సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడకుండా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మాదిరి మోసం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంటే ఉద్యోగ సంఘాలతో చర్చలే జరపదు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారిని ఒప్పించి ఓపీఎస్, సీపీఎస్‌కు మధ్యేమార్గంగా జీపీఎస్ ని తీసుకుని వచ్చారు.
ప్రత్యేక హోదా
ప్రత్యేక హొదా అనేది మొదటి 5ఏళ్ళలోనే కెంద్రంపై వత్తిడి చేసి సాధించాల్సిన హక్కు.. దానిని ప్యాకేజీలకి ఒప్పుకుని నాశనం చేసింది చంద్రబాబు.. ఇప్పటికి ప్రత్యేక హొదా అనే నినాదం ఉంది అంటే దానిని కాపాడుతూ వచ్చింది జగన్ మాత్రమే .. ఆయన ఇప్పటికి కేంద్రం తో ప్రత్యేక హొదా డిమాండ్ పై చర్చలు జరుపుతూనే ఉన్నారు. చంద్రబాబు సాధించలేని ఎన్నో కేంద్రం నుండి సాధించిన జగన్ త్వరలోనే చంద్రబాబు నాశనం చేసిన ఈ ప్రత్యేక హొదాని కూడా సాదిస్తారనే నమ్మకం సామాన్య ప్రజల్లో ఉంది.
మద్యనిషేధం
జగన్ గారు మ్యానిఫెస్టోలో పెట్టింది దశల వారి మద్యనిషేధం అని దానిలో భాగంగానే జగన్ గారు ప్రభుత్వం ఏర్పాటు కాగానే 43 వేలకు పైగా బెల్టుషాపులను రద్దు చేశారు. పర్మిట్ రూమ్‌లన్నీ రద్దు చేశారు. 4,380 నుంచి 2,934కి వైన్ షాప్‌లను తగ్గించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో షాపులుంటే విచ్చలవిడిగా మద్యం విక్రయించి బెల్టుషాపులు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రభుత్వమే పరిమితంగా నిర్ణీత వేళల్లో విక్రయాలు చేపట్టింది. నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎస్‌ఈబీ ద్వారా ఎక్కడిక్కడ దాడులు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తు గ్రామాలో చంద్రబాబు జన్మభూమి కమిటీల ఆద్వర్యంలో సాగిన బెల్టుషాపులు లేకుండా చేశారు. ఇవన్ని దశలవారి మధ్య నిషేధంలో భాగం కాదా?
30 లక్షల ఇళ్ళు
మానిఫెస్టోలో చెప్పిన విధంగా 25 లక్షల మందికి ఇళ్ళు కట్టించే యజ్ఞంలో భాగంగా ఇప్పటివరకు దేశ చరిత్రలో కనీ విని ఏరుగని విధంగా ఒకే సారి 30.66 లక్షల ఇళ్ళ పట్టాలు మహిళలకు ఇచ్చారు జగన్ అన్న .. అయితే పేదవాడికి గూడు రాకూడదనే కుటిల యత్నంలో భాగంగా దాదాపు 3 లక్షల 65 వేల ఇళ్ళ స్థలాలపై కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. అసలు అమరావతిలో పేదలకి ఇళ్ళు ఇస్తుంటే సామాజిక అసమానతులు వస్తాయి అని కొర్టుకు పోయిన టీడీపీకి పేదవాళ్ల ఇళ్ళ పై మాట్లాడే హక్కే లేదు. జగన్ ఇళ్ళు ఇవ్వలేదని టీడీపీ చెప్పడం ఒక అబద్దపు ప్రచారం మాత్రమే .
45ఏళ్ళకే పెన్షన్
45ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అని జగన్ గారు 2017 అక్టోబర్ 18వ తేదీన పాదయాత్రలో చెప్పారు. అయితే మహిళలకి 45ఏళ్ళకే పెన్షన్ ఎంటని టీడీపీ విషం చిమ్మేసరికి ఆ హామీని పాదయాత్రలో 2018 సెప్టెంబర్ 3న మారుస్తూ వైయస్సార్ చేయూతని తీసుకుని వచ్చారు దానినే మానిఫెస్టోలో పెట్టారు అది ఇప్పటికీ అక్కడా అడ్డంకి లేకుండా పధకం అమలులోనే ఉంది. టీడీపీ అసత్యాలతో ఎలా విషం చిమ్ముతుందో చెప్పడనికి ఇదోక ఉదాహరణ .
3వేలు పెన్షన్
పాదయాత్రలో కాని మానిఫెస్టోలో కాని జగన్ పెన్షన్ విషయంలో చెప్పింది ఒకేసారి 3వేలు పెంచుతానని కాదు.. ఏడాదికి 250 చొప్పున 4ఏళ్ళకి 3వేలు చేస్తానని మాత్రమే చెప్పారు. దానిని సంభందించిన వీడియొలు కూడా ఉన్నాయి. అబద్దాలతో బ్రతికే తెలుగుదేశం ఈ విషయంలో కూడా చేస్తున్నాది తప్పుడు ప్రచారం మాత్రమే.
జాబ్ క్యాలెండర్
జగన్ ప్రభుత్వం వచ్చాకా ఈ 3ఏళ్ళలో 2 లక్షల 6వేల 630 శాశ్విత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, గ్రామ వార్డు సచివాలయాల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు 5ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,108 మాత్రమే - అసలు ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసిన టీడీపీకి ఉద్యోగాలపై, జాబ్ క్యాలెండర్ పై మాట్లాడే అర్హత ఉందా?
సన్న బీయ్యం
జగన్ గారు మానిఫెస్టోలో చెప్పింది నాణ్యమైన బీయ్యం ఇస్తాం అని దానిని ఎల్లో పత్రికలు సన్న బీయ్యం అని రాసి జగన్ కూడా సన్న బీయ్యమే ఇస్తాను అన్నాడు అంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపాయి. జగన్ గారు నాణ్యమైన బీయ్యం ఇప్పటీకి ప్రజలకి క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ప్రజలు కూడా గత ప్రభుత్వాలు కన్నా జగన్ ఇస్తున్న బీయ్యం నాన్యంగా ఉన్నాయని చెబుతున్నారు.
200 యునిట్లు ఉచిత విద్యుత్
2019 ఆగస్టు నుంచి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును జగన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల దాదాపు 22,54,596 మంది ఎస్సీ, ఎస్టీలకు మేలు చేకూరుతోంది. గత నాలుగేళ్ళుగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వారంతా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యుత్తు వెలుగులు పొందుతున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంలేదని తెలుగుదేశం చేస్తున్నది గొబెల్స్ ప్రచారం మాత్రమే .
జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ తప్పుడు ఆరోపణలు.
Reviewed by surya
on
11:00 PM
Rating:
No comments: