Comments

చంద్రబాబు మద్యం బ్రాండ్లకి శిక్ష అనుభవించింది జగన్


గడిచిన 5ఏళ్ళు రాష్ట్రంలో నిరంతరం ప్రజల మధ్య నలిగిన సమస్య మద్యం. జగన్ పాలన రాగానే చెత్త బ్రాండ్లు వచ్చాయని, వాటి వలన ఆరొగ్యం పాడవుతుందని, జగన్ ముడుపులు తీసుకునే ఇలాంటి బ్రాండ్లకి అనుమతి ఇచ్చాడని అనేక అరొపణలతో తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతల నుండి సోషల్ మీడియా కార్యకర్తల వరకు ఊదరగొట్టారు. ఏకంగా టీవీలో సినిమాల్లో నటించే సైడ్ ఆర్టిస్టులచేత కూడా చెప్పించారు. ఈ ప్రచారాన్ని జగన్ సీరియస్ గా పట్టించుకోలేదు. ప్రజలకు అన్ని తెలుసనే నమ్మకంతో అరా కోరాగా మాట్లాడి నష్టం మూట కట్టుకున్నారు. ఇక నైనా ఈ మధ్యంపై నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక సారి ఈ మధ్యం పై సాగుతున్న ప్రచారాలకి సంభందించి నిజాలు ఎలా ఉన్నయొ చూస్తే. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే 14 డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు, ఒకే డిస్టిలరీల నుంచే మద్యం సరఫరా అయింది. అయితే జగన్ హయాంలో విషం అయిన మద్యం.. చంద్రబాబు హయాంలో అమృతం అవుతుందా?’ ఇదేలా సాధ్యం.


అలాగే రాష్ట్రంలో చలామణిలో ఉన్న బ్రాండ్‌లన్నింటికీ 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే అనుమతులిచ్చారు. గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలియన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ వంటి దాదాపు 15 బ్రాండ్ల విస్కీ, బ్రాందీ బ్రాండ్‌లకు 2018 అక్టోబర్‌ 26న చంద్రబాబు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారు. ప్రెసిడెంట్‌ మెడల్, హైదరాబాద్‌ బ్లూ డీలక్స్‌ విస్కీకి 2017 నవంబరు 22న అనుమ­తిచ్చారు. హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్ల బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వమే వాటన్నింటికీ 2017 జూన్‌ 7న అనుమతి జారీ చేశారు. రాయల్‌ ప్యాలెస్, న్యూకింగ్, సైన్‌ అవుట్‌ బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా 2018 నవంబరు 9నఅనుమతి జారీ చేశారు. బిరా బూం 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు కూడా అపద్ధర్మ సీఎంగా చంద్రబాబు 2019 మే 14న అనుమతి ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి ఆ మర్నాడే 2019 మే 15న టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా క్లియరెన్స్‌ ఇచ్చారు. 







రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతినిచ్చారు. మిగి­లిన 6 డిస్టిలరీలకు అంతకు ముందున్న ప్రభు­త్వా­లు అనుమతి ఇచ్చాయి.  జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయ్యింది. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముందనేది మౌళిక ప్రశ్న. 

ఇక 2014–19 మధ్య చంద్రబాబు పరిపాలనలో లిక్కర్‌ అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదైందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.. ఈ లెక్కన 2018–19 నాటికి 3.84 కోట్ల కేసుల మద్యం విక్రయించారు. దీన్ని బట్టి పరిశీలిస్తే 2023–24 నాటికి లిక్కర్‌ విక్రయాలు గణనీయంగా పెరగాల్సి ఉండగా 3.2 కోట్ల కేసుల లిక్కర్‌ అమ్మకాలు తగ్గాయి. 2018–19లో 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోతే, జగన్ ప్రభుత్వంలో 2023–24లో 1.12 కోట్ల కేసులు మాత్రమే విక్రయించారు. దీన్ని బట్టి కమీషన్లు, లంచాలు తగ్గించిన వారికి ఇస్తారా లేక పెంచిన వారికి ఇస్తారా అనేది విజ్ఞతతో ఆలోచిస్తే తెలుస్తుంది.

జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే దశలవారి మధ్య నిషేధాన్ని అమలు చేశారు, హామీలో భాగంగా దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా, వాటిని 2,934కు తగ్గించారు. 2019కి ముందు ప్రతి వైన్‌ షాప్‌కు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశారు. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43 వేల బెల్ట్‌షాప్‌లకు స్వస్తి పలికారు. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి.. 2019 అక్టోబరు 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించారు. మద్యం విక్రయ వేళలు కుదించారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలు అనుమతించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు షాక్‌ కొట్టేలా ధరలు పెంచామని హామీ ఇచ్చినట్టుగానే పెంచారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేశారు. తద్వారా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి. ఇలా ఇచ్చిన హామీని దశలవారిగా అమలు చేశారు జగన్.

చంద్రబాబు పాలనలో ఉన్న డిస్టలరీలే జగన్ పాలనలోను ఉన్నాయి . చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లే జగన్ పాలనలో కూడా ఉన్నాయి. చంద్రబాబు కన్నా జగన్ మద్యం రేటుని హామీ ఇచ్చినట్టుగానే షాక్ కొట్టేలా పెంచారు. కానీ చంద్రబాబు పాలనలో అవినీతి లేదని జగన్ పాలన్లోనే మద్యం అవినీతి జరిగిందని ఒక దుర్మార్గమైన ప్రచారం తెలుగుదేశం చేసింది. మధ్యాన్ని ఎక్కువ సరఫరా చేసి సేల్స్ పెంచుకునే అవకాశం ఇస్తే ముడుపులు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ వాళ్ల బిజినెస్ తగ్గిస్తే ముడుపులు ఎవరైనా ఇస్తారా? లాజికల్ గా ఆలోచిస్తే, మద్యంపై తెలుగుదేశం జనసేన చేసిన దుర్మార్గమైన ప్రచరాన్ని సరిగా తిప్పికొట్టేందానిపై దృష్టి పెట్టక చంద్రబాబు మధ్యం బ్రాండ్లకి జగన్ శిక్ష అనుభవించాడని చెప్పక తప్పదు.

చంద్రబాబు మద్యం బ్రాండ్లకి శిక్ష అనుభవించింది జగన్  చంద్రబాబు మద్యం బ్రాండ్లకి శిక్ష అనుభవించింది జగన్   Reviewed by surya on 11:41 PM Rating: 5

No comments:

Powered by Blogger.