Comments

కూటమి ప్రభుత్వంలో ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ?


 

శాంతిభద్రతలను గాలికి వదిలేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం..  రాష్ట్రంలో వరుసగా వయస్సుతో నిమిత్తంలేడా మహిళలపై దాడులు - కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కరువైపోయింది. వరసగా జరిగిన ఘటనలు చూస్తే

2024 జూన్ 10:- అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో 13ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పరమట రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచారయత్నం.



2024 జూన్ 11:- పాడేరు మోదకొండమ్మ జాతరలో ఆరేళ్ల పాపపై దుండగులు అత్యాచారం చేశారు. జాతరకు ఓ కుటుంబం రాగా.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యారు. పాప ఏడుస్తూ విషయం పెద్దవాళ్లకి చెప్పడంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు.  

                                      

2024 జూన్ 21:- బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం ఆపై హత్య 

                                     

                                             

2024 జూన్ 26 :- పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఓప్పిచర్ల గ్రామంలో ఓంటరి మహిళ గండికోట విజయలక్ష్మీ పై అత్యాచారం ఆపై హత్య     

                                          

2024 జూన్ 27 :- విజయవాడలో ప్రేమోన్మాది టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ దర్శిని అనే యువతిని ప్రేమపేరుతో వేదించడమే కాకుండా అడ్డు చెప్పిన యువతి తండ్రీని హత్య చేశాడు. 

                         

2024 జూన్ 28 :- విజయవాడ మదరసాలో కరిష్మాని చంపేసారని వారి తల్లి మోత్తుకున్నా స్పందనలేదు.

                                          


2024 జూన్ 30:- బాపట్ల పెరవలి గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై నిజాంపట్నం మండలం గరువపాలెం దగ్గర అత్యాచారం. 

                                  

2024 జులై 1 :- విశాఖపట్నం జిల్లా మధురవాడ పరిధి మల్లయ్యపాలెంలో పోలిపల్లి తరుణ్‌ (19) అనే యువకుడు, ఆదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఇచ్చి తాము ఉంటున్న మేడపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

                                                

2024 జులై 3 :- అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోగా, ఆమె పట్ల ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన  ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. 

2024 జులై 6 :- అనకాపల్లి రాంబిల్లి లో మైనర్ బాలికని ప్రేమపేరుతో వేదింది హత్య చేసిన ఉన్మాది.


2024 జులై 7 :- మచ్చుమర్రిలో 8ఏళ్ళ చిన్నపాపపై అత్యాచారం ఆపై హత్య . మృతదేహం కూడా దోరకలేదు. 

 

2024 జులై 7 :- ఏర్పేడు మూలకండ్రికలో 6ఏళ్ల బాలికపై అత్యాచారం .

                       


2024 జులై 14 :- విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో  ఆరునెలల చిన్నారిపై అత్యాచారం.

                       

2024 జులై 15 :- పత్తిపాడులో 15ఏళ్ళ దళిత బాలికపై అత్యాచారం.

2024 జులై 15 :- అనంతపురం - శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు

                              

2024 జులై 16 :- గుంటూరు కొత్తరెడ్డిపాలానికి చెదందిన 8వ తరగతి విధ్యార్ధినిపై అత్యాచారం ఆపై హత్య  

                                       


2024 జులై 16 :- ఫిరంగిపురంలో నిలాంబరం అనే యువకుడి వేదిపులు తట్టుకోలేక పురుగులుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాలిక

2024 జులై 16 :- టి. నర్సాపురంలో 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం.

                                       
2024 జులై 17:-  దోరవారిసత్రంలో 8ఏళ్ళ బాలికపై అత్యాచారం ఆపై హత్య

                                

2024 జులై 17:- విశాఖలో డిగ్రీ చదువుతున్న శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సిద్దు.

                          

2024 జులై 17:- అడ్డతీగల జూనియర్ కళాశాలలో విధ్యార్ధినిపై అధ్యాపకుడి లైంగిక వేదింపులు. వాష్ రూం కి వెళుతున్న సమయంలో చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడు.

                                     
2024 జులై 17:- నెల్లూరు జిల్లా ముదివర్తికి చెందిన పట్టుపు రోహిత్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు మాయ మాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఇంట్లో చెప్పడంతో బాలిక తండ్రి బుధవారం విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

2024 జులై 17:- నెల్లూరు జిల్లా కావలి పట్టణం తుఫాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న 53 ఏళ్ల మహబూబ్ బాషా అదే ప్రాంతంలో నాలుగో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా, ఆరోగ్యం బాగా లేకపోవడంతో బాలిక ఇంట్లోనే ఉండిపోయింది. ఇంట్లో ఉన్న సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉండగా మహబూబ్ బాషా ఇంట్లోకి వెళ్ళి బాలిక వద్ద ఉన్న సెల్ఫోన్లోనే బాలిక నగ్న చిత్రాలను తీసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

2024 జులై 18:- శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరానికి చెందిన ఓ మహిళ కాలునొప్పితో విజయనగరంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. ఎంఆర్ ఐ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో గుమ్చి వద్ద ఉన్న ఓ ప్రైవేటు మెడికల్ ల్యాబ్ కు వెళ్ళగా.. అక్కడ బోయ్ గా పనిచేస్తున్న పతివాడ రాంబాబు మహిళపై లైంగికి దాడికి యత్నించాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

2024 జులై 18:- గూడూరులో కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థిని అవమాన భారంతో ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటిన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

                                              

2024 జులై 18:- గుడివాడలో ఇంజినీరింగ్ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వేదిచిన వేమూరి జాన్ హెన్రీ ,ఏడాది క్రిందట యువతి తల్లి తండ్రుల ఫిర్యాదు. అది మనసులో పెట్టుకుని తోలి ఏకాదసి పూజలో ఉన్న యువతి కుటుంభంపై దాడి. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్ళగా స్టేషన్ లో సామాగ్రిపై కూడా దాడిచేసిన జాన్ హెన్రీ. జాన్ స్థానిక తెలుగుదేశం నాయకురాలి కుమారుడు అవ్వడం గమనార్హం.

                            

2024 జులై 20:- చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఓ గ్రామంలో పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ రెడ్డిహుస్సేన్ (28) సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి కూలీ పనికి, తండ్రి అడవికి కట్టెల కోసం వెళ్లగా ఈ దారుణానికి పాల్పడ్డాడు తాపీమేస్త్రీ రెడ్డిహుస్సేన్

2024 జులై 20 :- అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన యువకుడు నెల్లి వెంకటరమణ సిరిపల్లిలోని బంధువుల ఇంటికి గతంలో వచ్చాడు. ఆ సందర్భంలో 15 ఏళ్ల బాలికను విలసలోని ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆ బాలికను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు

2024 జులై 26 :- కుక్కునూరు మండ‌లంలోని రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఏడేళ్ల బాలికపై మ‌డ‌కం వెంక‌టేష్ అనే యువకుడు వ‌ర్షాల‌తో పొంగిపొర్లుతున్న‌ గోదావ‌రి న‌ది వ‌ర‌ద‌ను చూపిస్తాన‌ని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు

2024 జులై 26 :- కృష్ణా జిల్లా పెడన బంటుమిల్లి గ్రామంలో మతిస్థిమితం లేని  మహిళపై అత్యాచారం చేసిన కోనాల వెంకటేశ్వరరావును.

2024 జులై 28 :- పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన మౌలాలి చిలకలూరిపేటలో తన కుమారుడు వద్ద ఉంటూ గణపురంలోని చికెన్ సెంటర్ పనిచేస్తున్నాడు. స్కూల్ ముగిసన అనంతరం అటుగా ఇంటికి వెళ్తున్న బాలికకు డబ్బులు ఆశ చూపి షాపులోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడంతో ఇది తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిలదీశారు. వారి నుండి తప్పించుకున్న మౌలాలీ పరారవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


2024 ఆగస్టు 1 :- విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో గుర్ల మండలానికి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి సమీపంలోని కొండ వెలగాడ రియల్ ఎస్టేట్లో మాట్లాడుతుండగా బొండపల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్న చంద్రంపేటకు చెందిన సురేష్ అటుగా వెళ్తూ వీరిని చూశాడు. తాను ఎస్ఐను అని చెప్పి యువతిని బెదిరించి బలవంతంగా తీసుకుని వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు

2024 ఆగస్టు 1 :- తిరుపతి, ఒజిలి మండలం పున్నేపల్లి దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న గిరిజన బాలికపై 50 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

2024 ఆగస్టు 1 :- విశాఖ నగరంలో వెంకోజిపాలెం, రామాలయం వీధి ప్రాంతానికి చెందిన 19ఏళ్ల బొట్టా రమ్యను అప్పుఘర్ ప్రాంతానికి చెందిన బంగారు రాజు అనే వ్యక్తి నిత్యం వేదిస్తూ చివరికి అమే సీతమ్మధారలో పనిచేసే దుకాణానికి వెళ్లి ఆమెను షాపులోంచి బయటకు లాగి బట్టలు చింపేసి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు అక్కడితో ఆగకుండా ఆమె ఇంటికి వెళ్లి ఆమె తల్లిపై ఇటుకలతో దాడి చేసి భయబ్రాంతులకి గురిచేశాడు.
 
2024 ఆగస్టు 2 :- అనంతపురం నగరంలోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ లో నాలుగవ తరగతి చదువుతున్న బాలిక పై ప్రిన్సిపల్‌ ఆంజనేయులు గౌడ్‌ అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

2024 ఆగస్టు 3 :- మార్కాపురంలో తన కూతురి వెంట పడవద్దు అని మందలించినందుకు , నలుగురు యువకులతో వచ్చి ఇంటర్ చదువుతున్న బాలిక తండ్రి నాలి సత్యనారాయణను కత్తులతో పొడిచి పరారైన యువకులు.

2024 ఆగస్టు 4 :-  గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్రాంతి అనే ప్రేమోన్మాది తన ప్రేమను నిరాకరించిందని స్థానికంగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతిపై బ్లేడ్ తో గొంతు కోసి హత్యాప్రయత్నం చేశాడు.
 
2024 ఆగస్టు 5 :-  నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో ఐదేళ్ళ చిన్నారిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు, సమీపంలోని పామాయిల్‌ తోటలో అత్యాచారం చేసి పాపను అక్కడే వదిలేసి పారిపోయారు.

2024 ఆగస్టు 6:-  కృష్ణా జిల్లా పామర్రు మండలం, నిమ్మకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దాసరి వెంకట రాజేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని మానసిక ఆందోళనకు గురై తీవ్ర మనస్థాపం చెంది విషయాన్ని తల్లికి చెప్పడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది.

2024 ఆగస్టు 6:- నెల్లూరు జిల్లా విడవలూరు, ముదివర్తి గ్రామం గాంధీనగర్ సంఘం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న మానసిక దివ్యాంగురాలైన బాలికపై అదే గ్రామానికి చెందిన ఎలేటి శీనయ్య మద్యం మత్తులో లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.  

2024 ఆగస్టు 8:- నాదెండ్ల మండలం, గణపవరం గ్రామం, పీర్లచావిడికి చెందిన షేక్‌ మస్తాన్‌బి పై గుర్తు తెలియని వ్యక్తులు  లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశారు.

2024 ఆగస్టు 11:- అల్లూరి సీతారామ రాజు మన్యం జిల్లా రంపచోడవరం మండలం పెద్దగిద్దాడ రెడ్డిపేటకు చెందిన 25 ఏళ్ల గిరిజన యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మాట్లాడుకోవాలని పిలిచి అక్బర్ భాషా అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. విజయవాడ పట మటలోని పూజిత అపార్ట్మెంట్లో నివాసం దూదేకుల అక్బర్ బాషా, స్నేహితుడు శేషం జయ సాయి, కేశవరావుతో కలిసి హోటల్ కు తీసుకెళ్ళి. కేశవరావును బయటపెట్టి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.   

2024 ఆగస్టు 18 :- ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన ఈ భార్యాభర్తలు జీవనోపాధి కోసం ఏలూరు నగరానికి వచ్చారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళ్ళేవారు.  

2024 ఆగస్టు 19 :- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం నూతిపాడు గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలేజీ ముగించుకొని ఇంటికి వెళుతున్న విద్యార్థినిని మరో ఇద్దరు స్నేహితుల సాయంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.

2024 ఆగస్టు 19 :- పుంగనూరు పులిచెర్ల మండలంలోని ముప్పిరెడ్డిగారిపల్లెలో తొమ్మిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన రెడ్డి హుస్సేన్ అనే యువకుడు మాయమాటలు చెప్పి  లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడుతుండగా భయంతో కేకలు వేసింది. దగ్గరలోనే ఉన్న బాలిక తల్లి వచ్చి కేకలు వేయడంతో హుస్సేన్ పారిపోయాడు.  

2024 ఆగస్టు 21 :- అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలోని దళిత కాలనీకి చెందిన మూడేళ్ల చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఆ సమీపంలోనే నివసిస్తున్న కోట పాములు అనే వ్యక్తి (65) ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

2024 ఆగస్టు 21 :- విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవాడ వన్డేన్ శ్రీచైతన్య స్కూల్ లో 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు గణితం సబ్జెక్ట్ చెప్పే పోతిన హేమంత్ (36) కొంత కాలంగా 8వ తరగతి విద్యార్థినీని బ్యాడ్ టచ్ చేస్తున్నాడు. విధ్యార్ధిని విషయం తల్లితండ్రులకి చెప్పడంతో వారు హేమంత్ కి దేహశుద్ది చేసి పోలీసులకి అప్పచెప్పారు. 


2024 ఆగస్టు 23 :- తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్థిని ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు మాయమాటలు చెప్పి క్లాస్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

2024 ఆగస్టు 23 :- శ్రీకాళహస్తి బహదూర్‌ పేటకు చెందిన మైనర్‌ బాలిక చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. నలుగురు యువకులు బాలికకు మాయమాటలు చొప్పి లోబరుచుకుని అత్యాచార చేశారు..

2024 ఆగస్టు 25 :- విజయవాడ కంకిపాడు మండలం ఈడుపుగల్లు ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాద్యాయుడు మండవ వెంకట శ్రీనివాస్. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై తల్లితండ్రులకు ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థులు.   

2024 ఆగస్టు 26 :- వైద్య రంగంలో స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ టెక్నీషియన్‌గా చేస్తున్న తెనాలికి చెందిన ఓ యువతి ఫొటోలను ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్‌ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ మార్ఫింగ్‌ చేశారు. వాటిని కొరియర్‌ ద్వారా ఆమెకు పంపి బెదిరిఇంపులకి దిగారు.

2024 ఆగస్టు 28 :- నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన మతిస్థిమితంలేని 16 ఏళ్ల బాలికను అదే పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడీయొలు తీసి స్నేహితులకి షేర్ చేయడంతో విషయం భయటికి వచ్చింది.

2024 ఆగస్టు 30 :- గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో భద్రతకు తూట్లు. ఆడపిల్లల వాష్ రూం లో హిడెన్ కెమారాలు పెట్టి సుమారు 300 మంది పైగా ఆడపిల్లల విడీయొలు సేకరించిన అదే కాలేజీలో చదువుతున్న పవన్ కళ్యాణ్ అభిమాని  విజయ్ అనే ఉన్మాది.

3 సెప్టెంబర్ 2024 :- అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణంలో ఆరేసిన బట్టలు తీసుకు రావడానికి వెళ్లిన ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్య మాయమాటలు చెప్పి లైగింక దాడికి పాల్పడ్డాడు.  

5 సెప్టెంబర్ 2024 :- టిడిపి మహిళా నాయకురాలిపై లైంగికదాడి చేసి అత్యాచారం చేసిన టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  

9 సెప్టెంబర్ 2024 :- కదిరి , కొత్తమిద్దె గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు వచ్చిన 17ఏళ్ళ వికలాంగురాలిపై జనార్ధన్‌ అనే యువకుడు బలవంతంగా పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు గమనించడంతో పారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు

15 సెప్టెంబర్ 2024 :- మంగళగిరి నగర పరిధిలోని రత్నాలచెరువుకు చెందిన 7వ తరగతి చదువుతున్న మైనర్పై అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల గుంటూరు వెంకటేశ్వరరావు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు

15 సెప్టెంబర్ 2024 :- మంగళగిరి నగర పరిధిలోని బాలాజీనగర్ లో ఏదేళ్ళ బాలికపై అదే ప్రాంతానికి చెందిన వడ్రంగి పని చేసుకునే 60 ఏళ్ల చింతక్రింది వెంకటేశ్వరరావు అత్యాచారానికి యత్నించాడు

15 సెప్టెంబర్ 2024 :- విశాఖ శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన జోగి పాపారావు వరసకు బావమరిది అయిన వ్యక్తి  భార్యపై ఇంట్లో ఎవరు లేని సమయంలో జ్వరం మందు అని మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కోలుకున్న బాధితురాలు జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించి తల్లిదండ్రుల సాయంతో  మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసారు.

16 సెప్టెంబర్ 2024 :- తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సుభద్రపాలెం గ్రామానికి చెందిన ఉన్నమట్ల వెంకట నాగేశ్వరరావు అనే లారీ డ్రైవర్‌ మద్యం తాగి వచ్చి తన ఇంటి సమీపంలో ఉండే ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లి పక్కనే నిద్రిస్తున్న ఆరేళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడాడు.  

18 సెప్టెంబర్ 2024 :- ఏలూరు ఎర్రగుంటపల్లి ప్రభుత్వ బి.సి., బాలుర వసతి గృహంలో గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి. శశికుమార్ ఏలూరు అమీనాపేటలోని శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమ బాలికల వసతి గృహంలోని బాలికలను అక్కడే పనుచేస్తున్న తన భార్య పేరు చెప్పి వెళ్ళి లైంగికంగా వేదించాడు .. దీంతో బాలికలు తనపై ఫిర్యాదు చేశారు.

22 సెప్టెంబర్ 2024 :- తిరుపతి జీవకోనలో 12 సంవత్సరాల బాలిక పై 20 సంవత్సరాల యువకుడు ఇంటిలో ఎవరు లేని సమయంలో  లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో జరిగిన విషయం తన తల్లికి తెలియజేసి బోరను విలపించింది. దీంతో బాలిక తల్లి ఆదివారం పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.



27 సెప్టెంబర్ 2024:- అనంతపురం జిల్లా , పుట్లూరు మండలం,శనగలగూడూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక పై వీఆర్‌ఏ తిరుపాలు అనే వ్యక్తి అత్యాచారయత్నం.


27 సెప్టెంబర్ 2024:- సొంత చిన్నాన్న కుమార్తెనే ఓ కామాంధుడు చెరబట్టాడు. అనంతపురం జిల్ల ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక బాగోగులను ఆమె పెదనాన్న కుమారుడు రామాంజనేయులు చూసుకుంటున్నాడు. వినాయకచవితి సందర్భంగా బాలిక ఇంటికి వచ్చిన సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 


29 సెప్టెంబర్ 2024:- అప్పు తీర్చమన్నందుకు, కోపంతో వాళ్ళ ఆరేళ్ల బాలిక అస్పియాను హత్య చేశారు. అయితే ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్ పుంగనూరు వస్తానని ప్రకటించడంతో అధికార పార్టీ వెంటనే మంత్రులని పంపి బాలిక కుటుంభ సభ్యులని కలుసుకుని వివరాలు సేకరించి నిందితులని అరెస్ట్ చేసినట్టు ప్రకటించుకున్నారు. 




4 అక్టోబర్ 2024:- గుంటూరు బుచ్చయ్యతోట ప్రాంతంలో బిఫార్మసి విద్యార్థినిపై పోలీసును అని బెదిరించి అత్యాచారం చేసిన గుంటూరుకు చెందిన పోతినేని గోపి అనే యువకుడు.  



7 అక్టోబర్ 2024:- పిఠాపురంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకుని వెళ్ళి ఆత్యాచారం చేసిన టీడీపీ లీడర్ దుర్గాడ జాన్.


7 అక్టోబర్ 2024:- మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై 69 ఏళ్ళ చిన్నారావు అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారావు అఘాయిత్యం చేశాడని బాలిక తన కుటుంబ సభ్యులతో చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు బత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

8 అక్టోబర్ 2024:- గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర అదే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో వీడియో కాల్‌లో జరిపిన అశ్లీల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


9 అక్టోబర్ 2024:- గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ ఈసీ మెంబర్‌, మీడియా ప్యానలిస్టు అయిన పాటిబండ్ల రామకృష్ణ. పూర్తి నగ్నంగా ఉండి వేరెవరికో వీడియో కాల్‌ చేస్తూ తన శరీరాన్ని చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో హోరెత్తింది. 

9 అక్టోబర్ 2024:- భీమిలి ప్రాంతం సంగివలస దగ్గరలోని ఇడదాసరిపేటలో ఒక పౌల్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మతి స్థిమితం లేని యువతిని విజయనగరం దగ్గర గొట్లాంకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. 

10 అక్టోబర్ 2024:- ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ద్వార‌కా తిరుమ‌ల మండ‌లం మ‌ల్ల‌సానికుంట‌కు చెందిన యువ‌కుడు ఓ బాలిక‌పై అత్యాచారం చేశాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.    


11 అక్టోబర్ 2024:- సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో దసరా పండగ రోజునే దుండగుల ముఠా అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డారు. కత్తుతో బెదిరించిన నలుగురు వ్యక్తులు తండ్రికుమారుడిపై దాడి చేసి వారి భార్యలపై అత్యాచారానికి పాల్పడ్డారు.




14 అక్టోబర్ 2024:- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన  యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ పై పోలీసులకి అప్పచెప్పారు.



14 అక్టోబర్ 2024:- మహిళని లైగికంగా వేదిస్తూ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియొ సోషల్ మీడీయాలో వైరల్. 



17 అక్టోబర్ 2024:-  పార్వతీపురం మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు రాకేష్‌ మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడినట్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేసి విచారణకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా అక్కడి నుంచి పరారైన నిందిత యువకుడు బెలగాం రైల్వేస్టేషన్‌లో మృతదేహమై కనిపించాడు.  

17 అక్టోబర్ 2024:- ఆరేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖ మధురవాడలో జరిగింది, ఓ కాలనీలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన 10, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. చిన్నారి రాత్రి నిద్ర పోయేందుకు ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. విషయం చెప్పింది. దీంతో బుధవారం వారు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


17 అక్టోబర్ 2024:- అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్‌ బాషా పేద మహిళపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్‌ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్‌.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది. 



17 అక్టోబర్ 2024:- కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన రౌతు కస్తూరి పై నర్సరీ పక్కన పనిచేసే వ్యక్తి అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. 

18 అక్టోబర్ 2024:-  పలమనేరు మెప్మాలో పనిచేసే ఆర్‌పీ గాయత్రి అనే మహిళను తన భర్త తనతో లేడని తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్త మధుసూదన్‌ అలుసుగా తీసుకుని ఒంటరిగా ఉన్నప్పుడు బెదిరించడంతోపాటు దుర్భాషలాడుతు, వ్యంగంగా మాట్లాడుతున్నాడని లైగికంగా వేదిస్తున్నాడని చెబుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు గాయత్రి.  

18 అక్టోబర్ 2024:- కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్‌ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన సన్నీ అనే యువకుడు, తన ప్రేమని నిరాకరించిందని బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడు .



18 అక్టోబర్ 2024:-  బద్వేల్‌ పట్టణంలోని రామాంజనేయ నగర్‌కు చెందిన దస్తగిరమ్మ అనే ఇంటర్మీడియట్‌ విద్యార్ధిణిపై అదే ప్రాంతానికి చెందిన జక్కల విగేష్‌ ప్రేమించాలని వేధించాడు. ఇందుకు తిరస్కరించడంతో దస్తగిరమ్మ ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్ లో చికిత్స పోందుతూ మృతి చెందింది.

                       

19 అక్టోబర్ 2024:- గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే మహిళను కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్‌ నవీన్ బలవంతంగా కారులో తీసుకెళ్ళి. లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

                              

20 అక్టోబర్ 2024:-  పలాస కాశీబుగ్గకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు, ముగ్గురు మైనర్ బాలురు కలిసి బర్త్డే పార్టీ సందర్భంగా ఒక ఇంటికి వెళ్లి పార్టీలో భాగంగా మైనర్ బాలికలు, బాలురు కలిసి మద్యం సేవించగా , మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మైనర్ బాలికలు స్వయంగా అక్కా, చెల్లిళ్లుపై మరో ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం జరపగా, మరో మైనర్ బాలుడు అత్యాచారం జరుపుతున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి వికృత ఆనందం పొందాడు. 

22 అక్టోబర్ 2024:- కాకినాడ జనసేన నేతలు బండారు మురళి, నానిబాబు చేస్తున్న లైంగిక వేదింపులు తట్టుకోలేక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సునీత ఆత్మహత్యాయత్నం చేసింది.

27 అక్టోబర్ 2024:- నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో టీడీపీ నేత మల్లినేని పెంచలయ్య వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పెళై రెండేళ్ళు దాటిన తనకి పిల్లలు లేకపోవడంతో టీడీపీ నేత 'నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా' అంటూ అసభ్యకరంగా మాట్లాడటంతో గిరిజన మహిళ మనస్తాపానికి గురైంది. గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 


 27 అక్టోబర్ 2024:- ఆరేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన చెన్నేకొత్తపల్లి గ్రామంలో జరిగింది. బాలిక ఆడుకుంటుండగా వృద్ధుడు మాయ మాటలు చెప్పి తన ఇంటిలోకి తీసుకెళ్లాడు. ఓ గదిలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. పసిగట్టిన బాలిక ప్రతిఘటించే ప్రయత్నం చేయగా, చంపుతానని బెదిరించాడు. చివరికి ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఏడ్చుకుంటూ తల్లికి తెలిపింది. వెంటనే తల్లి వెళ్లి వృద్ధుడిని నిలదీయగా అతడు బుకాయించాడు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా కొందరు పెద్ద మనుషులు కేసు నమోదు కాకుండా రాజీ చేస్తున్నట్లు తెలిసింది.

28 అక్టోబర్ 2024:- చెందిన దంపతులు తన మూడేళ్ళ కుమార్తెతో పాటు గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి ఫంక్షన్‌కు వెళ్లారు. అందరూ ఆ ఫంక్షన్‌ హడావుడిలో ఉండగా, అదే గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఆ బాలికను సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

29 అక్టోబర్ 2024:- వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండల పరిధిలోని నెమళ్లదిన్నె గ్రామంలో మతిస్థిమితం లేని 17 సంవత్సరాల వయసు గల కన్న కూతురిపై మద్యం మత్తులో తండ్రి లైంగిక దాడికి ఒడిగట్టాడు.

29 అక్టోబర్ 2024:- తిరుపతికి చెందిన 9వ తరగతి చదువుతోన్న ఓ మైనర్ బాలికపై వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22) ఆన్లైన్ ద్వారా పరిచయం పెంచుకుని. తిరుపతికి వచ్చి ఓ ప్రైవేటు లాడ్జిలో బలవంతంగా అత్యాచారం చేశాడు. 

 

31 అక్టోబర్ 2024:- పెదకాకాని పోలీస్ స్టేసన్ పరిధిలో ఐదో తరగతి వరకు చదువుకున్న బాలిక(14) ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. ఆమె తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషిస్తోంది. స్థానికంగానే బాలిక బాబాయి శామ్యూల్ భార్య మృతి చెందింది. దీంతో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆమె కుమార్తెపై కన్నేశాడు. కొద్ది నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాలిక తీరుపై అనుమానం వచ్చిన బంధువులు, స్థానికులు ఆమెను ప్రశ్నించగా. తనపై బాబాయి చేసిన అకృత్యాన్ని వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

1 నవంబర్ 2024:- తిరుపతి వడమాలపేట మండలం ఏ.ఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన మూడన్నరేళ్ల చిన్నారిపై సుశాంత్ అనే యువకుడు చాకెట్లు ఇస్తానని ఆశచూపి చిన్నారిపై అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి పూడ్చి పెట్టాడు. 

2 నవంబర్ 2024:- కోనసీమ జిల్లా రాజోల్లో తల్లిదండ్రులను కోల్పోయిన బాలిక నానమ్మ సంరక్షణలో ఉంటోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అనారోగ్యానికి గురైన బాలిక నానమ్మ ఇటీవల వైద్యానికి వేరే గ్రామంలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికంగా ఉండే ములపర్తి వినయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె భయంతో కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

3 నవంబర్ 2024:- తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం- పెద్దమనుషులతో రాజీ చేయించిన నిందితుడి తండ్రి, 30 వేలు చెల్లించాలని తీర్పు, పరువుపోతుందని బయటకు చెప్పని బాలిక తల్లిదండ్రులు.

4 నవంబర్ 2024:- తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. పాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి వస్తుండగా. వెనుకవైపు నుంచి పల్సర్‌ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి చేశారు.

5 నవంబర్ 2024:- కృష్ణా జిల్లా కోడూరు శివారు నరసింహపురం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థిని తొడపై కొరికి అసభ్యంగా ప్రవర్తించాడు . తమ కుమార్తె పై అసభ్యంగా ఉపాధ్యాయుడు ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులు కోడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
 

5 నవంబర్ 2024:- నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలోని ఓ అపార్ట్మెంట్ లో మహ్మద్ అలీ అనే అతను అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న బాలికను రీల్స్ చేయమని ప్రోత్సహిస్తున్నట్లు దగ్గరై తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి, బంధువులు సోమవారం గట్టిగా నిలదీయగా అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.


8 నవంబర్ 2024:- ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో విద్యార్థిని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. బాలిక స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండడంతో తల్లికి అనుమానం వచ్చింది. బాలికను పరిశీలించి, స్థానికంగా వైద్యం చేయించారు. లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.  

12 నవంబర్ 2024: కర్నూలు జిల్లా, గూడూరు మండలం ఆర్. ఖానాపురం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన ఓ వివాహి తపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ గోపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. కాగా టీడీపీ నేత గోపాల్ గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. వారంతా నిందితుడు గోపాల్ కు భయపడి కేసులు పెట్టేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. గోపాల్ టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ మునిస్వామికి స్వయాన మేనల్లుడు.



16 నవంబర్ 2024: బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు సమీపంలోని అబ్బనగూడవల్లికి చెందిన బాలిక (17)ను దేవరపల్లి అభిషేయ్ ఆటోలో ఎక్కించుకుని కేఎస్కే కాలేజీ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు తీసుకువెళ్లి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. 


16 నవంబర్ 2024: నంద్యాల జిల్లా చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల లైంగిక దాడి.


16 నవంబర్ 2024: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులో పదో తరగతి బాలికకు మాయమాటలు చెప్పి యువకుడు పెంచలయ్య (23) అత్యాచారం.







ఇన్ని ఘటనలు జరగడం ఎప్పుడు లేదు ... ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ప్రజలకి అండగా లేకపోతే ఇక 5ఏళ్ళలో ఈ ప్రభుత్వంలో రాష్ట్రం వల్లకాడైపోయే ప్రమాధం ఉంది అంటున్నరు ప్రజలు


















కూటమి ప్రభుత్వంలో ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ? కూటమి ప్రభుత్వంలో ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ?  Reviewed by surya on 12:58 PM Rating: 5

No comments:

Powered by Blogger.