Comments

కూటమి ప్రభుత్వంలో దేవుళ్లపై దాడులు , హిందువుల మనోభావాలకి పాతర

 తిరుమలలో ఒక్కో గదిని 100 రూపాయలకి బ్లాక్ చేసి వెయ్యికి అమ్ముకున్న అధికార పార్టీ నాయకులు



కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని అపర్ణదేవి గుడి నిర్వహణ బాధ్యతల విషయంలో టిడిపి, జనసేన పార్టీ నాయకుల మధ్య ఘర్షణ గ్రామంలో ఉద్రిక్తత.



శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశాడు. ఆలయ నిర్మాణ స్థలం పక్కనే ఇతనికి స్థలం ఉండటంతో అక్కడ ఆలయం కడితే తన స్థలం ఇక ఎవరు కొనరని చెబుతూ ఈ పని చేశాడు.



బయట తయారు చేసిన లడ్డూనూ కనక దుర్గమ్మ లడ్డూగా చెబుతూ బక్తులకి ఇచిన ఆలయన పవిత్రతను పోగోట్టిన కూటమి ప్రభుత్వం.



తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల పుణ్యక్షేత్రంలో రీల్స్ చేస్తు భక్తులతో ప్రాంక్ వీడియోలు చేసిన అల్లరి మూకలు.



టీటీడీ నిధులను పక్కదారి మళ్ళిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం కోసం ఈవోకు ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.



శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. శ్రీవారి భక్తులకి అదనపు లడ్డూలపై టీటీడీ ఆంక్షలు. ఒక్క భక్తుడికి ఒక్క లడ్డు మాత్రమే ఇస్తామంటూ కొత్త రూల్. ఆధార్ కార్డు ఉంటేనే అదనపు లడ్డు. అది కూడా నెలలో ఒక్కసారి మాత్రమే భక్తుడికి అవకాశం.



తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి. టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి, అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించిన భక్తలు, టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా మమ్మల్ని వెళ్ళిపోమన్నారు - భక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి భక్తుల డిమాండ్



కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుడికి నివేదించే మహానైవేద్యం కల్తీ బెల్లంతో తయారవుతున్నట్లు నిర్ధారణ అయింది. దేవస్థానానికి సరఫరా అవుతున్న బెల్లం పూర్తిగా కల్తీదేనని, అందులో పంచదార అధికంగా కలుస్తోందని జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ తేల్చింది.



విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయం లోని లడ్డూ తయారీ కేంద్రానికి మందీ మార్బలాన్ని వెంటేసుకె ళ్లెన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రసాదాన్ని చేతు ల్లోకి తీసుకుని రుచి చూడటం భక్తులను విస్మయానికి గురిచే సింది. విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రసాదాలను రుచిచూడటం భక్తుల మనోభావాలతో ఆటలాడటమే అనే విమర్శలు వచ్చాయి. 



బ్లాక్ లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్న ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదు. కూటమి ప్రభుత్వం రాగానే లోకేష్ ని కలిసి ఆ పార్టీతో జతక్కట్టి ఇలాంటి పని చేసిన జకియా ఖానంపై భక్తుల ఆగ్రహం.



విజయవాడలో దేవాలయాలు కూల్చి వేత. శ్రీకృష్ణ మందిరం , గోశాల,  40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్ట తొలగింపు. శ్రీకృష్ణ విగ్రహాన్ని మున్సిపాలిటీ వ్యాన్ లో తీస్కుని వెళ్లడంతో భక్తుల ఆగ్రహం.



సింహాచలం దేవస్థానంలో బరితెగించిన మందుబాబులు. పెళ్ళిళ్ళ కోసం కొండపైకి వచ్చి మద్యం తాగి చిందులు.... సింహాచలం కొండపై కనిపించిన పర్యవేక్షణ లోపం.

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థంలో కొంతమంది యూట్యూబర్లు అశ్లీల నృత్యాలు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో 16వ శతాబ్దం నాటి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు నిత్యం పూజలు చేసే ఆ దేవాలయాన్ని దుండగులు నేలమట్టం చేసేందుకు యత్నించారు.

తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో జాతీయ రహదారి పక్కన కూరగాయల మార్కెట్లో వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ప్రతిష్ఠించారనే అక్కసుతో టీడీపీ నేతలు స్వామివారి విగ్రహం చెయ్యి, కాలు విరగ్గొట్టారు. విగ్రహం ఏర్పాటు చేసిన దిమ్మెను తవ్వేసి.. స్వామి విగ్రహాన్ని పెకలించి సమీపంలోని రైతు భరోసా కేంద్రం వద్ద పడేశారు.

తిరుమలలో పర్యావేక్షణ లోపం వలన శ్రీవారి భక్తులకు కష్టం ఎదురైంది. కొండపై భారీ వర్షం కురవడంతో లడ్డూ బూందీ తయారీ కేంద్రం నుంచి ప్రవహించే ఓ కాలువ నుంచి నెయ్యితో కూడిన మురుగు పొంగి ఆలయం, పుష్కరిణి మార్గంలో కొంతమేర ప్రవహించింది. శ్రీవారి దర్శనం ముగించుకుని, లడ్డూ ప్రసాదం తీసుకుని వస్తున్న భక్తులు ఈ మురుగుపై కాలు వేయ డంతో జారిపడిపోయారు. అలా అరగంట వ్యవధిలో అధికారుల నిలక్షయం వలన దాదాపు 11 మంది భక్తులు గాయపడ్డారు. 

మార్కాపురం మండలంలోని కొండేపల్లి గ్రామంలో ఏర్పడిన రాజకీయ వివాదంతో టీడీపీ నేతలు ఏకంగా ఎల్లమ్మ గుడికి తాళం వేసి భక్తులకి తీవ్ర అసౌకర్యం కలిగించారు. 


పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్ లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది.

కార్పొరేట్ కంపెనీలు, అర్హతలు లేని వ్యక్తులకు ప్రొటోకాల్ దర్శనాల వెనుక వెంకయ్య చౌదరి భారీ అవినీతి ఉందని ఆరోపిస్తూ వెంకయ్యచౌదరిని కూటమి ప్రభుత్వం తక్షణమే తొలగించాలని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు.  


తిరుమల శ్రీవారి ఆలయంపై గగనతలంలో హెలికాప్టర్ చక్కర్లు. ఆగమశాస్త్రం పకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో హెలికాప్టర్ ఎగరడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.


తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేసి సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న కూటమి ప్రభుత్వం

2004–05లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుట్టపర్తిలో 1.50 కోట్లు వెచ్చించి టూరిజం గెస్ట్‌ హౌస్‌ నిర్మించారు. తిరుమల తిరుపతి తరహాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తిని సైతం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పుట్టపర్తి నుంచి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు కొనసాగించకూడదని గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ నిబందనలు తుంగలోతొక్కి పుట్టపర్తిలోని సాయి ఆరామం హోటల్లో మద్యం దుకాణాల లైసెన్సుల ఖరారు కోసం లాటరీ తీసే కార్యక్రమం ఏర్పాటు చేయడంపై సత్యసాయి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విజయవాడ క‌న‌క దుర్గ‌మ్మ ఆలయంలో పవిత్రతను దెబ్బతీసేలా పోలీసులు కాళ్లకు షూ వేసుకొని అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వ‌హించారు. పోలీసులు షూ వేసుకుని డ్యూటీ చేయడంపై భవానీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశరు.  


తిరుమల ప్రతిష్టకు అప్రతిష్ట కలిగిస్తూ రాష్ట్రంలో అత్యధికంగా మద్యం షాపులను తిరుపతి జిల్లాకి ఇచ్చిన కూటమి ప్రభుత్వం




కూటమి ప్రభుత్వంలో దేవుళ్లపై దాడులు , హిందువుల మనోభావాలకి పాతర కూటమి ప్రభుత్వంలో దేవుళ్లపై దాడులు , హిందువుల మనోభావాలకి పాతర Reviewed by surya on 1:17 AM Rating: 5

No comments:

Powered by Blogger.