Comments

ప్రధమ స్వాతంత్ర సంగ్రామం - ఆంద్రా లొ తిరుగుబాట్లు

ప్రధమ స్వాతంత్ర సంగ్రామం - ఆంద్రా లొ తిరుగుబాట్లు


సిపాయుల తిరుగుబాటు గా వ్యవహరించబడే భారత ప్రధమ స్వాతంత్ర సంగ్రామం 1857 లొ జరిగింది తిరుగుబాటు కు ఉత్తర ప్రదేశ్ కేంద్రం గా నిలిచింది , మీరుట్ , లక్నొ, కాన్ పూర్ సైనికులు యురొపియన్ అధికారులని చంపారు , విప్లవకారులని అనిచి వేయటానికి బ్రిటీష్ అధికారులు చాలా క్రూరంగా ఫిరంగి గొట్టాల మూతులకి విప్లవకారులని కట్టి కాల్చి చంపి వేశారు 1859 లొ ఈస్ట్ ఇండియా కంపెనీ ని త్వలగించి బ్రిటీష్ పార్లమెంట్ భాతర దేశాన్ని పాలించ సాగింది విక్టొరియా మహారాణి భారత దేశ కిరీటం ని ధరించింది.

ఈ ప్రధమ స్వాతంత్ర సంగ్రామం లొ దక్షిన భారత దేశం పాల్గొనకపొయినా , దానికి ముందు వెనుకా ఆంద్ర దేశం లొ చదురు మదురు తిర్రుగుబాట్లు జరిగాయి.

1780 అక్టొబర్ 3 న విశాఖపట్నం లొ సిపాయుల తిరుగుబాటు జరిగింది , బ్రిటీషు వారిని మన దేశం నుండి తరిమి వేయటానికి ఒక వీరుని గా మైసూర్ సుల్తాన్ హైదరాలి ప్రయత్నిస్తునాడు అని ప్రజలు భావించారు. ఇది పసిగట్టిన బ్రిటీషు అధికారులు నాలుగు సైనిక పటాలాలను హైదరాలి మీదకు యుద్దానికి కదలాలి అని విశాఖ లొని సైన్యానికి ఆర్డర్ వేసారు. మేము హైదరాలి తొ యుద్దం చెయము అని నాలుగు సైనిక పటాలాలు తిరుగుబాటు చెసి అక్కడి బ్రిటీష్ ఉన్నతా అధికారులని చంపి పారిపొయారు, ఆ మరుదినమే ఒక బ్రిటీష్ ఆఫీసర్ అదనపు సైన్యం తొ పారిపొతున్న సైనికులని వెంబడించి కనబడ్డ వాడిని కనబడినట్లు కాల్చి వేశారు.

తమ తలపాగాలని తీసివేయాలి అన్న ఆర్డర్ కి నిరసనగా మచిలీపట్నం లొని సిపాయులు 1806 లొ తిరుగుబాటు చెసారు , దాని ఫలితంగా బ్రిటీష్ అధికారులు అప్పుడు ఆరుగురు సైనికులని కాల్చి చంపారు

1837 లొ గొల్కొండ ఏజన్సి ప్రాంతానికి పాలకుడిగా ఉన్న ఆనంద భూపతిని పన్నులు చెల్లించలేదు అనే నెపం తొ బ్రిటీష్ వారు త్వలగించారు. ఇందుకు నిరసనగా కొండ దొరలు భూపతి వంశం అయిన చిన భూపతిని ఏలిక గా ఎన్నుకుని మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సిస్తులు కట్టకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఇక్కడ తమ పప్పులు ఉడకవు అని తెలుసుకున్న ప్రభుత్వమే దిగి రాగా, కొన్ని ఒప్పందాలపై చిన భూపతి తిరుగుభాటుని విరమించుకున్నాడు.

1838 లొ కర్నూల్ నవాబు రసూల్ ఖాన్ బ్రిటీష్ వ్యతిరక కుట్ర చెసాడు. ఈ కుట్ర లొ నెల్లూరు జిల్లా ఉదయగిరి నవాబు కూడా పాల్గొన్నాడు. నవాబు రసూల్ ఖాన్ ను బ్రిటీష్ వారు అరెస్టు చెసి తిరుచాన్ పల్లి జైలుకు పంపగా , రసూల్ ఖాన్ జైలు లొ మరణించాడు.

కర్నూల్ జిల్లా కొవెల కుంట్ల తాలుకా ఉయ్యాలవాడ మండలం రూపన గుడి గ్రామం లొని పెద్ద మల్లారెడ్డి చిన్న కుమారుడు అయిన రేనాటి నర సిం హా రెడ్డి మన దేశ స్వాతంత్ర చరిత్ర లొ మూల స్తంభం అయి నిలిచాడు. 1846 లొ గెరిల్లా పొరాటం తొ తెల్ల దొరల సామ్రాజ్యానికి తన పదునైన ఖడ్గం తొ సవల్ విసిరిన ఉగ్రుడు -- ఉయ్యాలవాడ వాడ నరసిం హా రెడ్డి ని ఉరి తీసారు.

1857 తిరుగుబాటు వార్తలు విని ఉత్తేజుడై బళ్ళారి జిల్లా లొ భీమ రావు అనే ఒక మాజీ తాహసీల్దారు ఒక తిరుగుబాటు లేవదీసాడు. హొస్పేట కి 26 మైళ్ళ దూరం లొ ఉన్న " కొబ్బాల్" ను తిరుగుబాటు దారులు స్వాదీన పరుచుకున్నారు. తుంగభద్రా నది ఒడ్డున బ్రిటీష్ సేనలకు , తిరుగుభాటు దారులకు ఘర్షణ జరిగగా అక్కడ భీమ రావు తొ సహా వందమంది దాకా మరణించారు. 77 మందిని జైలు లొ పెట్టి తరువాత ఉరి తీసారు.

క్రమేపి మెల్లి మేల్లిగా ప్రధమ భారత సంగ్రామ వార్తలు దేశం అంతా వ్యాపించగా 1864 - 65 లొ బ్రిటీష్ వారు ఏజన్సీ ప్రాంతం అంతా పొలీస్ స్టేషన్లు స్థాపించారు. 1879 -80 ప్రాంతం లొ ప్రారంభం ఐన పితూరి ప్రభావం గొల్కొండ మీద ప్రసరించి 1879 జూన్ 3 వ తేది పొలీసులకు కొండ దొరలకు ఘర్షణ జరిగింది. కొండ దొర నాయకుడు అయిన వీరయ్య ను బ్రిటీష్ వారు కాల్చి చంపారు , 1856 లొ ఒకసారి 1891 లొ ఒకసారి కొండ దొరలు పితూరీలు చెసారు. గూడేం , చింతపల్లి , క్రిష్నదేవి పేట పొలీస్ స్టేషన్ లపై 200 మంది సాయుద ప్రజలు దాడి చెసి పొలీసులని చంపి వేసి ఆయుధాలతొ కొండల్లొకి పారిపొయారు. వారి నాయకుడు శాంతి భూపతి మరణించటం వలన తిరుగుభాటు విఫలం అయింది.

1864 లొ పొలీసులు తమ నాయకుడు ని అరెస్టు చెసినందుకు నిరసన గా గుమపూర్ తాలూకా లొని ఒక పొలీస్ ఇన్స్పెక్టర్ ని నలుగురు పొలీసులని చంపి పొలీస్ స్టేషన్ ద్వంసం చేసారు. తరువాత 1866 నుండి 1900 వరకు జరిగిన వి అన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లు గా నమొదు అయినాయి.

1900 లొ సాలూరు తాలూకా లొని కొర్ర వాని వలస లొ తిరుగుబాటు జరిగింది. కొర్ర మల్లయ్య అనే కొండ దొర 5 వేల మంది ప్రజలని చేర తీసుకుని బ్రిటీషు వారిని ఏదిరించాడు. ఆ తిరుగుబాటు ని అనిచివెసేందుకు జిల్లా కలక్టర్ ముగ్గురిని ఉరి తీయించాడు.

1879 లొ విస్త్రుత మైన రంప పితూరి గొదావరి ఏజన్సీ ప్రాంతం లొ జరిగింది. మన్యం రైతులు , ముటా దారులు , అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ తిరుబాటు లేవతీసారు. రంప చొడవరం లొ ప్రారంభం అయిన ఈ పితూరి భద్రాచలం , రేకపల్లి, గొలు కొండ , ప్రాంతాలకి విస్తరించింది. తిరుగు బాటు దార్లకు ద్వారబందాల చంద్రయ్య , పులిచింత సారయ్య, అంబుల్ రెడ్డి , నాయుకులైయారు 1879 లొ ద్వారబందాల చంద్రయ్య అడ్డతీగల పొలీస్ స్టేషన్ ని ద్వంసం చేసాడు, అదే సంవత్సరం నవంబర్ లొ చంద్రయ్య అనుచరులని 79 మందిని , అనంతరం 1880 లొ ఫిబ్రవరి లొ చంద్రయ్య ని పొలీసులు కాల్చి చంపారు.

1879 జులై 10వ తేదీన అంబుల్ రెడ్డి నాయకత్వం లొ వడ్డి గూడేం పొలీస్ స్టేషన్ ని తగులబెట్టారు, 1880 లొ తమ్మన దొర రేకపల్లి ని స్వాదీనం చెసుకున్నాడు. బ్రిటీష్ సైనికులు క్రమం గా తిరుగుబాటు దార్లని స్వాదీనం చెసుకున్నారు. ఆతరువాత వారిని కాల్చివేస్తు ప్రజల పై క్రూర నిర్భంధం ని అమలు చెసారు.

1922 లొ పల్నాడు లొ పుల్లరి ఉద్యమం నడిపి , ఈ చెట్టు నువ్వు పెట్టావా ? విత్తు నువ్వు పెట్టావా? నారు నువ్వు పోశావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగడ్డ పై నీకేక్కడి నుంచి వచ్చింది పెత్తనం? `` అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో గర్జించిన పల్నాటి వీరుడు మీంచాలం పాడు గ్రామానికి చెందిన కన్నెగంటి హనుమంతు ని రూదర్ ఫొర్డ్ ఆద్వర్యం లొ కాల్చి చంపారు , ఇక్కడ ఈ బ్రిటీష్ అదికారి కన్నెగంటి హనుమంతు లేవతీసిన విప్లవాన్ని అనిచి వేగలిగాడు అని ఇతనినే అల్లూరి ని కూడా మట్టు పెట్టమని అక్కడి పంపి ఇతని ఆద్వర్యం లొనే అల్లూరిని కూడా దొంగదెబ్బ తీసారు

మన్యం ప్రాంతం లొ 1922 లొ అల్లూరి సీతారామ రాజు నాయకత్వం లొ మన్యం తిరుగుబాటు జరిగింది. 1922 జనవరి లొ సీతారామ రాజు కొండ దొరలను , ప్రజలను సమీకరించుకుని రాజవొమ్మంగి పొలీస్ స్టేషన్ పై దాడి చెసి ఖైదు లొ ఉన్న వీరయ్య దొర ను విడిపించారు, వీరయ్య దొర , గంటం దొర , మల్లు దొర, సీతా రామరాజు కుడి భుజాలు గా నిలబడి తిరుగుబాటు లొ సహాయ పడ్డారు . సితారామ రాజు దళాలు అనేక పొలీస్ స్టేషన్ల పై దాడి చేసి ఆయుదాలు స్వాదీనం చెసుకున్నారు. సీతారామ రాజు బ్రుందం కి బ్రిటీష్ సేనలకు మద్య రెండు సంవత్సరాల పాటు తీవ్ర ఘర్షణ జరుగగా చివరికి పితూరి ఒడిపొయింది. వందలాది పితూరి దార్లు మరణించారు.

ఇలా మన ఆంద్ర దేశపు యొదులు కూడా ప్రధమ స్వాతంత్ర సంగ్రామం లొ శంఖారావం చెసి అనేక కష్ట నష్టాలు భరిస్తు చివరికి ప్రాణాలు సైతం పణం గా పెట్టి చరిత్ర లొ చరగని పేరు సంపాదించుకున్నారు.
ప్రధమ స్వాతంత్ర సంగ్రామం - ఆంద్రా లొ తిరుగుబాట్లు ప్రధమ స్వాతంత్ర సంగ్రామం - ఆంద్రా లొ తిరుగుబాట్లు Reviewed by surya on 5:56 PM Rating: 5

No comments:

Powered by Blogger.