Comments

తాత రామారావు రద్దు చేసిన వ్యవస్థ, తండ్రి చంద్రబాబు వ్యతిరేకించిన వ్యవస్థ నుండి లొకేష్ రాజకీయ ఆరంగేట్రం ??

తాత రామారావు రద్దు చేసిన వ్యవస్థ, తండ్రి చంద్రబాబు వ్యతిరేకించిన వ్యవస్థ నుండి లొకేష్ రాజకీయ ఆరంగేట్రం ??
---------------------------------------------------------------------------------------

చంద్రబాబు తనయుడు , తెలుగుదేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లొకేష్ గారికి ఎం.ఎల్.సి స్థానం ఇవ్వాలి అని ఆదివారం జరిగిన పొలిట్ బ్యురొ సమావేశం లొ తీర్మానించారు అనే వార్తలు వినిపించాయి. కచ్చితంగా ఎం.ఎల్.ఏ కొటా లొ ఆయనకి ఎం.ఎల్.సి ఇవ్వటం కాయం అని సొమిరెడ్డి గారు బహిరంగంగానే చెప్పారు , ఇవన్ని చూస్తే లొకేష్ గారు ఎం.ఎల్.సి అవ్వటం ఇంక లాంచన ప్రాయం అని అర్ధం అవుతుంది.



సాదారణం గా భవిష్యత్తు లొ ముఖ్యమంత్రి స్థానం కొసం పొటి లొ ఉన్న వ్యక్తి రాజకీయ ఆరంగెట్రం ప్రజల మద్దతు తొ , ప్రజల చేత ఎన్నుకొ బడితే ఆ విలువ, ఆ హొదా వేరు , కాని తెలుగుదేశం నేతలు లొకేష్ బాబు భవిష్యత్తు లొ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చెప్పుకుంటున్నారు , అలాంటి వ్యక్తి ఇలా కొటాలొ రాజకీయ పదవి తెచ్చుకొవటం ప్రజలు ఎలా తీసుకుంటారొ భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

ఇక్కడ చెప్పుకొవాలిసిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది అది ఈ శాశన మండలి చరిత్ర, ఈ మండలి వ్యవస్థ ఎప్పుడు మొదలింది , ఎప్పుడు రద్దు అయింది , దానికి గల కారణాలు ఎంటి , మళ్ళి ఎప్పుడు ప్రారంభం అయింది, ఎవరు ప్రారంభించారు , అప్పుడు శాశన మండలి వ్యవస్థను చంద్ర బాబు గారు ఎందుకు వ్యతిరకించారు అనేది తెలుసుకొవాలి.

వివరాలలొకి వెల్తే

భారత రాజ్యాంగం లొ ఏ రాష్ట్రం లొ అయిన శాశన మండలిని ఏర్పాటు చేసుకొవటానికి ఆర్టికల్ 169 కింద అవకాశం కల్పించారు. 1956 లొ భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంద్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్రం లొ అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి అని నిపుణులు, మేదావులు, విజ్ఞానవంతులు చాలామంది పెద్దల సహకారం తొ రాష్ట్రం పురొభివ్రుద్ది కావాలి అని ఆలొచన చేసి రాజ్యాగం లొ ఇచ్చిన 169 ఆర్టికల్ ను ఆసరా చేసుకుని పెద్దలు చేసిన సూచన మేరకు 1958 జులై 1 న ఆంద్రప్రదేశ్ శాశన మండలి ని ఏర్పాటు చేసి, జులై 7 న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేత హైద్రాబాద్ , పబ్లిక్ గార్డెన్స్ , జూబ్లి హాల్ లొ 90 మంది సభ్యుల తొ ప్రారంభొత్సవం చేశారు. అప్పటి నుండి మొటూరి హనుమంత రావు, తొట రామ స్వామి, సయ్యద్ ముఖాసిర్ షా లాంటి విజ్ఞానవంతుల తొ నిరాటంకం గా సాగిన శాశన మండలి ఎన్.టి. రామారావు పెట్టిన  తెలుగుదేశం పార్టి అధికారం లొకి రావటం తొనే 1985 మే 31 న రామారావు గారు శాశన మండలి వ్యవస్థ ని రద్దు చేశారు..



ఇలా రద్దు చేయటానికి రామారావు గారు చెప్పిన కారణాలు ఆ మండలి వ్యవస్థ వలన రాష్ట్రం కి ఆర్ధిక భారం పడుతుంది అని. ఆయన చెప్పిన ఆర్ధిక భారం విలువ సుమారు 38 లక్షలు. పైకి ఇలా చెప్పిన రామారావు గారు దీనిని రద్దు చెయటానికి వెనక ఉన్న కారణాలు 1983 లొ రామారావు గారు అధికారం లొకి వచ్చినా, ఆయనకి మండలి లొ బలం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టి దే బలం , అసెంబ్లీ లొ సభ్యుల బలం తొ నిరాటం కా సాగిన రామారావు గారి తెలుగుదేశం జైత్ర యాత్ర , మండలి కి వచ్చేసరికి కాంగ్రెస్ సభ్యులు అయిన రొసయ్య , నర్సి రెడ్డి, పురుషొత్తం రెడ్డి , గారి లాంటి మేదావుల వాగ్దాటికి తెలుగుదేశం విలవిల లాడిపొయేది , అప్పటికే నాదెండ్ల బాస్కరరావు గారు ఒక సారి రామారావు ని పదవి నుండి దించి వేయటం కూడా జరిగింది. ఇంక కాంగ్రెస్ ని ఎదుర్కొవాలి అంటే మండలిని రద్దు చెయాలి అనే నిర్ణయం కి వచ్చిన రామారావు , ఇందిర గాంధి గారి హత్య , తరువాత వెంటనే ప్రధాని అయిన రాజీవ్ గాంది తొ రాజీ కి వెల్లారు ( ఎప్పుడు కెంద్రం మీద అయినదానికి కానిదానికి దుమ్మెతి పొసే రామారావు రాజీవ్ గాంది దగ్గరకు రాజీ కి వెల్లటం అక్కడ మీద్రు ఆంద్రప్రదేశ్ లొ మండలి రద్దు చేస్తే ప్రతిపక్షాలతొ కలిసి భారత్ దేశం పార్టి ఆలొచన విరమించుకుంటా అనటం , ఇంకా మీకు సహకరిస్తా అనంటం వలన రాజీవ్ గాంది గారు మండలి రద్దు కి ఒప్పుకున్నారు) అనే వార్త ఆనాడు దావానం లా పాకిపొయింది. ఇలాంటి ప్రతిపాదనతొ రాజీవ్ గాంది గారిని రామారావు గారు డిల్లీ వెల్లి కలవటం , ఆ వెంటనే 10 రొజులకే మండలి రద్దు అవ్వటం చెక చెక జరిగిపొయాయి.




తరువాత మల్లి 1989 లొ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1990 జనవరి 22 న చెన్నారెడ్డి గారి హయాం లొ ఆంద్రప్రదేశ్ కి శాశన మండలి కొరుతూ అశంబ్లీ లొ తీర్మానం చేసి కెంద్రానికి పంపించారు, 1990 మే 29 న బిల్లు రాజ్య సభ లొ ఆమొదించారు , కాని లొక్ సభ లొ  యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం బిల్లు ని తిరస్కరించింది. అక్కడి తొ ఆ ప్రయత్నం ఆగిపొయింది.


1994 లొ రామారావు గారి ఆద్వర్యం లొ తెలుగుదేశం గెలవటం , 1995 ఆగస్టు లొ చంద్రబాబు గారు , వైస్రాయి హొటల్ లొ సొంత మామ గారు అయిన రామారావు గారి మీద తిరుగుబాటు చేసి ఆయనని పదవి నుండి దించి ముఖ్యమంత్రి అవ్వటం జరిగిపొయింది , 1995 నుండి 2004 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు. అప్పుడు ఈ శాశన మండలి ఊసే లేదు.

మహా పాదయాత్ర తరువాత 2004 లొ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారు జులై 8 2004 న శాశన మండలి కొసం అశంబ్లీ లొ తీర్మానం చేసి కెంద్రానికి పంపించారు , ఆ నాడు అశంబ్లీ లొ ఈ వ్యవస్థ కొసం పెట్టిన తీర్మానం ని ప్రతిపక్షం లొ ఉన్న చంద్రబాబు గారు తీవ్రం గా వ్యతిరేకించారు , ఇలా వ్యతిరేకిస్తు చంద్రబాబు గారు అన్న మాటలు (" ఈ మండలి వల్ల అధికారం లొ ఉన్న వారికి పదవులు వస్తాయి తప్ప రాష్ట్ర ప్రజలకు లాభం లేదు , దీనివలన కార్యకర్తలకి , నాయకులకి రాజకీయ నిరుద్యొగులకు పునరావాసం కల్పిస్తారు తప్ప దీని వలన బ్రహ్మాండంగా శాశనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయొజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదు , ఒకప్పుడు చదువు కున్న వారు తక్కువ ఉండేవారు అందుకే ఈ శాశన మండలి లొ ఇంటలెక్ట్యువల్స్ ని తీసుకొచ్చి చర్చించాలి అనే ఉద్దేశం ఉండేది , కాని ఇప్పుడు శాశన సభ లొ ఉన్న 294 మంది అందరు చదువు కున్న వారే. ఇంతకన్న బెటర్ గా శాశన మండలికి వస్తారు అంటే ఏ మాత్రం నమ్మ సక్యం గా లేదు దీనివలన ప్రభుత్వం మీద భారం పడుతుంది తప్ప దేనికి ఉపయొగ పడదు ") అని ఆనాడు చంద్రబాబు గారు అశంబ్లీ లొ అన్నారు.




తరువాత వై.యస్ రాజశేఖర రెడ్డి గారి ఆద్వర్యం లొ ఆంద్రప్రదేశ్ శాశన సభ లొ బిల్లు పాస్ చేసి ఆమొదం కొసం కెంద్రానికి పంపటం 16 డిసెంబర్ 2004 లొ బిల్లు ని లొక్ సభలొ ప్రవేశపెట్టటం తరువాత లొక్ సభ బిల్లు ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటి కి పంపటం 2005 డిసెంబర్ 15 న బిల్లు ని లొక్ సభ ఆమొదించటం , 2005 డిసెంబర్ 20 న రాజ్య సభ లొ ఆమొదం పొందటం 2006 జనవరి 10 న రాష్ట్రపతి ఆమొదం పొందటం జరిగింది.



మార్చ్ 30, 2007 న రామారావు హయాం లొ (1985 మే 31 న) రద్దు అయిన శాశన మండలి , రాజ శేఖర రెడ్డి గారి హయాము లొ తిరిగి ప్రారంభం అయింది. శాశన మండలి ఏర్పాటు ని తీవ్రం గా వ్యతిరేకించిన చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ మండలి వ్యవస్థ ని రద్దు చేస్తాం అని ఆనాడు చెప్పారు .

ఇలా రామారావు గారు , చంద్రబాబు గారు చెత తిరస్కరించబడ్డ శాశన మండలి వ్యవస్థ ఆదారం గా చేసుకి తెలుగుదేశం భవిష్యత్తు నేత అని చెప్పుకుంటున్న నారా లొకేష్ గారిని రాజకీయ ఆరంగేట్రం చెయటం మరీ విడ్డురం గా ఉంది. రాజకీయ నిరుద్యొగుల కొసం తప్ప ప్రజలకి పనికి రాదు ఈ శాశన మండలి అని చెప్పిన చంద్రబాబు గారు, నేను అధికారం లొకి వస్తే రద్దు చేస్తా అని చెప్పిన ఈ బాబు గారు. ఆయన తనయుడిని అదే మండలికి పంపటం మరీ విచిత్రం.

ఏది ఏమైనా ప్రజా నాయుడు అవ్వాలి అనుకునే వారు ప్రజా మద్దతు తొ గెలిచి రాజాకీయాలలొకి రావాలి. ఇలా వాటా లలొ , కొటాలలొ వస్తే. వారి ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతారొ కాదొ వారు ఒక సారి ఆలొచించుకొవాలి , బ్యాక్ డొర్ రాజకీయాలకైన , బ్యాక్ డొర్ ఉద్యొగాలకైన వెలుగు కొన్ని రొజులు మాత్రమే ఉంటుంది ....              
     
తాత రామారావు రద్దు చేసిన వ్యవస్థ, తండ్రి చంద్రబాబు వ్యతిరేకించిన వ్యవస్థ నుండి లొకేష్ రాజకీయ ఆరంగేట్రం ?? తాత రామారావు రద్దు చేసిన వ్యవస్థ, తండ్రి చంద్రబాబు వ్యతిరేకించిన వ్యవస్థ నుండి లొకేష్ రాజకీయ ఆరంగేట్రం ?? Reviewed by surya on 2:28 PM Rating: 5

No comments:

Powered by Blogger.