Comments

రాజ్యాంగ రూపకల్పనలో తెలుగువారి పాత్ర


ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యంగంగా పేరొందిన భారత రాజ్యాంగంకి నేటితో 70 వసంతాలు నిండాయి. 1914లో భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని గోపాల కృష్ణ గోఖలే నినదించిన దగ్గర నుండి రాజ్యాంగ పరిషత్ స్థాపించడానికి 1940లో బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించే వరకు అనేక పోరాటాలు అనేక డిమాండ్లతో పెద్ద కసరత్తే జరిగింది.

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రజాస్వామ్యాని ప్రసాదించిన భారత రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న సభ్యుల సంఖ్య 389, వీరిలో 11మంది తెలుగువారు సైతం రాజ్యంగ పరిషత్ కు ఎన్నికయ్యారు వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్-ముఖ్, కళా వెంకట్రావు, కల్లూరి సుబ్బారావు, మూటూరి సత్యనారాయణ ,యన్.జి రంగా, వీసీ కేశవరావు, తిరుమల రావు, బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావుకి చోటు దక్కింది

ప్రజలే పాలకులుగా ఒక దేశ నిర్మాణంకి దాని పరిపాలన వ్యవస్థకి, ఆది గ్రంధంగా చెప్పుకునే మన రాజ్యంగ రూపకల్పనలో తెలుగువారు సైతం తమ అమూల్యమైన అభిప్రాయాలను పొందుపరిచి భావితరాలకు అందించడానికి ఎనలేని కృషి చేశారు, ఆ మహానుభావుల ఆలోచనా ఫలితమే నేడు ఈ దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్చ. ఇంతటి గొప్ప రాజ్యంగం మనది కావటం ప్రతీ భారతీయుడికి గర్వకారణం.

రాజ్యాంగ రూపకల్పనలో తెలుగువారి పాత్ర  రాజ్యాంగ రూపకల్పనలో తెలుగువారి పాత్ర Reviewed by surya on 2:56 AM Rating: 5

No comments:

Powered by Blogger.