వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తాను అసెంబ్లీకి రావాలి అంటే తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని తెల్చి చెప్పేసారు. చట్టంలో ఎక్కడా 10% సభ్యులుండాలనే నియమం లేకపోయినా ఉనట్టు చెబుతూ జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు కూటమి నేతలు. జగన్ కి ప్రతిపక్షహోదా ఇవ్వడం అనేది స్పీకర్ చేతిలో ఉన్నా ప్రజలే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మరో వితండవాదానికి దిగుతుంది అధికార పార్టీ. నిజానికి ప్రజాస్వామ్యంలో 40% ఓట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఒక చెడు సాంప్రదాయమే అవుతుందు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఉంటే తనకి కేటాయించే సమయంలో కూటమి అసతవ్యస్త పరిపాలనా విధానాన్ని తీవ్ర స్థాయిలో ఎడగడతాడనే భయంతోనే తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి పార్టీలు వెంకడుగు వేస్తున్నాయనే అభిప్రాయం అప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది కూటమి నేతలకే ప్రమాధ సూచిక. అధికార బలంతో జగన్ గొంతు నొక్కడం అంటే తమ గోత్తును నొక్కడమే అని ప్రజలు అనుకుంటున్న ఈ తరుణంలో కూటమి నేతలు మెలుకోకపోతే నష్టం తీవ్ర స్థాయిలో ఉండటం అనేది స్పష్టం.
అసెంబ్లీకి రాని జగన్ అంటూ మరో వాదన తెస్తూ జగన్ ను చులకన చేసే ప్రయత్నం కూటమి పార్టీల్లోని కోంతమంది అలాగే ఆ పార్టీలకి మద్దతు పలికే మరికోన్ని చానల్స్ చేస్తున్నాయి. ప్రజలకి జరిగిన ప్రతి సంఘటన గుర్తు ఉంటుందని ఈ కూటమి పార్టీ నాయకులు వారికి వంతపాడే మీడియా అధినేతలు విశ్మరించడం హాస్యస్పధం. గతంలో రామారావు గారు, చంద్రబాబు గారు, జగన్ గారు పక్క రాష్ట్రంలో జయలలిత గారు కూడా అసెంబ్లీకి రాకుండానే తిరిగి ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తుపెట్టుకోవాలి.
1993 ఆగస్టులో జరుతున్న వర్షాకాలపు సమావేశాలలో అధికారపక్షాన్ని ఇరుకున పెడదామనే ఆలోచనతో అసెంబ్లీకి వచ్చి, అది ఫలించకపోయే సరికి తెలుగుదేశం అధ్యక్షుడు అప్పటి ప్రతిపక్షనాయకుడైన ఎన్టీఆర్ గారు 1993 ఆగస్టు 13న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మళ్ళి సభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపొయిన ఉదంతాన్ని మర్చిపోయారా ఈ కూటమి నేతలు, అలాగే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి రాని ఘటనలు గుర్తులేవా, జగన్ గారు సైతం అసెంబ్లీలో తనకి మైక్ ఇవ్వడలేదని ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లో మమేకమై ఘనవిజయం సాధించలేదా. పక్కరాష్ట్రం తమిళనాడులో కూడా డీఎంకే పార్టీ నేతలు తనని అసెంబ్లీలో తీవ్రంగా అవమానించారని తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతానని జయలలిత శపధం చేసి అలాగే గెలిచి వచ్చిన ఉదంతం కనిపించడంలేదా.
గెలుపోటములు అనేవి ప్రజలు నిర్ణయిస్తారు. అసెంబ్లీలో ఎవరు తమ సమస్యలపై గళం విప్పి అండగా నిలబడుతున్నారో నిశితంగా పరిశిలించగల శక్తి ఓటర్ సోంతం. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తే ప్రజలు కూడా హర్హించరు. ప్రజాధనంతో నడిచే అసెంబ్లీలో 40% ప్రజల మద్దతు కూడకట్టుకున్న జగన్ కి ప్రతిపక్ష హోద ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడం అవుతుంది. లేదు మాకు బలం ఉంది మాకు నచ్చిన పందాలోనే మేము వ్యవహరిస్తాం అంటే, ఓటరు చూస్తూనే ఉన్నాడు.

No comments: