జగనన్న అమ్మ ఒడి
పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000
జగనన్న విద్యా కానుక
ఏటా 1,080 కోట్ల ఖర్చుతో- ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టుకూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ తో పాటు అదనంగా ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీ కూడా బడులు తెరిచిన రోజు నుండే అందజేత.
జగనన్న గోరు ముద్ద
(ప్రతి రోజూ మెనూ మార్చి మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం..) సంవత్సరానికి దాదాపు 1.900 కోట్ల ఖర్చుతో మొత్తం 15 రకాల ఐటమ్స్. ప్రతి రోజూ గుడ్డు, వారానికి 3 రోజులు చిక్కీ, మరో 3 రోజులు రాగి జావ.
పాఠశాలల్లో “నాడు-నేడు”
మూడు దశల్లో 17.805 కోట్ల వ్యయంతో రక్షిత త్రాగునీరు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నుంచి ఫర్నిచర్, పెయింటింగ్, సురమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ చాక్ బోర్డు, కిచెన్, ప్రహరీగోడలు, ఇంగ్లీష్ ల్యాబ్, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూం వంటి మౌలిక వసతుల కల్పన.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ
ఏటా 2,200 కోట్ల వ్యయంతో గర్భిణులు, బాలింతలు, 6 నెలల నుండి 6 ఏళ్ల వయస్సు పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం..
స్వేచ్ఛ (శానిటరీ నాప్ కిన్స్)
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు బ్రాండెడ్ శానిటరీ నాప్ కిన్లు ఉచితంగా పంపిణీ..
డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ..
8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా బైజూస్ కంటెంట్ తో ట్యాబ్లు..
6వ తరగతి ఆపైన ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్..
ఇతర పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు..
జగనన్న విద్యా దీవెన
పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం.. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే..
జగనన్న వసతి దీవెన
వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20వేల వరకు.. 2 విడతల్లో ..
జగనన్న విదేశీ విద్యా దీవెన
QS వరల్డ్, TIMES ర్యాంకుల ప్రకారం 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంక్లో ఉన్న 320కి పైగా కాలేజీల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు గరిష్టంగా 1.25 కోట్ల వరకు నూరు శాతం ఫీజు రీయింబర్స్ మెంట్..
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
చదువును ప్రోత్సహించేలా వధూవరులిద్దరికీ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి..

No comments: