విద్యార్థినులకు మెనూలో భాగంగా ఉప్మా పెట్టారు. మధ్యాహ్నం విద్యార్థినులందరూ భోజనం చేశారు. కొద్దిసమయం తర్వాత 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే 108లో వారిని హరిపురం సిహెచ్సికి తరలించారు. 


2025 జూన్ 24 :- శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 13 మంది విద్యార్థులకు కడుపు నొప్పి. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు.


2025 జూన్ 30 :- అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల హాస్టల్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. విద్యార్థులతో పాటు తనూ కూర్చొని భోజనం పెట్టమన్నారు. ఇక అంతే.. ఆమె తినే భోజనం ప్లేటులో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో అనిత ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. 


2025 జులై 3 :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్ధినులు, ఉప్మాలో జెర్రి కనిపించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్ధినులు. టిఫిన్ తిని అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  


2025 జులై 4 :-  శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలిక‌ల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజన్ క‌ల‌క‌లం కలుషిత ఆహారం తిని 30 మందికి అస్వస్థత.. విద్యార్థులకు వాంతులు, విరేచనాలు గుట్టుచ‌ప్పుడు కాకుండా వసతి గృహంలోనే వైద్య చికిత్స.



  




మధ్యాహ్న భోజన పథకం అధ్వానం - డోక్కా సీతమ్మకే అవమానం! మధ్యాహ్న భోజన పథకం అధ్వానం - డోక్కా సీతమ్మకే అవమానం! Reviewed by surya on 7:18 AM Rating: 5

No comments:

Powered by Blogger.