Comments

టీడీపీ కమ్మవారి పార్టీ అన్న జలగం ... తీవ్రంగా తప్పు పట్టిన వైయస్సార్.


వైయస్సార్ అంటేనే కమ్మవారికి వ్యతిరేకం, వైయస్సార్ కమ్మ కులాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు అంటూ వైయస్సార్ వ్యక్తిత్వంపై కోంతమంది మీడీయాని అడ్డు పెట్టుకుని తెలుగుదేశానికి బాకా ఉదే మనుషులు విష ప్రచారం చేయడం గమనిస్తూనే ఉన్నాం. చంద్రబాబుని రాజకీయంగా వ్యతిరేకిస్తే అలా చేసిన వారు కమ్మ కులాన్ని కూడా వ్యతిరేకిస్తునట్టు చిత్రీకరించి, సమాజంలో వర్గ వైష్యమాలు పెంచడం తద్వారా తెలుగుదేశానికి చంద్రబాబు మేలు చేయడం వీరి ప్రధాన ఎజండా.

నిజానికి వీరు చెబుతునట్టు వైయస్సార్ కమ్మ వారిని వ్యతిరేకించారా అంటే సుద్ద అబద్దమనే చెప్పాలి. వైయస్సార్ కేవలం చంద్రబాబు, టీడీపీ విధానాలని మాత్రమే వ్యతిరేకించారు కాని ఏరోజు కమ్మవారిని వ్యతిరేకించలేదు. నిజానికి తాను ఉన్న కాంగ్రెస్ లో ఎవరైనా తెలుగుదేశాన్ని కమ్మవారికి అంటగట్టినా ఆయనకి నచ్చేది కాదు, అలాంటి వారిని ఆయన బహిరంగంగానే తూర్పారబట్టేవారు. దీనికి సాక్ష్యం 1986లో జలగం వెంగళరావు , వైయస్సార్ మధ్య జరిగిన  సంఘటన.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షడుగా ఉన్న జలగం వెంగళరావు 1986లో జరిగిన నగర మున్సివల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధికి సమర్పించిన నివేదికలో తెలుగుదేశం పార్టీకి కమ్మ కులస్తులు పెద్ద ఎత్తున డబ్బు, వాహనాలు ఇచ్చి ప్రచారంలో సహకరించారని నివేదిక ఇవ్వడంతో, ఈ విషయం తెలిసిన వైయస్సార్ గారు బహిరంగంగానే జలగం వెంగళరావుని తూర్పారబట్టారు.   

కమ్మ కులస్తులంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు నిచ్చారన్న అర్ధం వచ్చేవిధంగా వెంగళరావు నివేదిక ఇవ్వడం విచారకరమని వైయస్సార్ గారు విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కాంగ్రెసు పార్టీకి మద్దతునిస్తున్న కమ్మవారు జలగం వెంగళరావుకి కనిపించకపోవడం విచారకరమని  వెంగళరావు నివేదిక వల్ల పార్టీలో ఉన్న కమ్మవారిలో అపోహలు తొలగించవల్సిన బాధ్యత పార్టీలో ఉన్న ఒక ముఖ్యనాయకుడిగా తన పైన ఉందని రాజశేఖర రెడ్డి గారు నాడు అభిప్రాయవడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు అభ్యర్థులలో ఇద్దరు ఆ కమ్మ కులానికి చెందిన వారన్న విషయం వెంగళరావు మరిచిపోతే ఎలాగని ప్రశ్నించారు. ఇకముందైనా ఒకకులం వారిపై బురదజల్లే విధానానికి వెంగళరావు స్వస్తిచెబుతారన్న ఆశాభావాన్ని నాడే ఆయన వ్యక్తం చేశారు. వైయస్సార్ గారు నిజంగా ఒక కులానికి వ్యతిరేకి అయితే వెంగళరావు మాటలకి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిపై విమర్శనాస్త్రాలు సందించవలసిన అవసరం లేదు. కానీ నాడు మోత్తం కాంగ్రెస్ పార్టీలో ముందు వచ్చి తప్పు పట్టిన ఏకైక వ్యక్తి వైయస్సార్ గారు మాత్రమే. ఇలా ప్రకటించడం మూలానా సీనియర్ నాయకుడిని వ్యతిరేకించ్నందుకు రాజకీయంగా ఆయనకి నాడు నష్టమే కలిగింది కానీ లాభం జరగలేదు. నష్టం జరుగుతుందని తెలిసినా ఆయన వెనకడుగు వేయకుండా ఆయన అభిప్రాయన్ని నిర్భయంగా ప్రకటించారు.   

వైయస్సార్ వ్యక్తిత్వం ఈ విధంగా ఉండేదైతే వైయస్సార్ చంద్రబాబుని , చంద్రబాబు మనుషులని , చంద్రబాబు పార్టీని రాజకీయంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని ఏకంగా ఆయనపై కమ్మ వ్యతిరేకి అని ముద్ర వేయడానికి చంద్రబాబు మీడియా మనుషులు ఎంత తీవ్రస్థాయిలో ప్రయతించారో తెలిసిన విషయమే.

ఇదే పందాలో వైయస్సార్ తనయుడు జగన్ "వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ" పెట్టిన రోజు నుంచే, జగన్ సైతం కమ్మ వారికి వేతిరేకని ఒక దుష్ప్రచారనికి తెరలేపింది ఇదే మీడియా, జగన్ గారికి ఎంతో ముఖ్యులుగా అదే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని, అబ్బయ్య చౌదరి, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ , బొల్ల బ్రహ్మనాయుడు, తలసిల రఘురాం, నంబూరి శంకర రావు లాంటి కమ్మ వారు మద్దతుగా నిలిచినా జగన్ కమ్మ వారికి వ్యతిరేకనే ప్రచారం చేయడం కేవలం ఆయనను రాజకీయంగా దెబ్బకోట్టడానికే తప్ప మరోకటి కాదు. 

నాడు వైయస్సార్ పై చేసినా, నేడు జగన్ పై చేసినా రాజకీయ లబ్ది కోసమే అనేది ప్రజలే గ్రహించాలి, చంద్రబాబును , ఆయన మనుషులని అంటే కమ్మవారిని అనట్టే అనే మీడీయా ప్రచార మాయలో కమ్మవారిని పడేయడమే చంద్రబాబు,  టీడీపీ ఏజండా . ఈ నితిమాలిన ఏజండాని ప్రజలే గ్రహించాలి.

టీడీపీ కమ్మవారి పార్టీ అన్న జలగం ... తీవ్రంగా తప్పు పట్టిన వైయస్సార్.  టీడీపీ కమ్మవారి పార్టీ అన్న జలగం ... తీవ్రంగా తప్పు పట్టిన వైయస్సార్. Reviewed by surya on 8:36 AM Rating: 5

No comments:

Powered by Blogger.