కుటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంతో పవిత్రమైన తిరుమల ప్రతిష్ఠ పాలనా వైఫల్యం వలన మసకబారుతుందనే వాదన బలపడుతోంది. దినికి సాక్ష్యం రోజు అక్కడ జరుగుతున్న ఘటనలే సాక్ష్యం అంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు.
వరుస క్రమంలో జరిగిన ఘటనలు
2024 జులై 8:- తిరుమలలో ఒక్కో గదిని 100 రూపాయలకు బ్లాక్ చేసి 1000 కి అమ్ముకున్న కూటమి పార్టీ నాయకులు (ఆంధ్రజ్యోతి వార్త)
2024 జులై 11:- తిరుమల క్యూ లైన్ లో ఆకతాయిల ప్రాంక్ వీడియొలు
2024 ఆగస్టు 7:- తిరుమలలో అధికారుల పర్యావేక్షన లోపం వలన గాయపడ్డ భక్తులు , వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఆలయం ముందు నెయ్యితో కూడిన మురుగు ఏర్పడి లడ్డూ ప్రసాదం తీసుకుని వస్తున్న భక్తులు ఈ మురుగుపై కాలు వేయడంతో జారిపడిపోయారు. అలా అరగంట వ్యవధిలో దాదాపు 11 మంది భక్తులు గాయపడ్డారు. (ఆంధ్రజ్యోతి వార్త)
2024 ఆగస్టు 8:- టీటీడీ నిధులు పక్కదారి మళ్ళిస్తూ చంద్రగిరిలో రహదారుల నిర్మాణంకోసం ఈవోకు ఆదేశాలు జారీచేసిన సీఎం చంద్రబాబు
2024 ఆగస్టు 22:- తిరుమలలో నీటి వినియోగంపై టీటీడీ ఆంక్షలు విధించింది. హోటళ్లకు, మఠాలకు, స్థానికులకు ఇకపై నీటి సరఫరా నిరంతరం ఉండదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. (ఆంధ్రజ్యోతి వార్త)
2024 ఆగస్టు 24:- శ్రీవారి భక్తులకు అధనపు లడ్డుపై ఆంక్షలు పెట్టి వ్యతిరేకత రావడంతో మానుకున్నారు
2024 సెప్టెంబర్ 22:- ఖమ్మం జిల్లా గొల్ల గుడెంలో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదం కోన్నారు. ఆ లడ్డుతోనే వారు ఇంటికి తిరిగి వెళ్ళారు. తీరా ఇంటికి వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదం తిందాం అని చూడగా ఆ లడ్డూలో గుట్కా ప్యాకెట్ వచ్చింది. దీంతో వారు ఖంగుతున్నారు
2024 అక్టోబర్ 1:- శ్రీవారి ప్రసాదంలడ్డూపై అసత్య ప్రచారం , దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగద్దు అంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ సుప్రీం కోర్టు
2024 అక్టోబర్ 4:- టీటీడీ అన్న ప్రసాదంలో జెర్రి (భాదితుడు మీడియా ముఖంగా సాక్ష్యం చూపినా , అదేమిలేదని ఖండించిన టీటీడీ అధికారులు)
2024 అక్టోబర్ 4:- శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అపశృతి, తిరుమల ధ్వజస్తంభంపై విరిగిన ఇనుప కొక్కి, ఈ కొక్కి ద్వారానే గరుడ పఠాన్ని ఏగురవేస్తారు.
2024 అక్టోబర్ 14:- తిరుమల ప్రతిష్టకు దెబ్బతగిలే విధంగా , తిరుపతి జిల్లాకి రాష్ట్రంలోనే అత్యధిక మధ్యం షాపులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
2024 అక్టోబర్ 20:- బ్లాక్ లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్న తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్సీ జకియా ఖానం
2024 అక్టోబర్ 21:- ఏడు కొండలపై హెలికాప్టర్ చక్కర్లు
2024 అక్టోబర్ 28:- సాధుపరిషత్ అధ్యకులైన తమ లాంటి వారిని సైతం పక్కన పెట్టి అదనపు ఈవో వెంకయ్య చౌదరి కార్పొరేట్ కంపెనీల వ్యక్తులకు అర్హత లేని వ్యక్తులకి ప్రోటోకాల్ దర్శనం కల్పించి తమని అవమానించారని వైసీపీ ప్రభుత్వంలో తమకి ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పై మండిపడ్డారు సాధుపరిషత్ అధ్యకులైన శ్రీనివాసానంద సరస్వతి స్వామీ.(ఆంధ్రజ్యోతి వార్త)
2024 డిసెంబర్ 5:- తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం లాంటివి నిషేధించినా కూటమి పాలనలో అధికారుల పర్యావేక్షణ లోపం వలన జరుగుతూనే ఉన్నాయి . అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
2024 డిసెంబర్ 18:- తిరుపతి నగర పరిధిలోని తిరుచానూరు మ్యాంగో యార్డ్ సమీపంలోని అనుమతులు లేకుండానే ఓ పబ్ ఏర్పాటైంది.
2024 డిసెంబర్ 23:- భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇంటిదొంగల నిర్వాకంతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వారం వారం తిరుమల నుంచి వచ్చే ఈ లడ్డూ ప్రసాదాల్లో కొన్నింటినే సామాన్య భక్తులకు విక్రయించి ఆపై చెన్నై నడివీధుల్లో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్నలడ్డూలు 2, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ కలిపి ప్రత్యేక ప్యాకింగ్ చేసి రూ.1,500కు అమ్మేసుకుంటున్నట్టు తేలింది.
2024 డిసెంబర్ 28:- తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం. శ్రీవారి ఆలయ నిబంధనలకు టీడీపీ మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా, ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు. పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2025 జనవరి 6:- పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
2025 జనవరి 9:- వైకుంఠ ద్వారం గుండా ఆ కలియుగ వేంకటే శ్వరుడిని దర్శించి పునీతులవ్వాలని తరలి వచ్చిన భక్తులకి సరైన వసతి ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైన టీటీడీ పాలకమండలి , ఫలితంగా తొక్కిసలాటలో 7మంది భక్తుల మృతి . ఇలా భక్తులు మృతి చందడం తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి.
2025 జనవరి 13:- తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్‌రోడ్‌లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
2025 జనవరి 13:- తిరుమల 47వ నెంబర్ లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కౌంటర్‌లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు.
2025 జనవరి 14:- తిరుమల పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన తిరుపతికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి వీరిశెట్టి పెంచలయ్య. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను దొంగిలించినట్టు నిర్ధారణ.
2025 జనవరి 15:- తిరుమలలో ఆర్టీసి బస్ స్టేషన్ వద్ద పద్మనాభ యాత్రిక సదన్ భవనం నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వసతి సముదాయం (రెండో అంతస్తు) నుంచి బాలుడు కిందకి పడిపోయాడు. వైఎస్సార్ కడప జిల్లా చినచౌక్‌కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్(3)గా గుర్తించారు.
2025 జనవరి 15:- తిరుమలలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్సిస్తూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తు టీటీడి ఆదాయానికి గండి కొట్టారు.
2025 జనవరి 17:- తిరుమలలో కూటమి పాలనలో అడుగడుగునా అవినీతి మయం.. వీఐపీ బ్రేక్ దర్శనం: ₹25,000, ప్రోటోకాల్ దర్శనం: ₹50,000, ఉద్యోగుల దర్శనం: ₹10,000 - ₹15,000. ఇలా దళారుల అడ్డాగా మారిపోయిన తిరుమల అంటూ తెలుగుదేశం అధికార ప్రతినిది వెనుగోపాల్ రెడ్డి చెంచు అనే అతను తన అనుభవాలని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు
2025 జనవరి 18:- తిరుమల కొండపై కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. మాంసం, గుడ్డు, మద్యం, మత్తు పదార్థాలను తిరుమల కొండపైకి అధికారులు అనుమతించరు. కానీ తాజాగా కూటమిపాలన అధికారుల నిర్లక్ష్యం మూలానా కొంతమంది ఏకంగా తిరుమల కొండపైకి ఎగ్ బిర్యాని తెచ్చుకుని తిన్నారు.
2025 జనవరి 17:- తిరుమల ఉచిత భోజనం గతంతో పోల్చితే నాన్యత చాలా తగ్గిపోయింది అన్న ఉషా డైరీ యూట్యూబర్. కూటమి పాలనలో తిరుమల పవిత్రత రోజురోజుకు మసకబారుతుంది అనడానికి మరో నిదర్శనం ఇది.
2025 జనవరి 18:- తిరుమల ఆలయం వద్ద దాతల కన్నీరు !! భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన టీటీడీ సిబ్బంది. దాతలు కోటిరూపాయలు ఖర్చు పెట్టి 3 రోజులు కష్టపడి పూలతో అలంకరణ చేస్తే , గంటల వ్యవధిలోనే చెప్పకుండా తొలగించిన సిబ్బంది. దీంతో బెంగుళూరుకు చెందిన సునీతా గౌడ్ అనే దాత కన్నీరు.
2025 జనవరి 28:- సాంప్రదాయ ఆచారానికి మంగళం పాడిన తిరుమల ఆధికారులు. స్వామి వారిని దర్శనానికి భక్తులు సంప్రదాయ దుస్తులతో మాత్రమే వెళ్లాలి. పురుషులైతే ధోతీ/కుర్తా పైజమా ధరించాలి. స్త్రీలైతే పంజాబీ డ్రెస్, లంగా వోణీ, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ నేడు తిరుమలలో ఒక మహిళ టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్ళినా, అధికారులు అనుమతించి తిరుమల పవిత్రతని మంట కలిపారు.
2025 ఫిబ్రవరీ 1 :- తిరుమల శ్రీవారి ఆలయంపై చక్కర్లు కొట్టిన విమానం.
2025 ఫిబ్రవరీ 7 :- తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు.
2025 ఫిబ్రవరీ 13 :- తిరుములలో మళ్ళీ అపచారం తిరుమల తిరుపతి స్వామి వారి ఊరేగింపు జరిగే తిరుమల మాఢ వీధులలో మాంసాహార అమ్మకాలు.
2025 మార్చ్ 14:- తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన చోట పదే పదే ఆనంద నిలయం మీదుగా విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఆగ్రహం.
2025 మార్చ్ 15:- తిరుమలలో అపచారం.. మద్యం మత్తులో యువకుడు వీరంగం. తిరుమల మాడవీధుల్లో తప్పతాగి మహిళతో గొడవ పడుతూ వీరంగం సృటించాడు.'నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా' అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు.
29 మార్చ్ 2025 :- తిరుమల కొండపై బెల్ట్ షాపులు అని మార్చ్ 29న మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా పవిత్ర క్షేత్రంలో అక్రమ మద్యం షాపులు ఉండటం కూటమి పాలన వైఫల్యం, గతంలో ఇలాంటి అపచారం ఎప్పుడు జరిగిన చరిత్రలేదు
12 ఏప్రిల్ 2025:- తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గోవులు పరిరక్షన కరువై మృత్యువాత పడుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆరోపణ , ఆ ఆరోపణలో నిజం ఉందనే విధంగా 191 గోవులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చనిపోయాయని అధికారికంగా ప్రకటించిన టీటీడీ
12 ఏప్రిల్ 2025:- తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్ నుంచి మహాద్వారం వరకు చెప్పులుతో వచ్చిన భక్తులు, వారిని అప్పటివరకు ఆపలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట్ర వస్తున్నా వారిని ఆపలేకపోవడం అధికారుల
14 ఏప్రిల్ 2025:- పవిత్రమైన తిరుమల కొండపై పార్కింగ్ విషయంలో కొట్టుకున్న డ్రైవర్లు ఈ గోడవలో శివ అనే డ్రైవర్ మృతి
16 ఏప్రిల్ 2025 :- భక్తులు డ్రోన్లతో కొండపైకి రావడాన్ని టీటీడీ కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. అయితే అలిపిరి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతో కొందరు డ్రోన్లతో నేరుగా తిరుమలకు చేరుకుంటున్నారు ఈ నేపధ్యంలో ఒక వ్యక్తి తిరుమలలో డ్రోన్ ఎగరేసి కలకలం సృష్టించాడు

No comments: