Comments

కూటమి పాలనలో ఏపిలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్!


కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని , అలా చేయలేని పక్షంలో మా మోహం చూపించమని లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకి హామీలు ఇచ్చారు... ఎన్నికల్లో గెలిచాక గతంలో కన్నా గంజాయి విచ్చలవిడిగా దోరుకుందనే భావన ఇప్పటికే జరుగుతున్న సంఘటనలు చూసి ప్రజలు అనుకుంటున్న మాట .. ఇప్పుడు ఈ గంజాయికి తోడు కూటమి పాలనలో మాదకద్రవ్యాల వినియొగం కూడా ఏపీలో విచ్చలవిడిగా సాగుతుందని నమోదవుతున్న కేసులు ద్వార తేలిపోతుంది.

2 సెప్టెంబర్ 2024:- పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో మాదక ద్రవ్యాలు(డ్రగ్స్‌) తయారీ యూనిట్‌ను సీజ్‌ చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ యూనిట్‌ ద్వారా ఆల్ప్రజోలం తయారు చేసి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.600 లీటర్ల కల్లులో ఒక గ్రాము ఆల్ప్రజోలం కలిపితే కిక్కు వచ్చే విదంగా డ్రగ్స్ తయారీ చేస్తున్న యువకులు.

7 అక్టోబర్ 2025:- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలోని ఓ గెస్ట్ హౌస్​లో యువకులు బర్త్ డే పార్టీ. సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా కారులో నాలుగు గ్రాముల కొకైన్ బయటపడింది. నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాలు కలిగి ఉన్న ఒక కారును సీజ్ చేశారు.

19 జనవరి 2025:- గుంటూరులో శ్యామలానగర్ వద్ద ముగ్గురు యువకుల నుంచి ఎనిమిదిన్నర గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్  చేసి అదుపులోకి తీసుకున్నారు.  

18 ఫిబ్రవరి 2025:- గుంటూరు సమీపంలోని గోరంట్ల వద్ద 10 గ్రాములు, చుట్టుగుంట వద్ద 3 గ్రాములు ఎండీఎంఏ మత్తు మందుతోపాటు ఒక కిలో గంజాయి కలిగి ఉన్న 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

22 మార్చ్ 2025:- కృష్ణాజిల్లా అవనిగడ్డలో భార్గవ్ మెడికల్ షాప్ లో  ఐసిస్ డ్రగ్స్ ను గుర్తించారు. ఐసిస్, బోకో హారం లాంటి ఉగ్రవాద సంస్థలు వాడే ఈ డ్రగ్ విజయవాడ పరిసరాల్లో మెడికల్‌ షాపుల్లో సులువుగా లభ్యమవడం కొసమెరుపు. మెడికల్ స్టోర్ యజమాని కొనకళ్ల రామ్మోహన్‌పై ఎండీపీ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

5 ఏప్రిల్ 2025:- గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు ఓ వ్యక్తి వద్ద నిషేధిత 7 గ్రాముల కొకైన్​ను, 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.    

3 జూన్ 2025:- బాపట్ల జిల్లా అద్దంకి నుంచి రూ. 2 కోట్ల విలువ చేసే సరుకును హైదరాబాద్ తరలిస్తుండగా డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈ వ్యవహారంలో ఓ యువతితో పాటు ఏపీ తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ , మరో ఆరుగురుని అరెస్ట్ చేశారు. 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదును సైబరాబాద్ శోట్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

5 జూన్ 2025:- విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర వాహనాల తనిఖీ సమయంలో ముగ్గురు వ్యక్తులు 2లక్షల విలువ చేసే 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు. 

6 జూన్ 2025:- తిరుపతి ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో మత్తు ఇంజక్షన్లను స్వయంగా తీసుకుంటున్న యువకుల వీడియొ సోషల్ మీడీయాలో వైరల్. 

21 జూన్ 2025:-  శ్రీకాళహస్తి: పట్టణంలో డ్రగ్స్‌ కలకం. ఏవీఆర్‌ పాఠశాల వెనుక ఐదుగురు యువకులు మద్యం సేవించి గొడవ పడుతుండడాన్ని గమనించిన స్థానికులు వారిని తరిమేయడానికి ప్రయత్నించారు. వారు పారిపోయారు. ఒక యువకుడు ద్విచక్ర వాహనాన్ని వదిలేవసి వెళ్లిపోవడంతో దాన్ని రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. తీరా అక్కడ పరిశీలించగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు తేలింది. డ్రగ్స్‌ బాటిళ్లు, సిరంజీలు, గంజాయి బీడీలు కనిపించడంతో అవాక్కయారు.

29 జూన్ 2025:-గుంటూరు నగరానికి చెందిన చల్లా గోపి, షేక్‌ షారూక్‌ 25 గ్రాముల డ్రగ్స్‌తో చిలకలూరిపేట మండల పరిధిలో ఓ రెస్టారెంట్‌ వద్దకు చేరుకుని అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో అర్బన్‌ ఎస్‌ఐ చెన్నకేశవులు ఇరువురిని తనిఖీ చేసి రూరల్‌ పోలీసులకు అప్పగించారు. రూరల్‌ సీఐ సుబ్బనాయుడు ఇరువురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

6 జూలై 2025:- విశాఖ నగరంలోని కూర్మన్నపాలేనికి చెందిన కమ్మెళ్ల శ్రీకృష్ణచైతన్య వర్మ (34) ఎంబీబీఎస్‌ పూర్తిచేసి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు సీతమ్మధారకు చెందిన అక్షయ్‌కుమార్‌తో పరిచయం ఉంది. దీంతో డ్రగ్స్‌ కావాలని కోరుతూ అందుకోసం 65వేలు చెల్లించాడు. విచారణలో అక్షయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు వైద్యుడు శ్రీకృష్ణచైతన్యకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు అయితే ఈ కేసులో కోంతమంది ప్రముఖులని అధికార పార్టీ తప్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. 

12 జూలై 2025 :- కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామానికి చెందిన గవర శ్రీరామ వెంకట మణికంఠ అమరావతి విట్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివాడు. విట్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన హైదరాబాద్‌కు చెందిన దేశబోయిన ఆకాష్‌ ఇద్దరూ బెంగళూరులో ఉన్న ఓ వ్యక్తిని ద్వార డ్రగ్‌ను తెచ్చి అంబాపురంలో శివకుమార్‌ కౌశిక్‌ అనే యువకుడికి డ్రగ్‌ను విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నుంచి 5 గ్రాముల మెథాంఫెటమిన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో గ్రాము 4 వేలకు కొని విజయవాడలో 9-12 వేలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 


 





 


కూటమి పాలనలో ఏపిలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్! కూటమి పాలనలో ఏపిలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్! Reviewed by surya on 11:44 AM Rating: 5

No comments:

Powered by Blogger.