ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మంది నేనే, పార్టి పెట్టమని సలహా ఇచ్చింది నేనే అంటున్న చంద్రబాబు - ఇందులో నిజం ఎంత ??
1982 మార్చ్ 21న రామకృష్ణా స్టుడియొలో విలేఖరల సమావేశం పెట్టి నాకు మే 28తో 59 సంవత్సరాలు నిండి 60లోకి వస్తాను, ఇక ప్రజా జీవితంలోకి వస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు.
ఆ రోజు జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ గారు ఇలా అన్నారు (పోయిన సంవత్సరం ఊటిలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో మీరు ఎంజీఆర్ లాగా రాజకీయాలలో ప్రవేసిస్తారా అని నన్ను అడిగారు, అప్పటి నుండి ఆ విషయం నా మనస్సులో మెదులుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా నాకు 900 పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. వారు టెలిగ్రాముల ద్వారా నామీద వత్తిడి అధికం చేసారని చెప్పారు) ఎక్కడా చంద్రబాబు చెప్పరని ఎన్టీఆర్ చెప్పలేదు. చంద్రబాబు గురించి పత్రికల వారు అడిగితే ఇలా అన్నారు (చంద్రబాబుని పార్టిలో చెరమని అడగలేదు తనకు తానుగా చెరితే స్వాగతిస్తానని అన్నారు)
22 మార్చ్ 1982న - వెంటనే చంద్రబాబు తాను పార్టి మారబోనని ప్రకటించటమే కాకుండా, ఎన్టీఆర్ ఈ రోజు రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు, నేను ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్నాను, నేను ఉన్న చోటనే ఉంటా అని ప్రకటించారు చంద్రబాబు (ఇక్కడ ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రవేశం తన సొంత అల్లుడునే మెప్పించలేక పోయిందని ప్రత్యర్ధి వర్గం నుండి కొంత అవహేళన ఎదుర్కొన్నారు)
ఎన్టీఆర్ ప్రకటన రాగానే కాంగ్రెస్ పార్టికి నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఆదయ్య, రత్తయ్య, నారాయణ వారి పార్టికీ రాజీనామ చేశారు - (బాబుగారు రాజీనామ చెయలేదు)
ఊటిలో సినిమా షూటింగ్ ముగించుకుని 1982 మార్చ్ 29న హైద్రాబాద్ వచ్చి నేరుగా నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటికి ఎన్టీఆర్ గారు వెళ్ళారు - (ఎన్టీఆర్ గారి వెంట బాబు గారు లేరు)
1982 మార్చ్ 29న న్యూ-ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టి పేరు తెలుగుదేశం అని ఎన్టీఆర్ చెప్పినప్పుడు (బాబు గారు అక్కడ లేరు)
మనకు తెలిసి ప్రజాజీవితంలోకి వచ్చే ముందు ఎన్టీఆర్ గారు ఇద్దరు ప్రముఖుల సలహా తీసుకున్నారు అందులో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు, రెండోవారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, - అక్కినేని గారు నాకు రాజకీయాల మీద ఆశక్తి లేదన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ ని వదిలి రానని అన్నారు.
రామకృష్ణా స్టుడియొస్ లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం లోగోని ఒక పేపర్ మీద గీసి చక్రం, నాగలి, గుడిసె అక్కడికి వచ్చిన ప్రముఖులకి చూపించి అభిప్రాయం అడిగారు, ఆ ప్రముఖులు బెజవాడ పాపిరెడ్డి గారు, తూర్లపాటి సత్యనారాయణ గారు, యలమంచలి శివాజి, నాదెండ్ల, రతయ్య, ఆదయ్య, నారాయణ, దగ్గుబాటి చెంచురామయ్య - (ఇక్కడ కూడా బాబు గారు లేరు)
9 ఏప్రిల్ 1982న పత్రికలకి తెలుగుదేశం జెండాని విడుదల చేసారు (ఆ రోజు బాబు గారు దగ్గర లేరు) 1982 ఏప్రిల్ 11న హైద్రాబాద్ నిజాం గ్రౌండ్స్ లో మొదటి తెలుగుదేశం బహిరంగ సభ జరిగింది (ఆ సభలో బాబు గారు కనిపించలేదు)
(దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారి మాట్లలో)
మొదటి సభ ముగిసాక మద్దతు కొరుతు పార్టిలోకి ఆహ్వానించటానికి కాంగ్రెస్ లో సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను, అప్పుడు చంద్రబాబు ఒక కాగితం తీసుకుని లెక్కవేసి ఎన్టీఆర్ జెబులో నుండి పైసా తియడు, ఎన్టీఆర్ కి 5% ఒట్లు మాత్రమే వస్తాయి, సినిమా మొజుకి ఓట్లు పడతాయా? నేను మంత్రి పదవి వదులుకుని ఎలా వస్తానని అన్నారు.
1982 మే 28న - ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తిరుపతిలో సభ ఏర్పాటు చేసి దానికి మహానాడని పేరు పెట్టారు (ఈ సభ లోను బాబు గారు లేరు) , 1982 నవంబర్ 18న అధిస్టానం ఆదేసించితే, మామా ఎన్టీఆర్ మీద పొటికి రెడి అని ప్రకటించారు చంద్రబాబు.
1983 జనవరి 5న పుట్టిన గడ్డ చంద్రగిరిలో మెడసాని వెంకటరామ నాయుడు అలియాస్ మీసాల నాయుడు చెతిలో 17,429 ఓట్ల తేడాతో ఘొరంగా పరాజయం చెందారు చంద్రబాబు.
1983 జనవరి 23 - తెలుగుదేశం పార్టి రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబుని ఓడించిన మీసాల నాయుడు లేచి కాంగ్రెస్ వారిని పార్టిలోకి చెర్చుకోకూడదని తీర్మానం పెట్టారు, దీనిని 99% సభ్యులు మద్దతు పలుకుతు చేతులు పైకి ఎత్తారు, వీరిని పార్టిలోకి ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మాహిళా విభాగం నాయకురాలు శ్రీ రమణమ్మ అసంతృప్తి వ్యక్తపరిచారు, వీరి చేరికను వ్యతిరేకిస్తు మరో నాయకురాలు శ్రీమతి సీతా మహాలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. వీరందరికి నచ్చ చెప్పి చంద్రబాబు గారిని ఎన్టీఆర్ గారు పార్టిలో చెర్చుకున్నారు.
ఎలా చూసిన ఎన్టీఆర్ గారి పార్టిని చంద్రబాబు వ్యతిరేకించారని తెలుస్తుంది.. అంతేకాని చంద్రబాబు గారు ఎన్టీఆర్ ను రాజకీయ పార్టీ పెట్టమని సలహా ఇచ్చినట్టు లేదు.

No comments: