నాడు టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పొర్ట్స్ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడుపై వచ్చిన ఆరోపణలతో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు ఆయనపై గరం అయ్యారు.
ఆ ఆరోపణలలో మరీ ముఖ్యమైంది ఐదు ఇంజినీరింగ్ కాలేజీలకు కంప్యూటర్ సైన్స్ కోర్సులు ప్రారంభించడానికి సాంకేతిక విద్యా మంత్రిగా ముడుపులు తీసుకుని అనుమతి ఇచ్చారని. మరీ ముఖ్యమంగా మజ్లీస్ పార్టీకీ చెందిన డక్కెన్ ఇంజినీరింగ్ కళాశాలకు కూడా అనుమతులు ఇవ్వడం ఎన్టీఆర్ గారికి కోపం తెప్పించిన విషయం. పైగా మజ్లీస్ ప్రతీ విషయంలో ఎన్టీఆర్ గారిని రాజకీయంగా ఇరుకున పెడుతున్న రోజులవి
ఈ డెక్కన్ ఇంజినీరింగ్ కళాశాలలో మెడికల్ విభాగానికి అనుమతి ఇచ్చింది 1984లో ముఖ్యమంత్రిగా ఉన్న నదెండ్ల భాస్కర రావు గారు. దీని వలన ఆ కాలేజీ అవకతవకలు పాల్పడుతుంది అనే నెపంతో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఆ కాలేజీ గుర్తిపుని రద్దు చేసింది , కానీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి తిరిగి అనుమతులు తెచ్చుకుంది. దీనిపై ఎన్టీఆర్ గారు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు కేసు సుప్రీంలో ఉండగా ఆ కాలేజీలకి అనుమతులు ఎలా ఇస్తావ్ అని ఎన్టీఆర్ నిలదీసారు. దీనికి అయ్యన్న రాజీనామ చేశారు. ఆ తరువాత ఇద్దరు రాజీ పడి పదవిలో కోనసాగారు.

No comments: