Comments

ప్రతిపక్షహోదా ఇవ్వడానికి 10% సీట్లు ఉండాలా ? అలా అని ఏ రూల్ బుక్ లో ఉంది ?


లీడర్ ఆఫ్ అప్పోజిషన్ ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఖచ్చితంగా ఉండాల్సిందేనా..?? ఇలా అని ఏ రూల్ బుక్ లో ఉంది ? నిజనికి అలా అని ఎక్కడా కూడాలేదు, ప్రతిపక్ష నాయకుల జీత భత్యాల పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం అధికార పక్షానికి వ్యతిరేకంగా సంఖ్యా బలం ఎక్కువ ఉన్న పార్టీని స్పీకర్ ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలనే ఉంది కానీ ఎక్కడా కూడా 10% ఉండాలని లేదు. ఈ వాదననే "పిడిటి ఆచర్య" లోక్ సభ మాజీ సెక్రెటరీ జనరల్ కూడా దృవీకరించారు. 

ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వని పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం అనేది ప్రజాస్వామ్య విలువలని కాపాడే వారు చేసే పని. కానీ పార్టీకి 10 శాతం రాకపోతే తన విచక్షణాధికారంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ చెప్పడం ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టినట్లు అవుతుందా? 

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 67 సీట్లలో విజయం సాధించింది, బీజేపీ 3 సీట్లలో మాత్రమే గెలిచింది.. అయినా అప్పటి స్పీకర్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి విజేంద్ర గుప్తాని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. ఇక్కడేమి 10% అనే నియమం స్పీకర్ చెప్పలేదే! అలాగే 1989లో తమిళనాడులో 232 సీట్లకు గాను డీఎంకే పార్టీకి 170. జయలలిత పార్టీకి కేవలం 27 సీట్లే వచ్చినా టూ తార్డ్ మెజారిటీ లేకపోయినా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారే తప్ప కుంటి సాకులు చెప్పలేదు.


సభలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి రెండు వైపుల మాత్రమే ఉంటాయి. అలా ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు అధికార పక్షం వైపున ఉంటే..ఒక్క వైసీపీ మాత్రమే ప్రతిపక్షం వైపు ఉంది. కానీ 40% ఓట్ల శాతం సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణం చూస్తే సభలో చర్చలు జరిగేటప్పుడు అధికార పక్షంకి ఇచ్చే సమయం ప్రతిపక్షంకి కూడా ఇవ్వాలనేది రూల్ చెప్తుంది. 

ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఇచ్చే సమయంతో సమానంగా ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వాలి అనేది నియమం.అప్పుడే ప్రజా సమస్యలపై విస్తృత చర్చ జరుగుతుంది. ఇదే వైసీపీ కోరుతోంది కూడా. ఇలా సీఎంతో సమానంగా ప్రతిపక్షనాయకుడికి సమయం ఇస్తే జగన్ తెలుగుదేశం,జనసేన చేస్తున్న పరిపాలనను ఎక్కడ తూర్పారపడతారో అనే భయంతోనే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దాటవేస్తున్నారనే అనుమానం వీరి ప్రవర్తన మూలానా ప్రజల్లో కలుగుతుంది.

ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వలేదు అనేది ఒక కుంటి సాకు మాత్రమే. నిజానికి ఆ హోదా కల్పించాల్సింది స్పీకర్ మాత్రమే. డిల్లీలోను, తమిళనాడులోను ప్రతిపక్ష హోదా అక్కడ పార్టీలకి కల్పించింది స్పీకరే అనేది సుస్పష్టం. 40% ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రజలు పరోక్షంగా ప్రతిపక్షహోదా ఇచ్చినట్టే, రాష్ట్రంలో 40% మంది గొంతు వినిపించే భాధ్యత ప్రజలే వైసీపీకి ఇచ్చారు. 

8% వచ్చిన వాళ్ళకి డిప్యుటీ సీఎం హోదాలో ప్రజలందరిని ఏలుతాం అని చెప్పే వెసులుబాటు ఎలా ప్రజాస్వామ్యంలో కలిగిందో అలాగే 40% ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రజలే ప్రతిపక్షం ఇచ్చారనేది స్పష్టం. కనుక ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, ప్రజాస్వామ్యం నిలబెడతారా లేక రాజకీయ ఉద్దేశ్యాలతో ఇలాగే చట్టసభలను నడుపుతారా అనేది చూడాలి. అలాగే చరిత్రలో ఎన్నడు లేని విదంగా పీఏసీ కూడా అధికార పక్షమే తీసుకుని అనుభవిస్తుంది నిజానికి ఆ హోదా కూడా ప్రతిపక్షానికే రావాలని రాజ్యంగం చెబుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ గారు మరో కోత్త రాగం అందుకున్నారు. సభలో రెండో పెద్ద పార్టీగా తాము ఉండగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ఆయన వాదన. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వంలో భగమైన వారు ఎక్కడైనా ప్రతిపక్ష హోదా పాత్ర పోషిస్తారా పవన్ కళ్యాణ్ గారు.

ప్రతిపక్షహోదా ఇవ్వడానికి 10% సీట్లు ఉండాలా ? అలా అని ఏ రూల్ బుక్ లో ఉంది ?  ప్రతిపక్షహోదా ఇవ్వడానికి 10% సీట్లు ఉండాలా ? అలా అని ఏ రూల్ బుక్ లో ఉంది ?  Reviewed by surya on 1:31 AM Rating: 5

No comments:

Powered by Blogger.