ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్గ అనుభవం ఉన్న చంద్రబాబు చాలా చిన్న చిన్న విషయాల్లో ఇట్టే దోరికిపోతూ ఉంటారు. ప్రపంచంలో జరుగుతున్న సాంకేతిక రంగ అభివృద్దిని ఎప్పటికప్పుడు తన ఖతాలో వేసుకుని గొప్పచేపుకునే ప్రయత్నం చేసే చంద్రబాబు గారు అనేక సార్లు మీడియాకు దోరికిపోవడం పరిపాటైంది.
ఇప్పటికే హైద్రబాద్ లో ఐటీకి ఆధ్యుడిని నేనే, కంప్యూటర్ రంగాన్ని తెచ్చింది నేనే , సెల్ఫోన్ తెచ్చింది నేనే అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ చేసేది నేనే సత్యానాదెళ్లకి స్పూర్తి నేనే అంటూ గొప్పగా చెప్పి నెటిజనులకి దోరికిపోయిన చంద్రబాబు తాజాగా దావోస్ గురించి పెట్టిన ప్రెస్ మీట్ లో కుడా ఇలాంటి గొప్పలే చెప్పుకోబోయి దోరికిపోయారు.
ప్రతీ ఏటా దావోస్ లో జరిగే పెట్టుబడి సదస్సులకు తాజాగా మూఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన చంద్రబాబు పక్క రాష్ట్రాలతో పోటీ అటుంచి కనీసం ఒక్క ఎం.ఓ.యూ కూడా సంపాదిచలేక వెనుదిరిగారు. ఆయన రాజకీయ చరిత్రలోనే ఇది ఒక దారుణమైన విఫల పర్యటనగా మిగిలిపోయింది. ఈ పర్యటంతో ప్రజల నుండి విమర్శల దాడిని సైతం ఏదుర్కోవాల్సి వచ్చింది.
చంద్రబాబుగారి విఫల పర్యటనను కప్పెట్టి సానుభూతి కధనాలతో చంద్రబాబును కాద్దాం అనుకున్న ఆయన అనుకూల మీడియా సైతం ఆ పని చేయలేనంతగా ప్రజల్లో ఈ పర్యటన వివరాలు చోచ్చుకుని వెళ్లాయి. ప్రజలు ఈ పర్యటనపై ఇంత ఆశక్తి కనపరచడానికి కూడా అయన అనుకూల మీడియానే ఒక ఇందుకు కారణం గా చెప్పవచ్చు . జగన్ పాలనలో దావోస్ పర్యటాన నుండి కానీ మరో సమిట్ నుండి కానీ పెట్టుబడులు సాదించి అవి గౌండ్ అయ్యేలా చేసి భారీ పరిశ్రమలను ఏపీకి తెచ్చినా జగన్ ప్రభుత్వం పై రోజూ విపరీతామైన బురద వేసి ప్రజలని తప్పుదోవ పట్టించారు. దీంతో జగన్ ప్రభుత్వంలో సంక్షేమమే తప్ప అభివృద్ది లేదని మోసపోయిన ప్రజలు చంద్రబాబు విపరీతమైన అభివృద్ది చేస్తాడని ఆయనకి పీఠం అప్పచెప్పారు.
ఈ నేపధ్యంలో జరిగిన దావోస్ టూర్ పై రాజకీయ వర్గాల నుండే కాకుండా ఇటు ప్రజల నుండి కూడా తీవ్రమైన ఆశక్తి చూపారు. తీరా ఆ టూర్ దారుణంగా విఫలం చెందడంతో తీవ్రమైన విమర్శల పాలయ్యారు. ఈ విమర్శలనుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా దావోస్ పర్యటనపై ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు తానే ఈ దేశంలో మొదటి సారి దావోస్ కి వెళ్ళాలి అని నిర్ణయించానని, ఒక ట్రండ్ సెట్ చేశానని, 1997 నుండి దావోస్ కి రెగ్యులర్ గా వెళ్లానని చెప్పుకోచ్చారు.
ఇక్కడే చంద్రబాబు నెటిజనులకి మరోసారి దోరికిపోయారు. నిజానికి చంద్రబాబు కన్నా ముందే 1992లోనే పీవీ నర్సింహారావు గారూ దావోస్ పర్యటనలకి వెళ్ళినట్టు పేపర్ క్లిప్స్ నెట్ లో వైరల్గా మారాయి. అంతే కాకుండా 1994లో నాటి మహారాష్ట్ర ముఖ్యామంత్రిగా ఉన్న శరత్ పవార్ కూడా దావోస్ కి వెళ్ళినట్టు స్పష్టంగా తెలుస్తుంది . కానీ చంద్రబాబు గారు దేశంలో నేనే మోదట ట్రెండ్ సెట్ చేశానని చెప్పుకోవడంతో మరోసారి బాబుగారు ఇక మారారా ఈ గోప్పలు చెప్పుకోవడంలో అని టీడీపీ శ్రేణులో మాట్లాడుకోవడం కనిపిస్తుంది.

No comments: