27 జులై 2024 :- టిడిపి నేతల వేధింపులు భరించలేక కలిదిండి మండలం సానా రుద్రవరంలో వేప చెట్టుకి ఉరివేసుకున్న జనసేన కార్యకర్త విన్నకోట రామకృష్ణ.
30 సెప్టెంబర్ 2024:- టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీకే చెందిన ఒక సర్పంచ్ ను వేదించడంతోవాటు ఆయన భార్యను బహిరంగంగా దూషించడంతో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.
25 అక్టోబర్ 2024:- మధ్యం ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మార్కాపురం రాయవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తమ్మిశెట్టి వెంకటేశ్వరులు ఆత్మహత్యాయత్నం.
26 అక్టోబర్ 2024:- అక్రమ ఇసుక పై ప్రశ్నించాడని సొంత పార్టీ కార్యకర్త పై కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్
21 నవంబర్ 2024:- యరగొండపాలెంలో టీడీపీ ఇంచార్జి ఏరీక్షన్ బాబు ఉద్యోగాలు టీడీపీ కార్యకర్తలకు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకుంటున్నారని టీడీపీ ఇంచార్జి ఏరీక్షన్ బాబు కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న టీడీపీ కార్యకర్త నాగేంద్ర ఆత్మహత్యా యత్నం.
1 డిసెంబర్ 2024:- టీడీపీ పార్టీ అధికారంలోకి తేవాలని చెప్పి, ఐటీడీపీలో తన చేత పని చేపించుకుని , చివరికి అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోలేదని బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను ఆత్మహత్య
13 డిసెంబర్ 2024:- తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోల్పోయింది. నెల్లూరు జిల్లా ,గుడ్లూరు మండలం చేవూరు గామానికి చెందిన నక్కల వినోద్ కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్త టీడీపీ పాలనలో ఉన్నతాధికారులు వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంటునట్టు లేఖ రాసి చనిపోయాడు
20 జనవరి 2025:- తనకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని, గూడూరు మండల టీడీపీ అధ్యక్షులు పోతన స్వామినాయుడు వేధింపులు తాళలేక పోతునానన్న ఆవేదనతో పెడనకు చెందిన జనసేన కార్యకర్త సంతోష్ స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో ఆత్యహత్యయత్నానికి పాల్పడ్డాడు.
5 ఫిబ్రవరీ 2025:- మా పార్టీ వారే లంచం అడిగారని తీవ్రంగా వేదిస్తున్నారని సెల్ఫీ వీడీయొ తీసుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం చెర్లోపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నం.
7 ఫిబ్రవరీ 2025:- టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
3 ఏప్రిల్ 2025:- తెలుగుదేశం కోసం పనిచేసి మోసపోయానని చెప్పి ఆత్మహత్యాయత్నం చేసిన మదనపల్లె పట్టణం నీరుగట్టు వారి పల్లె మాయాబజార్ ప్రాంతానికి చెందిన వేల్పుల వెంకటేశ్
21 ఏప్రిల్ 2025:- టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం, దెందులూరులో చింతమనేని మట్టి మాఫియా వేధింపులు భరించలేక టీడీపీ ఆఫీస్‌లో దాసరి బాబురావు ఆత్మహత్యయత్నం.
20 మే 2025:- అనంతపురం టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు సాకె వెంకటేష్. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన తమకు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
28 మే 2025:- మహానాడు జరుగుతుండగా కడపలో సెల్ టవర్ ఎక్కిన టీడీపీ మహిళా కార్యకర్త మీనాక్షి. నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టించుకోవడంలేదని ఆవేదన. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.
11 జులై 2025:- టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. కోవూరు నియోజకవర్గంలోనీ విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమామ్ భాషా మీడియాతో మాట్లాడారు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
29 ఆగస్టు 2025:- శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.
17 నవంబర్ 2025:- చిత్తూరు కలెక్టరేట్ వద్ద విషం తాగి టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య యత్నం. భూమి విషయంలో ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపణ
24 ఫెబ్రవరి 2026:- ఇంటి స్థలం వివాదంలో టీడీపీకి అనుకూలంగా సీఐ వ్యవహరిస్తున్నాడని, తనకి న్యాయం చేయకపోగా రోజు వేదిస్తున్నారని మనస్తాపం చేంది ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త అంకారావు
11 మార్చ్ 2026:- ఇఫ్తార్ విందుకు రమ్మని పిలిస్తే.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అవమానించడమే కారణం. అంటూ సెల్ఫీ వీడియొ తీసి ఆత్మహత్యయత్నం చేసిన టీడీపీ కార్యకర్త నూర్ మహ్మద్
16 మార్చ్ 2026:- ర్నూలు జిల్లా పందికూన గ్రామంలో టీడీపీ నేతల అరాచకాలు. సొంత పార్టీ కార్యకర్త భూమిని సైతం కబ్జా చేసిన టీడీపీ నేతలు. ప్రశ్నించినందుకు చంపేస్తామంటూ బాధితుడికి వేధింపులు. పంచాయితీకి పిలిపిస్తే బాధితుడిపై దాడి చేసిన టీడీపీ నేతలు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం. తన కుటుంబ బాధ్యత తీసుకోవాలంటూ ఎమ్మెల్యేని కోరుతూ సెల్ఫీ వీడియో
2 ఏప్రిల్ 2026:- టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల వేధిస్తున్నాడని. తనని వంచించిన తీరును సీఎం చంద్రబాబుకు చెబుతాననే భయంతో తనని కిడ్నాప్ చేయించాడని. టీడీపీ మహిళా నేత వెంగమాంబ ఆరోపణలు.
2 ఏప్రిల్ 2026:- మచిలీపట్నంలో ఇల్లు నిర్మించుకోవాలంటే.. గజానికి రూ.5 వేలు కమీషన్ ఇవ్వాల్సిందే జనసేన కార్యకర్త విజయ్ కుమార్ తమకు కమీషన్ ఇవ్వలేదని జేసీబీతో ఇల్లు కూల్చివేయించిన టీడీపీ నేతలు
కూటమి నేతల వేదింపులకి కొనసాగుతున్న కూటమి కార్యకర్తల ఆత్మహత్యల పర్వం .
Reviewed by surya
on
11:04 AM
Rating:
Reviewed by surya
on
11:04 AM
Rating:





.jpg)

















No comments: