జగన్ నవ్యాంద్రప్రదేశ్ కు ఉండే మూడు రాజధానులలో అత్యంత ముఖ్యమైన ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖలో ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించారు , జి.యన్ రావు కమిటీ నివేదిక కూడా జగన్ చెప్పిన మాటకు బలం చేకూర్చింది . దీంతో భవిష్యత్తు అందాల నగరమైన విశాఖదే అని తేలిపొయింది. విశాఖలో సుదీర్గ తీర ప్రాంతంతో పాటు పోర్టులు, అంతర్జాతీయ విమనాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే లైన్ల వంటి అనుసంధాన మార్గాలే కాదు. ఒక రాజధానికి ఉండాల్సిన సహజ సిద్దమైన లక్షణాలు అన్నీ విశాఖకు ఉన్నాయి అనేది మేధావుల అభిప్రాయం. హైకోర్టు బెంచ్, పాలనా నిలయం, వేసవి అసెంబ్లీ సమావేశాలతో విశాఖ విశ్వపటంలో చేరేందుకు ఒకొక్క అడుగు పడుతూ ఉంది. ప్రాంతీయ అసమానతలు పారతోలేలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెజారిటి ప్రజలు స్వాగతిస్తున్నారు. విశాఖ ప్రజలు గత 5 ఏళ్లలో తమ ప్రాంతం ఎంతో నిర్లక్ష్యానికి గురైందని , వై.యస్ హయంలో అభివృద్దిలో ఎంతో ముందుకు వెళ్ళిన విశాఖ ఆయన మరణం తరువాత కుంటుపడిందని, తిరిగి జగన్ తో అభివృద్ది వైపు అడుగులు వేస్తుంద్ది
నాడు వై.యస్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో అప్పటివరకు విశాఖకు ఏ ముఖ్యమంత్రి చేయని అంత ఆభివృద్ది చేసారని చెప్పుకోవటం వినే ఉంటాం . గాజువాకతో పాటు 32 పంచాయితీలతో 72 వార్డులతో 2005 లో విశాఖకు వై.యస్ గ్రేటర్ హోదా కలిగించారని. కేంద్రం పై వత్తిడి తెచ్చి జె.ఎన్.యస్.యు.ఆర్.యం , సుమారు 1500 కోట్లతో భూగర్భ డ్రైనేజి ప్రాజెక్టుతో నగరాన్ని మురుగు నుండి బయటపడేశారని అప్పటి రాజధాని హైద్రాబాద్ కి దీటుగా శీఘ్ర రవాణ వ్యవస్త కోసం 456 కోట్లతో బి.ఆర్.టి.యస్ కు బాట వేశారని. విశాఖ ఉక్కు విస్తరణ, అచ్యుతాపురంలో ఇండస్ట్రియల్ కారిడార్, భీమిలిలో ఐ.టి కారిడార్, పరవాడలో ఫార్మాస్యుటికల్ కారిడార్ , దువ్వాడలో ఐ.టి సెజ్ లతో విశాఖ ను పరిశ్రమల పుంతగా మార్చారని. విశాఖ ఎయిర్ పొర్టుని అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా తీర్చి దిద్ది, 100 కోట్లతో అధునాతన టెర్మినల్ నిర్మించారని. తరుచూ ముంపునకు గురయ్యే ఎయిర్ పోర్టును ఎత్తుపెంచి ఆధునీకరించారని. ఉత్తరాంద్ర వాసులకు ఆదునిక సదుపాయాలతో మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో 110.24 ఎకరాలలో 250 కోట్లతో విమ్స్ (విశాఖ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ని 2006 లో మొదలు పెట్టారని దానిని చంద్రబాబు చివరి 30 కోట్లు పెట్టి ప్రారంభించారని గోదావరి నీటిని విశాఖతో పాటు ఉత్తరాంద్రకి కూడా మళ్ళించటానికి సంకల్పించిన వై.యస్ పోలవరం ఎడమ కాలవ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని , స్టీల్ ప్లాంటు కు నీటి సమస్య లేకుండా ఏలేరు నీటిని మళ్ళించటంతో పాటు రిజర్వాయర్ల సామర్ద్యం పెంచెందుకు ప్రణాళికలు సిద్దం చేశారని, కేంద్రంతో పోరాడి మూతపడనున్న (బి.హెచ్.ఈ.యల్) ను ( బి.హెచ్.పి.వి)లో విలీనం చేయించారని, ఎప్పుడో మూతపడాల్సిన షిప్ యార్డు ను న్యావిలోకి మెర్జ్ చేయించారని , (ఎన్.టి.పి.సి) , (హెచ్.పి.సి.యల్) విస్తరణ కూడా వై.యస్ హయాము లోనే అంకురార్పణ జరిగిందని. ఆరిలొవ , సింహాచలం , మదురవాడ నగరానికి 6ట్రాక్ రోడ్లు నిర్మించారని. ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి రైల్వేస్టేషన్ వరకు 87 కోట్లు పెట్టి విశాఖలోనే తొలి ఫ్లై ఓవర్ నిర్మించారని చెప్పుకొచ్చారు. విశాఖలో ఐ.టి రంగం కూడా వై.యస్ హయాములోనే అభివృద్ది చెంది౦దని చెబుతూ, నగరంలో ఐ.టి ఎగుమతులలో వై.యస్ పాలనలో 18000 మంది ఉద్యొగులతో 2000 కోట్లు ఉంటే, చంద్రబాబు 5 ఏళ్ళ పాలనలో 1045 కోట్లకి పడిపొయి ఉద్యోగులు 2వేలు మంది తగ్గి 16000 మంది అయ్యారని, అలాగే ఉత్తరాంద్ర వాసుల కలల ప్రాజెక్టు ఉత్తరాంద్ర సుజల స్రవంతి కి అంకురార్పన చేశారని చెప్పుకోచ్చారు.
ఇలా వై.యస్ తన పాలనలో విశాఖను అభివృద్ది పధంలో నడిపించి విశ్వ నగరంగా తీర్చిదిద్దితే. రాష్ట్ర విభజన తరువాత గత చంద్రబాబు ప్రభుత్వంలో విశాఖను నిర్లక్ష్యం చేశారని, ఒక్క శాశ్వత కట్టడం నిర్మించకపొయిన రాష్ట్రమే అమరావతి అన్నంత స్థాయిలో ప్రచారం సాగించారని, మరో పక్క ప్రశాంతతకు నిలయం అయిన విశాఖలో ప్రభుత్వ పెద్దలే భూ కబ్జాలకు తెరతీసారని. చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటికరణ చెయటానికి ప్రయత్నాలు చేశారని . హుద్ హుద్ పేరు చెప్పి భూముల డాక్యుమెంట్ల ట్యాంపరింగ్, 3 వేల కోట్ల దస్పల్లా భూముల కబ్జా చేశారని. దీనిని అప్పటీ తెలుగుదేశం శాశన సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడే బహిరంగంగా చెపారని. మరోపక్క సమ్మిట్ల పేరుతో లక్షల కోట్ల పెట్టుబడులు అంటు మోసానికి వేదికగా విశాఖను వాడుకున్నారని. ఇప్పుడు మళ్ళి విశాఖ అభివృద్దికి జగన్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అడ్డుపడుతు తెలుగుదేశం నేతల చేత విమర్శలు చేయిస్తున్నారని, ఇది చంద్రబాబు కావాలనే చేస్తున్న రాజకీయం అని దుయ్యబట్టారు.
జగన్ ముందుచూపుతో గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని తెరపైకి తెవడం ద్వారా వెనకపడిన ఉత్తరాంద్రతో పాటు రాష్ట్రంలో నలుమూలలా అభివృద్దికి అంకురార్పణ జరుగుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహంలేదు, నాడు వై.యస్ నేడు జగన్ విశాఖ అభివృద్దిపై ప్రత్యక దృష్టి పెట్టటం ఎంతో హర్షించదగ్గ విషయం. నాడు గ్రేటర్ హోదాతో నేడు క్యాప్టిల్ హోదాతో విశాఖ ప్రజలకు ప్రాతినిధ్యం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవటంతో విశాఖ చరిత్రలో మరో మైలు రాయిని దాటిందని చెప్పుకోవచ్చు.

No comments: