ఆంధ్రప్రదేశ్ నుండి లూలూ గ్రూప్ సంస్థ వెళ్ళిపోయింది, మేము ఇంక ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ పెట్టుబడులు పెట్టము అని చెప్పి మరీ వెళ్ళిపోయింది, జగన్ ప్రభుత్వం వైఖిరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిపొయింది, జగన్ పాలనలో రాష్ట్రం మరో 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంక రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఇది తెలుగుదేశం నాయకులు, వారి మద్దతు దారుల నుండి వస్తున్న మాట . నిజంగానే రాష్ట్రంకి లూలూ సంస్థ వెళ్ళిపోతే అంత నష్టం జరిగిపొతుందా, అంత నష్టం జరిగేలా ఉంటే లూలూ గ్రూప్ ని జగన్ సర్కార్ ఎందుకు పక్కన పెట్టింది ? భూకేటాయింపులలో జరిగిన అవకతవకలు ఎంటీ?
భూకేటాయింపులలో అవకతవకలు
గత చంద్రబాబు సర్కార్ దుబాయికి చెందిన లూలూ గ్రూప్ నకు 2018 ఫిబ్రవరీ నెలలో విశాఖపట్నంకే మణిహారం అయిన ఆర్.కే బీచ్ ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన 13.83 ఎకరాల వుడా భూమిని అధికారులు నిభందనలకు విరుద్దం అని చెపినా వినకుండా స్వయాన ముఖ్యమంత్రి హొదాలొ చంద్రబాబు గారే జోక్యం చేసుకుని కన్వేన్షన్ సెంటర్ , ఫై స్టార్ హొటల్, షాపింగ్ మాల్ ఇతర భవనాల నిర్మాణం కి కేటాయించారు, ఈ 13.83 ఎకరాలలొ 10.5 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా , సుమారు 3 ఎకరాలు సి.యం.ఆర్ కు చెందిన భూమి, స్టాంప్ డ్యుటీలు 7 కొట్లకు మినహాయించారు. మరో పక్క కేటాయించిన ఆ భూములలో తమకు హక్కులు ఉన్నాయి అంటూ ఎల్.జీ పాలీమర్స్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ భూముల క్రమబద్దీకరణకు ఫీజులు కూడా చెల్లించినట్టు ఆ సంస్థ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించింది. సదరు భూములు ఎల్.జీ పాలీమర్స్ కి కేటాయిస్తూ న్యాయస్థానం తీర్పు ఇస్తే ఆ భూముల విలువ మొత్తం ఆ సంస్థకు చెల్లిస్తాము అని అధికారులు న్యాయస్థానం లొ హామీ ఇచినట్టు తెలుస్తుంది.
మార్కెట్ రేటు ప్రకారం 900 కోట్లు విలువ చేసే ఈ వివాదస్పద భూమిని కన్వేన్షన్ సెంటర్ల పేరుతో అప్పనంగ లూలూ గ్రూప్ కి దారాదత్తం చెయ్యటం ద్వారా చంద్రబబుకి ఆయన తనయుడు లోకేష్ కి సుమారు 500 కోట్లు ముడుపులు ముట్టాయి అని ఆనాడు బి.జే.పి పార్టీ, సి.పి.యం పార్టీతో పాటు అన్ని పార్టీలు, మేధావులు గతంలోనే ఆరొపణలు చేశారు, ఈ మాల్స్ వలన చిన్న చిన్న దుకాణాలు దెబ్బతిని సుమారు 25వేల మందికి ఉద్యోగాలు, ఉపాది అవకాశాలకు నష్టం కలుగుతుంది అని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు, పర్యాటకులను ఆకర్షించే విశాఖ బీచ్ రోడ్లో ఈ కన్వేన్షన్ సెంటర్ పూర్తి అయితే బీచ్ రోడ్లో కూర్చునేందుకు అడుగు స్థలం కూడా ఉండదు అని ఆందోళణ వ్యక్తం చేశారు , ఇదే విషయాలను అక్కడ ఉన్న ప్రజలు పాదయాత్రలో ఉన్న జగన్ దృష్టికి తీసుకుని వెళ్ళగా అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరిపించి నిబందనలకు విరుద్దంగా జరిగితే చర్యలు తీసుంటాము అని ప్రజలకు మాట ఇచ్చారు
ఇచ్చిన మాట ప్రకారమే.
పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారులతో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి లూలూ గ్రూప్ కి గత ప్రభుత్వం కెటాయించిన ఆ వివాదాస్పద భూమిని రద్దు చెస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ నిర్ణయించింది. అధికారులు సైతం ఈ భూమి కేటాయించటం నిబందనలకు విరుద్దం అని చెప్పినా వినకుండా స్వయంగ చంద్రబాబు పూనుకుని ఆ వివాదాస్పద భూమిని లూలూ గ్రూప్ కి ఎందుకు కేటయించారో. తెలుగుదేశం నుండి ఇప్పటికీ సమాధానం లేదు. 2,200 కోట్లు పెట్టుబడిపెడతాము అంటు 2018 తోలి నెలలో వచ్చిన ఆ లూలూ సంస్థ అంత విలువైన భూమిలో ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చెయ్యకుండా శంకుస్థాపనలతోనే సరిపెట్టుకుంది. మాటలకే పరిమితం అయిన ఇటువంటు సంస్థకు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేయాలి అనే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బి.జే.పి తో పాటు అన్ని పార్టీలు స్వాగతించగా, తెలుగుదేశం పార్టీ మాత్రమే యాగీ చెస్తుంది. లూలూ సంస్థది ఆంధ్రలొ ఆది నుండి వివాదాస్పదమే. ఇక పొతే పెట్టుబడులు తీసుకురావటం అంటే అక్రమాలకు రహదారిలా కాకుండా ప్రజలకు మేలు జరిగే రీతిలో ఉండాలి ,విశాఖ లో జరిగిన సి.ఐ.ఐ సమిట్ తో పచ్చడ్ల్లు, అమ్ముకునే వాళ్ళు, మెస్సులు పెట్టుకున్న వాళ్ళతో సూటు బూటు వేయించి 12 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అని చెప్పుకున్న గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ లక్షల కొట్ల యం.ఒ.యుల లొ ఎన్ని వాస్థవ రూపం దాల్చయొ స్వేత పత్రం విడుదల చెయ్యవచ్చు కద ప్రజలు కూడా తెలుసుకుంటారు.
.jpg)
No comments: