తిరునాళ్లలో కాశీపట్నం చూడరబాబు అంటూ పాటలు పాడుతూ బైయోస్కోప్ లో ఫోటోలను చూపించి పావలానో అర్ధ రూపాయి తీసుకుంటారు. చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయిన తరువాత విజన్ 2020 పేరుతొ 10 స్లైడ్స్ తయారు చేయించి రాష్ట్రానికొచ్చిన ప్రతి విదేశీ బృందాలకు ప్రెసెంటేషన్ ఇచ్చేవాడు,వాళ్ళు “ఘూద్” అనేవారు… గూద్ అనేది వాళ్ళ సహజ ప్రతిస్పందన అనే విషయాన్ని మరిచి తరువాతి రోజు ఈనాడులో బాబు విజన్ను అభినందించిన విదేశి పారిశ్రామిక వేత్తల బృందం అని హెడ్డింగ్ పెట్టి రాసేవారు.
ఒకసారి ఛీఈ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన సదస్సుకు స్విట్జర్లాండ్ ఆర్ధిక శాఖా మంత్రి హాజరయ్యారు. ఆ సమావేశంలో చంద్రబాబు యాధావిధిగా విజన్ 20:20 అని మొదలు పెట్టాడు. ఆ ప్రెసెంటేషన్ను కొద్దిసేపు చూసిన తరువాత “మీరు చెప్తున్న పథకాలకు ఎన్ని నిధులు కావాలో తెలుసా?”అని అడిగారు,దానికి చంద్రబాబు సమాధానం దాటవేసి ప్రెసెంటేషన్ను కొనసాగించటంతో మాదేశంలో ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడాము. ఇదే మాదేశంలో అయితే మిమ్మల్ని అబద్దాలు చెప్తున్నందుకు జైల్లో అన్న పెడతారు లేదా పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు” అని అన్నారు. మీడియాకు దగ్గరివాడు కాబట్టి ప్రధాన పత్రికల్లో ఈ వార్తను మార్చి బాబుకు అనుకూలంగా రాయగా కొన్ని పత్రికల్లో స్విస్ మంత్రి కామెంట్లను యదాతథంగా ముద్రించారు.
నాది విజన్ 2020, 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగిన చంద్రబాబును ఐదేళ్లలోనే ఓటర్లు తిరస్కరించారు. సోషల్ మీడీయా బలం పెరిగేసరికి హైటెక్ సిటి – సైబర్ టవర్స్ కు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఫోటోలను బయట పెట్టి చంద్రబాబు లోకేసుకే పితా కానీ ఐటీకి కాదని నిరూపించారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో అబ్దుల్ కలామ్ నా విజన్ చూసే విజన్ డాక్యుమెంట్ తయారుచేశారని నేనే పారాయణాన్ని పఠించారు. అన్నిటికి నేనే, అందరికి నేనే మాటల మీద ప్రజలు చివరికి స్వపక్షమే జోకులు వేసుకుంటున్న చంద్రబాబు వైఖరి మాత్రం మారటం లేదు. కలాం గారి పుస్తకం 1998లో విడుదల కాగా చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 1999లో విధుల కావటం గమనార్హం.

No comments: