Comments

ఎన్.టి.ఆర్ ని రాజకీయాలలొకి రమ్మంది నేనే, పార్టి పెట్టమంది నేనే - చంద్రబాబు

ఎన్.టి.ఆర్ ని రాజకీయాలలొకి రమ్మంది నేనే, పార్టి పెట్టమంది నేనే  - చంద్రబాబు


"ఒక్కసారి చరిత్ర చూదం

( పూర్తి ఆదారాలు , క్రింద ఇచ్చిన ఫొటొలలొ చూడొచ్చు)

-> 1982 మార్చ్ 21 రామక్రిష్ణా స్టుడియొ లొ విలేఖరల సమావేశం పెట్టి నాకు మే 28 తొ 59 సంవత్సరాలు నిండి 60 లొకి వస్తాను ఇంక ప్రజా జీవితం లొకి వస్తాను అని ఎన్.టి.ఆర్ ప్రకటించారు.

రొజు జరిగిన సమావేశం లొ రామారావు గారు ఇలా అన్నారు (పోయిన సంవత్సరం ఊటి లొ జరిగిన ఒక పత్రికా సమావేశం లొ మీరు ఎం.జి.ఆర్ లాగా రాజకీయాలలొ ప్రవేసిస్తారా అని నన్ను అడిగారు, అప్పటి నుండి విషయం నా మనస్సు లొ మెదులుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా నాకు 900 పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి వారు టెలిగ్రాముల ద్వారా నామీద వత్తిడి అధికం చెసారు అని చెప్పారు ) ఎక్కడా చంద్రబాబు చెప్పరు అని రామారావు చెప్పలేదు.

చంద్రబాబు గురించి పత్రికల వారు అడిగితే ఇలా అన్నారు ( చంద్రబాబు ని పార్టిలొ చెరమని అడగలేదు తనకు తానుగా చెరితే స్వాగతిస్తాను ) అని అన్నారు.


-> 22 మార్చ్ 1982 - వెంటనే చంద్రబాబు తాను పార్టి మారబొను అని ప్రకటించటమే కాకుండా , రామారావు రొజు రాజకియాలలొకి వస్తా అంటున్నారు నేను ఎప్పటినుండొ కాంగ్రెస్ లొ ఉన్నాను నేను ఉన్న చొటనే ఉంటా అని ప్రకటించారు చంద్రబాబు (ఇక్కడ రామారావు గారు రాజకియ ప్రవేశం తన సొంత అల్లుడునే మెప్పించలెక పొయింది అని ప్రత్యర్ధి వర్గం నుండి కొంత అవహేళన ఎదుర్కొన్నారు )



రామారావు ప్రకటన రాగానే కాంగ్రెస్ పార్టి కి నాదెండ్ల భాస్కర్ రావు గారు , ఆదయ్య , రత్తయ్య , నారాయణ వారి పార్టి కి రాజీనామ చేశారు - ( బాబు గారు రాజీనామ చెయలేదు )

ఊటి లొ సినిమా షూటింగ్ ముగించుకుని 1982 మార్చ్ 29 హైద్రాబాద్ వచ్చి నేరుగా నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటికి రామారావు గారు వెళ్ళారు - ( రామారావు గారి వెంట బాబు గారు లేరు)

1982 మార్చ్ 29 న్యూ ఎం.ఎల్. క్వార్టర్స్ లొ పార్టి పేరు తెలుగుదేశం అని చెప్పినప్పుడు ( బాబు గారు అక్కడ లేరు )

మనకు తెలిసి ప్రజాజీవితం లొకి వచ్చే ముందు రామారావు గారు ఇద్దరు ప్రముఖుల సలహా తీసుకున్నారు అందులొ ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు , రెండొవారు కొట్ల విజయభాస్కర్ రెడ్డి గారు , - అక్కినేని గారు నాకు రాజకీయాలమీద ఆశక్తి లేదు అన్నారు , కొట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ ని వదిలి రాను అని అన్నారు.

రామక్రిష్ణా స్టుడియొస్ లొ రామారావు గారు తెలుగుదేశం కి లొగొ ని ఒక పేపర్ మీద గీసి చక్రం , నాగలి, గుడిసె అక్కడికి వచ్చిన ప్రముఖులకి చూపించి అభిప్రాయం అడిగారు, ప్రముఖులు బెజవాడ పాపిరెడ్డి గారు , తూర్లపాటి సత్యనారాయణ గారు, యలమంచలి శివాజి, నాదెండ్ల , రతయ్య, ఆదయ్య, నారాయణ , దగ్గుబాటి చెంచురామయ్య - ( ఇక్కడ కూడా బాబు గారు లేరు )

9 ఎప్రిల్ 1982 పత్రికలకి తెలుగుదేశం జెండా ని విడుదల చెసారు ( రొజు బాబు గారు దగ్గర లేరు)

1982 ఎప్రిల్ 11 హైద్రాబాద్ నిజాం గ్రౌండ్స్ లొ మొదటి తెలుగుదేశం బహిరంగ సభ జరిగింది ( సభ లొ బాబు గారు కనిపించలేదు )

(దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారి మాట్లలొ)

మొదటి సభ ముగిసాక మద్దతు కొరుతు పార్టిలొకి ఆహ్వానించటానికి కాంగ్రెస్ లొ సినిమా ఆటొగ్రఫి మంత్రిగా ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను , అప్పుడు చంద్రబాబు ఒక కాగితం తీసుకుని లెక్కవేసి రామారావు జెబులొనుండి పైసా తియడు , రామారావు కి 5% ఒట్లు మాత్రమే వస్తాయి, సినిమా మొజుకి ఒట్లు పడతాయా ?, నేను మంత్రి పదవి వదులుకుని ఎలా వస్తాను అని అన్నారు.

1982 మే 28 - రామారావు జన్మదినం సందర్భంగా తిరుపతి లొ సభ ఏర్పాటు చెసి దానికి మహానాడు అని పేరు పెట్టారు ( సభ లొను బాబు గారు లేరు )

-> 1982 - నవంబర్ - 18 అధిస్టానం ఆదేసించితే , మామా రామారావు మీద పొటికి రెడి అని ప్రకటించిన చంద్రబాబు


1983 -జనవరి-5 పుట్టిన గడ్డ చంద్రగిరి లొ మెడసాని వెంకటరామ నాయుడు అలియాస్ మీసాల నాయుడు చెతిలొ 17,429 ఒట్ల తేడా తొ ఘొరంగా పరాజయం చెందిన చంద్రబాబు.




1983 జనవరి 20 - ఒడొపొయిన 15 రొజులకి కాంగ్రెస్ పార్టిని వదిలి తెలుగుదేశం లొ చెరుతాను అని పత్రికలకి ప్రకటించిన బాబు


1983 జనవరి 22 - గత ఎన్నికలలొ చిత్తురు జిల్లాలొ తెలుగుదేశం ఒటమికి తీవ్రక్రుషి చెసి , తెలుగుదేశం కార్యాలయం ని ద్వంసం చెసిన చంద్రబాబు ని పార్టి లొ చెర్చుకుంటే అది పార్టి పతనం కి నాంది పలుకుంతుంది అని హెచ్చరించిన తెలుగుదేశం నేత సిద్దయ్య మూర్తి.

1983 జనవరి 23 - తెలుగుదేశం పార్టి రాష్ట్ర స్థాయి సదస్సు లొ బాబు ని ఒడించిన మీసాల నాయుడు లేచి కాంగ్రెస్ వారిని పార్టి లొకి చెర్చుకొకూడదు అని తీర్మానం పెట్టారు దీనిని 99% సభ్యులు మద్దతు పలుకుతు చెతులు పైకి ఎత్తారు , వీరిని పార్టిలొకి ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాము అని మాహిళా విభాగం నాయకురాలు శ్రీ రమణమ్మ అసంత్రుప్తి వ్యక్తపరిచారు , వీరి చెరికను వ్యతిరేకిస్తు మరొ నాయకూరాలు శ్రీమతి సీతా మహా లక్ష్మి కనీరు పెట్టుకున్నారు వీరందరికి నచ్చ చెప్పి బాబుగారిని రామారావు గారు పార్టి లొ చెర్చుకున్నారు.



ఎలా చూసిన రామారావు గారి పార్టి ని చంద్రబాబు వ్యతిరేకించారు అని తెలుస్తుంది..  
ఎన్.టి.ఆర్ ని రాజకీయాలలొకి రమ్మంది నేనే, పార్టి పెట్టమంది నేనే - చంద్రబాబు ఎన్.టి.ఆర్ ని రాజకీయాలలొకి రమ్మంది నేనే, పార్టి పెట్టమంది నేనే  - చంద్రబాబు Reviewed by surya on 3:36 AM Rating: 5

No comments:

Powered by Blogger.