ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు
తాడేపల్లి మున్సిపాలిటీలో కలిసిన ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం నిబందనలకు వ్యతిరేకంగా రోడ్డు పైకి చోచ్చుకుని వచ్చిన ఇళ్ల గోడలని ముందుగానే నోటీసులు ఇచ్చి సమయం అయిపోవడంతో కూల్చివేతలకు దిగారు.
అయితే ఇదే గ్రామంలో ఉన్న కోంతమంది జనసేన మద్దతుదారులతో పవన్ కళ్యాణ్ వచ్చి నానా హంగామా చేసి జగన్ పై నిందలు మోపాడు. ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారులు ప్రభుత్వం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేస్తోందంటూ హైకోర్టులో పిల్ వేయించాడు.
విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులని చూసి పిల్ వేసిన జనసేన మద్దతుదారులపై ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు ఒక్కొక్కరికి లక్ష జరిమానా వేసింది . పవన్ ని చూసి రెచ్చిపోయిన ఆ పార్టీ మద్దతుదారులు లక్ష కట్టలేక సుప్రీం కోర్టుకు వెళ్ళగా కోర్టు వారి చర్యను మందలించి ఒక్కొకరికి 25వేలు జరిమానా వేస్తూ తీర్పుని ఇచ్చింది.
30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్
వాలంటీర్ల వలన 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. కానీ జగన్ పాలనలో కేవలం ట్రాఫికింగ్ కి గురైన అమ్మాయిలు 46 అని అందులోను 34 కేసులు ట్రేస్ చేశారని అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పొల్చితే అతి తక్కువ కేసులు.
సుగాలి ప్రీతీ కేసు
2014-19 మధ్య జరిగిన సుగాలిప్రీతీ అనే బాలిక హత్యను నాడు పోత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా 2019 ఎన్నికల అనంతరం జగన్ అధికారంలోకి వచ్చాకా నానా రబస చేశారు. జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించినా జగన్ ప్రభుత్వమే చేయించింది అనట్టు ఊగిపోయారు. అధికారంలోకి వస్తే మోదట కేసుగా తీసుకుని సాల్వ్ చేస్తా అన్నారు. అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారు. సీబీఐ కూడా తమకి సిబ్బంది లేరని చెప్పినా స్పందించిన పాపాన పోలేదు పవన్ కళ్యాణ్.
14లక్షల కొట్లు అప్పులు
రాష్ట్రాన్ని జగన్ 14లక్షల కొట్లు అప్పులు చేసి నాశనం చేశాడని గగ్గోలు పెట్టారు , అధికారంలోకి వచ్చాక మోత్తం ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.
రుషికొండ భవనాలు
రుషికొండ భవనాలు జగన్ తన సోంతానికి కట్టుకుంటున్నాడని , వాటికి ప్రభుత్వ అనుమతులు కూడా లేవని నానా హంగామా చేశారు పవన్ కళ్యాణ్ .. అధికారంలోకి వచ్చాక రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు.
సచివాలయ భవనాలకి రంగుల
సచివాలయ భవనాలకి రంగుల పేరిట 4వేల కొట్లు ఖర్చు చేసి ప్రజా ధనాన్ని వృదా చేశారని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ , అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలకి రంగుల పేరిట ఖర్చు చేసింది 101 కోట్లు మాత్రమే అని ఒప్పుకుని ఆయన మాటలు అబద్దమని ఆయనే ఓప్పుకున్నారు.
విశాఖ నౌకలో మాదక ద్రవ్యాలు
2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయని బ్రెజిల్ నుంచి వీటిని వైసీపీ దిగుమతి చేసుకుందని. జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్‌ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. కానీ సీబీఐ అసలు అందులో డ్రగ్స్ లేవని దర్యాప్తు చేసి తెల్చింది.
టిడ్కో ఇళ్ళపై అబద్దం
మేము 2015-19 మద్య 20 లక్షల టిడ్కో ఇల్లు ఇస్తే జగన్ రద్దు చేశాడు.
2024లో కూటమి గెలిచాక నారాయణ చెప్పిన వాస్తవం: 2019 నాటికి కెంద్రప్రభుత్వం ద్వారా 7 లక్షల ఇళ్ళు అప్పటి టీడీపీ ప్రభుత్వం మణూరు చేస్తే 4 లక్షల ఇళ్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి, 2019 నాటికి 3 లక్షల 13వేల యునిట్ నిర్మాణ పనులు ప్రారంభించాం అని ఓప్పుకున్నారు. మరి ఈ 20 లక్షల ఇళ్ళు ఎక్కడ? దీంతో 20 లక్షల టిడ్కో ఇళ్ళు అబద్దం అని తేలిపోయింది.
రోడ్లపై ఖర్చు
2019-24 మద్య జగన్ హయాంలో 43 వేల కోట్లు రోడ్లపై ఖర్చు చేసి రోడ్లు వేసారు అయినా ప్రచారం చేసుకోలేదు, అంతకు ముందు చంద్రబాబు 2014-19 హయాంలో 27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు ఈయన ఒక కిలోమీటర్ రోడ్డు వేసి చేసుకుంటున్న ప్రచారం చూస్తే ఇదేం పబ్లిసిటీ పిచ్చి అనిపిస్తుంది. పని తక్కువ పీఆర్ ఎకువ.
‘సెకీ’ ఒప్పందం సక్రమమే
సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ 1,750 కోట్లు లంచం ఇచ్చారని. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే. రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా. ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది.
రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ 2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సాక్షిగా రుజువైంది. జగన్ ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో కేవలం జగన్ పై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా తప్పుడు వార్తలతో ఎల్లో మీడీయా కూటమి నేతలు బరితెగించినట్లు వెల్లడైంది.
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష
రాష్ట్రంలో భూముల యజమానులకు పూర్తి హక్కులతో అప్పజెప్పేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేతో భూములు లాగేసుకున్నారని, కబ్జా చేశారని, విస్తీర్ణం తగ్గించేశారని, రికార్డులు ట్యాంపర్ చేశారంటూ చంద్రబాబు ఎన్నికల్లో రకరకాల తప్పుడు ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఈ సర్వేను రద్దు చేస్తాం అన్నారు.
తీరా అధికారంలొకి వచ్చాక రద్దు చేయకపోగా ఇందులో జరిగిన ఒక్క తప్పునీ చూపలేకపోయారు, పైగా కోన్సాగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడితో ఆగకుండా జగన్ పాలనలో 7 వేల గ్రామాలకుగానూ 6,800కి పైగా గ్రామాల్లో పూర్తయిన భూముల రీ సర్వేను చూపించి కెంద్రం నుండి 397.72 కోట్ల కేంద్ర ప్రోత్సాహకం పోందారు.
ఇక సీజ్ థా షిప్ వ్యవహారంలో కేంద్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పింది.
తిరుపతి లడ్డు కల్తీ
కృష్ణా బ్యారేజీని బోట్లతో గుద్దారు

No comments: