Comments

ఎన్.టి - రామారావు కి వెన్నుపొటు - దుష్టశక్తి పాత్ర ఎవరిది, ఏది నిజం ?

చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆశ తొ , ఎన్.టి - రామారవు కి వెన్నుపొటు పొడిచారా , లేక ఆయన రాష్ట్ర ప్రజలకి వివరణ ఇచ్చినట్టు దుష్టశక్తులనుండి (1993 లొ రామారావు గారిని పెళ్ళిచెసుకున్న లక్ష్మి పార్వతి) నుండి పార్టి ని కాపాడారా. ????
==========================================================

కొంచం చరిత్ర లొకి వెలితే 1987 నవంబర్ 9 న అప్పటి తెలుగుదేశం రెవెన్యు మంత్రి శ్రీనివాసుల రెడ్డి చంద్రబాబు పైన ఒక తీవ్రమైన ఆశక్తికరమైన ఆరొపణ చెశారు..........

******ఆరొజు ఆ (టి.డి.పి) మంత్రి ఏమన్నారు అంటే****** (ఆంద్రపత్రిక లొ వచ్చిన వార్త )......... 


రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం కాళి అయితే ఆ పదవిని చెజిక్కించుకొవటానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నం చెస్తున్నారు అని రెవెన్యు మంత్రి శ్రీనివాసుల రెడ్డి ఆరొపించారు . నేటి మద్యాహ్నం విలేకరుల సమావేశం లొ మట్లాడుతు శ్రీ చంద్రబాబు నాయుడి ని ఆయన తీవ్ర పదజాలం తొ విమర్శించారు . ముఖ్యమంత్రి పదవి చెజిక్కించుకునే ప్రయత్నం లొ తాను , ఉపేంద్రా , దగ్గుబాటి వెంకటేశ్వర రావు అడ్డు వచ్చే ప్రమాదం ఉంది అని చంద్ర బాబు భయపడుతున్నారు అని ఆయన అన్నారు . తమ ముగ్గురిని పార్టీ లొనుండి తప్పించే భాగంగానే తమ పై ధుమారం లేవతీశారు అని శ్రీ రెడ్డి ఆరొపించారు . చంద్రబాబు ప్రస్తుతం పార్టి ప్రధాన కార్యదర్శి కాకపొయినా పార్టీని , ప్రభుత్వాన్ని తన సోంత సోత్తు కింద పరిగణిస్తు వ్యవహరిస్తున్నారని శ్రీ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

ముఖ్యమంత్రి ఆదేశానుసారమే తాను ఈ ప్రజా సదస్సులను నిర్వహిస్తున్నాను అని వీటి ద్వారా తాను ప్రజాభిప్రాయాన్ని పొందటం చంద్రబాబు కు ఈర్ష్య గాను అక్కసు గాను ఉంది అని శ్రీ రెడ్డి అన్నారు . ఈ సదస్సు కు ఇతర మంత్రులు ,కలక్టర్లు రాకుండా చంద్రబాబు అనేక విదాలు ప్రయత్నిస్తున్నారు అని శ్రీ రెడ్డి ఆరొపించారు .

తరువాత నాలుగు రొజులకి అంటే నవంబర్ 13 న మళ్ళి ఇంకొ ఆరొపణ చెసారు దాని సారాంసం ఇది
శీనయ్య మాటలలొ:--- (కింద పేపర్ కటింగు లొ చూడొచ్చు)

తాను చనిపొయే లొగా ముఖ్యమంత్రి పదవి పొందాలి అని చంద్రబాబు నాయుడు ఉబలాట పడుతున్నాడు . అందుకొసం ఆహారం లొ విషం కలిపి ఎన్.టి.ఆర్ ని చంపేయటానికి కూడా చంద్రబాబు వెనకాడడు , అలాచెసినా ఆచర్య పొవాల్సిన పనిలేదు . ఇప్పటికే చంద్రబాబు పార్టి నుండి నన్ను పంపించేలా చెసాడు , ఉపేంద్ర ని మరొలా అడ్డు త్వలగించుకున్నాడు ఇప్పుడు మిగిలింది ఎన్.టి.ఆర్ ప్రాణం ఒక్కటే దానిని కూడా చంద్రబాబు ఏదొ ఒక రొజు తీయ్యక మానడు , మెల్లిగా ఒకదాని తరువాత ఒకటి నరుక్కుంటు వస్తూన్నాడు

లక్ష్మీ పార్వతి గారు రామారావు ని 1993 లొ పెళ్ళి చెసుకుంటే ఈ వార్త 1987 లొ వచ్చింది . అప్పటికి లక్ష్మీ పార్వతి అనే మనిషి రామారావు జీవితం లొ లేదు, అప్పుడు రెడ్డి గారు చెప్పింది 8 సంవత్సరాల తరువాత నిజమైంది.
ఎన్.టి - రామారావు కి వెన్నుపొటు - దుష్టశక్తి పాత్ర ఎవరిది, ఏది నిజం ? ఎన్.టి - రామారావు కి వెన్నుపొటు - దుష్టశక్తి పాత్ర ఎవరిది, ఏది నిజం ? Reviewed by surya on 11:33 PM Rating: 5

No comments:

Powered by Blogger.