రాజకీయానికి దేవదేవుడి ప్రసాధంపై బురదవేసే ముందు నిజాలు తెలుసుకోవాల్సిన భాధ్యత అందరిపై ఉంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి మతం రంగు పూసీ దేవిడిని సైతం అపవిత్ర రాజకీయాల్లోకి లాగడం హేయమైన చర్య
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదానికి నెయ్యి సేకరణకు పక్కా వ్యవస్థ.
ఎల్-1గా నిలిచిన సంస్థ టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు. అలా సరఫరా చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యి టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లు సరఫరా సంస్థే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబ్స్ ధ్రువీకరించిన సంస్థ నుంచి సర్టిఫికెట్ తేవాలి. ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఆ ట్యాంకర్ నెయ్యిని టీటీడీ మార్కెటింగ్ అధికారి, సరఫరా సంస్థ ప్రతినిధి సమక్షంలో టీటీడీ మూడు శాంపిళ్లను తీసుకుని ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్ష చేయిస్తుంది. ఆ మూడు పరీక్షల్లో ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లు తేలితేనే ఆ నెయ్యి ట్యాంకర్ను ముందుకు అనుమతిస్తారు. మూడు పరీక్షల్లో ఏ ఒక్క పరీక్షలోనైనా నెయ్యిగాని ముడిసరుకుగానీ నాణ్యతగా లేదని తేలితే. ఆ ట్యాంకర్ నెయ్యి తెచ్చిన వాహనాన్ని సరఫరా సంస్థకే వెనక్కి పంపిస్తారు.
2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకపోవడంతో 14-15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. వైఎస్సార్సీపీ హయాంలో నాణ్యత లేకపోవడంతో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
లడ్డూ లో కల్తీ నెయ్యి కలిసింది అనేది అబద్దం
టీటీడీ నిర్వహించే మూడు పరీక్షల్లో ప్రమాణాల మేరకు నాణ్యంగా నెయ్యి ఉన్నట్ట్లు రాకపోతే ఆ నెయ్యిని తిప్పి వెనక్కి పంపిస్తారు, ఇది గతంలో చంద్రబాబు జగన్ ప్రభుత్వాల్లో జరిగింది. భక్తులకి ఇచ్చే ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవలేదని నాటి ఈవోనే ఒప్పుకున్నాక , జనసేన తెలుగుదేశం లడ్డూలో నెయ్యి కలిసింది అని ఏ రాజకీయ ప్రయొజనాలకొసం యాగీ చేస్తున్నారు.
ఏ.ఆర్ డైరీ జగన్ పాలనలో ఒక్క ట్యాంకర్ కూడా పంపలేదు.
నెయ్యి సరఫరాకు 2024, మార్చి 12న టీటీడీ టెండర్లు పిలిచింది. అదే ఏడాది మే 8న టెండరును టీటీడీ ఖరారు చేసి 15న టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. సరఫరా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే నెయ్యిని సరఫరా చేశాయి. ఇందులో మొదలు జూలై 6న రెండు ట్యాంకర్లు.. జూలై 12న రెండు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. ఈ నెయ్యిని పరీక్షల కోసం ఎన్టీడీబీ (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) ల్యాబ్కు టీటీడీ పంపింది. వాటికి సంబంధించిన పరీక్షల నివేదికలను జూలై 23న టీటీడీకి ఎన్డీబీ అందజేసింది. అదేరోజున తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఈఓ... ఒక సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని తేలిందని వెల్లడించారు. ఆ రెండు ట్యాంకర్లను సరఫరా సంస్థకు తిప్పి పంపారు ఇది 2014-19 చంద్రబాబు పాలన్లో అలాగే జగన్ పాలన్లో కూడా జరిగింది.
అయితే ఆ ట్యాంకర్ లో నెయ్యిని టీటిడీలో ఉన్న వ్యవస్తతో కాకుండా గుజారాత్ కంపెనీతో పరిక్షలు చేయించి రిపొర్ట్ తెప్పించారు, ఆ సంస్థ పై కూడా గతంలో అనేక్ ఆరొపణలు ఉన్నాయి, పైగా ఆ రిపొర్ట్ ఇచ్చే సమయంలో ఆ సంస్థే ఆ రిపొర్ట్ డిస్క్లైమర్ లో ఈ రిపొర్టు కోర్టుల్లో చెల్లదు ఆ సాంపిల్స్ మేమే సేకరించినవి కావు , ఈ సాంపిల్స్ ఎక్కడనుండి తెచ్చారో మాకు తెలియదు అని స్పష్టంగా రాసింది.

ఆ సాంపిల్స్ వచ్చిన నెల తరువాత చంద్రబాబు యాగీ చేయడం ప్రారంభించారు. అది కూడా ఆ సాంపిల్స్ ని తెలుగుదేశం ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు. తిరుమల గేట్ కూడా దాటని నెయ్యిని ఏకంగ లడ్డూలో కలిసిందని దానినే బక్తులకి పంచారని ప్రచారం అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ కల్తీ లడ్డూలే అయొద్య రామాలయానికి కూడా పంపారని ఆరొపణ చేశారు. నిజానికి అయొద్యకు లడ్డూలు పంపింది జనవరిలో , ఏ.ఆర్ డైరీ సరఫరా ప్రారంభించింది జూలై నుండి పైగా రామాలయానికి జనవరిలో పంపిన లడ్డూలో వాడిన నెయ్యి తిరుమల బోర్డ్ మెంబర్ గా ఉన్న సౌరబ్ బోరా ఇచ్చిన దానమే కానీ టెండర్లలో తెచ్చీన్ నెయ్యి కాదు. కానీ పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు.
నిభంధనలు కఠినతరం చేసింది వైసీపీ హయాంలోనే
ఆవు నెయ్యి సేకరణకు నిబంధనలను మరింత కఠినతరం చెసింది వైసీపీ పాలనలోనే. 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించి అమలు చేశారు. ఆవు నెయ్యి సేకరణ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం ఐదేళ్లు వరుసగా డెయిరీలో నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండాలని, జాతీయ డెయిరీలైతే రోజుకు 4 లక్షల లీటర్లు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే రోజుకు 2 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలైతే రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తుండాలని నిబంధనలు పెట్టారు. ఈ నిభంధలే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కోనసాగిస్తుంది. ఈ నిభనదలు మేరకే ఏ.ఆర్ డైరీ టెండర్లు దక్కించుకుంది. కానీ ఆ డైరీ వేరే డైరీలతో కుమ్మక్కైందని సీబీఐ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు కల్తీ జరిగిన దానిపై కాదు కేవలం రికార్డులు తారుమారు చేసి టెండర్లు దక్కించుకున్న దానిపైనే. ఇల దక్కించుకునా టీడీపీ ప్రమాణాల ప్రకారం టెస్ట్ పాస్ అయితేనే నెయ్యి ట్యాంకర్ తిరుమలోకి అడుగు పెట్టగలదు లేకపోతే తిప్పి పంపేస్తారు.రేట్ విషయం చూస్తే
2014లో బాబు సీంఎగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్టోబర్‌లో కిలో రూ.306, రూ.325 చొప్పున కొనుగోలు చేసిన టీటీడీ.. 2015 జూన్‌లో కిలో రూ.276, రూ.279 చొప్పున కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? బహిరంగ మార్కెట్‌లో రూ.1100 నుంచి రూ.1200 ఉంటే ఏ విధంగా కిలో రూ.320కి సరఫరా చేశారని ప్రశ్నిస్తున్నారు. అదే వారు రూ. 276కు ఎలా కొన్నారు? మరీ చంద్రబాబు హయాంలో ఇంత తక్కువ ధరకు టీటీడీకి కొనుగోలు చేసిందంటే అప్పట్లో కూడా జంతువుల కొవ్వు కలిపిన నెయ్యినే టీటీడీకి ఆయా కంపెనీలు సరఫరా చేశాయా?

No comments: