Comments

జగన్ ఆస్తులపై ఎల్లో సిండికేట్ దొంగాట… ఏది నిజం ?

జగన్ వ్యతిరేక కుట్రలకు నాయకుడైన రామోజీ నిజాయతీపరుడే అయితే తాను అంబానీకి వాటా ‘అమ్మితే’ వచ్చిన సొమ్ములో ఏమేరకు పన్ను కట్టారో ప్రజలకు వివరించాలి. మన రాష్ట్రంలోనూ అన్నా హజారే ద్వారా నీతిమంతమైన సమాజం కోసం ఉద్యమం చేయాలంటూ పత్రికాముఖంగా గిరీశం లెక్చర్లిచ్చిన రామోజీ…. అదే అన్నా హజారేను పిలిచి తన ఫిలింసిటీతో పాటు రాష్టవ్య్రాప్తంగా తనకున్న భూములు, దేశ వ్యాప్తంగా తన సంపదల వివరాలను, 420 సహా తనమీద ఉన్న అడ్డమైన కేసులను, హోల్‌మొత్తంగా తన చరిత్రను ఆయనకు వెల్లడిస్తే… అప్పుడు అన్నా హజారే దేశ వ్యాప్త ఉద్యమాన్ని వాయిదా వేసుకుని తక్షణం రామోజీకి వ్యతిరేకంగా ఫిలింసిటీ గేటు బయటే బైఠాయించటం మాత్రం ఖాయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ‘అన్న’ను బజారున పడేసి, పరలోకానికి పంపి, ఆ తరవాత అదే అన్నకు దండ వేయించిన దణ్ణం పెట్టించిన రాజగురువు… ఇప్పుడు అన్నా హజారేకి దణ్ణం పెడుతున్నారంటే ఇదీ ఆలోచించాల్సిన అంశమే! 
కేజీ బేసిన్‌లో అపారమైన గ్యాస్ నిల్వల్ని చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న రోజుల్లో రిలయన్స్‌కు తాకట్టుపెట్టకుండా ఉండి ఉంటే… రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నెలకు వంద రూపాయలకే వంట గ్యాస్ లభించేది.
వైఎస్ తరవాతి ప్రభుత్వాలు రామోజీ ప్రయోజనాల కోసం రిలయన్స్ ముందు మోకరిల్లకుంటే… నేడు విద్యుదుత్పాదనకు గ్యాస్ సక్రమంగా సరఫరా అయి రైతాంగానికి కనీసం తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు లభించేది.
ఈ రాష్ట్ర తీరంలోని గ్యాస్‌ను మా ప్రజలకు ఉపయోగపడకుండా వేరే రాష్ట్రాలకు ఎలా తరలిస్తారని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్… జీవించి ఉంటే, ‘నా గ్యాస్-నా ఇష్టం’ అన్నట్టుగా సాగుతున్న రిలయన్స్ ఆటలకు తెరపడి, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు వాగ్దానం అమలు అయి ఉండేది.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రిగా చంద్రబాబు రిలయన్స్‌కు వదిలేయటంవల్ల లాభపడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో మరొక్కరు ఎవరైనా ఉంటే అది రామోజీరావే. రకరకాల బోగస్ కంపెనీలను సృష్టించి రామోజీ సంస్థల్లోకి రిలయన్స్ గడచిన కొన్నేళ్ళుగా ప్రవహింపజేసిన సొమ్ము రెండున్నర వేల కోట్లకు పైనే. రాష్ట్రంలో పొలాలను ఎండబెట్టి, ప్రజల్ని ఎండగట్టి కేజీ బేసిన్ గా్‌‌యస్‌ను రాష్ట్రానికి కాకుండా చేసిన చంద్రబాబుకు అందాల్సిన ‘నజరానా’ ఇలా ఆయన రాజగురువైన రామోజీ కంపెనీల్లోకి గురుదక్షిణగా చేరింది. ఇలాంటి నిజాలు చెప్పే ఒక పత్రిక, ఆ పత్రిక వ్యవస్థాపకుడు, నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు… వైఎస్ జగన్ కడప లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేస్తున్నప్పుడు రామోజీ గుండె దడ, గడబిడ ఏస్థాయికి చేరిందో నిన్న ఆయన పత్రికను గమనిస్తే తేలిగ్గానే అర్థమవుతుంది.
మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి స్థానాల్లో ఉన్న అభినవ నీరోలు… నల్లారి, నారాలు రామోజీ ఇచ్చిన ఫిడేళ్ళు వాయించుకుంటూ ఆయనకు పక్కవాద్యాలుగా మారిన నేపథ్యంలో… రామోజీ తన పచ్చపత్రికనే వేపమండగా పట్టుకుని పబ్లిగ్గా మరోసారి వీరంగం మొదలుపెట్టారు. వైఎస్ జగన్ తన ఆస్తులకు సంబంధించి నామినేషన్‌తోపాటు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ను వక్రీకరించి తన పాఠకులను బకరాలుగా భావించి నిన్నటి ఎడిషన్ ఈనాడులో పచ్చి అబద్ధాలను అచ్చుగుద్దారు.
ప్రజా సమస్యలపై పోరాడితే ఒట్టు!
ఇప్పుడు రామోజీకి ‘సాక్షి’ని చూడకపోతే తెల్లారటం లేదు… జగన్ పేరు వింటే నిద్ర పట్టటం లేదు. ప్రజల ప్రయోజనాలు ఎలా తగలబడుతున్నా ‘ఈనాడు’కు, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి- మరీ ముఖ్యంగా రాష్ట్రంలో పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీకి పట్టటమే లేదు. ఫీజులు అందక విద్యార్థులూ తల్లిదండ్రులూ గుండె కోతకు గురవుతున్నా, విద్యుత్తు లేక పంటలు ఎండుతున్నా, ఆర్టీసీ ఛార్జీలు భగ్గుమన్నా, గుక్కెడు మంచి నీటి కోసం జనం గొంతులు పిడచకడుతున్నా, ఆసుపత్రుత్లో మందులే లేకపోయినా, రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నా, పావలా వడ్డీ ఏ మూలన పడిందో తెలియకపోయినా, జలయజ్ఞమే సాంతంగా ఆగిపోయినా, ప్రకృతి ఆగ్రహంతో తల్లడిల్లిన రైతన్నకు పైసా సాయం అందకపోయినా, రైతులకు రుణాలు గగన కుసుమాలుగా మారిపోయినా, ఉపాధికి హామీ కరవైనా, వారానికి రెండు రోజుల విద్యుత్తు కోతతో పారిశ్రామిక రంగంతో పాటు కార్మికుడి నడ్డి విరుస్తున్నా, విద్యుత్తు ఛార్జీలు పెంచేసినా, పింఛన్లను తుంచేసినా, పాలన సాంతంగా పడకేసినా, 108 కదలకపోయినా, ఉద్యోగిమీద ఉక్కుపాదం మోపుతున్నా… ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజానీకమంతా మళ్ళీ నారా వారి పాలన నాటి నరకాన్ని అనుభవిస్తున్నా ఇవేవీ అసెంబ్లీలోగానీ, రాజకీయంలోగానీ చర్చాంశాలే కావటం లేదు.
ఎందువల్ల? కేవలం ఒక కుటుంబాన్ని- మరీ ముఖ్యంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అధికార ప్రతిపక్షాలతోపాటు ప్రత్యేక ప్రయోజనాల మీడియా ముఠా ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేస్తోందంటే… ఎవరి వల్ల? అధికారపక్షాన్ని మన్నించి వదిలేసిన ప్రతిపక్షం… ఆ ప్రతిపక్షం ఎజెండాను భుజాన వేసుకున్న అధికార పక్షం… ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతటి హైన్యాన్ని మరెప్పుడైనా ఎక్కడైనా చూశారా? వైఎస్, జగన్… ఈ ఇద్దరి చుట్టూనే శాసనసభ సమావేశాలను తిప్పి, ఆ తరవాత కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులనే ఇచ్చిపుచ్చుకోవటానికి సిద్ధమైపోయిన పార్టీల బాహాటమైన విషపు కౌగిళ్ళను కన్నారా? పాడిందే పాటరా అన్నట్టు మూడేళ్ళుగా పాడుతున్న పాచి పాటలతో ఎన్నికల్లో ప్రజల తీర్పును ప్రభావితం చేయటానికి, అనుంగు గణాలతో అధికార వ్యవస్థలద్వారా వ్యాజ్యాలు నడపటానికి సాగిస్తున్న కుట్రలను గమనించారా?
దశాబ్దంగా జగన్ ఆస్తులపై ఏడుపు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, దాని హైకమాండ్ రామోజీ చేస్తున్న విష ప్రచారాలకు ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్ సమర్పించిన అఫిడవిట్‌లో పెరిగినట్టు కనిపిస్తున్న ఆస్తికి సంబంధించి రామోజీ, చంద్రబాబులకు నిజాలు తెలియక కాదు. నిజానికి వైఎస్ జగన్ ఆస్తులు పెరగలేదన్న నిజం వారికి అర్థం కాకా కాదు. మరెందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటే… నిజాలు చెప్పి బతకలేరు కనుక. 2003-04లో వైఎస్ జగన్ ఆస్తులు మొదలు నేడు ఆయన వ్యాపారాలు, నివాసాల వరకు ఎల్లో సిండికేట్ ఏనాడు నిజాలు చెప్పింది గనుక!
కంపెనీ ఆస్తులు వేరు… వ్యక్తిగత ఆస్తులు వేరు…
2003-04 ఎన్నికల్లో జగన్ పోటీ చేయలేదు. కాబట్టి అప్పట్లో వైఎస్ జగన్‌కు ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను వెల్లడించాల్సిన అవసరమే లేదు. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ఆయన నాటి ఆస్తి తొమ్మిది లక్షలన్నది. నిజానికి అది ఆయన ఆదాయం పన్ను(ఐటీ) రిటర్న్‌లో పేర్కొన్న ఇన్‌కమ్. ఇది ఆదాయమే తప్ప ఆస్తి కాదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప లోక్‌సభకు పోటీపడిన 2009లో ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించినది వ్యక్తిగత ఆస్తుల వివరాలను. చంద్రబాబు అయినా మరో నాయకుడైనా ఇలా సమర్పించేది వ్యక్తిగత ఆస్తుల వివరాలు మాత్రమే. ఉదాహరణకు హెరిటేజ్ కంపెనీ చంద్రబాబు నాయుడిదే అయినా కంపెనీ ఆస్తులు వేరు… చంద్రబాబు ఆస్తులు వేరు. ఈ రెండింటికీ మధ్య అంతరాన్ని చెరిపేసి… చంద్రబాబు అఫిడవిట్ ప్రకారం పేర్కొన్న రూ.68.70 కోట్లు మాత్రమే మేం చెల్లిస్తే…హెరిటేజ్‌తోపాటు మొత్తంగా ఆయన ఆస్తుల్ని స్వాధీనం చేస్తారా అని అడగటమంటే, వాదనలో తర్కంగానీ అడిగే వారికి మెదడుగానీ లేదని రూఢి చేయటానికే అది పనికి వస్తుంది.
అభ్యర్థి సమర్పించే అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్ కోరేది ఏయే కంపెనీల్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టారన్న అంశాన్నే తప్ప ఆయా కంపెనీల ఆస్తుల వివరాలను కాదు. ఇలా అభ్యర్థి ఎన్నికల కమిషన్‌కు సమర్పించే వివరాల్లో అన్‌లిస్టెడ్ కంపెనీలకు అయితే ఏరేటున వాటాలు కొన్నదీ వెల్లడించాలి. భూములూ భవనాల వంటివి వ్యక్తి ఆస్తులైతే వాటిని కొన్న విలువతోపాటు మార్కెట్ విలువ వెల్లడించాలి. లిస్టెడ్ సెక్యూరిటీలకు సంబంధించిన తాజా మార్కెట్ విలువను వెల్లడి చేయాలి. వైఎస్ జగన్ దాఖలు చేసిన అఫిడవిట్ ఈ నియమనిబంధనల ప్రకారం పూర్తిగా చట్టబద్ధం. మరి ‘ఈనాడు’కు వచ్చిన సమస్య ఏమిటి…? వైఎస్ జగన్ వాటాదారుగా ఉన్న, ఆయన బంధువులకు చెందిన కంపెనీలు భూములు కొనుక్కోవాలా, వద్దా? భవంతులు కట్టుకోవచ్చా, లేదా? ఇలాంటి అంశాల్లో రామోజీరావు తనకు గిట్టని వ్యక్తులకు వేరే చట్టం వర్తిస్తుందంటారు. కాబట్టే లోటస్ పాండ్, బెంగళూరుల్లో భవనాల ఫొటోలను ముద్రించి ఇవి వ్యక్తిగతంగా జగన్‌వేనని రామోజీ వీలునామా రాస్తున్నారు.
లోటస్‌పాండ్ సమీపాన నిర్మించిన భవంతిలో 27 బెడ్‌రూము లున్నాయా? అక్కడ కడుతున్నది తన తార-సితార టైపు హోటలని రామోజీ నిర్ణయానికి వచ్చారా? ఆ భవనం విలువ ఎంతో కూడా నిపుణులు చెప్పలేకపోతున్నారని ‘ఈనాడు’లో రాశారు. భవనం విలువ కూడా చెప్పలేని ఎక్స్‌పర్టుల్ని పెట్టుకున్న రామోజీ తెలివి అమోఘమ యింది. జగన్, భార్య, పిల్లలు, తల్లి ఉండటానికి- వారి బంధుమిత్రులకు… రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి అతిథులకు… మొత్తం కలుపుకున్నాఏడు బెడ్‌రూముల నివాసాన్ని నిర్మించుకోవటం బంజారా హిల్స్ ప్రాంతంలో అసాధారణం కాదు. అయినా రూములు మొదలు బాత్‌రూముల వరకు ఎంత ఉండాలో చెప్పటానికి ఆయనెవరు? సాక్షిలో పెట్టుబడులకు సంబంధించీ ఎప్పటినుంచో సాగిస్తున్న అడ్డగోలు వాదననే రామోజీ మళ్ళీ వినిపిస్తున్నారు. సాక్షిలో జగన్ పెట్టుబడులు తక్కువే అంటూ రాసి… మరోవంక సాక్షి జగన్‌దేనని అందరికీ తెలుసు అంటూ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వర్తించే చట్టాలనే మరచిపోయారు.
మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో తనకు ఏ చట్టాలూ వర్తించవని వాదించిన రామోజీ ఇతరులకు ఏ చట్టాలు వర్తిస్తాయో తానే నిర్ణయించి తన పత్రిక మొదటి పేజీలో తీర్పులు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఇలాంటి అంశాలమీద మాట్లాడటానికి నైతికంగా ఆయన స్థాయి ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా రామోజీకి, ఆయన బినామీలకు, ఆయన కంపెనీలకు ఉన్న భూములెన్ని? భవనాలెన్ని? బెడ్‌రూములెన్ని? సమాచార హక్కు అమలు కోసం… నిదురపోతున్న జనులంతా తనవద్దకు వచ్చి జ్ఞానులై వెళ్ళాలని ఉద్యమం నిర్వహిస్తున్న పెద్దమనిషిని అసలు నీ ఆస్తి ఎంతో చెప్పమంటూ ఊరూరా నిలదిస్తే ఏం బదులిస్తారు? ఎలా సంపాదించావో చెప్పమంటే ఏం బదులిస్తారు? అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడిందన్నది సామెత. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? జగన్ ఆస్తులు రూ.445 కోట్లకు ఎలా పెరిగాయని పత్రికా ముఖంగా గింజుకుంటున్న రామోజీకి ఉన్న ఆస్తులేమిటి… దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి చిట్స్ పేరిట, పత్రికా కార్యాలయాల పేరిట, తనకున్న ఇతర కంపెనీల పేరిట ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులను దాచేసిన ఈ ఘనుడు… 2008-09 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమర్పించిన రిటర్న్‌లో పేర్కొన్న సంపద ఎంతో తెలుసా..? కేవలం రూ.70 కోట్లు. ప్రభుత్వానికి కట్టిన పన్ను ఎంతో తెలుసా? కేవలం రూ.52 వేలు. ఇది అచ్చు తప్పు కాదు… నిజం… మరోసారి చెబుతున్నాం వినండి… రూ.52,000 మాత్రమే. నీచం ఏమిటంటే ఆయన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కట్టే పన్ను కూడా ఇంతకన్నా ఎక్కువే.
ఇలాంటి రామోజీ సత్యహరిశ్చంద్రుడికి బంధువునని, గాంధీ మహాత్ముడికి-తనకు వేష ధారణలో మాత్రమే తేడా ఉందని, తాను ఉత్తరం రాయకపోతే అన్నా హజారే ఆత్మస్థైర్యం కోల్పోయేవాడేనని, ఈ రాష్ట్రంలో నీతిమంతుల జాబితాలో రెండోపేరు చంద్రబాబేనని అచ్చుగుద్దుకోవటం అంటే దానికి మరోపేరు ఆత్మ వంచన మాత్రమే. మొన్న తెలుగుదేశం పార్టీ చేసిన వాదన ప్రకారం ఎవరైనా రూ.70 కోట్లిస్తే రామోజీ ఫిలింసిటీ, కంపెనీ ఆస్తుల సహా రాష్ట్రంలో తన సంపదలన్నింటినీ రాసిస్తారా? జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు అమ్ముకుని రూ.85 కోట్లు పన్ను చెల్లించారు. మరి రామోజీ చరిత్ర ఏమిటి? పన్నులు ఎగ్గొట్టి ఆస్తులు పెంచుకున్నారు. తేడాల్లో ఇదీ ఒకటి. మరో ముఖ్యమైన తేడా ఏమిటంటే… భారతి సిమెంట్ కోసం సేకరించిన భూములకు మొదట్లోనే మార్కెట్ ధర చెల్లించినా, వాటా అమ్మగా వచ్చిన సొమ్ముతో మరోసారి అదే రైతులకు ఎకరాకు రెండు లక్షల రూపాయల వంతున మళ్ళీ సొమ్ము పంచిన ఘనత జగన్‌ది.
ఇది దేశంలో భూసేకరణ-పరిహారం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం. రామోజీ కూడా ఇలాగే అనాజ్‌పూర్ పరిసర గ్రామాల్లో భూములను ఎకరం పది వేల చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆభూముల విలువ కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో ఆనాడు తెలియక, బలవంతాన పొలాలు అమ్ముకున్న వారికి ఎంత ఇచ్చి రామోజీ వారి రుణం తీర్చుకుంటారో వెల్లడిస్తే బాగుంటుంది. కేవలం రెండెకరాల పొలం ఉన్న కుటుంబంలో జన్మించిన చంద్రబాబు 2002 నాటికే దేశంలో అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడిగా ఎలా రూపొందారనిగానీ, ఈ ముప్ఫైమూడేళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు అడ్డదిడ్డమైన సంపాదననుగానీ ఈ ముప్ఫై ఏడేళ్ళ పత్రిక ఏనాడూ ప్రశ్నించలేదు… ఎందుకని? ఏ ప్రజా ప్రయోజనాల కోసం రామోజీ జర్నలిజం?
వైఎస్ మరణానంతరం…
2009-11 మధ్య జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయంటూ రామోజీ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి తనయుడు కాడు. వైఎస్ జీవించి ఉన్నన్ని రోజులూ జగన్ వ్యాపారాలమీద ఏడ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. 2004 ఎన్నికలకు మునుపే… వైఎస్ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ఉండగానే… 2003 మార్చిలోనే… జగన్ ఆస్తులకు సంబంధించి, ఆయన పెట్టుబడులూ వ్యాపారాలకు సంబంధించి శాసన సభలో గగ్గోలు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు, ఆయన పార్టీకి ఉంది. 2000 తరవాతి చరిత్రను గమనిస్తున్న తెలుగువారందరికీ వైఎస్ కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆస్తులు, సంపదలమీద తెలుగుదేశం దుష్ర్పచారానికి దశాబ్దం చరిత్ర ఉందని అర్థమవుతుంది. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరవాత జగన్ సంపద ఎలా పెరిగిందంటూ తెలుగుదేశం పార్టీ అడిగిన ప్రశ్నలకు ఓపికగా వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో సమాధానాలు ఇస్తూ వచ్చారు.
చంద్రబాబు నాయుడు, ఆయన మీడియా గ్యాంగ్ వ్యవహారానికి భిన్నంగా తన ఆస్తులు- వ్యాపారాలను జగన్ పూసగుచ్చినట్టు వివరించారు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్‌లో ఆస్తికి 2011లో ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆస్తి వివరాలకు మధ్య తేడాను ప్రశ్నిస్తున్న ఎల్లో సిండికేటుకు నిజాలు తెలియక కాదు. వైఎస్ జగన్ ఆస్తులూ సంపాదనా చట్టబద్ధమేననీ వారికి తెలుసు. ఈ ఉప ఎన్నికల్లో గెలవగలం అనే విశ్వాసం ఏకోశాన ఉన్నా కడప, పులివెందుల ఎన్నికలమీద తెలుగుదేశం దృష్టి పెట్టేది. తద్భిన్నంగా ఇంతకు మునుపు భారతి సిమెంట్ కంపెనీలో మెజారిటీ వాటాను జగన్ అమ్ముకున్న నేపథ్యంలో వచ్చిన లాభాలను పట్టుకుని నానా యాగీ చేసినట్టుగానే… ఆ తరవాత క్యాపిటల్ గెయిన్స్‌మీద పన్ను చెల్లించినప్పుడు వీరంగం వేసినట్టుగానే… ఇప్పుడూ ప్రజలకు ఈ క్యాపిటల్ గెయిన్స్, చరాస్తుల్లో పెరుగుదలకు కారణాలు అర్థం కావులే అనే భావంతోనే జగన్ కడపలో నామినేషన్ వేయగానే తనదైన రాగాన్ని అందుకుంది. అదెలాగో చూడండి…
వాటా అమ్మితే వచ్చిన డబ్బు…
భారతీ సిమెంట్ సంస్థను స్థాపించి, బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకువచ్చి, అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో ఉత్పత్తి ప్రారంభించి, మార్కెట్‌లో దానికి అద్భుతమైన బ్రాండ్ వాల్యూ తీసుకువచ్చిన తరవాత… అంతర్జాతీయంగా సిమెంటుకు రాగల కాలంలో ఏర్పడనున్న డిమాండు దృష్ట్యా ఫ్రెంచి సంస్థ వికా భారతి సిమెంట్‌లో 51 శాతాన్ని 2010 జులై నాటికే కొనుగోలు చేసింది. అంటే కంపెనీకి ప్రధాన యజమాని అయిన జగన్ తన మెజారిటీ షేరును వేరే కంపెనీకి అమ్మి డబ్బు అందుకున్నారు. తనతోపాటు పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, మ్యాట్రిక్స్ ప్రసాద్‌లకు కూడా ఈ అమ్మకం వల్ల గణనీయంగా లాభాలందాయి. కంపెనీలో వాటా అమ్మకం ద్వారా వచ్చిన సుమారు రూ. 415 కోట్ల సొమ్ములో రూ.84 కోట్లు అడ్వాన్స్ టాక్స్‌గా చెల్లించారు. అయితే… కంపెనీలో వాటా అమ్మినప్పుడు, వచ్చిన సొమ్ములో 20 శాతాన్ని చట్టబద్ధంగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించినప్పుడు, మిగిలిన సొమ్మును పెట్టుబడులుగా పెట్టి దాన్ని ఇప్పుడు అఫిడవిట్‌లో ఆస్తిగా చూపినప్పుడు… ఈ మూడు సందర్భాల్లోనూ ఈ వ్యవహారాన్ని జగన్‌కు వ్యతిరేకంగా మలచటానికి ఎల్లో సిండికేట్ చేయని ప్రయత్నం లేదు.
జగన్ వ్యతిరేక కుట్రలకు నాయకుడైన రామోజీ నిజాయతీపరుడే అయితే తాను అంబానీలకు వాటా ‘అమ్మితే’ వచ్చిన సొమ్ములో ఏమేరకు పన్ను కట్టారో ప్రజలకు వివరించాలి. మన రాష్ట్రంలోనూ అన్నా హజారే ద్వారా నీతిమంతమైన సమాజం కోసం ఉద్యమం చేయాలంటూ పత్రికాముఖంగా గిరీశం లెక్చర్లిచ్చిన రామోజీ…. అదే అన్నా హజారేను పిలిచి తన ఫిలింసిటీతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న భూములు, దేశ వ్యాప్తంగా తనకున్న సంపదల వివరాలను, 420 సహా తనమీద ఉన్న అడ్డమైన కేసులను, హోల్‌మొత్తంగా తన చరిత్రను ఆయనకు వెల్లడిస్తే… అప్పుడు అన్నా హజారే దేశ వ్యాప్త ఉద్యమాన్ని వాయిదా వేసుకుని తక్షణం రామోజీకి వ్యతిరేకంగా ఫిలింసిటీ గేటు బయటే బైఠాయించటం మాత్రం ఖాయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ‘అన్న’ను బజారున పడేసి, పరలోకానికి పంపి, ఆ తరవాత అదే అన్నకు దండ వేయించి, దణ్ణం పెట్టించిన రాజగురువు… ఇప్పుడు అన్నా హజారేకి దణ్ణం పెడుతున్నారంటే ఇదీ ఆలోచించాల్సిన అంశమే!
చరాస్తుల్లో మాత్రమే తేడా
ఇక జగన్ ఆస్తుల్లో పెరుగుదలకు వస్తే… 2009 ఎన్నికల్లో కడప లోక్‌సభకు పోటీ పడినప్పుడు వైఎస్ జగన్ సమర్పించిన ఆస్తులూ అప్పుల పట్టికలో ఆనాటికి ఆయనకు ఉన్న బాండ్లు/డిబెంచర్లు/ మ్యూచువల్ ఫండ్ల వివరాల్లో పేర్కొన్న ఆస్తి రూ.37.99 కోట్లు. అలాంటి చరాస్తుల విలువను తాజా వివరాల్లో పొందుపరచారు. తాజా వివరాల ప్రకారం అది రూ.359.59 కోట్లు. అంటే దాదాపు రూ.312 కోట్ల తేడా కనిపిస్తోంది. ఇదే వైఎస్ జగన్ అదనంగా పెట్టుబడులు పెట్టిన సొమ్ము. భారతి సిమెంట్‌లో వాటా అమ్ముకోవటం వల్ల వైఎస్ జగన్‌కు లభించిన లాభాన్ని ఇలా చరాస్తుల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ విషయాన్నే ఎన్నికల కమిషన్‌కు నామినేషన్‌తోపాటు సమర్పించారు. బుద్ధీ జ్ఞానంతో చూస్తే జగన్ ఆస్తుల విలువ 2009తో పోలిస్తే పెరగలేదన్నదీ అప్పటి అఫిడవిట్‌తో పోల్చి చూస్తే అర్థమవుతుంది. ఇది కంపెనీలో మెజారిటీ వాటా అమ్ముకున్నందువల్ల ద్రవ్య రూపంలోకి వచ్చిన సొమ్ము మాత్రమేననీ స్పష్టమవుతుంది. అదీ కాక, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్ ఆస్తుల విలువ పెరగటానికి కారణం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే అన్నది తెలుగుదేశం, దాని భజంత్రీ పత్రికలు వేసిన అపవాదు. వైఎస్ మరణించిన పందొమ్మిది నెలల తరవాత జరుగుతున్న ఎన్నికల నాటికి… వైఎస్ జగన్ ఆస్తుల విలువ పెరిగితే అదీ తప్పేనని తెలుగుదేశం పార్టీ పేర్కొంటోంది. ఈ వ్యవహారాన్ని బట్టే జగన్ వ్యాపారాలకు-వైఎస్ అధికారానికి ముడిపెట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంతా అసత్యమని వెల్లడి అవుతోంది.
భారతి సిమెంట్‌లో మెజారిటీ వాటాను ఫ్రెంచ్ కంపెనీ వికాకు అమ్మటం ద్వారా వచ్చిన సుమారు రూ.415 కోట్ల సొమ్ములో జగన్ రూ.84 కోట్లు అడ్వాన్స్ టాక్స్‌గా చెల్లించారు. కంపెనీలో వాటా అమ్మినప్పుడు, వచ్చిన సొమ్ములో 20 శాతాన్ని ఆయన చట్టబద్ధంగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించినప్పుడు, మిగిలిన సొమ్మును పెట్టుబడులుగా పెట్టి దాన్ని ఇప్పుడు అఫిడవిట్‌లో ఆస్తిగా చూపినప్పుడు… ఈ మూడు సందర్భాల్లోనూ ఈ వ్యవహారాన్ని జగన్‌కు వ్యతిరేకంగా మలచటానికి ఎల్లో సిండికేట్ చేయని ప్రయత్నం లేదు…
భారతి సిమెంట్ కోసం సేకరించిన భూములకు మొదట్లోనే మార్కెట్ ధర చెల్లించినా, తన వాటా అమ్మగా వచ్చిన సొమ్ముతో మరోసారి అదే రైతులకు ఎకరాకు రెండు లక్షల రూపాయల వంతున మళ్ళీ సొమ్ము పంచిన ఘనత జగన్‌ది. ఇది దేశంలో భూసేకరణ- పరిహారం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం.
2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి వైఎస్ కుటుంబానికి ఉన్న ఆస్తులు, సంపదలు అందరికీ తెలిసినవే. కడప, పులివెందులలో నివాస గృహాలు, హైదరాబాద్‌లో ఇళ్లస్థలాలు, విజయవాడలో రాజ్- యువరాజ్ థియేటర్లు అప్పటికే ఉన్నాయి. గనులు, పొలాలు… వాటి ద్వారా ఆదాయంతోపాటు జగన్ అప్పటికే రెండు విద్యుత్ కేంద్రాలను నెలకొల్పారు. ఇప్పుడు జగన్ ఆస్తులపై రగడ చేస్తున్న రామోజీ, చంద్రబాబుల్లో ఒకరు పచ్చళ్లతో వ్యాపార జీవితం ప్రారంభించి ప్రచ్ఛన్న అధికారంతో వేల కోట్లకు పడగలెత్తితే, మరొకరు ప్రత్యక్ష అధికారమే పెట్టుబడిగా కేవలం రెండెకరాల నుంచి లక్ష కోట్లకు విస్తరించారు. తమ సంపదలపై ప్రజలకు జవాబు చెప్పాలని బాబు, రామోజీ ఏనాడూ భావించకపోవడంతోపాటు ఇతరుల ఆస్తులు అక్రమమని రగడకు దిగటమే అన్నింటికన్నా విచిత్రం.
వాటా అమ్మకం వల్లే ఆస్తుల్లో వృద్ధి
జగన్ ఆస్తుల్లో పెరుగుదల అసాధారణం అంటూ తెలుగుదేశం, ‘ఈనాడు’లతోపాటు కాంగ్రెస్‌లో కొందరు నాయకులూ గడచిన కొన్నేళ్ళుగా గగ్గోలు పెడుతున్నారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి కాక మునుపూ తెలుగుదేశం, రామోజీలది ఇదే బాణీ. జగన్ కంపెనీలు, ఆస్తులకు సంబంధించి 2003లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం నాయకులు సాక్షాత్తు శాసన సభలోనే రాజకీయం మొదలుపెట్టారు. పారిశ్రామిక వేత్తగా తన ఎదుగుదలకు సంబంధించి జగన్ గడచిన నాలుగేళ్ళలో అనేక పర్యాయాలు పూసగుచ్చినట్టు వివరణలిచ్చారు. 2003-04 నాటికే సాండూర్ కంపెనీ దాదాపుగా పూర్తి అయింది. అంటే అది పెట్టుబడులు పెడుతున్న దశ. ఈ ఆస్తుల విలువ 2009 నాటికి 77 కోట్లకు చేరుకోవడం వ్యాపార విస్తరణలను గమనిస్తున్న వారికి అసాధారణంగా కనిపించదు. 2009 తరవాత జగన్ ఆస్తుల విలువ పెరగటానికి కారణం అప్పటికే మార్కెట్‌లో మంచి బ్రాండ్ వాల్యూ సంపాదించిన భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను ఫ్రెంచి బహుళజాతి సంస్థ వికాకు అమ్మటం మాత్రమే.
ఒక కంపెనీ స్థాపిస్తున్న దశలో దాని విలువకు, నిర్మాణం పూర్తి అవుతున్న దశలో దాని విలువకు, పూర్తి అయి ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న దశలో దాని విలువకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. కార్పొరేట్, పారిశ్రామిక రంగాలమీద అవగాహన ఉన్న అందరికీ తెలిసిన నిజమే ఇది. అదీకాక… పెట్టిన పెట్టుబడులకు ఎన్నో రెట్లు మార్కెట్‌లో విలువను పొందిన అనేక సంస్థలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఎస్‌కెఎస్ మైక్రో ఫైనాన్స్ ప్రమోటర్ విక్రమ్ ఆకుల నామ మాత్ర పెట్టుబడితో ఆ సంస్థను ఆరంభించి మూడేళ్ళలోనే పన్నెండు రెట్లు వృద్ధి చూపగలిగారు. ఎవరి సంగతో ఎందుకు… స్వయానా రామోజీరావు తన కంపెనీకి చెందిన వంద రూపాయల ముఖవిలువ ఉన్న షేరును ఏకంగా రూ.5,28,830కి అమ్మారు. రిలయెన్స్ గ్రూపు ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి చేయకుండా భవిష్యత్ ప్రాజెక్టుల కోసం రిలయన్స్ పవర్ పేరిట భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ తెచ్చింది.
రూ.11,700 కోట్ల కోసం ఇష్యూ తెస్తే జనం ఏకంగా రూ.2,00,000 కోట్లు పెట్టుబడి పెట్టటానికి ముందుకు వచ్చారు. పారిశ్రామిక ప్రపంచంలో ఇలా పెట్టుబడుల ప్రవాహం అత్యంత సహజం. ఇక లాభాలకు సంబంధించి చూస్తే… కేవలం సిమెంటునే పరిగణనలోకి తీసుకున్నా ఏసీసీలో హోల్‌సిమ్(2005), అంబుజాలో హోల్‌సిమ్(2007), ఎల్‌అండ్‌టీకి చెందిన సంస్థలో లఫార్జ్(2008), దాల్మియాలో కోల్డ్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్(2010) భారీగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రాన్నే తీసుకున్నా 2008లోనే మైహోం ఇండస్ట్రీస్ నుంచి బహుళ జాతి సంస్థ సీఆర్‌హెచ్ భారీగా వెచ్చించి వాటాలు కొనుగోలు చేసింది. భారతి సిమెంట్ నుంచి 70 దేశాల్లో సిమెంట్ రంగంలో ఉన్న వికా 51 శాతం వాటా కొనుగోలు చేయటం కూడా ఈ కోవకు చెందినదే. భారతి సిమెంట్ కర్మాగారాన్ని అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో నిర్మించి, మార్కెట్‌లో భారీ విజయాన్ని సాధించిన తరవాత… వైఎస్ మరణానంతరం జరిగిన వ్యాపారపరమైన డీల్ ఇది.
పోలింగ్ అయ్యే వరకు అదే పైత్యం
వచ్చేనెల ఎనిమిదిన పోలింగ్ జరిగే వరకు రామోజీ తెలుగుదేశం పార్టీల పైత్యం ఇలాగే, లేదా ఇంతకు మించిన స్థాయిలో ప్రకోపిస్తుందన్నది రామోజీకి పత్రికా పరంగా ఉన్న నేర చరిత్ర రీత్యా రూఢి అవుతూనే ఉంది. రాష్ట్రంలో పాలనను, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా రామోజీ- తెలుగుదేశం ఆడుతున్న డ్రామాలు వెన్నెముక లేని ప్రభుత్వానికి వరంగా తోస్తున్నాయి. రామోజీ- తెలుగుదేశం పార్టీలు కడప, పులివెందుల ఎన్నికల వేళ మొదలు పెట్టిన కొత్త డ్రామా వెగటే పుట్టిస్తుంది. ఎందుకంటే… ఈ పార్టీ, ఈ పత్రిక కడప పేరు చెబితే ఏం వ్యాఖ్యలు చేశాయో, ఏం కథనాలు రాశాయన్నది 2009 వరకు సాగిన చరిత్ర. వైఎస్ హయాంలో కడపకు దోచి పెడుతున్నారని వెళ్ళగక్కిన అక్కసు అంతాయింతా? ఒక జిల్లామీద వెళ్లగక్కిన విషం అంతాయింతా? 2004, 2009 ఎన్నికల్లో వైఎస్‌కు బ్రహ్మరథం పడుతూ తెలుగు ప్రజలు వీరికి పెట్టిన వాతలు అన్నాయిన్నా?
ఫొటోలో కనిపిస్తున్నది రామోజీ కట్టుకున్న రాజసౌధం. ఫిలింసిటీ పేరు పెట్టి ఆయన హైదరాబాద్‌లో వేల ఎకరాలను ఆక్రమించారు. వాటిలో కొండలు, గుట్టలు, అడవులు, చెరువులు ఉన్నాయి. నిజానికి ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు. వీటిని ఎవరూ మావి అనటానికి వీలేలేదు. పర్యావరణ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయినా రామోజీకి ఈ చట్టాలేవీ వర్తించవట. ఆయన తన ఫిలిం సిటీలో ఓ కొండపైన నిర్మించుకున్న ఇల్లు ఇది.


ఈ ఇంటి పక్కనే హెలిప్యాడ్ కూడా ఉంది. ఇలా రాష్ట్రం మొత్తంలో ఇంటికి పక్కన హెలిప్యాడ్‌ను నిర్మించుకున్న మొట్టమొదటి కోటీశ్వరుడు రామోజీయే. మొత్తంగా ఆయనకున్న భూములెన్ని, ఆస్తులెన్ని, ఆయన కడుతున్న పన్నులెన్ని వంటి వివరాలను అడిగిన వారికి రామోజీ సమాధానమే ఇవ్వరు. సమాచార చట్టం కోసం ఉద్యమం చెయ్యండని మాత్రం పిలుపునిస్తారు. మద్య నిషేధ ఉద్యమాన్ని కేవలం ఉదయం పత్రికను కూల్చివేసేందుకు ఆయుధంగా ఉపయోగించిన రామోజీ… ప్రజా ప్రయోజనాల పేరిట చేసే ప్రతి విజ్ఞప్తి వెనకా ఓ కుట్ర దాగి ఉంటుందన్నది సుదీర్ఘ చరిత్ర నిరూపించిన సత్యం.
జగన్ ఆస్తులపై ఎల్లో సిండికేట్ దొంగాట… ఏది నిజం ? జగన్ ఆస్తులపై ఎల్లో సిండికేట్ దొంగాట… ఏది నిజం ? Reviewed by surya on 1:45 PM Rating: 5

No comments:

Powered by Blogger.