18, 19 వ శతాబ్ధం లొ బ్రిటీష్ వాళ్ళు ఐరొపా వాళ్ళు భారత దేశం కి వచ్చి భారత దేశం యొక్క విస్తారమైన భౌగొళిక సరిహద్దులు, భినత్వం లొ ఏకత్వం, వివిద మతాల సమేళనం చూసి విపరీతంగా దిగులు చెందారు, వారికి ఉన్న గత అనుభావాలు దృష్ట్య ఇలా భినత్వం గా ఉన్న వాళ్ళు ఏప్పుడు ఎక్కడ ఒక దేశం గా కలిసి ఉండలేరు అని నమ్మూతు వచ్చారు, ఇది వారి తప్పు కాదు ఎందుకు అంటే వారి ఐరొపా చరిత్ర మొత్తం, భూబాగాల కొసం యుద్దాలు, జాతి స్వచ్చత పేరు మీద సరిహద్దులు ఏర్పర్చుకొవటం, మతపరమైన విశ్వాసాలతొ విడి భుభాగాలు ఏర్పర్చుకొవటం, సాంసౄతిక, భాషా , రాజకియ అవసరాల ఉనికి అంటు అనేక రకాలుగా విడిపొయి దేశాలుగా మారిపొయిన చరిత్ర వాళ్ళ సొంతం, ఇది నిర్ధారించుకొవాలి అనుకుంటే ఐరొపా లొ 7వ శాతాబ్దం నుండి 15వ శతాబ్ధం వరకు సాగిన భూస్వామ్య పరిణామం, 18వ శతాబ్ధం నుండి ఇప్పటివరకు సాగిన రాజకీయ ఉద్యమాలు, విడిపొయిన యుగొస్లేవియా, జెకొస్లేవేకియా, సొవియేట్ రిపబ్లిక్ లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
భారత దేశం లొ యురొపియన్లు అసాధారణము అని భావిస్తు వస్తున్న ఈ భినత్వం లొ ఏకత్వం అనే సిద్దాంతం వారి అంచనాలకు మించి ఉండటం గమనించారు, మొత్తం ఐరొపా కన్న ఎక్కువ ఉన్న భారత భూభాగం ఒకే దేశం గా ఎలా మనుగడ సాదిస్తుంది అనే ప్రశ్నకి పరిష్కారం వారి ఊహకి కూడా అందలేదు, వారి అజ్ఞానం ని కప్పిపుచ్చుకొవటానికి బ్రిటిషు మరియు ఐరొపా పండితులు అందరు కలిసి భారత దేశం అంతా ఒకటి కాదు వివిద రాజ్యాల సమూహమే ఈ భారత దేశం అని ప్రకటించారు. బ్రిటీషువాళ్ళ ఆలొచనని అనుగుణం గా ఈస్ట్ ఇండియా కంపెని కి సివిల్ సర్వెంట్ గా చెసిన జాన్ స్ట్రాచి ఇలా రాసాడు
" మనము ఇండియా గురించి మొదట తెలుసుకొవలసిన విషయం "భౌతికంగా కానీ, సామాజికంగా కాని, రాజకీయంగా కాని, మతపరంగా కాని, ఎల చూసుకున్న ఇండియా అనేదే లేదు అని రాసాడు " జాన్ స్ట్రాచీ తొ పాటు కంపెని అండలొ బ్రతికే దుబొఇస్ అనే మైసూరు మిషనరికి చెందిన వ్యక్తి కూడా ఇదే పరమైన అభిప్రాయాలను తెలుపుతు పుస్తకాలు రాసాడు,
ఇలంటి ఐరొపా బ్రిటీషు వారు అందరుకలిసి బౌగొళిక పరంగా, సాంసృతిక పరంగా ఒక్కటిగా ఉన్న భారతదేశం ని అనగతొక్కటానికి ప్రచారం లొ పెట్టిన మాటే భారత దేశం ఎప్పుడు ఒక దేశం కాదు , కెవలం తాము (బ్రిటీషర్లు) వచ్చిన తరువాతే చిన్న చిన రాజ్యాలుగా ముక్కలుగా ఉన్న ఈ భూభాగం ని రాజకీయంగా ఒక దేశం గా ఏర్పరిచాం అని చెబుతు ప్రచారం చెశారు, ఇలా విషప్రచారం అందుకున్న బ్రిటీషర్ల ఆలొచన విధానం ని ఖండిస్తు భారత దేశ ఉనికిని వివరిస్తు మహాత్మా గాంధి గారు హింద్ స్వరాజ్ అనే పత్రికలొ ఈ విదంగా రాసారు.
ఈ తెల్లవాళ్ళు వచ్చి మనది ఒక దేశం కాదు అని వాళ్ళు వచ్చిన తరువాతే ఒక దేశం గా ఏర్పడింది అని చెబుతూ వచ్చారు, నేను ఇక్కడ వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఈ తెల్లవాళ్ళు ఈ భూ భాగం లొకి అడుగుపెట్టక ముందే మనది ఒక దేశం, ఒకే ఆలొచన మనకి ప్రేరణ కలిగించింది , మన జీవన విధానం ఒక్కటే, మనది ఒక దేశం కాబట్టే వాళ్ళు ఒక రాజ్యంగా ఇప్పుడు మనలని పాలించగలుగుతున్నారు, మన దేశం లొ చాలా మంది ప్రముఖులు కాలినడకన కాని , ఏద్దుల బండి లొ కాని ఈ దేశం మొత్తం తిరిగారు, మన పూర్వీకులు ముందు చూపుతొ ఏ విదంగా దక్షిణం న రామశ్వరం , తూర్పున జగన్నాదుని , ఉత్తరాన్న హరిద్వార్ ని ముఖ్య తీర్దయాత్రల స్థలాలుగా నిర్ణయించారు, వాళ్ళు ఏమి మూర్కులు కదు ఇలా చెయటానికి , వాళ్ళకి తెలుసు దేవుడి ని ఇంట్లొ ఉండికూడా గది మందిరం లొ పెట్టుకుని పూజించుకొవచ్చు, ఎవరి ఇంట్లొ అయితే గంగ ని పెట్టుకుంటారొ వాళ్ళ హృదయాలు ధర్మము తొ వెలుగొందుతాయి అని మనకి మన పూర్వికులు నెర్పారు 15వ శతాబ్దం లొనే గురు రవిదాస్ గరు చెప్పిన విషయము మనము గుర్తు చెసుకొవాలి, ఈ దేశం ప్రకౄతి ఆదారం గా నిర్మితమైనది, ఈ భూభాగం లొ వారు నెలకొల్పిన పుణ్యక్షేత్రాలే మిగిలిన ప్రపంచంకి భారత భూమికి మద్య ఉన్న తేడాని చూపిస్తుంది. అని గాంధి గారు తన వ్యాసం లొ వివరించారు.
ఇదే సమయం లొ ఆర్.కె ముఖర్జీ గారు తన వ్యాసం "ఫండమెంటల్ యునిటి ఆఫ్ ఇండియా" లొ ప్రాచీన భారత దేశ ఉనికిని వివరిస్తు " ఐరొపా చీకటి యుగం లొ ఉన్నప్పుడే భారత భూమి జాతియవాదం ని ప్రచారం చెసింది అని నేడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియ గా ఉన్న విస్తారమైన భూ భాగ ప్రాంతం అంతా ప్రాచీన భారత్ లొ భరతవర్షం గా పిలిచెవారు అని ఈ భూ భాగం ఉత్తరం న హిమాలయ పర్వతములు, దక్షిణము న సముద్రాల సరిహద్దులుగా జంభూద్వీపం గా ఉండేది అని ఇదే ప్రపంచం లొ ఉన్న ఇతర ప్రాంతాలకి భారత భూమికి మద్య ఉన్న తేడా అని చెప్పారు,
భరత దేశ/రాష్ట్ర అనే ఖచ్చితమైన ప్రస్తావన మనకి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం లొనే పాణిని ప్రస్తావించాడు, మన పురాణాలు భరతవర్షం అనే మాటని అనేక సార్లు ప్రస్తావించాయి. మన పురాణాలలొ అనేక మార్లు ఈ విందంగా చెపబడ్డాయి. ముఖ్యంగా మహాభారతం లొని భీష్మ పర్వం లొ జంభూ ద్వీపం గురించి ప్రస్తావించారు, జంభూద్వీపము 80,600 యొజనుమ విస్తీర్ణం తొ ఉంటుంది అని హద్దులు కూడా చెప్పారు, దీనికి హద్దులు గా - దక్షిణం న హిందు మహా సముద్రము, ఉత్తరం న మంచు కొండలు అయిన హిమాలయాలు, మద్యన ముఖ్యమైన 7 పర్వతాలు ( మలయము, శక్తిమంతము, వింద్యా, పారియత్ర, మహెంద్రము, ౠక్షవంతము, సహ్యాద్రి ) అను 7 పర్వతముల ఇందులొ {గంగా, తుంగబద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్నా, యమునా, తమస, శారావతి, కావేరి, గొదావరి, నర్మదా, బాహుదా, సరయు,శతదృవు, వితస్త ,విపాశ, తామ్ర పర్} అను మహానదులు కలవు అని భీషపర్వం లొ ఈ దేశము గురించి ప్రస్థావించారు. అలాగే తూర్పున కిరాటలు ( నేపాల్ ప్రాంతము లొ రాజ్యము ) పడమర న యవనలు ( గ్రీకులు) కలరని స్పష్టంగా చెప్పారు.
భరతవర్షము అంటే నేడు ఇండియా మాదిరి భౌగొళిక విస్థరణ మాత్రమే కాదు, ఆ పేరుకి మరింత చారత్రిక ప్రాముఖ్యత కూడా ఉంది. రుగ్వేదం ప్రకారం భరతులు నివసించే దేశము అని కూడా చెబుతారు, హైందవ సాహిత్యం లొ చెప్పబడ్డ ఈ పేరు తొ హైందవుల మనొభావాలు, ప్రేమా, ఒక సేవా తత్వం ముడిపడి ఉండటం మనం చూడొచ్చు ఇప్పటికి వినాయకుని వ్రత కల్ప పూజ ని ఆచరించె ఆప్పుడు లొ మంత్రాలలొ ఈ మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి ( ద్వితియ పరమార్దే, శ్వేత వరాహకల్పె, వైవస్యతమన్వంతరే, కలియుగే ప్రదమపాదే , జంభూద్వీపే , భరతవర్షే , భరతఖండే, మేరొ: దక్షణ దిగ్భాదే శ్రీశైలస్య ఈశాన్య ప్రదెశే అని మన ప్రాంతము పేరు చెప్పటం మనము చూస్తునే ఉన్నాము ) ఇలా సప్త నదులు పేరుతొ భరతవర్షం అని భూమిని పూజించటాం ఒక్క హిందవ సాంప్రదాయం లొనే ఉంది అంటే ఈ భూమిని దేశం కాదు ఎలా చెప్పగలుతారు వీళ్ళు,
అలగే ఇంకొక హైందవ మంత్రం లొ సప్త పవిత్ర స్థలాలుగా అయొద్య, మథురా, మయ (హరిద్వార్), కాశీ, కంచి, అవంతికా (ఉజేయిని), ద్వారక పేర్లు చెబుతారు అలాగే దైవికమైన స్థలాలుగా ఉత్తరం న హిమాలయాలలొ ఉన్న కైలాశ మానస సరొవరం, పచ్చమున బలూచిస్తాన్ లొ ఉన్న హింగలాజ్ దేవి, దక్షణం న కన్యాకుమారి, తూర్పున పరుసరామ కుండ అరుణాచల్ ప్రదేశ్. హైంద్వ ధర్మం ఇంకా మనుగడలొ ఉంది అంటే ఈ భూభాగం లొ ఉన్న పవిత్రస్థాలే ప్రధాన కారణం ప్రతి ఆలయం తొ హైందవ ఆత్మ ముడిపడి ఉంటుంది, హైందవ ధర్మం పాటించె వాళ్ళు ఎవరైనా కావచు, వైష్ణవులు కావచ్చు , శైవులు కావచు, శక్తి రూపం లొ ఉండే అమ్మవారుని పూజించే వారు కావచ్చు ఈ దేశం నాలుగు దిక్కులలలొ ప్రతి ఒక్కరికి ఒక ప్రధానమైన ఆలయం ఉంది. తీర్ధయాత్ర పెరుతొ ఒక రాష్ట్రం లొనే ఉండరు , ఈ దేశం లొ నలుములలకి వెళతారు , అక్కడే మనకి ప్రాచీన భారతదేశ అస్తిత్వం కనిపిస్తుంది.
ఆదిశకరాచార్యులు కూడా ఈ దేశ నాలుగు దిక్కులలొ నాలుగు మఠాలు స్థాపించారు - ఉత్తరాన్న హిమాలయా పర్వత ప్రాంతం లొ బదరి,కేదార్నాద్ దగ్గర జ్యొతిర్ మఠం , పచ్చమాన్న ద్వరక లొ శారధా మఠం , తుర్పున పూరి లొ గొవర్ధన మఠం, ధక్షణం న మైసూరు లొ శ్రుంగేరి మఠం. ఇలా వివిధ విభాగాలుగా ఉనికిని చాటుకుంటూన్న హైందవ ధర్మమే, భారతదేశం లొ యుగాలుగా జాతీయవాదం ని ఏకీకృతం చెస్తూనే వచ్చింది. సింహాద్రి భాగవత పురాణం లొ కూడా భరతఖండం దైవనిర్మిత స్థానం అని లిఖించబడి ఉంది , అందుకే మన పూర్వీకులు పురాణాలలొ అనేక మంది మరణించి తరువాత మళ్ళి ఇదే గడ్డపై జన్మించాలి అని పూజలు చెసేవారు అంటే జాతీయవాదం కి వేరే నిదర్శం అవసరమే లేదు అని చెప్పవచ్చు. జనని జన్మ భుమి స్వర్గాదపి కరీయశి అని వార్మీకి రామాయణం లొనే మన దేశం స్వర్గం కన్న గొప్పది అని రాసి దేశ ఉనికిని చెప్పారు. ఐతెర బ్రాహ్మణ లొనే 8.15 లొ హిమలాయల నుండి సముద్రము వరకు మద్యన ఉన్న ఈ భూమిని మొత్తం ఒక్కడే పాలించాలి అని ఉంది.
ప్రచీన భారతదేశ ఉనికి గురించి మన జాతీయ నాయకులైన మహాత్మ గాంధి గారు, బిపిన్ చంద్రపాల్ గారు మాత్రమేకాదు దేశం , జాతి, జాతియవాదం అనే వాటిమీద తన జీవితం మొత్తం దారపొసి పరిశొధన చెసిన అమెరికా చరిత్రకారుడు కార్ల్టన్ హయాస్ కూడా భారత దేశ జాతియవాదం గురించి చెప్పిన విషయం ( బ్రిటిషు వాళ్ళు రాజకీయంగా ఏము భారత దేశం ని ఏకం చెశాము అని చెపుకొవటం తప్పు, బ్రిటిషు వాళ్ళు భారత దేశం లొ అడుగుపెట్టక కొన్ని శతాబ్దాల ముందే వారిలొ సాంసౄతిక జాతియవాదం ఉంది దాని ఆదారంగానే వాళ్ళు భారత దేశం లొ వాళ్ళు జీవనం సాగించారు అని చెప్పాడు, చరిత్ర లొ కూడా మనకి జాతియవాదం కనిపిస్తుంది , 323 బి.సి లొ ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య్డు బాబిలొనా లొ అలెక్జాండర్ చనిపొయాడు అని తెలుసుకుంటాడొ వెంటనే జాతీయవాదం ని లేపు మిగతా వారిని కూడకట్టి పరాయి దేశం వారిని తరిమివేశాడు గ్రీకు సైనిక దళం ని తక్షశిల నుండి తరిమివేసి స్వాదిన పరుచుకున్నాడు, జాతియవాదం ప్రెరేపించి పాటలిపుత్ర దాక వెళ్ళి పరాయివారిని తరిమి , అలెక్జాండర్ చనిపొయిన రెండు ఏళ్ళకి మౌర్య మహా సామ్రాజ్యం ని స్థాపించాడు చంద్రగుప్తుడు , ఇక్కడ చంద్రగుప్తుడి తొ మిగతవారి కలిసి రావటానికి మన దేశం మన భూమి జాతియవాదం మాత్రమే అప్పటికే ఈ భూమి లొ అనేక రాజ్యాలు ఉన్న వాళ్ళు బాబిలొనా నుండి వచ్చిన అలెక్జాండర్ ని మాత్రం పరాయి దేశస్తుడు గానే చూశారు దీనికి కారణాం అప్పతీకే ఇక్కడ రాజకీయంగా రాజ్యాలు వేరు అయిన సాంసౄతికంగా ఇక్కడ జాతియవాదం విరాజిల్లటమే కారణం.
ఈ దేశ చరిత్ర అజరామం అయితే బ్రిటిషు వాళ్ళు వదిలిపొయిన ఆపొహలతొ ఇంకా భారత దేశం ఒక దేశమే కాదు బ్రిటిషువాళ్ళు వచ్చి దీనిని ఒక దేశం గా మార్చారు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు అంటే కచితంగా వారు అజ్ఞానులైనా అయి ఉండాలి లేకా పరాయి పాలకుల తానేదార్లు అయినా అయు ఉండాలి, ప్రపంచం చీకటి లొ మగ్గిపొతున్న రొజులల్లొ ఈ భూమి నాగరికత తొ విరాజిల్లింది. ఇది వేద భూమి, కర్మ భూమి, సాక్షాత్తు దైవస్వరూపులు నడిచిన పుణ్యభూమి. ప్రపంచం లొ ఉన్న 195 దేశాలలొ అమెరికా వయస్సు 500 ఏళ్ళు , 500 ఏళ్ళ క్రితం అమెరికా లేదు, ఇరాక్, ఇజ్రాయిల్ వయస్సు 2వేల ఏళ్ళు 2వేల ఏళ్ళ ముందు ఈ దేశాలు లేవు, చైనా వయస్సు 5వేల ఏళ్ళు, 5వేల ఏళ్ళ ముందు చైనా దేశం లేదు, కాని భారత దేశం వయస్సు తెలుసుకొలేకపొయారు, ప్రపంచం లొ ఏ చరిత్రకారుడి స్కెల్ కి కొలమానం కి అందని చరిత్ర భారత దేశం ది, ఆర్నాల్డ్ టాంబి అనే ఒక బ్రిటీషు చరిత్రకారుడు ప్రపంచం లొ 28దేశాల చరిత్రని చదివాను కాని నేడు ప్రపంచం లొ ఆ 28 దేశాలు చచ్చిపొయాయి, అన్నడు. అల్క్జాండర్ పుట్టిన గ్రీకు దేశం ఈ రొజు లేదు, ప్రపంచం లొ మహా సామ్ర్యాజం ఏర్పర్చుకున్న దేశం రొం ఈరొజు లేదు అస్సెరియా సుమేరియా బాబిలొనియా మిసపటొనియా ఇలా 28 నాగరికతలు,దేశాలు కాలగర్భం లొ కలిసిపొయిన తరువాత కూడా మిగిలిన ఒకే ఒక దేశం మన భారత దేశం, ప్రపంచం లొ ప్రతి దేశం ఆక్రమణకు గురైంది దండయాత్రలకు గురైంది, ఈజిప్ట్ మీద 1500 ఏళ్ళు దాడులు చేశారు ఈజిప్టు సంసృతి నాశనం అయింది, రొం మీద కేవలం 8 ఏళ్ళు దాడులు జరిగాయి రొం సంసృతి ప్రపంచం లొ నాశనం అయింది, కాని భారత దేశం మీద , హునులు, అరబ్ లు,మొగలలు, డచ్ వాళ్ళు, పొచుగీస్ వాళ్ళు బ్రిటీషువాళ్ళు ఇలా ఒకరి తరువాత ఒకరు దాడి చెసిన లేచి నిలిచిన దేశం భారత దేశం.
ఈ దేశం రాజకియంగా ఏర్పడకముందే సాంసౄతికంగా ఎప్పుడొ ఏర్పడి , ప్రపంచానికే పాటాలు చెప్పిన దేశం ఇది. ఈ దేశం మీద సాగించే విష పచారాలు కాలగర్భం లొ కలిసిపొవటమేకాని ఈ భూమి లొ లీనమైన జీవాత్మని త్వలగించటం ఎవరి తరము కదు - జై హింద్
భారత్ అనేది ఒక దేశము కాదా ? చరిత్ర ఏమి చెబుతుంది?
Reviewed by surya
on
11:23 AM
Rating:
No comments: