1995 ఆగస్టులో ఎన్టీఆర్ గారిని వైస్రాయి హోటల్ ఉదంతం నడిపి పదవి నుండి దింపి (దినినే వెన్నుపొటు ఉదంతం అంటారు) 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజులవి, ఎన్టీఆర్ పార్టిని హస్తగతం చేసుకోవడంతో పాటు కోర్టులకి వెళ్ళి ఆయన పార్టీ ఫండ్ ని కూడా లాగెసుకోవటం, తరువాత శాశనసభ్యులకి పార్టి మారకుండా ఉండటానికి ఒక్కొ సభ్యునికి ఏడాదికి 25 లక్షలు ఆదాయం సమకూరేలా చెయటంతో ఏమి చెయలేక దిగులుతో ఎన్టీఆర్ గారు 1996 జనవరి 18న చనిపోయారు.
తాను చెసిన వెన్నుపోటు చర్య వలనే మానసింకంగా కృంగి ఎన్టీఆర్ గారు మరణించారన్న అపవాదును తప్పించుకునేందుకు హరికృష్ణ చేత ఎన్టీఆర్ మరణం అనుమానాస్పదం అని పత్రికలలో ప్రకటన ఇప్పించారు. ఎన్టీఆర్ చావు వెనకాల లక్ష్మీపార్వతి గారి పాత్ర ఉందేమొనని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చేలాగ పత్రికల్లో వ్యాసాలు వచ్చేలా చేశారు, ప్రజలకి పూర్తిగా లక్ష్మీపార్వతి గారి మీద అనుమానం వచ్చిందని నిర్దారించుకున్న తరువాత ఇక ప్రజల్లో దీని మీద ఎక్కువ చర్చ రావటం అనవసరం అనే భావనతో హరికృష్ణ హైద్రబాద్లో లేని సమయం చూసి ఎన్టీఆర్ మరణం మీద న్యాయ విచారణకు తన మంత్రి వర్గం చేత "నో" అనిపించారు.
ఇలా రాజకీయ లబ్ది కోసం హరికృష్ణని వాడుకున్న తరువాత హరికృష్ణని రాజకీయ తెర నుండి తప్పించే ప్రయత్నం ప్రారంభించారు, ఎన్టీఆర్ మరణం మీద న్యాయ విచారణ చేయించక పోవటం, యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ కు హరికృష్ణ రాజ్యసభ టిక్కెట్టు అడిగితే చంద్రబాబునో చెప్పటంతో పైగా తనని పక్కన పెడుతు జయకృష్ణని దగ్గర చెసుకునే ప్రయత్నం చంద్రబాబు చెయటంతో హరికృష్ణ రాజీనామ చెసే పరిస్థితి తెచ్చి సఫలీకృతం అయ్యారు చంద్రబాబు. తరువాత చంద్రబాబు హరిని పిలిచి యార్లగడ్డకి టిక్కెట్టు ఇచ్చారు కాని ఎన్టీఆర్ మరణం మీద న్యాయవిచారణకి మాత్రం కుదరదని తెగేసి చెప్పి హరిని చల్లబరిచారు చంద్రబాబు.
ఎన్టీఆర్ బ్రతికి ఉన్నప్పుడు అనిగిమనిగి ఉన్న చంద్రబాబు ఆయన మరణం తరువాత వైఖిరి పూర్తిగా మారిపోయింది ఎవ్వరిని లెక్క చెయలేదు, ఎవ్వరి మాట వినలేదు. ఎన్టీఆర్ బ్రతికి ఉన్నప్పుడు పి.వి నరసింహా రావుతో స్నేహంగా మెలిగిన చంద్రబాబు తరువాత నేరుగా ప్రధాని పీవీని విమర్శించటం మొదలుపెట్టారు దీని వెనకాల ఉన్న మర్మం బాబు జాతియ స్థాయిలో ఉన్న ప్రతిపక్షాలను ఆకర్షించి, నేషనల్ ఫ్రంట్ లో ఉన్న ఎన్టీఆర్ గారి చర్మన్ పదవి తాను దకించుకోవటానికేనని అందరు బహిరంగానే మాటాడుకున్నారు.
ఈ నేపధ్యంలోనే 1996 ఏప్రిల్ లో 11వ లొక్ సభ ఎన్నికలు రానే వచ్చాయి - ఈ ఎన్నికలు చంద్రబాబుకి అత్యంత కీలకమైన ఎన్నికలుగా మారాయి కాంగ్రెస్ మన్నుతిన్న పాములా పొడుకుని ఉంటే ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ను నువ్వు చంపావు అంటే నువ్వు చంపావు అని లక్ష్మీపార్వతి, చంద్రబాబు తిట్ల దండకం అందుకున్నారు, చంద్రబాబుకి మద్దతుగా హరికృష్ణ ఉంటే, లక్ష్మీపార్వతికి మద్దతు గా దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిలిచారు, లక్ష్మీపార్వతి ఎన్నికల వ్యుహలోపం, చంద్రబాబుకి అండగా ఈనాడు దినపత్రిక, ఈనాడు చాన్ల్ ఎప్పటి లాగే గోబెల్స్ ప్రచారంకి నడుం బిగించి చంద్రబాబుని ఆకాశానికెత్తి వ్యాసాలు రాసాయి, పచ్చి అబద్దలని పండు నిజాలుగా ప్రతి ఇంట హొరెత్తిపోయేలా చేశాయి, కోట్ల డబ్బు కుమ్మరించి , విసృంఖలంగా రిగ్గింగు చేసి, పొలీసుల చేత వీర విహారం చేయించి, కాంగ్రెస్ కి ఒటు వేస్తే 2 రూపాయల కిలో బియ్యంని 5 రూపాయలు చేస్తారని, ఆడ బిడ్డలకు 5వేలు డిపాజిట్ చేస్తాం అని అబద్దాలు అడి ఆఖరికి 18 సీట్లు గెలిచారు చంద్రబాబు.
ఈ విజయంలో ఆయన వంతు ఒకటి అయితే 3 వంతుల ఘనత ఈనాడు రామొజీరావుది. ఎన్టీఆర్ కు ద్రోహం చేసి అధికారాన్ని దురాక్రమించుకున్న ద్రోహిగా జన చీత్కారం బరించవలసిన చంద్రబాబు ని ఎన్టీఆర్ వారసుడిగా నిలబెట్టింది ఈనాడు రామొజీరావు మాత్రమే. ఈ ఎన్నికల్లో పత్రికలు ఆయనని రాజకీయ సమాధి కాకుండా కాపాడాయి. ఇక డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 534 స్థానాల్లో 268 మంది మద్దతు అవసరం. ఏవరికి అన్ని స్థానాలు రాలేదు అందరికన్న ఎక్కువగా బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. రాజ్యంగంలో స్పష్టంగా అతి పెద్ద పార్టిని పిలవాలని ఉంది కాబట్టి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు వాజ్ పాయి గారిని పిలిచి బల నిరూపణకి అవకాశం ఇచ్చారు. ప్రదానమంత్రిగా ప్రమాణ శ్వీకారం చెసిన వాజ్ పాయి గారు సభలో బలనిరూపణ చెసుకొవటంలో విఫలం చెంది 13 రోజులకే ప్రధాని పధవి నుండి దిగిపోయారు.
కాంగ్రెస్, కమ్యునిస్టుల మద్దతుతో జనతదల్ (యునైటెడ్ ఫ్రంట్) అనే పేరుతొ సమాజ్ వాది పార్టి, డియంకే, అస్సాం ఘన పరిషద్, తమిళ మనీలా కాంగ్రెస్, తెలుగుదేశం మద్దతుతో ప్రభుత్వం ఏర్పర్చటానికి నిచ్చయించుకుని జనతాదళ్ పార్టి విపి సింగ్, కమ్యునిష్టు పార్టి జ్యొతి బసు గారి మద్దతుతో కాంగ్రెస్ పార్టి అంగీకారంతో కర్నాటకాకి చెందిన దేవగౌడ 1996 జూన్ 1న ప్రధానమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేశారు (ముందు ప్రధానిగా విపి సింగ్, జ్యొతిబసు గారిని ఉండమంటే తిరస్కరించారు) ఈ యునైటెడ్ ఫ్రెంట్ 13 పార్టీల కలయక జనతాదళ్, సమాజ్ వాది పార్టి, డియంకే, తెలుగుదేశం, అస్సాం ఘన పరిషద్, తమిళ మనీలా కాంగ్రెస్, ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారి), నేష్నల్ కాంఫరెన్స్, మహారాష్ట్రవాది గొమాంతక్ పార్టి, 4 పార్టిల లెఫ్ట్ ఫ్రంట్ (ఈ సిద్దాంతాలు, భావాలు కలవని కలగాపులగం ఫ్రంట్ కి చంద్రబాబు కన్వీనర్ గా నియమితులైనారు).
దేవగౌడా గారు 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు ప్రధానిగా చేశాక ఈ ఫ్రంట్ కి కాంగ్రెస్ కి వచ్చిన అభిప్రాయ భేదాల వలన కాంగ్రెస్ దేవగౌడాకి మద్దతు ఉపసంహరించుకుని జనతాదల్ పార్టికి చెందిన ఐకే గుజరాల్ గారిని ప్రధానిని చేశారు. ఐకే గుజరాల్ 1997 ఏప్రిల్ 21 నుండి 1998 మార్చ్ 19 వరకు ప్రధానిగా చేశారు. అంతకు ముందే వైస్రాయి ఉదంతం నడిపి సొంత మామా ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి కుర్చి నుండి దింపి తాను ముఖ్యమంత్రి అయిన సంఘటనల దృష్ట్యానో లేక మరో ఆలోచనో తెలియదు కాని దేవగౌడా తనని ముఖ్యమంత్రి పదవి నుండి దింపటానికి కాంగ్రెస్ కేసరితో చంద్రబాబు మంత్రాంగం నడిపారని భావించి దేవగౌడా చంద్రబాబుకి నెరుగా ఫ్రంటుకి వెన్నుపొటు పొడిచావని ఒక ఘాటు లేఖ రాసారు, దానితోపాటుగా చంద్రబాబు గుట్టు మొత్తం నాదగ్గర ఉందని దానిని నేను త్వరలో సాక్షాలతో భయటపెడతానని పత్రికాముఖంగా చెప్పారు చివరికి ఏ ఒప్పందం జరిగిందో తెలియదు కాని దేవగౌడా నోరు విప్పలేదు. కాని ప్రజలు మాత్రం చంద్రబాబు బినామి పెరులతో బెంగుళూరులో కొన్న సుమారు 400 కోట్ల రియలెస్టేటు భూమి గురించే అయివుండోచ్చుని ప్రజలందరు అనుకున్నారు.
ఈ కలగాపులగంకి చంద్రబాబు కన్వీనర్ కాబట్టి వీళ్ళని నేనే ప్రధానిని చేశానని చెబుతుంటారు, కాని అందులో అందరి సహకారం మద్దతు లేకుండా సాద్యం కాదని అందరికి తెలిసిన విషయమే. తరువాత 12వ లోక్సభ ఎన్నికలు వచ్చాయి యునైటెడ్ ఫ్రెంట్ కన్వీనర్ గా బాబు పాలనలో పెరిగిన ధరలు, పాతి పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం హామి, మద్యపాన నిషేదంకి మంగళం పాడటంతో ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని తెలిసి విపరీతమైన రిగ్గింగు చేయించారు బాబు. అదికారుల సహాయంతో ఒక్కొక్క బూతులో 50వేల నుండి 60వేల రిగ్గింగు పాల్పడితే 15 సీట్లు వస్తాయని అంచనా వేశారు, అలాగే విపరీతమైన అధికార దుర్వినియొగంతో 12 సీట్లు గెలుచుకున్నారు చంద్రబాబు.
ఈ ఎన్నికల్లో కూడా ఎవరికి సాధ్యమైనంత మెజారిటి రాక బిజేపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చెసింది అప్పటిదాక యునైటెడ్ ఫ్రెంట్ కన్వినర్ గా ఉన్న బాబు రాత్రికి రాత్రే ఎవరికి చెపకుండా బిజేపి కూటమిలో చేరిపోయారు. తన 12 మంది చెత బిజేపికి ఒటు వేయించి బల పరచటమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు అందరు సంగ్మాని స్పీకర్ చెద్దాంమని నిర్ణయించుకుంటే బాబు మాత్రం బాలయొగిని స్పీకర్ చేయాలని బిజేపికి చెప్పారు. 1986లోనే గతంలో బీజేపీతో పోత్తు పెట్టుకుని తప్పు చేశాం అని చెప్పుకున్న చంద్రబాబు మళ్ళీ మతతత్వ బీజేపీకి చీకట్లో షేక్ హూఅండ్ ఇచ్చినందుకు రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న దళితులు మరో ఏడాదిన్నర కాలంలో జరగబోయే శాశనసభ ఎన్నికల్లో ఎక్కడ టీడీపీని చీ కొడతారో అనే ఆందోళనతోనే దళిత వ్యక్తైన బాలయొగి గారికి స్పీకర్ ఇప్పించారనేది బహిరంగ రహస్యం.
చంద్రబాబు తీసుకున్న ఈ సడన్ యూటర్న్ తో కామ్రెడ్లకి, ఫ్రెంట్ సభ్యులకి కలిపి వెన్నుపొటు పొడిచారు చంద్రబాబని అందరు మాట్లాడుకున్నారు, ఎన్నికల ముందు బిజేపిని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించి ఎన్నికలైన వెంటనే బిజేపిలో కలిసిపోయిన బాబు మార్క్ రాజకీయానికి దేశమే ఆశ్చర్యపోయింది. మామకే వెన్నుపొటు పొడిచారు ఫ్రంటు ఒక లెక్కా అని ప్రజల్లో గుసగుసలు వినిపించాయి. 12వ లోక్ సభ 1999 ఏప్రిల్ 17న ఏఐడియంకే పార్టి జయలలితతో అభిప్రాయ భేదాల వలన బిజేపి కూటమిలో నుండి తప్పుకోవడంతో వాజ్ పాయి బల నిరూపణలో విఫలమై ఒక్కఓటుతో ప్రభుత్వం పడిపోయింది - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి రాష్ట్రపతి పిలిచినా అతుకుల బొంతతో నపడపలేనని సొనియా గాంధీ ఒప్పుకోలేదు దీంతో 12వ లోక్ సభ రద్దైంది.
అదే సమయంలో కార్గిల్ యుద్దం జరగటం, వాజ్ పాయి ఒక్క ఒటుతో ప్రభుత్వం నుండి దిగిపోయారనే సానుభూతి వెరసి 1999 అక్టొబర్ లో జరిగిన 13వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ వాజ్ పాయి ప్రధాని అయ్యారు. ఇక్కడ చంద్రబాబుకి బిజేపితో మద్దతు ఉండటంతో ఆ సాను భూతి ఓట్లు లాభం చేకూర్చి తిరిగి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. 1998 ఎన్నికల్లో బిజేపికి ఆంద్రప్రదేశ్ లో 18% ఓట్లు వచ్చాయి, అది అర్ధం చెసుకుని బిజేపి వైపు వెళ్ళి చంద్రబాబు 1999 ఎన్నికల్లో లాభం అందుకున్నారు.
ఈ ఎన్నికలని కొంచం నిశిధంగా పరిసీలిస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చిన 180 సీట్లలో సుమారు 100 సీట్లు 6వేలు లోపు మెజారిటితో వచ్చినవే బిజేపి విడిగా పోటి చేసిఉంటే తెలుగుదేశం అడ్రస్ ఉండేది కాదు. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది. ఇలా బిజేపి సహకారంతో లాభం పొందిన బాబు అక్కడ నుండి 2003 దాక బిజేపితో తిరిగి 2004లో మళ్ళీ బిజేపికి రాంరాం చెప్పి, ఇక జన్మలో బిజేపితో కలవనని చెప్పి 2009లో కూటమి పాట పాడి 2014లో మళ్ళి బిజేపి మద్దతుతో అధికారంలోకి వచ్చారు.
2014లోనైనా సవ్యంగా ఉన్నారా అంటే 4 ఏళ్ళు బిజేపితో అంటకాగి ఒక్క అభివృద్ది పని చెయకపోగా ప్రత్యేకహొదా అంటే వేస్టు ప్రత్యేక ప్యాకేజి బెస్టు అని బీజేపీ ట్యున్స్ కి వంతపాడి చివరికి మళ్ళి బిజేపిని తిట్టి, 30 ఏళ్ళుగా వ్యతిరేకిస్తు నానా తిట్ట్లు తిట్టిన కాంగ్రెస్ తో కలిసిపోయారు. బిజేపికి తనకి వచ్చిన భేదాలని రాష్ట్రానికి దేశానికి చుట్టి నానా యాగి చేస్తు తానోక జాతియ స్థాయి లీడర్ అని ప్రొజెక్ట్ చేసుకోవటానికి తాపత్రేయ పడటం చూస్తే ఓ ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ అని అనిపిస్తుంది. ఓటుకు నోటు కేసులో ఆడియొ వీడియొల్లో దొరికిన వ్యక్తి జాతియ స్థాయి నేతగా తిగటం ప్రజాస్వామ్య వాదులకి మిగుడుపడని విషయం. మళ్ళీ 2024లో సైతం విభేదించిన బీజేపీనే కౌగిలించుకున్నారు.
కోసమెరుపు :-
బాబు మీద "ఉదయ కమలం" (ప్రజా కోర్టులో బిజేపి చార్జ్ షీట్) అని బిజేపి వెసిన పుస్తకం ఉండగానే బిజేపి తో పోత్తు .... బాబు మీద "బాబు జమనా అవినితి ఖజాన" అని కమ్యునిస్టులు వెసిన పుస్తకం ఉండగానే కమ్యునిస్టులతో పోత్తు..... బాబు మీద "దోపిడి బాబు" అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళూ వేసిన పుస్తకం ఉండగానే కాంగ్రెస్ తో పోత్తు.
ఇలాంటి ఫ్లిప్ ఫ్లాప్ రాజకీయాలు బాబుకే సాద్యం - కాని ఇలాంటి అవకాశ వాద రాజకీయాలు వ్యవస్తలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయొ ఆలోచించాల్సింది ప్రజలే ఎందుకంటే ఈ మహొనత్త మైన వ్యవస్థ నిర్మాణాం తేలికగా జరిగింది కాదు , ఎందరో జాతీయ నాయకుల రక్త మాంసాల భిక్ష.
-- ఇక తీర్పు ప్రజలదే ---

No comments: