Comments

150 ఎకరాల కట్టడాలకి 54000 ఎకరాల భూమి ఎందుకు బాబు గారూ ?



29000 మంది రైతుల వద్ద 33000 ఎకరాల పంట భూమి , 21000 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకొని సీఆర్డీఏ ఏర్పాటు చేసి మీరు ఏ మహా నగరాన్ని నిర్మించారు బాబూ ?

మీరు నిర్మించిన కట్టడాలు , ఆరాకొరాగా పనులు మొదలైన కట్టడాలు ఏంటీ అన్నది ఒక్క సారి చూద్దాం .


నిర్మాణం పూర్తయిన కట్టడాలు :

తాత్కాలిక అసెంబ్లీ , తాత్కాలిక సెక్రటరియేట్ ,

అంతర్గత దారులు కలిపి = 47.00 ఎకరా

తాత్కాలిక హై కోర్ట్ = 4.00 ఎకరా

ఏపీ డిజిపి బిల్డింగ్. = 2.50 ఎకరా

మొత్తం పూర్తయిన నిర్మాణాలు= 53.50 ఎకరాలు


నిర్మాణం కొన సాగుతున్న కట్టడాలు :

గెజిటెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్స్. = 11.50 ఎకరా

ఛ్ర్ద బిల్డింగ్. = 5.78 ఎకరా

4వతరగతిఉద్యోగస్తుల బిల్డింగ్స్= 13.00 ఎకరా

ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నివాసాలు. = 10.48 ఎకరా

జడ్జిల నివాసాలు = 5.63 ఎకరా

ఐఏయ్స్, ఐపీఎస్ ల నివాసాలు = 6.00 ఎకరా

సెక్రటరీల నివాసాలు 1, 2 చ్త్గ్ = 12.00 ఎకరా

ఎంజీఓ హౌసింగ్ = 26.60 ఎకరా

మంత్రుల క్వార్టర్సు. = 5.39 ఎకరా

నిర్మాణం జరుగుతున్న కట్టడాలు = 96.38 ఎకరాలు 

ఈ నిర్మాణాలు కొన సాగుతున్న కట్టడాలు కూడా 20 శాతం నుండి 60 శాతం లోపు పనులు జరిగినవే . అంటే తాత్కాలిక కట్టడాలు మూడూ వదిలేస్తే బాబు గారు నికరంగా పూర్తి చేసింది ఒక్క డిజిపి బిల్డింగ్ మాత్రమే . ఈ నూట యాభై ఎకరాల కట్టడాలకి కనెక్టింగ్ రోడ్లు , డ్రైనేజ్ లు వసతుల కోసం ఇంకో నూట యాభై ఎకరాలు వాడుకలోకి తెచ్చినా మొత్తంగా రైతుల దగ్గర తీసుకొన్న 33 వేల ఎకరాలలో 300 ఎకరాల భూమి కూడా సద్వినియోగంలోకి తీసుకురాలేకపోయాడు . అంటే ఒక శాతం కూడా వినియోగించుకోలేక పోయాడు .

నికరంగా 150 ఎకరాల కట్టడాలు నాలుగేళ్లలో కట్టలేక కేవలం 50 ఎకరాలలో మూడు తాత్కాలిక కట్టడాలు కట్టి బేజారుమన్న బాబు గారు కనీసం ఓ ఎనిమిది వేల ఎకరాలలో సిటీ నిర్మించాలంటే ఎన్నేళ్ళు పడుతుంది . ఇటీవల ఆయన చెప్పినట్టు ఇంకో ఇరవై ఏళ్ళు బతికి రాజ్యమేలినా 600 ఎకరాలకి మించి నిర్మాణాలు చేయలేడనేది సత్యం 

మరి ఏ అత్యవసరాల కోసం హడావుడిగా ల్యాండ్ పూలింగ్ అని, 2017 నాటికి అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇస్తామని రైతులను మభ్యపెట్టి 33 వేల ఎకరాల భూమి తీసుకొని సాగుకు పనికిరాకుండా చదును చేసి , ప్లాట్స్ చూపించకుండా పాడు పెట్టారు .

చంద్రబాబు అనాలోచిత చర్యల వలన రైతులు , సమాజం ఎంత తీవ్రంగా నష్టపోయింది,

1. ముక్కారు పంటలు పండే ధాన్యాగారం లాంటి భూమిని కొల్పోయింది.

2. స్వయంకృషితో పంట పండించి సగర్వంగా జీవించే రైతులకు సకాలంలో ప్లాట్స్ ఇవ్వకపోవడం రైతులకు జరిగిన నష్టం, .

3. సాధారణ భూములు వాడకుండా నదీ పరివాహక , మూడు పంటలు పండే భూముల్ని తీసుకొని పంటలు పండించకుండా చేయడం జాతీయ ఆహార భద్రతకు నష్టం,.

4. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేట్లు ఆలోచించకుండా అనంతలో , కర్నూల్ లో నిర్మించాల్సిన సంస్థల్ని కూడా అమరావతిలో నిర్మించ తలపెట్టటంతో సీమ అస్తిత్వాన్ని రెచ్చకొట్టారు, .

5. రైతులకు సకాలంలో అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇవ్వక , చెప్పినట్టు నిర్మాణాలు చేయకుండా రోజుకో ప్లాన్ తో మాటలు చెప్పి ఈ రోజు రైతులు రోడ్డు పాలయ్యి వ్యవస్థకు వ్యతిరేకంగా నినదించే పరిస్థితికి తీసుకురావడం , ఇందులో కూడా టీడీపీ నాయకుల ప్రయోజనాల కోసం వారిని అమాయకుల్ని చేసి వాడుకోవడం సమాజ ద్రోహం .

ఇప్పటికైనా చంద్రబాబు భ్రమల్లో నుండి బయటికి వచ్చి , రైతుల్ని , రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడం ఆపేయాలి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా టీడీపీ పనితీరు ఉండాలి. 

150 ఎకరాల కట్టడాలకి 54000 ఎకరాల భూమి ఎందుకు బాబు గారూ ?  150 ఎకరాల కట్టడాలకి 54000 ఎకరాల భూమి ఎందుకు బాబు గారూ ? Reviewed by surya on 12:15 AM Rating: 5

No comments:

Powered by Blogger.