ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ బిజినెస్ కావాలని మహారాష్ట్ర, కర్నాటక కోరినా హైద్రబాద్ కి రావడానికి చంద్రబాబే కారణం అని అంటారు. కానీ ఇందులో ఉన్న మరో కోణం చూస్తే చంద్రబాబు భూ పందారం కనపడుతుంది.
కర్నాటకా, మహారాష్ట్ర వాళ్ళదగ్గరికి ఈ ISB వాళ్ళు వెళితే అక్కడి ముఖ్యమంత్రులు మీరు కోరిన భూమి ఉచితంగా ఇస్తాం కానీ మీరు ఇక్కడ విద్యార్దులకు 30 నుండి 50% కోటా తప్పనిసరిగా అమలుపరచాలని షరతులు విధించారు.
కానీ చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వలే సోంత రాష్ట్ర విద్యార్ధుల గురించి ఆలోచించకుండా ISB వాళ్ళకి 250 ఎకరాలు భూముని కట్టబెట్టాడు. దీంతో ఎలాంటీ షరతులు లేకుండా ఉచితంగా 250 ఎకరాల భూమి దోరకడంతో ISB వాళ్ళు హైద్రబాద్ లో క్యాంపస్ పెట్టారు.
ఈ ISB రావడానికి చంద్రబాబు ఇంకా రజత్ గుప్తా పనిచేశారు. ఈ రజత్ గుప్తా మకెన్సీ కంపెనీలో పనిచేసేవాడు ఈ ISB కి ఉచితంగా 250 ఎకరాలు కేటాయించి ఇక్కడికి వచ్చేలా డీల్ సెట్ చేసినందుకు రజత్ గుప్తా పనిచేస్తున్న మెకన్సీ కంపెనీకి విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసే కాంట్రాక్ట్ రూపంలో దానికి 1999లోనే 2.5 కోట్లు ఆ కంపెనీకి కట్ట బెట్టాడు. ఆ విజన్ 2020 డాక్యుమెంట్ తరువాత చెత్త బుట్టలోకి వెళ్ళింది. ఇక ఈ రజిత్ గుప్తా అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో 2ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇంకా చెప్పుకుంటే ఈ ISBకి డీన్ గా వ్యవహరించిన రాం మోహన్ రావు అనే వ్యక్తి సత్యం కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వ్యవహరించి స్కాంలో ఇరుక్కున్నాడు.
ఈ రాష్ట్రంలో ఒక్క విద్యార్ధికి కూడా ఉపయొగపడని ఒక ప్రయివేట్ విద్యా సంస్థకి చంద్రబాబు డప్పు ఎంటో అర్ధం కాదు. వైయస్సార్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్ధులకి ఉపయొగపడేలా ట్రిపుల్ ఐటీలు పెట్టారు, కొత్త యునివర్సిటీలు కట్టించారు, మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగంలో ఈ రాష్ట్ర విద్యార్ధులకు మేలు జరిగేలా ఎన్నో మార్పులు తీసుకుని వచ్చారు.
ఈ రాష్ట్ర సంపదను ఎవరికైనా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో కోంత మేలు జరిగేలా చూడాలి, కానీ ఏ ఒక్కరికి మేలు జరగకుండా ఆ సంపదని దారాదత్తం చేస్తే నష్టం ఎవరికి? లాభం ఎవరికి? ఈ తేడాని గమనిస్తే ఈ ISB గుట్టు అర్ధం అవుతుంది. మహారాష్ట్ర , కర్నాటకా ప్రభుత్వాలు వారి విద్యార్ధుల గురించి ఆలోచించారు, కానీ మన చంద్రబాబుకి అది పట్టలేదు..

No comments: