Comments

"మత ఘర్షణలు వాటి నివారణ" (__భగత్ సింగ్__ )

( 1927 లొ కీర్తి అనే పత్రిక లొ భగత్ సింగ్ రాసిన "మత ఘర్షణలు వాటి నివారణ" అనే వ్యాసం యదాతదంగా మీకొసం )
"మత ఘర్షణలు వాటి నివారణ" (__భగత్ సింగ్__ )


నేడు మన భారత దేశ పరిస్థితి చాలా భయానకంగా తయారు అవుతుంది. ఒక మతం ని అనుసరించె వారు వేరే మతం ని అనుసరించెవారిని పరస్పరం దారుణ శత్రువులు గా చూస్తున్నారు. వేరు వేరు మతాల ప్రజల మద్య విద్వేషం నానాటికి పెరిగిపొతుంది. ఇలా విద్వషాలు పెరగటానికి అతి పెద్ద కారాణాలు కూడా లేవు, కేవలం అవతలి వ్యక్తి పరాయి మతం అని ఒక్క కారణం సరిపొతుంది. నేను చెబుతున్న వాటిమీద ఏమైనా అనుమానం ఉంటే మీరు ఇటీవల లాహొర్ పట్టణం లొ జరిగిన అల్లరులను విశ్లేషించి చూడవచ్చు, ఎలా మహమదీయ సామాజిక వర్గం సిక్కు మరియు హిందు సామాజిక వర్గం మీద పడి మారణకాండ జరిపారొ, దీనికి గాను సిక్కు సామాజిక వర్గం ఎలా తీవ్రంగా స్పందించిందొ. ఈ పరస్పర హత్యలు అవతలి వారు నేరం చెసారు అనొ దానికి గాను వారికి శిక్ష వేస్తున్నామనొ అనటానికి వీలు లేదు. ఈ దారుణ మారణహొమం కి పాల్పడటానికి వారికి ఉన్న ఒకే ఒక్క బలమైన కారణం అవతలి వ్యక్తి తమ మతం వాడు అవ్వకపొవటమే. ప్రస్థుతం ఇటువంటి స్థితి లొ ఉన్న భారత దేశం ఏమౌతుందొ ఆ దేవుడు ఒక్కడికే తెలియాలి.
నేడు భారత దేశ భవిష్యత్తు ఏంటి అని ఆలొచిస్తే చాలా విచారంగా ఉంది. నేడు భారత దేశం మతం అనే చట్రం లొ ఇరుక్కుపొయి ఉంది. ఇటువంటి పరిస్థితులలొ జరుగుతున్న మత ఘర్షణల నుండి భారత్ దేశం ఎప్పుడు శ్వేచ్చ పొందుతుందొ ఎవ్వరికి అంతుపట్టటం లేదు, ఇటువంటి మత ఘర్షణల వలన ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు పల్చబడుతుంది, మూడనమ్మకాల వరదలొ ప్రజలు ఎలా కొట్టుకుపొతున్నారొ మనం చూస్తున్నం. ఇలా దేశ ప్రజలు తమ ఆదిపత్యం కొసం ఒకరిని ఒకరు చంపుకుంటుంటే. ఈ అల్లరి జ్వాలలొ బ్రిటీష్ ప్రభుత్వం తమ కత్తికి పదును పెడుతు రొజురొజుకి బలపడుతుంది.
ఇలాంటి దుర్భర పరిస్థితులలొ మత పెద్దలు , పత్రికలు వీరిని ఎలా రెచ్చ గొడుతున్నారొ మనం గమనించవచ్చు. ఇటువంటి మత విద్వేషాలు ప్రభలుతున్న సమయం లొ భారత దేశ నాయకులు మౌనం వహించటానికి నిర్ణయించుకున్నారు. కాని ఈ నాయకులే భారతదేశం కి స్వేచ్చ తీసుకువచ్చే మార్గదర్శకులుగా చెప్పుకుంటారు. ఇదే నాయకులు మాకు స్వరాజ్యం కావలి అని గొంతు ఎత్తి నినదిస్తారు , ఇదే నాయకులలొ కూడా కొంత మంది మతం అనే మూడనమ్మకాల చట్రం లొ ఇరుక్కుని ఉన్నారు. మత ఘర్షణ సమయం లొ ముఖం చాటేసే నాయకులు ఉన్నారు. కొంతమంది నాయకులు అల్లర్ల సమయం లొ ఏదొ ఒక మతం కి వారు బహిరంగం గా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. చిత్తశుద్ది తొ అందరిగురించి ఆలొచించే నాయకులు కొంతమంది మాత్రమే ఉన్నారు. కాని వీరు భలమైన మత జాడ్యం ని అడ్డుకొలేక పొతున్నారు.దీనిబట్టి మనకి భారత దేశ నాయకత్వం పూర్తిగా దివాళా తీయబడింది అని మనకి అర్ధం అవుతుంది.
ఈ మత ఘర్షణలు జరగడానికి ప్రొత్సాహం అందిస్తున్న ఇంకొక తెగ ఉంది, వారు ఏవరొ కాదు పత్రికలలొ వ్యాసాలు రాసేవారు. ఒకప్పుడు జర్నలిజం అనేది అత్యంత గౌరవించదగిన వృత్తి, కాని నేడు అది ఒక మురికి గుంట. వీరు అవతలి మతం మీద విషం చిమ్ముతూ పెద్ద పెద్ద అక్షరాలతొ శీర్షికలతొ కూడిన వ్యాసాలు రాస్తారు. దీని వలన మతాల మద్య జ్వాల మరింత గా రగులుతుంది, ఇది నేను ఏదొ గాలిలొ ఆరొపణలు చెయటం లేదు. మీరు తాజాగా మతఘర్షణలు జరిగిన ప్రాతం లొని పత్రికలను పరీక్షించి చూసుకొవచ్చు. వారు పరాయి మతాల మీద ఏలా విషం చిమ్ముతు వ్యాసాలు రాశారొ అర్ధం అవుతుంది. దారుణ పరిస్తితులలొ మనస్సు దగ్గర పెట్టుకుని దేశానికి మేలు కలిగేలా వ్యాసాలు రాసేవారు నేడు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు.
నిజంగా పత్రికల భాద్యత పాటకులని విద్యావంతులని చేసేలా ఉండాలి. వారు చెడుకు దూరంగా ఉండేలా వ్యాసాలు ప్రచురించాలి. పరస్పర మతాల మద్య స్నేహ భావిత వాతావరణం పేరిగేలా శీర్షికలు అందించాలి,ఒకరిమీద ఒకరికి నమ్మకం కలిగేలా కృషి చెయాలి , స్వరాజ్యం కొసం చేయి చేయి కలిపి పొరాడే వారిగా ప్రజలను తయారు చెసే వ్యాసాలు రాయాలి. కాని నేడు పత్రికలు వీటికి పూర్తి విరుద్దం గా ప్రవర్తించి , స్వాతంత్రం కొసం ఒక్కటిగా పొరాడవలసిన భారతీయులని విడగొడుతుంది. ఇటువంటి పరిస్థితులలొ భారత దేశ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే నాకు భరించలేని ఆవేదన తొ కంట వెంట నీరు వస్తుంది.
సహాయ నిరాకరణ ఉద్యమ సమయం లొ ఏ ప్రజలు అయితే అమిత మైన ఉత్సాహం చూపించి గౌరవింప బడ్డారొ వారు ఇప్పుడు దయనీయంగా తయ్యారు అయ్యారు. కళ్ళ ముందు స్వాతంత్రం కనపడిన రొజులు ఎక్కడ. మరి నేడు చూస్తే స్వాతంత్రం అనేది మనకి సుదుర కల లాగా మిగిలిపొయింది. సహాయ నిరాకరణ ఉద్యమ సమయం లొ బ్రిటీషు వారి పునాదులు కదిలి వారి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. కాని నేడు వారే మునుపట కన్న బలం గా ఈ దేశం లొ పాతుకుపొయారు..
ఈ మత ఘర్షణలకి మూల కారణం బహుశా ఆర్ధిక పరిస్థితి కావచ్చు. సహాయ నిరాకరణా ఉద్యమ సమయం లొ నాయకులు విలేఖరులు అమితమైనా త్యాగాలు చేశారు. వారు చేసిన త్యాగాలు కారణాం గా వారి ఆర్ధిక పరిస్థితి గనణీయంగా క్షీనించిపొయింది, ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం అర్ధాంతరంగా ఆపివేయబడిందొ ప్రజలకి ఈ నాయకుల పైన నమ్మకం పొయింది. ఇప్పుడు ఉన్న మత పెద్దలు ఏవరైతే ఉన్నారొ వారు ఆ సమయం లొ ఆర్ధికంగా దివాళ తీశారు. ప్రపంచం లొ ఏది జరిగినా దాని వెనుక ఉండే మూల కారణం ధనం అని అతి సులువుగా గుర్తించవచ్చు. కార్లమాక్స్ ముఖ్యమైన మూడు సిద్దాంతాలలొ ఇది కూడా ఒకటి, తబ్లిగీ అనుభవానికి సుద్ది సంస్త కి ఈ కార్లమాక్స్ సిద్దాంతం ని ఆపాదించవచ్చు మనం చెప్పుకొలేని విషాదం లొ ఉండటానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
ఈ మత ఘర్షణలకి ఏదైనా పరిష్కారం ఉంది అంటె ముఖ్యంగా భారత దేశ ఆర్ధిక పరిస్థుతలని మెరుగు పరచాలి, భారత దేశం లొ సాదారణ పౌరిని ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక వ్యక్తి మరొ వ్యక్తికి 25 పైసలు ఇచ్చి మూడొ వ్యక్తి మీదకి ఉసి గొలుపుతున్నాడు. నేడు ప్రజలలొ కొంత భాగం ఆకలి పొరాటాలు , చావు బ్రతుకుల మద్య జీవన ప్రయాణం లొ దుర్భర పరిస్థుతుల వలన వారు కొన్ని విలువలను పక్కన పెడుతున్నారు.కాని ఇప్పటి పరిస్థితులలొ ఆర్ధిక వ్యవస్థలొ అసమానతలను త్వలగించటం అత్యంత కష్టం అయిన పని, మనం విదేశీ పాలన లొ ఉన్నాం. వారు భారత ప్రజల ఆర్ధీక వ్యవస్థ పెంపొందించాలి అనే ఆలొచన ఏట్టి పరిస్థితులలొ చెయరు. స్వదేశ పాలన కొసం ప్రజలు పొరాడటానికి ఇది ఒక ముఖ్య కారణం
ప్రజల మద్య వైషమ్యాలు తగ్గించాలి అంటె నేటి రొజున వారి మద్య సామాజిక స్పృహ పెంపొందించటం చాలా అవసరం. కూలీలకి రైతులకి నిజమైన శత్రువు పెట్టుబడిదారి వ్యవస్థ అని వారికి తెలిసేలా చెయాలి. వారు గుడ్డి గా పెట్టుబడి దారి వ్యవస్థ మాయలొ పడకుండా చూడాలి. ప్రపంచం లొ ఉన్న పేదవారు అందరికి జాతి,మతం,కులం,వర్ణం అనే భేధం లేకుండా అందరికి సమాన హక్కులు ఉన్నాయి, జాతి మతం ప్రాంతం భేధం లేకుండా వీరు ఎప్పుడు అయితే చేతులు కలుపుతారొ ఆరొజున కచ్చితంగా అధికారం వీరి పాదాల దగ్గరికి వస్తుంది. దీని కొసం వీరు ప్రయత్నించటం లొ వీరు కొల్పొయేది ఏమి లేదు. ఒక రొజు కచ్చితంగా వీరు ఆర్ధిక చట్రం అనే సంకెళ్ళ నుండి భంద విముక్తులు అవుతారు.
ఎవరికైతే రష్యా చరిత్ర తెలుసొ వారు మీకు చెబుతారు జార్ పాలన సమయం లొ వివిద సంఘాలు ఒకరిమీద ఒకరు ఎలా ఆరొపణలు చెసూనేవారొ కాని ఎప్పుడైతే బొల్షివిక్కులు చెతికి పాలనా పగ్గాలు వచ్చాయొ పరిస్థితులు పూర్తిగా మారిపొయాయి అప్పటి నుండి రష్యాల ఘర్షణలు జరిగిన దాకలాలు లేవు. నేడు అక్కడ ప్రతి వ్యక్తిని మానవుడిగా సమాన హక్కుదారునిగా గుర్తిస్తున్నారు, జార్ పాలన లొ ప్రజల ఆర్ధిక స్థితి నీచంగా ఉండేది అందుకని అక్కడ అల్లరులు ఘర్షణలు జరిగేవి కాని నేడు రష్యా ఆర్ధిక స్థితి ఘననీయంగా పెగటంతొ పాటు ఆర్ధీక తరగతుల మద్య అవగాహన పెరిగింది. ఈ మార్పు వచ్చినప్పటి నుండి రష్యాలొ అల్లరులు , ఘర్షణలు జరిగినట్టు నమొదు కాలేదు.
సాదారణం గా అల్లరులు అతి నిరుత్సాహం కలిగించే వార్తలు తెస్తుంటాయి , కాని కలకత్త లొ జరిగిన అల్లరులలొ చాలా అనందకరమైన వార్త వినిపించింది. అక్కడ కార్మిక సంఘాలు అక్కడ అల్లరులలొ పాలుపంచుకొక పొగా కార్మిక వర్గం లొని హిందువులు మహమదీయులు కలిసి ఆ కొట్లాట వ్యాప్తి చెందకుండా తమ ప్రయత్నం చేశారు, ఇది జరగటానికి కారణం కార్మికులలొ సామాజిక స్పృహ ఉండటం వారి సంఘం యొక్క అభిరుచులు ఎంటొ వారు పూర్తిగా గుర్తించటం కలకత్తాలొ ఈ సామాజిక స్పృహ అనే ఒక్క ఉదాహరణతొ మత ఘర్షణలు జరిగినా ఎలానివారించవచ్చొ మనకి ఒక దారి దొరికింది.
మనకి ఇంకొక సంతొష కరమైన వార్త ఏమిటి అంటే ఎక్కువ శాతం భారత యువత ఈ మత ఘర్షణల నుండి దూరంగా ఉంటుంది. వారి స్వభావం చూస్తే వారు హిందువులా , మహమదీయులా , సిక్కులా అనేదాని కన్న వారు సాటి మనిషిని మనిషి గా భారతీయులుగా గుర్తిస్తున్నారు, భారత యువత లొ కలిగిన ఈ ఆలొచనలతొ నాకు భారత భవిష్యత్తు మీద ఆశ చిగురించింది, భారత దేశం ఈ మత ఘర్షణల వలన నిరుత్సాహం చెందకూడదు. ప్రతి ఒక్కరి మీద మత కలహం చెలరేగే వాతావరణం కలగకుండా చూసుకొవలసిన భాద్యత ఉంది 1914-15 అమరవీరులు ( గద్దార్ విప్లవకారులు) రాజకీయాల నుండి మత విశ్వాసాలను దూరంగా పెట్టారు. వారు మత విశ్వాసం ని సొంత విషయం గా దానిలొ వేరే వ్యక్తి జొక్యం అవసరం లేదు అని భావించారు. వారు రాజకీయాలలొ మతం ఉంటే ఉమ్మడి హక్కుల కొసం పొరాడేసమయం లొ అందరిని కలిసి ఒక్కతాటిమీదకు తీసుకురాలేము అని భావించారు. గద్దార్ పార్టి విప్లవం లొ హిందువులు, సిక్కులు , మహమదియులు కలిసి పని చెయటానికి ఇది ఒక ముఖ్య కారణం.
నేడు స్వాతంత్రం కొసం పొరాటం చెసే కొత్త రాజకీయ నాయకులు వచ్చారు, వీరు మతాలని రాజకీయాలకి దూరంగా పెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. మత ఘర్షణలు నివారించటనికి ఇది ఒక అద్భుతమైన దారి. మనకి వివిద రకముల మత విశ్వాసాలు ఉన్నా మనం రాజకీయాలనుండి మత విశ్వాసాలను దూరం చెయగలిగితే, ఉమ్మడి ప్రయొజనాల కొసం జరిగే పొరాటం లొ అందరిని ఒక్కతాటిమీదకు తీసుకురావచ్చు. భారత దేశం ని ప్రమించే ప్రతిఒక్కరు ఈ నివారణల గురించి ఆలొచించి భారత దేశం శ్వియ విద్వంశం కి గురి అయ్యే దారికి దూరం గా ఉంటారు అని ఆశిస్తున్న....
__భగత్ సింగ్__
"మత ఘర్షణలు వాటి నివారణ" (__భగత్ సింగ్__ ) "మత ఘర్షణలు వాటి నివారణ" (__భగత్ సింగ్__ ) Reviewed by surya on 5:08 PM Rating: 5

No comments:

Powered by Blogger.