జగన్ ప్రభుత్వంలో తాను ఇబ్బంది పడ్డానని కాబట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలని. అందుకోసం అహర్నిశలు కష్టపడాలని. నోటికొచ్చినట్లు మాట్లాడారు ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న సస్పెండ్ చేసింది.
తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టం అనే కంపెనీకి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై ఉన్న కేసు. కాంట్రాక్టును కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనలు, సాంకేతిక అర్హతలను కూడా మార్చారు. అంతేకాక.. ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ లిమిటెడ్/ ఆర్‌టీ ఎల్‌టీఏ సిస్టమ్స్ ఉత్పత్తులను భారత్‌లో మార్కెట్ సృష్టించేందుకు యత్నించారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెక్నికల్, కొనుగోలు కమిటీలను ప్రభావితం చేశారు. ఆ విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కుట్రపూరితంగా వ్యవహరించి.
ఇదంతా టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు కుతంత్రాలకు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ ఓ వైపు, ఓటర్ల డాటా చోరీకి మరోవైపు పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను అప్పటి ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించారు. ఎందుకంటే అప్పటికే 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఫోన్ల ట్యాపింగ్, డాటా చోరీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు.
ఏబీ వెంకటేశ్వరరావు ఈ చీకటి వ్యవహారం నడిపి చంద్రబాబు జోబులో మనిషిలా వ్యవహరించి చేసిన కోనుగోలుకు రాష్ట్రంలో ఉన్న కమ్మవారికి ఏంటి సంభంధం, ఈయన చేసిన దోంగ పనిని కమ్మవారి అందరికి అంటగట్టాలని ఈయన ఎందుకు చూస్తున్నాడు. కులం దోంగలని కాపాడుతుందా , లేక కాపాడుతుందని ఆయన నమ్ముతున్నాడా ?

No comments: