Comments

మూడవసారి కూడా రాజధాని విషయంలో అదే తప్పు జరుగుతుంది.


రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుమీద రైతుల నుండి భూములు తీసుకుని సింగపూర్ సంస్థలతో ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసింది. అవసరానికి మించి భూములు తనఖా పెట్టబోయింది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో జరుగుతుంది అన్నట్టు కేంద్రం నుంచి వచ్చిన అన్ని సంస్థలను అమరావతికి తరలించబోయింది. దీంతో రాష్ట్ర విభజనతో భంగపడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో మళ్ళీ అదే అనుమానం అభివృద్ది మాదాకా వస్తుందా లేక అభివృద్ది జరుగుతున్న ప్రాంతానికి వలస వెళ్లాలా అని. జరిగిన తప్పులే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు కళ్ళకి కట్టినట్టు కనపడసాగింది. దీంతో తెలుగుదేశం మీద మిగిలిన ప్రాంతాల్లో పూర్తిగా అసహనం అల్లుకుంది. ఆ అసహనం 2019 ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబించింది. 

ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంతి పీఠం అధిష్టించిన జగన్ వికేంద్రికరణకు మొగ్గు చూపుతూ రాజధానిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదే అభిప్రాయం 2014 లో శివరామ కృష్ణ కమిటి, నేడు జియన్ రావు కమిటి వెలిబుచ్చింది. అభివృద్ది అంతా ఒకే ప్రాంతానికి అంకితం చేస్తే రాబొయే రోజుల్లో రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు ఊతం అవుతుందని హెచ్చరించింది. ఇక ఈ కమిటి రిపొర్టు వచ్చిందో లేదో రాజకీయ రాబందులు వాలిపోయాయి. రాజధాని పేరిట కేంద్రం నుండి 2,500 కోట్ల సొమ్ము తీసుకుని శాశ్వత కట్టడం ఒక్కటి కూడా కట్టని తెలుగుదేశం రాజధాని ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టి అమరావతి ఇక ఎందుకు పనికి రాదని విషం నూరిపోస్తూ వారికి లేని భయాలను కలిగిస్తూ స్వార్ధపూరిత రాజకీయాలు చేశారు. కోర్టుల్లో కేసులు వేసి పరిపాలన రాజధాని విశాఖ అవ్వకుండా అడ్డుకున్నారు.

నిజానికి అమరావతిలో కమిటి రిపోర్టు ప్రకారం శాశనసభ, రాజ్ భవన్ లాంటి ప్రభుత్వ భవనాలు ఉండాలని కమిటి చెప్పింది. అలాగే అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తాం అని నాడు జగన్ నుండి హామి కూడా వచ్చింది. కానీ కొందరు వాదన మొత్తం రాజధాని అమరావతిలోనే పెట్టాలని. దాని కి తగ్గట్టే మీడియా బలంతో ప్రచారం చేసి జగన్ ఓటమికి కారణమ్య్యారు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తెలుగుదేశం వరద ముంపు ప్రాంతంలో రాజధాని కట్టాలని మళ్ళీ ప్రయత్నాలు మోదలుపెట్టింది. ఇది ఎంత ప్రమాదకరమైన వాదనో మనకి 100ఏళ్ల చరిత్ర చెబుతుంది. రాజధాని పేరుతో మొత్తం అభివృద్ది తమ దగ్గరే జరగాలి అని కోరుకోవటం అత్యంత స్వార్ధపూరితమైనది. తమ ప్రాంతంలో జరిగిన మొత్తం అభివృద్ధిని అనుభవించాలనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని అనే ఆలోచన ప్రజల్లో రావాలి. ప్రాంతియ అసమానతలు మళ్ళీ మొలవకుండా రాజధాని వికేంద్రికరణతోబాటు అభివృద్ధి వికేంద్రికరణ కూడా చాలా అవసరం అని గుర్తించాలి.

కొందరు రాజకీయనాయకులతోబాటు ప్రజలు కూడా రాజధాని అంటే ఎదో రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూస్తున్నారేగాని రాష్ట్ర ప్రజలందరి అవసరాలు తీర్చేదిగా చూడటం లేదు. ముఖ్యమైన ప్రజావసరాలు తీర్చేవన్ని గతంలో రాజకీయనాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానిలోనే పెట్టి, దానికోసం అందరు కొట్టుకు చచ్చే ప్రాంతంగా తయారు చేస్తూ వచ్చారు. ఆ సమస్య కొన్ని రొజులకి పెనుభూతంలా మారి ఆంద్రుల పై ప్రాంతియ అసమానతల పేరున పంజా విసిరింది. మద్రాసు రాష్ట్ర విభజనతో ఆంధ్రుడికయిన గాయం మనకి తెలియకపొయినా , హైదరాబాద్ చెసిన గాయం ఇంకా పచ్చిగా ఉంచుకుని కూడా మళ్ళీ అదే తప్పు జరగాలని కొందరు కోరుకోవటం స్వార్ద పూరితం.

మాకొద్దు ఈ మద్రాస్ పాలన.

మద్రాసు ప్రెసిడెన్సి లో మద్రాసు నగరంపై మొదటినుండీ ఆంధ్రుల ప్రభావం అధికంగా ఉండేది. మద్రాస్ నగరంలో తమిళులతో సమానంగా తెలుగువారు ఉండేవారు. తెలుగు రాష్ట్రాలనుండి ఉపాధి కోసం వ్యాపారం కోసం అనేక మంది మద్రాసు చేరారు.మద్రాసు తమ రాజధాని అని ఎన్నో పెట్టుబడులు పెట్టారు. సినీ పరిశ్రమ విజయ వాహిని స్టుడియో లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. అనేకమంది తెలుగువారు హోటల్స్ కట్టుకున్నారు. 1950 నాటికే మద్రాస్ లో తెలుగువారు స్థాపించిన ఛారిటీస్ 12వరకు ఉండేవని ప్రకాశం పంతులు తన జీవిత గాధలో చెప్పుకొచ్చారు. ఒక పక్క ఆంధ్రులు మద్రాస్ లో పెట్టుబడులు పెడుతుంటే మరో పక్క తెలుగువారిపై తమిళుల వివక్ష అధికంగా ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సిలో 40% ఉన్న తెలుగువాళ్ళు తమిళుల పాబల్యం వలన వివక్షకు గురౌతూ వచ్చారు. ప్రెసిడెన్సిలో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతంలోకుడా ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీలు తక్కువుగా ఉండేవి. రైల్వే విషయంలో కూడా తెలుగు ప్రాంతాలు చిన్న చూపుకు గురయ్యాయి. కోస్తా ప్రాంతాల నుండి మద్రాసు వెళ్ళటానికి ఓడలు తప్ప మరే ఇతర ప్రయాణా సాధనాలు ఉండేవికావు. వివక్ష ఎంత దారుణంగా ఉండేదంటే, తెలుగువాళ్ళు సైన్యంలో చేరటానికి వీలులేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉండేవి. తెలుగు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం దొరకాలి అంటే గగనం. ఒకవేళ దొరికినా తెలుగేతరులకన్న తక్కువ జీతాలు ఉండేవి. ఉదాహరణకి తెలుగువాళ్ళకి తెలుగేతరలకన్న 27% తక్కువ జీతాలు ఉండేవి. డిప్యూటి కలక్టర్ గా తెలుగువాళ్ళ జీతాలు ఇతర ప్రాంత డిప్యూటి కలక్టర్ కన్న 11% తక్కువగా ఉండేవి. మద్రాసు నగరంలోనే కాకుండా ఆంధ్రప్రాంతం లోని ఉద్యోగాలు కూడా తమిళులకో, మహారాష్ట్రులకో దక్కేవి. ఆంధ్ర ప్రాంతంలో కుడా ఉద్యోగం చేసే తెలుగువారిని వేళ్ళమీద లెక్కపెట్టే విధంగా ఉండేది. ఉపాధ్యాయులు కోర్టు గుమస్తాలు కూడా తమిళులే ఉండేవారు. దీంతో చదువుకున్న యువకుల్లో ప్రత్యేక రాష్ట్రం ఆలోచన పుట్టుకువచ్చింది. ఆంధ్ర మహాసభలు ప్రతి ఏడు జరిగినా రాయలసీమ ప్రాంతం వారు మాత్రం ప్రత్యేక రాష్ట్రం మీద తమ సందేహాలను వ్యక్తపరుస్తు వచ్చారు. రాయలసీమ వారి అనుమానాలు పోగొట్టడం కోసం కోస్తా రాయసీమ ప్రముఖులు కాశీనాధుని నాగేశ్వరరావు గృహంలో (శ్రీ బాగ్) 1937 నవంబర్ లో సమావేశం అయ్యారు. రాయలసీమ వారి అనుమానాలు తీర్చటానికి సీమ ప్రాతంకి కొన్ని హామీలు ఇచ్చారు. అంతటితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని తీర్మానం అసెంబ్లీలో ప్రతిపాదించి నెగ్గించుకున్నారు.

ఆంధ్రకు రాజధానిగా మద్రాసు రాష్ట్రం ఉండాలని ప్రకాశం పంతులు పట్టు బట్టారు. మద్రాస్ నగరాన్ని దాని పరిసర ప్రాంతాలను చీఫ్ కమీషనర్ రాష్ట్రంగా ఏర్పరిచి, మద్రాసు రాజధానిగా 12 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా నిర్మించాలని తీర్మానించారు. ఇదే విషయాన్ని ధార్ కమిటి ( ఫసల్ అలీ కమీషన్) కి ఇచ్చారు. పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నగరం ఆంధ్రులకి తమిళులకి ఉమ్మడి నగరం గా ఏర్పాటు చేయాలని సమస్య పరిష్కారం అవుతుందని దీక్షలో ఉండగా చెప్పుకొచ్చారు. దీనికి కారణం అనేకమంది మద్రాసు తమ రాజధానిగా భావించి అక్కడ వ్యాపారాలు నివాసాలు ఏర్పరచు కోవడం , సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిగా తీర్చిదిద్దే వేరొక ప్రదేశం లేకపొవటం,(అభివృద్ది అనేది మద్రాసుకు పరిమితం అవ్వటం) దీంతో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి అయిన శ్రీ రాజగోపాల చారి మద్రాసును వదులుకున్న మరు క్షణం ఆంధ్ర రాష్ట్రం కి ఒప్పుకుంటాము అని సభల్లో ప్రకటించుకుంటూ వచ్చారు. ఈ వాదాల మద్య పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరహార దీక్ష చేయడం ఆ దీక్షలోనే ఆయన కాలం చేయడంతో మద్రాసులో హింస చెలరేగింది. పొలీసు కాల్పుల్లో అనేకమంది చనిపొయారు. దీంతో మద్రాస్ నగరం మినహా నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి స్టేట్ కౌన్సిల్ లో అపట్టి ప్రధాని నెహ్రు ఒక ప్రకటన చేశారు. తమ రాజధాని అని పెట్టుబడులు పెట్టిన ప్రాంతం చివరికి సీమాంధ్రులకు తమది కాకుండా పోయింది. 1953 మార్చ్ 25న నెహ్రూ మద్రాసు వదులుకోవాలని రాజధాని ఎక్కడో ఆంధ్ర అసెంబ్లీ సభ్యులే తేల్చుకోవాలని చెప్పారు. దీంతో 1953 జూన్ 5న ఆంధ్ర శాశన సభ్యులు మరోసారి సమావేశమై తాత్కాలిక రాజధాని నిర్ణయించమని ప్రకాశం పంతులకు భాద్యతలు అప్పజెప్పారు. దీంతో కర్నూలు రాజధానిగా ప్రకాశం పంతులు నిర్ణయించారు. దీంతో 1953 అక్టొబర్ 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

విశాలాంధ్ర స్వప్నం

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై ఒత్తిడి పెరగటం, సయ్యద్ ఫజల్ అలీ నేత్రుత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ఏర్పాటవ్వటం 1955 సెప్టెంబర్ 30న ఆ కమీషన్ తమ నివేదిక సమర్పించటం జరిగిపోయింది. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని కోరుకోవటంతో కమీషన్ ఆ డిమాండ్ ను సమర్దిస్తూ హైద్రబాద్ రాష్ట్రంలో మరాఠి మాట్లాడే ప్రాంతాలను మహరాష్ట్రలో, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్నాటాకలో , తెలుగుమాట్లాడే ప్రాంతాలని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో కొంతమందికి అనుమానాలు ఉండడం వలన 5 ఏళ్ళ తరువాత రాష్ట్ర శాశన సభలో మూడింట రెండువంతుల సభ్యులు ఒప్పుకుంటేనే ఆంధ్రాలో విలీనం చెయ్యవచ్చని కుడా సూచించింది కమీషన్ సూచనలు ఆహ్వానించి కే.వి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర ఏర్పాటును సమర్ధించారు. హైద్రబాద్ శాసనసభలో అధిక శాతం మంది ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటును సమర్ధించారు. శాశన సభలో 103 మంది ఆంధ్ర ప్రదేశ్ కు మద్దతు తెలుపగా 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 అమంది తటస్థంగా ఉండిపోయారు. 1956 ఫిబ్రవరి 20న రెండు ప్రాంతాల నాయకులు సమావేశం అయి విలీనం లో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న భయాలపై అనేక చర్చలు జరిపి చివరికి 1956 జులై 19న పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నారు. దీంతో 1956 నవంబర 1న ప్రధాన మంత్రి నెహ్రు చెతుల మీదగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింధి ఆంధ్ర ప్రాంతం వారికి రెండవ శాశ్వత రాజధానిగా హైదరాబాద్ ఏర్పడింది.

హైదరాబాద్ తమ రాజధానిగా భావించిన సీమాంధ్ర ప్రాంతంవారు తిరిగి అక్కడ పెట్టుబడులు పెట్టటం మొదలుపెట్టారు. మద్రాసు నుంచి మెల్లగా తమ వ్యాపారాలను హైదరాబాద్ కి తరలించారు. ఏళ్ళు గడిచాక విశ్వనగరమైన హైదరాబాద్ తమదిగా భావించారు రాజకీయాలకు,రాజకీయ నాయకులు చేసిన తప్పిదాల వలన మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ రెండవసారి ఊపందుకుంది. 1972లో ముల్కి నిబంధనల ద్వారా కాకాని వెంకట రత్నం ఆధ్వర్యంలో ఏర్పడిన జై ఆంద్ర ఉద్యమం తెలంగాణ నుండి ఆంధ్రను విడదీయమని కానీ 2009 వచ్చేసరికి, అదే ఆంధ్ర ప్రజలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమమాన్ని వ్యతిరేకిస్తు సమైక్య ఆంధ్ర అన్నారు. దీనికి ముఖ్య కారణం 1970 నుండి 2009 వరకు సీమాంధ్ర ప్రాంతంలో హైదరాబాద్ తో సమాంతరంగా అభివృద్ది చెందిన ప్రాంతం ఇంకొకటి లేకపొవటం, ఉద్యోగాలు కావాలంటే ఆంధ్ర ప్రజలకు హైదరాబాద్ తప్ప ఇంకో ఆధారం లేకపొవటం , సీమాంధ్రులు హైదరాబాద్ తమ రాజధాని అని అందరూ అక్కడే పెట్టుబడులు పెట్టటం, దీంతో మద్రాసులో చెసిన తప్పే ఆంధ్ర ప్రజలు రెండవ సారి చేసినట్టయింది. ఈ తప్పు జరగటానికి ప్రథమ బాధ్యులు రాజకీయ నాయకులు, అభివృద్దిని వికేంద్రికించకుండా మొత్తం ఒకేచోట కేంద్రీకృతం అవటంతో స్వతంత్రం వచ్చిన ఇన్ని ఏళ్ళ తరువాత కూడా రాష్ట్ర రాజధానిపై వాదులాడులోవటం జరుగుతూ ఉంది, ఇది సీమాంద్ర ప్రజల దౌర్భాగ్యం …

2014లో రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు జరిగిన రెండు తప్పుల నుండి పాఠం నేర్చుకునట్టు కనపడలేదు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంటూ మళ్ళీ అదే తప్పుకు బీజం వేసారు. రాష్ట్ర ప్రజల చూపు అమరావతి వైపు తప్ప ఇంకో వైపు చూసే అవకాశం లేకుండా ఉండే స్థాయిలో ప్రచార చేశారు. కనీసం ఒక్క శాశ్వత భవనం కట్టకపోయినా అదొక అద్బుత రాజధాని అనే భ్రమను ప్రజల్లో కలిగించటానికి పత్రికల సాయంతో విశ్వ ప్రయత్నం చేశారు. 10 ఏళ్ల తరువాత కూడా అమరావతి బీడుగానే ఉంది. రాష్ట్ర ప్రజల చేతుల్లోనే 100 ఏళ్ళుగా జరిన తప్పులను సరిద్దిదుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ 100 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో జరిగిన తప్పులను దృష్టిలో ఉంచుకుని, శివరామ కృష్ణ , ప్రస్తుత జి.యన్ రావు కమిటీ నివేదికలు ఆధారంగా అభివృద్ది ఒక్క రాజధాని ప్రాంతానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందే విధంగా, భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు మళ్ళీ రాకుండా ఉండేదుకు అభివృద్ది వికేంద్రికరణకు శ్రీకారం చుట్టారు. దీనిని కొంతమంది తమ స్వార్ధం కోసం వ్యతిరేకించారు. వారు ప్రస్తుతం తమ వ్యక్తిగత అభివృద్దినే ఆలోచిస్తున్నారు కానీ రాష్ట్ర భవిష్యత్తుని పరిగణలోకి తీసుకోవడంలేదు అనేది సుస్పష్టం. 

కొంతమంది తెలుగుదేశం నాయకులు తమ స్వార్ధ రాజకీయలకోసం అమరావతి అనే బ్రహ్మ్మపదార్ధాన్ని కనిపిస్తూనే ఉంది. నేడు ఆంధ్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సింది. జరిగే అభివృద్ది మనకోసం కాదు మన భవిష్యత్తు తరాల అభ్యున్నతి కోసం, మళ్ళీ ఇంకో 20, 30 ఏళ్ళ తరువాత ప్రాంతీయ అసమానతలతో విద్వేషాలతో రగిలిపోయి జరిగిన తప్పులే మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసేందుకే బాధ్యత నేడు ఈ రాష్ట్ర ప్రజలందరిపైన ఉన్నది. దీనికి జగన్ తీసుకున్న అభివృద్ది వికేంద్రికరణ , పరిపాలన వికేంద్రికరణే సరైన మందు. రాజధానుల విషయంలో రెండు సార్లు ఆంధ్ర ప్రజలకు గుణపాఠం ఎదురైంది. ఇప్పుడు 3వ సారి కూడా అదే తప్పు జరుగుతుంది. గత రెండు గుణపాఠాల నుండి ఏం నేర్చుకున్నామో మనలని మనం ప్రశ్నించుకునే సరైన సమయం ఇది…   



మూడవసారి కూడా రాజధాని విషయంలో అదే తప్పు జరుగుతుంది.  మూడవసారి కూడా రాజధాని విషయంలో అదే తప్పు జరుగుతుంది. Reviewed by surya on 2:05 AM Rating: 5

No comments:

Powered by Blogger.